July 26, 2025Jul 26 Author 56 minutes ago, Nfan from 1982 said: 3 years lo completion is a dream 💭 Start ayithe chalu ade avuthundi
July 26, 2025Jul 26 Bangalore nearly 8 years still continuing Edited July 26, 2025Jul 26 by subbu_chinna
July 28, 2025Jul 28 Author Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ By Andhra Pradesh News TeamUpdated : 28 Jul 2025 13:19 IST Ee Font size 1 min read అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈపీసీ విధానంలో ఈ టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్-1లో 38.4 కి.మీ మేర రెండు కారిడార్లలో విజయవాడ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్-1లో నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు.. కారిడార్-2లో బస్‌స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మెట్రో నిర్మాణం జరగనుంది. కారిడార్-1లో 4.7 కి.మీ మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ రానుంది. ఇప్పటికే విశాఖ మెట్రో రైలు టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే.
July 29, 2025Jul 29 Author Home » Andhra Pradesh » Krishna » Tenders for Vijayawada Metro Phase 1 టెండర్ల ట్రాక్‌లోకి.. ABN , Publish Date - Jul 29 , 2025 | 12:53 AM దశాబ్దం నాటి కల సాకారానికి మొదటి అడుగు పడింది. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్) అధికారులు సోమవారం టెండర్లు పిలిచారు. సెప్టెంబరు 12 నుంచి టెండర్లు సమర్పించాల్సి ఉండగా, రెండున్నరేళ్లలో మెట్రో మొదటి దశ, రెండేళ్లలో నిడమానూరు-రామవరప్పాడు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాల్సి ఉంటుంది. విజయవాడ మొదటి దశ మెట్రోకు టెండర్లు నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీఎంఆర్‌సీ అధికారులు రూ.4,150 కోట్ల అంచనాతో మొదటి దశ పనులు గన్నవరం-పీఎన్‌బీఎస్ వరకు 25.95 కిలోమీటర్లు కారిడార్-1 పెనమలూరు-పీఎన్‌బీఎస్ వరకు 12.45 కిలోమీటర్లు కారిడార్-2 మొత్తం 38.40 కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మించాలని నిర్దేశం 32 ఎలివేటెడ్, ఒక అండర్ గ్రౌండ్ సహా 33 స్టేషన్ల నిర్మాణం విజయవాడ ఎయిర్‌పోర్టు వరకు అండర్ గ్రౌండ్ మెట్రోనే.. సెప్టెంబరు 17న టెండర్ల ఓపెన్.. రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి నిడమానూరు-రామవరప్పాడు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా.. (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రూ.4,150 కోట్లతో విజయవాడ మెట్రో కారిడార్-1, 2 మొద టి దశ నిర్మాణ పనులకు సోమవారం టెండర్లు పిలిచారు. రెండు కారిడార్లు కలిపి మొత్తం 38.40 కిలోమీటర్లు ఉండగా, వయాడక్ట్ నిర్మాణ పనులకు ఏపీఎంఆర్‌సీఎల్ టెండర్లు పిలిచింది. ఇందులో అంతర్భాగంగా నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు 4.33 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు కూడా టెండర్లు పిలిచింది. మొత్తం 32 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు, ఒక అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో నిర్దేశించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు వరకు అండర్ గ్రౌండ్‌లో మెట్రోను నిర్మించేలా ప్రతిపాదించింది. సెప్టెంబరు 17వ తేదీ వరకు టెండర్ల సమయాన్ని నిర్దేశించింది. ఈ 45 రోజుల్లో భూ సేకరణ, ట్రాఫిక్ మళ్లింపు, పైపులైన్లు, కరెంట్ తీగలు, యూజీడీ పైపులైన్ల మార్పు, రుణ ప్రయత్నాలు కొలిక్కి తీసుకొస్తారు. సెప్టెంబరు 12 నుంచి టెండర్లు సమర్పించాల్సి ఉంటుంది. 12 నుంచి 17వ తేదీ వరకు ఔత్సాహిక కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లను స్వీకరిస్తారు. 