Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vijayawada ki Light Metro!

Featured Replies

  • Author

Vijayawada metro ki KFW fund chesthundi, DPR SYSTRA chesindi, DPR cost  9-10 cr mottam KFW  valle pay chesaru. Vizag metro ki korea eximbank fund cheyyantaniki cbn time lo munduku vachindi jaffa ragane metro 40 km kadu 60 km anesariki vallu dobbesaru akkda agipoyayi , land acquisition  ki central ki sambandam ledu, amaravati metro rail corporation and state govt chesukutundi, cenral govt mundu vatiki vacchinattu partner ravachu leda help cheyyvachu kani  manki edi undadu anukutunna. amaravati metro rail corporation  ippudu ayithe state govt de,  jaffa dani peru marachadu AP metro rail corporation ani,  asalu vizag metro ki land acquisition avasaram takkuva, max road meda velthundi, 6-10 acres land akkkdakada kavali peddaga chesedi emi ledu.

 

Edited by sonykongara

  • Replies 451
  • Views 38.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • unnecessary project Vijayawada ki hanta avasarlaa..mundu kavalsindi metro to vizag adi tesuku randi chalu

  • ravindras
    ravindras

    hyderabad metro rail loss lo nadusthunte vizag, vijayawada discussion waste. mundhu polavaram ki funds thechukunte chaaalu. 

  • sonykongara
    sonykongara

    Budget ki vetiki peddga emi sambandam emi undadu bro, ivvalai anukunte istharu, EAP krinda chestharu evi max esari istaru anukunta.

Posted Images

  • Author

modi JICA nundi EAP loan ipisthe chalu, metro ki lekapothe  Amaravati ki ippichina chalu 30 years taruvtha pay chesedi. last time adigadu cbn oka mata cheppandi ani, mottam bullet train ke pettaru JICA fund ni..

2 hours ago, ravindras said:

hyderabad metro rail loss lo nadusthunte vizag, vijayawada discussion waste.

mundhu polavaram ki funds thechukunte chaaalu. 

World mottam lo profits lo vunna metros 3-4 ..public transport eppudu profit making laga choododdu .. ala chooste RTC's , metros anni moosukovali..

22 hours ago, dusukochadu said:

Vijayawada ki ippudu metro enduku, Bokka. Mundu aa Amaravati ni materialize Cheyyandi. 

vijayawada and vizag growing stages lo metro kattesukunthe tharuvatha chala easy avuthadi... pedha cities lo metro kattatam ento kasthamoo chusi kuda ela matladithe emi antam... vachina funds ni use chesukovatame..

  • 4 weeks later...
  • Author

Visakhapatnam: విశాఖ మెట్రో.. సరికొత్తగా!

విశాఖ నగరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది.

Updated : 14 Jul 2024 07:00 IST
 
 
 
 
 
 

ఎన్‌హెచ్‌ఏఐతో కలిసి ముందుకు వెళ్లేలా ప్రణాళిక
ఆకృతుల్లో మార్పులు

ap130724main3a.jpg

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ఆకృతుల్లో (డిజైన్లు) అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐతో సమన్వయంతో ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా.. మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు తెలియజేశారు.

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పైవంతెనల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్నవాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్‌హెచ్‌ఏఐకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో ఎన్‌హెచ్‌ఏఐ నగరంలో 12 పైవంతెనలు నిర్మించేందుకు డీపీఆర్‌ రూపొందించింది. ఆయాచోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం, అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. త్వరలో వాటిపై స్పష్టత రానుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పనీ జరగలేదు.

2017లోనే అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన అయిదు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా.. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం.. తరువాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు డీపీఆర్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు. నాటి తెదేపా ప్రభుత్వం 46 కి.మీ.లలో మొదట దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా.. వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140.13 కి.మీ.లకు మార్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటిగా స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 46 కి.మీ. కారిడార్‌ నిర్మించి.. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • 3 weeks later...
  • Author

ఏపీలో మెట్రో రైలు ప‌ట్టాలెక్కించేందుకు స‌ర్కార్ చ‌ర్య‌లు కొత్త ఎండీగా రామ‌కృష్ణారెడ్డి... జీవో జారీ

  • 4 weeks later...
  • Author

విశాఖ, విజయవాడ మెట్రోలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ మెట్రో ఫేజ్‌-1 కోసం రూ.11వేల కోట్లు,  ఫేజ్‌-2 కోసం రూ.14వేల కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్‌ నుంచి స్టీల్‌ ప్లాంట్‌ వరకు విశాఖ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11,400 కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు విశాఖ మెట్రో ఫేజ్‌-2 కోసం రూ.5,700 కోట్లు కావాలి. ట్రాఫిక్‌ సమస్యలు తగ్గాలంటే మెట్రో వల్లే సాధ్యం. 

