Jump to content

Water grid


Recommended Posts

తాగునీటి కోసం రూ.8వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు
 
636307902656473948.jpg
అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కోసం రూ.8వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఏడాది కాలంలో వాటర్‌గ్రిడ్‌ పూర్తయ్యేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Link to comment
Share on other sites

  • Replies 164
  • Created
  • Last Reply

Top Posters In This Topic

రక్షిత నీటికి ప్రత్యేక సంస్థ

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

కలెక్టర్ల సమావేశంలో త్వరలో నిర్ణయం

2 వేల కార్యనిర్వాహక పోస్టుల భర్తీకి చర్యలు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సమీక్షలో సీఎం చంద్రబాబు

ఈనాడు - అమరావతి

23ap-main5a.jpg

ప్రజలందరికీ రక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా తాగునీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేసే యోచనతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మారుమూల గ్రామాలతో సహా అన్ని ప్రాంతాలకూ రక్షిత నీటిని అందించేలా ఈ సంస్థ పని చేస్తుందని, దీనిపై రెండు, మూడు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. త్వరలో నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో చేపట్టిన పనుల పురోగతిపై మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సమీక్షించారు. వచ్చే ఆరు నెలల్లో ఎక్కడా తాగునీటి కలుషిత సమస్య తలెత్తకుండా పరిశుద్ధ జలాలను ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

* రాబోయే వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారానికి రెండు, మూడు సార్లు జాతీయ ఉపాధి హామీ కార్మికులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రత్యేకించి దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని చెప్పారు.

* అన్ని ముఖ్యమైన శాఖల్లో కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీలో భాగంగా త్వరలో రెండు వేల గ్రూపు-1, గ్రూపు-2 నియామకాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.సిమెంట్‌ రహదారులు, తాగునీటి సరఫరా, ఇంటింటికీ మరుగుదొడ్లు, వర్మీకంపోస్టు తదితర ఏడు అంశాల నిర్వహణ ఎలా ఉందో పరిశీలనకు ఏడు నక్షత్రాల గ్రేడింగ్‌ పద్ధతిని అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్రేడింగ్‌ పొందిన గ్రామాన్నే అభివృద్ధి చెందినదిగా గుర్తిస్తామని, ఇలాంటి గ్రామాలకు పేరొందిన సంస్థల నుంచి గుర్తింపు ఇప్పించి ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందిస్తామని వివరించారు.

* మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో నీటిని భూమిలోకి ఇంకించే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని చెప్పారు. హైడ్రాలిక్‌ మిషన్‌ సాయంతో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణకు అడ్డొచ్చే చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేరే ప్రాంతాలకు తరలించి నాటే సాంకేతికతను అనుసరించాలని సూచించారు.

* గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యర్ధాల నిర్వహణ తమ వంతు బాధ్యతగా గుర్తించి ఒక కమ్యూనిటీ ప్రాజెక్టుగా చేపట్టినపుడే ఫలితాలు సాధించగలమని చెప్పారు. వర్మీ కంపోస్టు నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 53,393 వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

* డిసెంబరులోగా రాష్ట్రం బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా ఉండాలని, డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కలెక్టర్ల సదస్సు నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛసేనాని పేరుతో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

ఉద్దానం సమస్యపై ప్రత్యేక దృష్టి: మంత్రి లోకేశ్‌

ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారానికి గతంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు అందించిన నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసి తగిన కార్యాచరణ సిద్ధం చేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి ఉద్దానంతో సహా సమస్యాత్మక గ్రామాలకు ఎన్టీఆర్‌ సుజల పథకంలో రక్షిత నీటిని అందిస్తామని ప్రకటించారు. సచివాలయంలో ప్లాస్టిక్‌ పైపులతో చేపట్టిన మురుగుపారుదల నిర్వహణ విజయవంతంగా నిలిచిందని, ఇదే పద్ధతిని గ్రామాల్లోనూ ప్రయోగాత్మకంగా తీసుకొస్తామని వివరించారు. పంటకుంటల ఏర్పాటు లక్ష్యసాధనలో కడప జిల్లా, మరుగుదొడ్ల నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచాయని వివరించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై కమిషనర్‌ బి.రామాంజనేయులు దృశ్య నివేదిక ఇచ్చారు.