17.. బిడ్లను సమర్పించటానికి ఆఖరి రోజు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీఎంఆర్‌సీఎల్ టెండర్లను తెరిచి కాంట్రాక్టు సంస్థను ప్రకటిస్తుంది. ఈ 45 రోజుల సమయంలో కాంట్రాక్టర్లతో పలుమార్లు ప్రీబిడ్ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో కాంట్రాక్టర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు టెండరు నోటిఫికేషన్‌ను సవరించే అవకాశం ఉంటుంది. టెండర్లు తెరిచి కాంట్రాక్టు సంస్థకు అప్పగించినప్పటి నుంచి 30 నెలలు అంటే.. రెండున్నరేళ్లలో విజయవాడ మొదటి దశ మెట్రో కారిడార్లను పూర్తి చేయాలి. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ పనులు మాత్రం రెండేళ్లలో పూర్తి చేయాలి. మొదటి దశలో 33 మెట్రో స్టేషన్ల నిర్మాణం మొదటి దశలో గన్నవరం బస్‌స్టేషన్ నుంచి ఎన్‌హెచ్-16 మీదుగా రామవరప్పాడు రింగ్‌రోడ్డు.. అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ను కలుపుతూ పీఎన్‌బీఎస్ వరకు 25.95 కిలోమీటర్ల మేర కారిడార్-1 పనులు చేపట్టాలి. ఇందులో భాగంగా గన్నవరం బస్టేషన్, గన్నవరం సెంటర్, యోగాశ్రమం, ఎయిర్‌పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీచైతన్య కాలేజీ, నిడమానూరు రైల్వేస్టేషన్, నిడమానూరు, ఎనికేపాడు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారామపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్ (ఈస్ట్), రైల్వేస్టేషన్ (సౌత) మెట్రో స్టేషన్ల నిర్మాణంతో పాటు పీఎన్‌బీఎస్ దగ్గర ప్రధాన మెట్రో స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంటుంది. అలాగే, పెనమలూరు నుంచి బందరు రోడ్డు మీదుగా 12.45 కిలోమీటర్ల పొడవున కారిడార్-2లో పెనమలూరు, పోరంకి, తాడిగడప, కానూరు సెంటర్, కృష్ణానగర్, అవోక్‌నగర్, ఆటోనగర్, బెంజిసర్కిల్, టిక్కిల్ రోడ్డు, ఐజీఎంసీ స్టేడియం, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, పీఎన్‌బీఎస్ మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టాలి. ప్రధాన రహదారులే కేంద్రంగా.. విజయవాడ మీదుగా వెళ్లే రెండు ప్రధాన జాతీయ రహదారులు ఎన్‌హెచ్-16, 65ను మెట్రో ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. నగరంలో అంతర్గత ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్లను కూడా కలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారగా, మెట్రో రాకతో ఆ సమస్యకు చెక్ పడనుంది.
July 29, 2025Jul 29 Author Vijayawada Metro: విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుకు టెండర్లు By Andhra Pradesh News DeskUpdated : 29 Jul 2025 06:40 IST Ee Font size 1 min read రూ.4,150 కోట్లతో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణం ఈనాడు - అమరావతి విజయవాడలో మెట్రోరైల్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లు పిలిచింది. తొలిదశలో 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నాలుగు లైన్ల పైవంతెన సహా మొత్తం 38.40 కి.మీ.తో రెండు కారిడార్ల పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.4,150 కోట్ల వ్యయం కానుంది. 32 చోట్ల ఎలివేటెడ్ మెట్రోస్టేషన్లు, ఒకచోట అండర్ గ్రౌండ్ మెట్రోస్టేషన్ నిర్మాణానికి ఈపీసీ విధానంలో మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక, ఆర్థికాంశాలను పరిశీలించి గుత్తేదారు సంస్థలను ఎంపిక చేసిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి బిడ్ల స్వీకరణ మొదలై అదే నెల 17న ముగియనుంది. అదేరోజు టెండర్లు తెరవనున్నారు. గుత్తేదారు సంస్థల అర్హతలపై మెట్రోరైల్ కార్పొరేషన్ నాలుగైదు రోజుల్లో మరో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనుల విలువకు సంబంధించిన వివరాలతో సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి కాంపిటీటీవ్ బిడ్డింగ్ కావడంతో ప్రాజెక్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అధ్యయనం చేసేందుకు గుత్తేదారు సంస్థలకు 45 రోజులపాటు సమయం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆసక్తి కలిగిన సంస్థలు మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులను వర్చువల్‌గా సంప్రదించే వెసులుబాటు కల్పించారు. విశాఖలోనూ తొలి దశలో 46.23 కిలోమీటర్లలో మూడు కారిడార్ల పనులకు ఈ నెల 25న టెండర్లు పిలిచారు.
