Jump to content

Water grid


Recommended Posts

  • 4 weeks later...
  • Replies 164
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఏపీలో లక్ష జనాభాలోపున్న 42 పట్టణాల్లో మెరుగైన తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల కోసం రూ.4188.71 కోట్ల అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది.

ఇందులో ఏఐఐబీ సాయం రూ.2606.31 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1116.99 కోట్లు, ఎంపికచేసిన పురపాలక సంఘాల వాటా రూ.465.41 కోట్లు

https://pbs.twimg.com/media/Dc018TxU0AEYQoG.jpg

Link to comment
Share on other sites

చిత్తూరు వరదాయిని!
అడవిపల్లె నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరా
రూ.250 కోట్లతో పైపులైను నిర్మాణం
నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
15 రోజుల్లో టెండరు అప్పగింత..15 నెలల్లో పనులు పూర్తి
చిత్తూరు నగర తాగునీటి స్వరూపం
ctr-top1a.jpg

- చిత్తూరు నగర జనాభా: 1.92 లక్షలు
- అవసరమైన నీళ్లు: 27 మిలియన్‌ లీటర్లు
- ఎన్టీఆర్‌ జలాశయం వద్దనున్న ప్లాంట్‌ సామర్థ్యం:  రోజుకు 12 మిలియన్‌ లీటర్ల శుద్ధి
- 2033లో నగర జనాభా (అంచనా): 2.7లక్షలు
- అప్పటి జనాభాకు అవసరమయ్యే నీళ్లు: 49 మిలియన్‌ లీటర్లు
- కల్లూరు వద్ద నిర్మించనున్న ప్లాంట్‌ సామర్థం: 37 మిలియన్‌ లీటర్ల శుద్ధి
- కల్లూరు ప్లాంట్‌ 37, ఎన్టీఆర్‌ ప్లాంట్‌ 12 మిలియన్‌ లీటర్లను శుద్ధి చేస్తాయి. 2033లోని జనాభాను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు.

నిధుల కేటాయింపు వివరాలు
కేంద్ర ప్రభుత్వ నిధులు: రూ.62.26 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం: రూ.24.52 కోట్లు
మున్సిపాలిటీ వాటా: రూ.163.19 కోట్లు (ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేటాయించాయి)
మొత్తం: రూ.250 కోట్లు

ఈనాడు డిజిటల్‌- చిత్తూరు: కంభంవారిపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి నీళ్లు తెచ్చి చిత్తూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రూ.250 కోట్ల నిధుల్ని కేటాయించింది. మరో పక్షం రోజుల్లో గుత్తేదారుకు ఈ కాల్వ, రిజర్వాయర్ల నిర్మాణ పనులను అప్పగించనున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇది సాకారమైతే.. దశాబ్దాలుగా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న జిల్లా కేంద్రానికి.. ఇకపై ఆ బాధలు తొలగిపోనున్నాయి.
హంద్రీ-నీవా ప్రాజెక్టు నీళ్లను నిల్వ ఉంచి 80 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ అడవిపల్లె రిజర్వాయర్‌ను 2006లో రూపొందించారు. నాటి  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై.. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆగిపోయాయి. తెదేపా ప్రభుత్వం వచ్చాక ఇటీవల దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. రూ.80 కోట్లతో నిర్మాణమైన ఈ రిజర్వాయర్‌కు రెండు బ్రాంచి కెనాళ్లున్నాయి. అడవిపల్లె నుంచి కలికిరి వరకు 17వేల ఎకరాల ఆయకట్టుకు ఒకటి, చిత్తూరు వరకు 63 వేల ఎకరాలకు మరోటి. ఇది పూర్తిగా హంద్రీ-నీవా మీదే ఆధారపడి ఉంది. సమీప వంకలు, వాగుల ద్వారా కూడా కొంత నీరు చేరనుంది. అయితే.. ఈ రిజర్వాయర్‌ను కేవలం సాగునీటి కోసమే రూపొందించారు. నిబంధనల ప్రకారం 10శాతం తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కానీ.. దీన్ని ఏర్పాటు చేసేటప్పుడు చిత్తూరు నగరానికి తాగునీరు అందించాలని అనుకోలేదు. చిత్తూరుకు నీరిస్తే.. దాదాపు 5వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందందు. రిజర్వాయర్‌ పూర్తయ్యాక చిత్తూరుకు తాగునీరు అందించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సాగు కంటే.. తాగునీటికి తొలి ప్రాధాన్యమన్న కోణంలో.. చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరికొన్ని రోజుల్లో రిజర్వాయర్‌ నుంచి చిత్తూరు నగరానికి పైపులైను పనులు ప్రారంభం కానున్నాయి.