Link to comment
Share on other sites

తాగునీటికి ప్రత్యేక కార్పొరేషన్‌!
 
636311918765102143.jpg
  • గ్రామాభివృద్ధికి స్టార్‌ రేటింగ్‌
  • సంపూర్ణ అభివృద్ధికి 7 స్టార్స్‌
  • గ్రామీణ ఆస్తులకు జియో ట్యాగింగ్‌
  • ఉపాధి కార్మికులతో పారిశుద్ధ్యమూ
  • త్వరలో 2 వేల గ్రూప్‌1, 2 కొలువులు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • ఈసారి కొత్తగా కలెక్టర్ల సదస్సు
  • దిశానిర్దేశ వేదికగా ఉండాలన్న సీఎం
  • అందుకనుగుణంగా అజెండాకు రూపు
  • చేయాల్సిన పనులపై చర్చకు ప్రాధాన్యం
  • రేపు, ఎల్లుండి విజయవాడలో సదస్సు
  • గ్రామాభివృద్ధికి రోడ్లు, తాగునీటి సరఫరా
  • వంటి ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఏడు నక్షత్రాల రేటింగ్‌ ఇస్తాం
  • 7 స్టార్స్‌ పొందితే ఆదర్శ గ్రామంగా ప్రకటిస్తాం
  • - ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షిత మంచి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా తాగునీటి సరఫరా సంస్థ (డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌)ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఆ శాఖల మంత్రి లోకేశ్‌తో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలతోసహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రెండు, మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనిని గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా తీసుకురావాలా? లేక ప్రత్యేకంగా నీటి సరఫరా కోసమే ఏర్పాటు చేయాలా? అన్నదానిపై త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న 6 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడా కలుషిత మంచినీటి సమస్య తలెత్తకుండా శుద్ధి చేసిన తాగునీటిని అందించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వానాకాలంలో నీటి కారక వ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నారు. అవసరమైతే వారానికి రెండు, మూడు సార్లు జాతీయ ఉపాధి హామీ కార్మికులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు.
 
గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక
అన్ని ముఖ్యమైన శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలోనే 2వేల గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 నియామకాలు జరుపుతామని సీఎం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు అవసరాన్ని గుర్తించామని, సాధ్యమైనంత త్వరలోనే ఈ నియామకాలు జరుపుతామన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయాలని కోరారు. గ్రామాల్లో రహదారి అనుసంధానానికి కచ్చితమైన వ్యూహ ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రహదారులు, తాగునీటి సరఫరా, ఇంటింటికి మరుగుదొడ్డి, వర్మీకంపోస్టు తదితర ఏడు అంశాల నిర్వహణ తీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ఏడు నక్షత్రాల రేటింగ్‌ పద్ధతిని అమలు చేస్తామని, ఏడు నక్షత్రాలు పొందిన గ్రామాన్నే అభివృద్ధి చెందిన గ్రామంగా గుర్తిస్తామన్నారు. అభివృద్ధి చెందిన గ్రామాలకు పేరొందిన సంస్థల ద్వారా అక్రెడిటేషన్‌ ఇప్పిస్తామని, దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించి ఉత్తమ గ్రామాలకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందిస్తామన్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ వాటర్‌ హార్వెస్టింగ్‌ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 40 వేల చేపల చెరువుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చేపల పెంపకందారులతో ఆయా గ్రామ పంచాయతీలు, సెర్ఫ్‌ సమన్వయంతో పనిచేసి ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వ్యర్థాల నిర్వహణను తమ వంతు బాధ్యతగా గుర్తించి ఒక కమ్యూనిటీ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన నాడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్వచ్ఛాంద్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్జీవోలు, సెలబ్రిటీలు, విద్యార్థులను భాగస్వాముల్ని చేయాలని సీఎం సూచించారు. డిసెంబరులోగా రాష్ట్రం మొత్తం ఓడీఎ్‌ఫగా రూపొందాలని, డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించి ఇంటింటి సర్వే జరిపించాలని కోరారు.
 