July 29, 2025Jul 29 Author శుభ.. సంకల్పం By Andhra Pradesh Dist. DeskPublished : 29 Jul 2025 04:39 IST Ee Font size 2 min read బెజవాడ మెట్రోకు టెండర్ల ఆహ్వానం.. తొలిదశలో రెండు కారిడార్లుగా పనులు ‘‘విజయవాడ నగర ప్రజారవాణాలో కీలకమైన మెట్రోకు ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ఎంఆర్‌సీఎల్) సోమవారం టెండర్లు పిలిచింది. మొత్తం వ్యయంలో 40 శాతం వెచ్చించి తొలుత పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.4,150 కోట్లతో బిడ్లు ఆహ్వానించారు.’’ ‘‘30 నెలల్లో ప్రాజెక్టు పనులు, 24 నెలల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలి. సీఎంపీ తయారీకి సిస్ట్రా.. 443.43 చదరపు కి.మీ. పరిధిలోని 2.3 మిలియన్ల జనాభా ఉండే ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. విజయవాడ, గన్నవరం, రాజధాని నగరం, మంగళగిరిలో అధ్యయనం చేపట్టారు. ట్రాఫిక్ విశ్లేషణకు 179 జోన్లుగా విభజించారు. మెట్రో రైలుకు నగరం అనుకూలమని తేలింది.’’ ఈనాడు, అమరావతి : మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో రెండు కారిడార్లలో నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పీఎన్‌బీఎస్ వరకు ఒకటి, పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ వరకు మరొకటి రానున్నాయి. 38.40 కి.మీ. నిడివితో ఈ రెండు మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లు ప్రతిపాదించారు. వీటిలో గన్నవరం విమానాశ్రయం వద్ద ఒక స్టేషన్ భూగర్భంలో రానుంది. స్టేషన్ల వద్ద నగరంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లేలా సిటీ బస్సు సర్వీసులు నడపనున్నారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్‌లతో అనుసంధానంతో ప్రయాణికులకు మేలు కలగనుంది. డబుల్ డెక్కర్ పైవంతెన... చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రద్దీ ప్రాంతంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. నగర రద్దీని తట్టుకునేలా మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు జాతీయ రహదారుల సంస్థతో కలసి మెట్రో రైలు కార్పొరేషన్ భారీ పైవంతెనను నిర్మించనుంది. 4.33 కి.మీ. పొడవున నాలుగు వరుసలతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. కింద వాహనాలు వెళ్తాయి. పైన మెట్రో రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. ఇందుకయ్యే వ్యయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ, ఏపీఎంఆర్‌సీఎల్ భరించనున్నాయి. తొలుత రెండు బోగీలు... ప్రతి రైలు రెండు బోగీలతో నడపనున్నారు. రెండు బోగీల్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణించే వీలుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడవనున్నాయి. రద్దీ ఉంటే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నడపనున్నారు. ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సెలవు రోజులు, ఆదివారాలు డిమాండ్ తక్కువగా ఉంటే సర్వీసులను కుదిస్తారు. ప్రారంభంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే వీలుందనీ.. 2055 నాటికి ఈ సంఖ్య 12-15 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
July 29, 2025Jul 29 2 hours ago, sonykongara said: శుభ.. సంకల్పం By Andhra Pradesh Dist. DeskPublished : 29 Jul 2025 04:39 IST Ee Font size 2 min read బెజవాడ మెట్రోకు టెండర్ల ఆహ్వానం.. తొలిదశలో రెండు కారిడార్లుగా పనులు ‘‘విజయవాడ నగర ప్రజారవాణాలో కీలకమైన మెట్రోకు ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ఎంఆర్‌సీఎల్) సోమవారం టెండర్లు పిలిచింది. మొత్తం వ్యయంలో 40 శాతం వెచ్చించి తొలుత పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.4,150 కోట్లతో బిడ్లు ఆహ్వానించారు.’’ ‘‘30 నెలల్లో ప్రాజెక్టు పనులు, 24 నెలల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలి. సీఎంపీ తయారీకి సిస్ట్రా.. 443.43 చదరపు కి.మీ. పరిధిలోని 2.3 మిలియన్ల జనాభా ఉండే ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. విజయవాడ, గన్నవరం, రాజధాని నగరం, మంగళగిరిలో అధ్యయనం చేపట్టారు. ట్రాఫిక్ విశ్లేషణకు 179 జోన్లుగా విభజించారు. మెట్రో రైలుకు నగరం అనుకూలమని తేలింది.’’ ఈనాడు, అమరావతి : మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో రెండు కారిడార్లలో నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పీఎన్‌బీఎస్ వరకు ఒకటి, పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ వరకు మరొకటి రానున్నాయి. 38.40 కి.