  • Author

Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల్లో కదలిక

జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది.

Updated : 30 Aug 2024 07:10 IST
 
 
 
 
 
 

తొలిదశ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం

ap290824main9a.jpg

విజయవాడ-అమరావతి మెట్రోరైలు కారిడార్లు

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు గురువారం ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపాలని ఆయన ఆదేశించారు. సవరించిన డీపీఆర్‌ల ప్రకారం... రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 

రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో. మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు. 

తొలి దశలో: 38.40 కి.మీ.
నిర్మాణ వ్యయం: రూ.11,009 కోట్లు.

విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ., బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ. 


రెండో దశలో: 27.80 కి.మీ.
నిర్మాణ వ్యయం: రూ.14,121 కోట్లు.

పండిట్‌నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రాజధాని అమరావతికి 27.80 కి.మీ.


మొత్తం ఖర్చు కేంద్రం భరించాలని కోరుతున్నాం: నారాయణ

విశాఖ, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకర్లకు తెలిపారు. ‘‘ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపాం. కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొన్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో

విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదన. నాలుగూ కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. 54 స్టేషన్లు ఉంటాయి. ఆయా కారిడార్ల వివరాలు ఇలా ఉన్నాయి..

తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు: 46.23 కి.మీ.
నిర్మాణవ్యయం: రూ.11,498 కోట్లు

కారిడార్‌ 1: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది. పొడవు: 34.40 కి.మీ.  స్టేషన్లు: 29

కారిడార్‌ 2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు. పొడవు: 5.07 కి.మీ.  స్టేషన్లు: 6

కారిడార్‌ 3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు. పొడవు:  6.75 కి.మీ.  స్టేషన్లు: 7

రెండో దశలో: ఒకటే కారిడార్‌.
నిర్మాణ వ్యయం: రూ.5,734 కోట్లు

కారిడార్‌ 4: కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం. పొడవు: 30.67 కి.మీ. స్టేషన్లు: 12

ap290824main9b.jpg
విశాఖ మెట్రోరైలు మార్గాలు ఇలా..

  • 1 month later...
  • Author

AP News: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ఢిల్లీలో కీలక చర్చలు..

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:21 PM

 

ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.

 
 
AP News: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ఢిల్లీలో కీలక చర్చలు..
 

 

అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ మూడ్రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులు సహా ఆయా శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అందివ్వనున్న రూ.15వేల కోట్లపై చర్చలు సాగుతున్నాయి. అలాగే సోమవారం నాడు హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి రుణంతోపాటు ఏపీ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపుపై మంత్రి చర్చించారు.

 

 

 

 
ABN ఛానల్ ఫాలో అవ్వండి
 
 
 
 
 
 
 
 
 
 

ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులపై ఇరువురూ కీలకంగా చర్చించారు. మెట్రో ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రిని నారాయణ కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వీటిని ప్రతిపాదించామని, రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలూ ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్-2 పథకం ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. దీంతో ఆ పథకం అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు చర్చించారు. మెట్రో ప్రాజెక్టుల విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు.

 

 
Updated Date - Oct 22 , 2024 | 02:21 PM
 
  • Author

విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానించాలి: మంత్రి నారాయణ

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో  ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు.

Published : 22 Oct 2024 16:18 IST
 
 
 
 
 
 

22metro-1a.webp

దిల్లీ: కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రమంత్రి ఖట్టర్‌ దృష్టికి తెచ్చారు. అమృత్‌ పథకం అమలుపై కూడా కీలక చర్చ జరిగింది. మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఖట్టర్‌ చెప్పినట్టు సమాచారం.

గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత ప్రభుత్వం మారడంతో మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. భూసేకరణనూ గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా కూటమి ప్రభుత్వ రాకతో మెట్రో ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్‌ మెట్రోకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్‌బీఎస్‌ నుంచి ఒక కారిడార్‌ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్‌ బందరు రోడ్డులో రానుంది. ప్రస్తుతం సుదీర్ఘ పైవంతెన ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.

  • 2 weeks later...
  • Author

విజయవాడ మెట్రోకు ఊపిరి.. కేంద్రం చెంతకు ప్రతిపాదనలు

రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రతిపాదనలు పట్టా లెక్కితే.. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దానికి ఉరేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ను.. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చింది.

Updated : 09 Nov 2024 07:43 IST
 
 
 
 
 
 

రెండు దశల్లో నిర్మాణానికి సూచన 
జెట్‌ సిటీ కారిడార్‌ తొలగింపు...