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం
ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి గతంలో ఎర్రన్నాయుడు అందించిన నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసి తక్షణం తగిన కార్యచరణను చేపడతామని సీఎం చెప్పారు. కిడ్నీ సమస్య ఉన్న గ్రామాల్లో ఎన్ని నిధులయిన ఖర్చు పెట్టడానికి వెనుకాడే సమస్య లేదన్నారు. జూలై నెలాఖరులోగా ఉద్దానం సహా సమస్యాత్మక గ్రామాలన్నింటికి ఎన్టీఆర్‌ సుజల పథకం కింద రక్షిత మంచినీటిని అందిస్తామని మంత్రి లోకేశ్‌ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థకు నూతన సాంకేతిక విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ప్ల్లాస్టిక్‌ పైపుల ద్వారా చేపట్టిన డ్రైనేజీ నిర్వహణ విజయవంతమైందని, ఇదే పద్ధతిని గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. పంటకుంటల ఏర్పాటు లక్ష్యసాధనలో కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
 
చెట్లు నరకొద్దంటే వినరేం!. అధికారులపై సీఎం ఆగ్రహం
అభివృద్ధి పేరుతో ఇష్టానుసారంగా చెట్లను నరికివేయరాదని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొన్ని చోట్ల విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు అడ్డు వచ్చిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేరే ప్రాంతాలకు తరలించే సాంకేతికత అందుబాటులో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వన సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కేవలం విత్తనాలు జల్లే సంప్రదాయ పద్ధతులతో సరిపుచ్చుకోకుండా హైడ్రాలిక్‌ మిషన్‌ సాయంతో మొక్కలు నాటాలని సీఎం సూచించారు.
 
SELF ADVT
Link to comment
Share on other sites

రాజధాని గ్రామాల్లో ‘కుప్పం నీటి సరఫరా’

రెండు మదర్‌ ప్లాంట్లు, 46 డిస్పెన్సింగ్‌ యూనిట్ల ఏర్పాటు

రూ.2కే 20 లీటర్ల శుద్ధ జలం పంపిణీ

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, సీఆర్‌డీయే సంయుక్త ప్రాజెక్టు

ఈనాడు - అమరావతి

23ap-main9a.jpg

రాజధాని అమరావతిలోని 29 గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు శుద్ధజలం సరఫరాకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ), ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ కలసి చేపడుతున్న ప్రాజెక్టుని వచ్చే నెల తొలి వారంలో ప్రారంభించనున్నారు. దీన్ని ఎన్టీఆర్‌ సుజల పథకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెంకటపాలెం, హరిశ్చంద్రపురం గ్రామాల వద్ద రెండు పెద్ద ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేస్తారు. ప్రతి గ్రామంలో నీటి పంపిణీ(డిస్పెన్సింగ్‌) యూనిట్లు ఉంటాయి. ఆర్వో ప్లాంట్లను మదర్‌ ప్లాంట్లుగా పిలుస్తారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన శుద్ధజలాన్ని ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు పంపించి డిస్పెన్సింగ్‌ యూనిట్లను నింపుతారు. 24గంటలూ నీటి లభ్యత ఉంటుంది. డిస్పెన్సింగ్‌ యూనిట్ల వద్ద 20లీటర్ల శుద్ధ జలాన్ని రూ.2కి అందజేస్తారు. వినియోగదారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు అందజేస్తారు. వారు డిస్పెన్సింగ్‌ యూనిట్‌ వద్దకు వెళ్లి కార్డు స్వైప్‌ చేసి, నీరు నింపుకొని వెళ్లవచ్చు. ఇలా మదర్‌ ప్లాంట్ల నుంచి డిస్పెన్సింగ్‌ యూనిట్లకు నీరు సరఫరా చేయడాన్ని ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ విధానంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలుచేస్తోంది.