మీ. నిడివితో ఈ రెండు మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లు ప్రతిపాదించారు. వీటిలో గన్నవరం విమానాశ్రయం వద్ద ఒక స్టేషన్ భూగర్భంలో రానుంది. స్టేషన్ల వద్ద నగరంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లేలా సిటీ బస్సు సర్వీసులు నడపనున్నారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్‌లతో అనుసంధానంతో ప్రయాణికులకు మేలు కలగనుంది. డబుల్ డెక్కర్ పైవంతెన... చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రద్దీ ప్రాంతంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. నగర రద్దీని తట్టుకునేలా మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు జాతీయ రహదారుల సంస్థతో కలసి మెట్రో రైలు కార్పొరేషన్ భారీ పైవంతెనను నిర్మించనుంది. 4.33 కి.మీ. పొడవున నాలుగు వరుసలతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. కింద వాహనాలు వెళ్తాయి. పైన మెట్రో రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. ఇందుకయ్యే వ్యయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ, ఏపీఎంఆర్‌సీఎల్ భరించనున్నాయి. తొలుత రెండు బోగీలు... ప్రతి రైలు రెండు బోగీలతో నడపనున్నారు. రెండు బోగీల్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణించే వీలుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడవనున్నాయి. రద్దీ ఉంటే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నడపనున్నారు. ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సెలవు రోజులు, ఆదివారాలు డిమాండ్ తక్కువగా ఉంటే సర్వీసులను కుదిస్తారు. ప్రారంభంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే వీలుందనీ.. 2055 నాటికి ఈ సంఖ్య 12-15 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. Nice 👌
September 8, 2025Sep 8 Author ప్రాజెక్టు అప్‌డేట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ABN , Publish Date - Sep 08 , 2025 | 08:28 AM విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ నెల 18న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే ఇటీవల ఏపీఎంఆర్‌సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు. Vijayawada Metro Rail Project విజయవాడ 'మెట్రో' ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టర్ల అభిప్రాయం గంపగుత్తగా కాకుండా పనులను విభజించాలని సూచన జాయింట్ వెంచర్ పనిచేయటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి మెట్రో రైల్ ప్రాజెక్టుకు కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన బోర్డు మీటింగ్‌లో చర్చించాలని భావిస్తున్న ఏపీఎంఆర్‌సీ టెండర్ల ప్రక్రియ అక్టోబరు 14వ తేదీకి వాయిదా ‘విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు (Vijayawada Metro Rail Project) టెండర్లు స్ట్రీట్ చేయండి.. బాయింట్ వెంచర్లకు అవకాశం కల్పించండి' అంటూ తాజాగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్ట్ సంస్థల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు రోజుల్లో ఏపీఎంఆర్‌సీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో కాంట్రాక్టు సంస్థల సూచనలపై చర్చించాలని భావిస్తోంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్థల అభిప్రాయాన్ని తెలియపరచనుంది. ప్రీబిడ్ మీటింగుకు కాంట్రాక్టు సంస్థల నుంచి విశేష స్పందన రావడం, కీలకమైన అంశాలపై వారు చర్చ పెట్టడంతో టెండర్లను అక్టోబరు 14వ తేదీ వాటికి వాయిదా వేసింది. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అనుమతుల కోసం ఎదురుచూపులు విజయవాడలో మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు 65 కిలోమీటర్ల నాలుగు వరసల ఫ్లైఓవర్ మంజూరైంది మెట్రో కారిడార్ కారణంగా నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 45 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన ఏపీఎంఆర్‌సీ నుంచి వచ్చింది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.1800 కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపారు. దీనికి సంబంధించి కూడా ఇంకా అనుమతులు రాలేదు. ప్రాజెక్టులో -జాప్యం జరగకుండా ఉండేందుకు ఏపీఎంఆర్సీ అన్ని ప్రయత్నాలను చేసింది. మెట్రో రైల్ అనుమతులతో పాటు, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు కూడా అనుమతులు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ నెల 18న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే ఇటీవల