Jump to content

Mobile Lift Irrigation Project


Recommended Posts

కదిలే ఎత్తిపోతలపై శాశ్వత కార్యాచరణ!

పంటలు ఎండకుండా ప్రణాళిక

ఈనాడు, అమరావతి: కదిలే ఎత్తిపోతల (మొబైల్‌ లిఫ్ట్‌) యంత్రాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు గత ఏడాది రెయిన్‌గన్లను వినియోగించినట్టే... ఈసారి కదిలే ఎత్తిపోతల యంత్రాలను కూడా ఉపయోగించాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయి స్థాయిలో వీటిని ప్రయోగాత్మకంగా ఎలా వినియోగించాలనేదానిపై నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ అధికారులు అధ్యయనం చేశారు. ఈ యంత్రాల ద్వారా కొద్ది మొత్తంలో నీటిని 10 కిలోమీటర్ల వరకు తరలించేందుకు వీలు ఏర్పడుతుంది. పంటలను రక్షించేందుకు శాశ్వత కార్యాచరణగా దీన్ని రూపొందించాలని భావిస్తున్నారు. దీనిపై ఇటీవలే ముఖ్యమంత్రి సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం గతంతో కంటే మరింత పక్కాగా ఇస్రో సహకారంతో వాతావరణాన్ని అంచనా వేస్తారు. భూమిలో తేమ రాబోయే వారం రోజుల్లో తగ్గుతుందా? మొక్క కాపాడేందుకు అనువుగానే ఉంటుందా? అనే విషయాన్ని గ్రామాల వారీగా లెక్క కడతారు. నీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి సమీపంలోని పంటకుంటలు, లేదా చెరువులకు ఆ నీటిని కొద్ది మొత్తంలో ఎత్తిపోస్తారు. ఇందుకోసం కదిలే ఎత్తిపోతల వాహనాలను వాడతారు. ఒక వాహనంపై పంపులు, మోటార్లు, ప్యానెల్స్‌ ముందే సిద్ధం చేస్తారు. వీటిలో తొలగించే, తిరిగి అతికించుకునే పైపులను వినియోగిస్తారు. విద్యుత్తు లేదా, డీజిలుతో వీటిని నిర్వహిస్తారు. వీటికి తోడు ఇప్పటికే సిద్ధంగా ఉన్న రెయిన్‌గన్‌లను వినియోగిస్తారు.

ధర్మవరం చెరువులో ప్రయోగాత్మక పరిశీలన.. గుంటూరు జిల్లా ధర్మవరం చెరువులో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించి చూస్తారు. క్యూబిక్‌ మీటరు నీటిని తరలించేందుకు ఒక కిలోమీటరు దూరానికి రూ.37.80 లక్షలు, మూడు కిలోమీటర్లకు రూ.60 లక్షలు, అయిదు కిలోమీటర్ల దూరానికి రూ.92.64 లక్షలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా లెక్కించారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో కొన్ని పంపుల కంపెనీల యజమానులు, ఎత్తిపోతల పనుల్లో కీలకంగా ఉండే గుత్తేదారు ప్రతినిధులతో చర్చించారు. ఒక టీఎంసీ నీటి తరలింపునకు వాహనాల వినియోగం, నిర్వహణ ఖర్చులు చెల్లించేలా... సమగ్ర అంచనాలు రూపొందించి ఒక అవగాహనకు రావాలని సూచించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ ఏడాది హంద్రీనీవా, గాలేరు నగరి కాలువల నీటిని ఇలా ఎత్తిపోసి చెరువుల్లో నింపాలని, తడులకు ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1400 చెరువుల్లో నీటిని నింపగల అవకాశం ఉందని గుర్తించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...