రోజుకి 3.20 లక్షల లీటర్లు..

హరిశ్చంద్రపురం, వెంకటపాలెం వద్ద ఏర్పాటుచేస్తున్న మదర్‌ ప్లాంట్లలో రోజుకి 3.20లక్షల లీటర్ల శుద్ధ జలాల్ని ఉత్పత్తి చేయవచ్చు. గ్రామాల్లో ఏర్పాటుచేసే ఒక్కో డిస్పెన్సర్‌లో 9వేల లీటర్ల నీరు నింపవచ్చు. హరిశ్చంద్రపురం యూనిట్‌ దాదాపు సిద్ధమైంది. వెంకటపాలెం వద్ద మదర్‌ ప్లాంట్‌ పనులు మరో వారంలోపే పూర్తవుతాయి. గ్రామాల్లో డిస్పెన్సింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసే పని చురుగ్గా జరుగుతోంది. రాజధాని గ్రామాలతో పాటు, వెలుపలి ఐదారు గ్రామాల్లోను డిస్పెన్సింగ్‌ యూనిట్లు పెడుతున్నారు. పెద్ద గ్రామాల్లో రెండు యూనిట్లు పెడతారు. మొత్తం 46 డిస్పెన్సింగ్‌ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో నీరు ఎప్పుడు అయిపోతున్నా, వెంటనే మదర్‌ యూనిట్‌కు తెలిసే వ్యవస్థ ఉంటుంది. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం సుమారు లక్ష జనాభా ఉంది. ఇప్పుడు పెడుతున్న మదర్‌ ప్లాంట్ల సామర్థ్యాన్ని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం ఉంది. రాజధాని బృహత్‌ ప్రణాళికలో భాగంగా ప్రజలకు సురక్షిత జలాలు అందజేసేందుకు నీటిశుద్ధి కేంద్రాలు, సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేంత వరకు.. రాజధాని ప్రజల తాటునీటి అవసరాలకు ఇప్పుడు ఏర్పాటు చేయనున్న వ్యవస్థను వినియోగించుకోవచ్చన్నది అంచనా.

23ap-main9b.jpg

రూ.3 కోట్ల వ్యయం..!

మదర్‌, డిస్పెన్సింగ్‌ యూనిట్ల ఏర్పాటుకి రూ.3 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మదర్‌ యూనిట్లకు 2,000 చ.గజాలు చొప్పున, డిస్పెన్సింగ్‌ యూనిట్లకు 100 చ.గజాలు చొప్పున ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కి ప్రభుత్వం 33 ఏళ్లపాటు భూమిని లీజుకిచ్చింది. విద్యుత్‌ సరఫరా లైన్లు, బోర్లు ప్రభుత్వం వేస్తోంది. ప్లాంట్ల నిర్మాణం, ట్యాంకర్లు సమకూర్చుకోవడం, డిస్పెన్సింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి ఖర్చులన్నీ ట్రస్ట్‌వే. కరెంటు పోయినా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా మదర్‌ ప్లాంట్ల వద్ద జనరేటర్లు ఏర్పాటుచేస్తున్నారు. డిస్పెన్సింగ్‌ యూనిట్లకు 24 గంటలూ బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. భవిష్యత్తులో అవరమైన వారికి శీతల జలాలు(కూల్‌ వాటర్‌) కూడా అందజేసేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిద్ధంగా ఉందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. శీతల జలాల్ని 20 లీటర్లు రూ.6 నుంచి రూ.10కి ఇవ్వగలమని ట్రస్ట్‌ చెబుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ప్రతి ఇంటికీ నీటి కొళాయి

బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేయాలి: మంత్రి నారా లోకేష్‌

ఈనాడు, అమరావతి: గ్రామాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు నెల రోజుల్లో బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, జలవనరుల శాఖ అధికారులు సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేనితో కలిసి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2019 లోపు వీలైనన్ని ఎక్కువ జిల్లాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని చెప్పారు.