1a_803.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రతిపాదనలు పట్టా లెక్కితే.. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దానికి ఉరేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ను.. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చింది. మెట్రో గిట్రో లేదని కార్యాలయాన్ని విశాఖకు తరలించింది. మెట్రో ప్రాజెక్టు ఆధారిత భారత్‌ హెవీ వెహికల్‌ లిమిటెడ్, ఇతర సంస్థలూ తమ కార్యాలయాలను తరలించేశాయి. విజయవాడ మెట్రో రైలు(Vijayawada Metro) ప్రాజెక్టుకు తిరిగి తెదేపా ప్రభుత్వం ఊపిరి పోయనుంది. రాజధాని పనులు ఊపందుకోవడం.. ఈప్రాంత అభివృద్ధిపై నగరవాసులు ఆశలు పెంచుకోవడంతో మెట్రో ప్రాజెక్టు తొలిదశకు ప్రాణం పోస్తూ పురపాలక మంత్రి నారాయణ కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు అందించారు.

తొలిదశలో రెండు కారిడార్లు..! 

తొలిదశలో 38.40 కిమీ.. మేర రెండు కారిడార్లు నిర్మిస్తారు. గత ప్రతిపాదనల్లో ఒక కారిడారు పీఎన్‌బీ (బస్టాండు) నుంచి గన్నవరం వరకు (ఏలూరు రోడ్డు వెంట), మరో కారిడార్‌ పీఎన్‌బీ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. అప్పట్లో భారీ కసరత్తు చేసి.. భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి టెండర్లు పిలిచారు. వైకాపా గద్దెనెక్కాక అన్నీ ఆపేసి..  భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరించి.. డీపీఆర్‌లూ బుట్టదాఖలు చేశారు. కేంద్రానికి ప్రతిపాదనలే పంపలేదు. విజయవాడ మెట్రో స్థానంలో తేలికపాటి మెట్రో ప్రాజెక్టు చాలని ఆమోదించింది. ఆ బాధ్యతను సిస్ట్రా-రైట్స్‌ సంస్థకు అప్పగించగా 2019 ఏప్రిల్‌లో డీపీఆర్‌ అందించారు. విజయవాడ, అమరావతి(Amaravati)లో కలిపి 85 కిమీ లైట్‌మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.17,500 కోట్లుపైగా అవసరమని అంచనా. తొలిగా విజయవాడలో 38.5 కిమీ నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత పరిణామాల్లో మెట్రో ఆవశ్యకత గుర్తించి నాటి సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యయనానికి నాటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని విదేశాలకు పంపారు. వివిధ మెట్రో ప్రాజెక్టులు పరిశీలించిన బృందం తేలికపాటి మెట్రో సముచితమని నిర్ణయించింది. 

మొదటి దశలో...

కారిడార్‌-1: గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు 26 కిమీ నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో.. 3 కిమీ భూగర్భంలో నిర్మిస్తారు. దీనిలో ఒక స్టేషన్‌ ఏర్పాటు చేస్తారు.

కారిడార్‌-2: పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు బందరు రహదారిపై 12.5 కిమీ నిర్మిస్తారు. మొత్తం 21 స్టేషన్లు, ఒక భూగర్భ స్టేషన్‌ ఉంటుంది. ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందని అంచనా.

రెండో దశలో...

అమరావతి కారిడార్‌: పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతికి 27.5 కిమీ మేర నిర్మిస్తారు. కృష్ణా కాలువ జంక్షన్‌ మీదుగానే వెళ్తుంది. అమరావతి పరిధిలో 5 కిమీ ఆకాశంలో, 15 కిమీ భూగర్భంలో నిర్మిస్తారు. 

అమరావతి కారిడార్‌లో 32 స్టేషన్లు ఉంటాయి. అన్ని స్టేషన్లు కలిపి 60 వరకు ఉంటాయి. ఈ ట్రాక్‌పై 2 కార్‌ కోచ్‌లు నడుపుతారు. గన్నవరం వద్ద కోచ్‌డిపో పెడతారు. 400-450 మంది ప్రయాణించే వీలుంది. జక్కంపూడి వరకు ఉన్న కారిడార్‌ను.. అక్కడ ఆర్థిక నగరం ఏర్పాటు నేపథ్యంలో 16 కి. మీ మేర వలయ రూపంలో నిర్మిస్తారు.

తాజా ప్రతిపాదనల్లో జక్కంపూడి కారిడార్‌ మినహాయించినట్లు తెలిసింది. తాజా ప్రతిపాదనల్లో రెండు దశల్లో నిర్మించనున్నారు. ఈ మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి. గతంలో జర్మనీ సంస్థ కేఎప్‌డబ్ల్యూ మొత్తం రుణంగా అందించేందుకు ముందుకు వచ్చింది. 

1b_404.jpg

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.