ఏపీఎంఆర్‌సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు. ప్రీ బిడ్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు హాజరయ్యారు కాంట్రాక్టర్ల నుంచి ప్రధానంగా రెండు సూచనలు. వచ్చాయి. రూ.4,150 కోట్ల విలువతో గుత్తగా టెండర్లు ఎందుకు పిలవాల్సి వచ్చిందని పలు కాంట్రాక్టు సంస్థలు అడిగినట్టు తెలిసింది. గుత్తగా కాకుండా పనులను స్పిట్ వేయాలన్న ప్రతిపాదనలు పలు కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చాయి. దేశంలో పలు మెట్రో కారిడార్ పనులలో రూ.300 కోట్లు ఆపైన కూడా స్పిట్ చేసి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారన్న విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై ఏపీఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. దేశంలో పలు చోట్ల స్పిట్ చేసి టెండర్లు పిలిచిన మాట వాస్తవమేనని, అలా చేయటం వల్ల నిర్మాణ పనులలో విపరీతమైన జాప్యం జరుగుతున్న ఉదంతాలను ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును తాము ఎట్టి పరిస్థితులలో 2028 నాటికి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్లు తెలిపారు. ప్రీబిడ్ మీటింగ్‌లో పాల్గొన్న మరికొన్ని సంస్థలు సింగిల్ కాకుండా జాయింట్ వెంచర్ (భాగస్వామ్య కాంట్రాక్టు సంస్థలు)కు కూడా అవకాశం కల్పించాలని కోరాయి. రెండు, మూడు సంస్థలు కలిసి ప్రాజెక్టు పనులలో పాలు పంచుకునేందుకు భాగస్వామ్యం కల్పించాలని ప్రతిపాదించాయి. ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టు సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనటం ఒక ఎత్తు అయితే.. వాటి నుంచి వచ్చిన సూచనలు కూడా యూనిఫామ్‌గా ఉండటంతో వీటిపై బోర్డు మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయించారు. బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నారు. దీని కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ నెల 10 నుంచి అక్టోబరు 14వతేదీ వరకు టెండర్ల గడువును పొడిగించారు. కేంద్రం అనుమతులు రావాలి! విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతులు రాలేదు. అధికారిక అనుమతుల కోసం ప్రతిపాదన వెళ్లింది. ఈ ప్రతిపాదన మేరకు ఇటీవల ట్రాఫిక్ స్టడీ నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టు పనులలో జాప్యం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే ముందుగా ఏపీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది. టెండర్లు ఖరారు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉంది. ఇటు ప్రీబిడ్ మీటింగ్‌లో కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కాటు కేంద్రం నుంచి అనుమతులు ఇంకా రాకపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని టెండర్ల గడువును మరికొంత కాలం వాయిదా వేశారు.
December 15, 2025Dec 15 Anyone has any details if they have started land acquisition for the project if so we're can I find those details.
February 11Feb 11 Author విజయవాడలో దుర్గగుడి వరకు కారిడార్ల విస్తరణ విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రెండు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లను దుర్గగుడి వరకు విస్తరించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకు అధికారులు ప్రాథమికంగా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపారు. పీఎన్‌బీఎస్ నుంచి గన్నవరం, పెనమలూరు వరకు వేర్వేరుగా రెండు కారిడార్లు మొదట ప్రతిపాదించారు. దుర్గగుడి వరకు వాటిని విస్తరించి బస్టాండ్ మీదుగా వెళ్లేలా మార్పులు చేస్తే బాగుంటుందన్న కేంద్ర నిపుణుల సూచనలపై అధికారులు ఇటీవల పరిశీలించారు. దుర్గగుడి ముందు రోడ్డులో తగినంత ఖాళీ స్థలం లేదని, ప్రైవేటు స్థలాల సేకరణ చాలా వ్యయంతో కూడుకున్నదన్న విషయాన్ని కేంద్రానికి నివేదించారని తెలుస్తోంది. రెండోదశలో బస్టాండ్ నుంచి రాజధాని అమరావతి వరకు కారిడార్ ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.14,121 కోట్లు అవసరమని అంచనా వేశారు. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నందున.. ఈ కారిడార్ కూడా తొలిదశలోనే చేపట్టేందుకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరబోతోంది.
Thursday at 08:31 AM4 days M9.newsమధ్యప్రదేశ్ మెట్రో కూడా నష్టాల్లో... ఆలస్యమే ఏపీని కాపాడి...Losses in Hyderabad and MP Metro projects raise doubts as AP’s delayed metro plans may have saved the state from debt.
Create an account or sign in to comment