విమానయాన అనుసంధానంతోనే అభివృద్ధి: రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామనీ, అయితే రాష్ట్రంలో విమానయాన అనుసంధానం లేకపోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ఆయన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల్ని అథారిటీ అధికారులు వివరించారు.

Link to comment
Share on other sites

తాగునీటి కార్పొరేషన్‌కు కార్యాచరణ
 
 
  •  అధికారులతో మంత్రి లోకేశ్‌ సమీక్ష
అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి లోకేశ్‌ కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ అధికారులతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు రూపొందించాల్సిన మాస్టర్‌ ప్లాన్‌పై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏళ్ల తరబడి ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నా.. ప్రతి సంవత్సరం నీటి ఇక్కట్లు తప్పడం లేదని.. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. శాశ్వత నీటి సదుపాయాలు గుర్తించడం, నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీరు అందేలా కార్యక్రమం సిద్ధం చేయాలన్నారు. మరో నెల రోజుల్లో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసి పని ప్రారంభించాలని సూచించారు. 2019 లోపు వీలైనన్ని జిల్లాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించేందుకు యంత్రాంగం పనులు ప్రారంభించాలన్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా జలవనరుల శాఖ సహకారంతో మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసి రాబోయే 100 సంవత్సరాల్లో తాగునీటి సమస్య రాకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.
Link to comment
Share on other sites

ప్రతి ఒక్కరికీ ప్రాణధార!

రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం

తాగునీటికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌..

300 టీఎంసీల వార్షిక సామర్థ్యంతో సంస్థ

సిద్ధమవుతున్న కార్యాచరణ ప్రణాళిక

త్వరలో రాష్ట్ర మంత్రివర్గం ముందుకు..

నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కార యత్నం

ఈనాడు - అమరావతి

దక్షిణ భారతదేశంలో తాగునీటిపై ఇదే మొదటి కార్పొరేషన్‌ అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభించాక రెండేళ్లలో పూర్తయ్యేలా ప్రతిపాదిస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పట్టణ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాలు ప్రస్తుతం రోజూ రాష్ట్రంలో 4 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నాయి.

10ap-main1a.jpg

జలామృతాన్ని ఒడిసిపట్టి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే మహా ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతోంది. రెండున్నర దశాబ్దాలకుపైగా నీటి సమస్యే లేకుండా చేసే బృహత్తర ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టబోతోంది. రూ.50వేల కోట్లకుపైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అందరికీ తాగునీరు అందుతుంది. 2044 వరకూ రాష్ట్రంలో సమస్యే ఉండదు. తాగునీటి కోసం కొత్తగా ఎలాంటి పనులూ చేపట్టే అవసరం ఉండదు. కేవలం నిర్వహణ బాధ్యత చూస్తే చాలు. ఇదంతా తాగునీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసే కార్పోరేషన్‌ద్వారా జరుగుతుంది.