కల్లూరు వద్ద ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌
చిత్తూరు నగరానికి నీళ్లిచ్చేందుకు అడవిపల్లె రిజర్వాయర్‌లోని ఓ భాగంలో బెడ్‌ లెవెల్‌ నుంచి 465 మీటర్ల లోతుకు ‘ఇన్‌టేక్‌ వెల్‌’ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి కల్లూరు వరకు 43 కి.మీల మేర 900మీటర్ల వెడల్పు కలిగిన డయా పైపులైనుతో నీళ్లు తెస్తారు. పంపింగ్‌ సిస్టమ్‌ ద్వారా నీళ్లు తెచ్చి.. కల్లూరు వద్ద భూఉపరితలం నుంచి 567 మీటర్ల ఎత్తులో ‘వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌’కు పంపిస్తారు. అక్కడ రోజుకు 37 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి, సరఫరా చేసేలా ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ 9కి.మీల దూరంలో ‘బ్రేక్‌ ప్రెజర్‌ ట్యాంకు’ (బీపీటీ)ను నిర్మిస్తారు. 800మీటర్ల వెడల్పు కలిగిన డయా పైపుతో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి బీపీటీ వరకు నీళ్లను తెస్తారు. బీపీటీ నుంచి చిత్తూరు వరకు 33 కి.మీలు ‘గ్రావిటీ ఫోర్స్‌’తో నీళ్లను తెస్తారు. చిత్తూరు నగరంలో 15కి.మీలు భూగర్భంలో పైపుల్ని నిర్మిస్తారు.

చిత్తూరుకు శాశ్వత పరిష్కారం
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చిత్తూరు నగర ప్రజలకు శాశ్వతంగా నీటి పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం నగరంలో 1.92 లక్షల జనాభా ఉంది. వీరికి రోజుకు 27 మిలియన్‌ లీటర్ల నీళ్లు అవసరం. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం ‘వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌’ రోజుకు 12మిలియన్‌ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధి చేస్తోంది. ఎన్టీఆర్‌ జలాశయం ప్లాంట్‌ నుంచి చిత్తూరు నగరపాలక సంస్థకు 9.50 మిలియన్‌ లీటర్‌ డైలీ (ఎంఎల్‌డీ) నీటిని తీసుకుంటోంది. 15 ఎంఎల్‌డీ నీటిని బోర్ల నుంచి, 2 ఎంఎల్‌డీను పూనేపల్లె ఫిల్టర్‌ స్టేషన్‌ నుంచి తీసుకుంటోంది. ఇక మిగిలిన 0.5 ఎంఎల్‌డీని ఆయా ఇంటి యజమానులు సొంత బోర్లను వాడుకుంటున్నారు. ఇలా రోజుకు 26.5 ఎంఎల్‌డీ నీళ్లను అతి కష్టం మీద సరఫరా చేస్తున్నారు.
2033 సంవత్సరంలో నగర జనాభా 2.7 లక్షలుగా ఉంటుందని.. అప్పుడు వారికి 49 ఎంఎల్‌డీ నీళ్లు అవసరమవుతాయని అంచనా. అందుకే ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కల్లూరు వద్ద నిర్మించనున్న వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కెపాసిటీ 37 ఎంఎల్‌డీ. అంటే రోజుకు 37 మి,, లీటర్ల నీటిని శుద్ధి చేసి, సరఫరా చేయగలదు. ఈ లెక్కన ఎన్టీఆర్‌ జలాశయం ప్లాంట్‌ ఇచ్చే 12, కల్లూరు ప్లాంట్‌ ఇచ్చే 37 ఎంఎల్‌డీ నీళ్లు పూర్తిగా సరిపోతాయి.

త్వరలో పనులు ప్రారంభం
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను నెల్లూరు ప్రజారోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. ఇటీవల టెండరుకు సంబంధించిన టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేశారు. మరో 15-20 రోజుల్లో గుత్తేదారుడికి పనులు అప్పగించనున్నారు.
‘అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి చిత్తూరుకు తాగునీరు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జల కేటాయింపుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. చిత్తూరుకు నీరిచ్చే క్రమంలో 5వేల ఎకరాలకు సాగు నీరు అందించలేకపోతున్నాం. ఆయకట్టు తగ్గించుకునైనా సరే.. తాగునీటికి ప్రాధాన్యతనివ్వాలి.’ అని జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ రెడ్డి వివరించారు

Link to comment
Share on other sites

9400 కోట్లతో కుళాయి నీళ్లు
05-06-2018 04:07:34
 
  • ఐదు జిల్లాల్లో పీపీపీగా అమలు
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన అధికారులు కార్యాచరణకు సిద్దమయ్యారు. రూ.4వేల కోట్లతో పల్లెల్లో తారు, సిమెంట్‌తో లింకు రోడ్లు నిర్మించాలని ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీరాజ్‌ శాఖ తాజాగా తాగునీటి వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగునీటి ప్రాజెక్టులను మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పీపీపీ విధానంలో హైబ్రిడ్‌యాన్యుటీ ప్రకారం వీటిని చేపడతారు. 70 ఎల్‌పీసీడీల తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటారు. వాస్తవానికి ప్రతి ఇంటికీ కుళాయి నీటిని అందించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే నారా లోకేశ్‌ నిర్ణయించారు. దానికనుగుణంగానే ఇప్పుడు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కడప జిల్లాకు రూ.1,800 కోట్లు, కర్నూలుకు రూ.1,449 కోట్లు, అనంతపురానికి రూ.1,904 కోట్లు, చిత్తూరుకు రూ.2,607కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.1,640 కోట్లు కేటాయించారు. డీపీఆర్‌లను సిద్ధం చేసి ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో 2,792 పథకాల ద్వారా 23,208 నివాసిత ప్రాంతాల్లోని 1.30కోట్ల జనాభాకు తాగునీటిని అందిస్తారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...