232 టీఎంసీల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యం

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు 300 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) వార్షిక సామర్ధ్యం కలిగిన తాగునీటి సంస్థ (డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌) ఏర్పాటు కోస¾ం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాది పొడవునా ఇదే టీఎంసీల సామర్ధ్యాన్ని కొనసాగించడంవల్ల తాగునీటి సమస్య నుంచి రాష్ట్రం బయటపడనుంది. 2014లో 232 టీఎంసీల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యంతో ఒక ప్రాజెక్టును రూపొందించారు. రెండేళ్లలో పెరిగిన జనాభా, ప్రజల అవసరాల దృష్ట్యా ప్రస్తుతం 300 టీఎంసీలు తప్పనిసరని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పట్టణ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యం 13 నుంచి 15 టీఎంసీలు. ఈ సామర్ధ్యాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు గత 20ఏళ్లుగా ఉన్నా నీటి లభ్యత అంతంత మాత్రం కావడంతో ప్రభుత్వ ఆమోదానికి నోచుకోలేదు. దీనివల్ల వేసవి ప్రారంభం నుంచే రాష్ట్రంలో తాగునీటి సమస్య మొదలవుతోంది. వర్షాభావం, భూగర్భ జలాలు, జలాశయాలు అడుగంటిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నాలుగైదు జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలైనా ఇప్పటికీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో తాగునీటి సంస్థ ఏర్పాటు కోసం కొద్దికాలంగా యత్నిస్తోంది. ఈనెల 15న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలోగా ఇందుకోసం మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో అధికార వర్గాలున్నాయి. రాష్ట్రంలో తాగునీటి సంస్థ ఏర్పాటు కోసం రూ.50వేల కోట్లకుపైగా అవసరమని అంచనా వేస్తున్నారు.

అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నందున

జలవనరులశాఖ ఆధ్వర్యంలోని జలాశయాల, బ్యారేజీల, కాలువల నుంచి నీటిని వినియోగించుకోవడానికి కొత్తగా పైపులైన్లు, నీటిని నిల్వ చేసేందుకు చెరువులు, జలాశయాల అదనపు నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. వీటితో 2044 వరకు రాష్ట్రంలో మళ్లీ కొత్తగా ఎలాంటి పనులు చేపట్టే అవసరం ఉండదని, కేవలం నిర్వహణ బాధ్యత చూస్తే చాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి, సమీకరణ, సరఫరా తరహాలో తాగునీటి సంస్థను రూపొందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కొత్తగా అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నందున గ్రామీణ, పట్టణ ప్రజల అవసరాలకు తగిన నీటిని సరఫరా చేసేందుకు జలవనరులశాఖ హామీ ఇవ్వడంతో తాగునీటి సంస్థ ఏర్పాటు, పనుల నిర్వహణ ప్రతిపాదనలను మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 15 నాటి సమావేశానికి ప్రాథమికంగా నివేదిక ఇస్తే తదుపరి సమావేశ అజెండాలో ప్రధానాంశంగా చేర్చాలని యోచిస్తున్నారు. తాగునీటి సంస్థ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని

10ap-main1b.jpg

అన్ని ప్రాంతాలకూ శుద్ధి చేసిన రక్షిత నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు అధికార వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 68శాతం ప్రాంత ప్రజలకు పైపుల్లో నీరు సరఫరా చేస్తున్నారు. మిగతా 32శాతం ప్రాంతాలకు పవర్‌బోర్లు, చేతిబోర్లు, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతోంది. అందరికీ రక్షిత నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తాగునీటి సంబంధిత వ్యాధుల నుంచి బయటపడే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలను లేవనెత్తుతున్నారు.

ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో రక్షిత నీటి సరఫరా సాధ్యం కాదని, అలాంటిచోట్ల ఇప్పుడున్న పథకాలను కొనసాగించడమే మేలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనిపై అధికారులు చేస్తున్న కసరత్తు ఒకటి, రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో సవరణలు చేసి ప్రాథమిక సమాచారాన్ని మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

మెగా ప్రాజెక్టుకు వూపిరి

రూ.80 కోట్ల నిధుల కేటాయింపు

వూపందుకోనున్న పనులు

పాయకరావుపేట, న్యూస్‌టుడే

vsp-gen7a.jpg

ప్రజల చిరకాల వాంఛ... కలల వారధి... మెగా ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ నిర్ణయంతో వూపిరి వచ్చింది.. తాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా? దాహార్తి తీరుతుందా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ మరో రూ.80 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదముద్ర లభించింది. దీంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు రూ.51 కోట్ల వ్యయంతో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజా నిధుల కేటా‘యింపు’తో మరిన్ని గ్రామాలకు దాహార్తిని తీర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో ప్రధాన సమస్య తాగునీరే! నీరు దొరుకుతుంది. నోట్లో వేసుకుంటే ఉప్పగా తాగేందుకు వీలులేని పరిస్థితి. తీరప్రాంతం కావడంతో సముద్ర జలాలు భూగర్భంలోకి చొచ్చుకురావడంతో ఈ దుస్థితి నెలకొంది. పాయకరావుపేట నుంచి పైపులైను ద్వారా నక్కపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నా అదీ అంతంతమాత్రమే. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు గత ప్రభుత్వ హయాంలో మెగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అప్పట్లో దీనికి రూ.102 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. తాండవ రిజర్వాయర్‌ వరకు పైపులైను వేసి అక్కడి నుంచి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని భావించారు. దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో 90 గ్రామాల్లోని 1,72,790 మంది దాహార్తి తీర్చేందుకు సన్నాహాలు చేశారు. తొలివిడతగా సుమారు రూ.20 కోట్లు విడుదల చేశారు. వీటితో తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని నర్సీపట్నం వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న గ్రామాలైన రేఖవానిపాలెం, మరువాడ, డి.పోలవరం, కోటనందూరు మండల పరిధిలోనూ పైపులైను పనులు పూర్తి చేశారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేందుకు రైతులు ఒప్పుకోలేదు. దీంతోపాటు మిగతా నిధులు కేటాయించలేదు. దీనివల్ల ప్రాజెక్టు పనులు అంతరాయం కలిగింది.

హామీ నెరవేర్చారిలా...

ప్రజల కలల మెగా ప్రాజెక్టు నిలిచిన వైనంపై ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో తరచూ కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేగాక ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిత దృష్టికి తీసుకువెళ్లింది. దీన్ని సాధించడమే తన ధ్యేయమని ఆమె స్వయంగా ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగానే ప్రాజెక్టు అంశాన్ని అప్పట్లో గ్రామీణాభివృద్ధిశాఖామంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడుతో చర్చించారు. అంతేగాక ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకురావాలనే కొత్త ప్రతిపాదనను వెలుగులోకి తెచ్చారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనల్లో శరవేగంగా మార్పులు చేయించారు. ఇదే సమయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు రూ.51 కోట్లు విడుదల చేశారు. దీంతో నిలిచిన పనులు మరోసారి వూపందుకున్నాయి. దీంతో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో పైపులైన్లు ఏర్పాటు చేశారు. మండలంలోని గోపాలపట్నం ఆవలో వాటర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణపు పనులు చేపట్టారు. నాతవరం మండలంలోని శరభవరం వద్ద పంప్‌ హౌస్‌ను నిర్మించారు. దీన్ని ఏలేరు కాలువకు అనుసంధానం చేశారు. ఈ పనులన్నీ పూర్తికాగా ప్రస్తుతం గోపాలపట్నం ఆవలో స్టోరేజీ ట్యాంకు పనులు జరుగుతున్నాయి. నామవరం వద్ద పైపులైను ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి.

మంత్రి లోకేశ్‌ చొరవతో..

ఇటీవల మెగా ప్రాజెక్టు పనులకు ఉద్దండపురం వద్ద మంత్రి నారా లోకేశ్‌ మెగా ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిధుల కొరత విషయాన్ని ఎమ్మెల్యే అనిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు తాజాగా రూ.80 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రాజెక్టు పరిధిలో లబ్ధి పొందే గ్రామాల జాబితా పెరిగింది. గతంలో 90 గ్రామాలకు అందించాలని నిర్ణయించినప్పటికీ నిధుల కేటాయింపుతో మరో 12 గ్రామాలు దీనిలోకి చేరాయి. ముఖ్యంగా ఎస్‌.రాయవరం మండలంలోని గెడ్డపాలెం, గుడివాడ తదితర గ్రామాలకు నీరందనుంది. వచ్చే ఏడాది నాటికి ‘మెగా’ కలలు నెరవేరనున్నాయి.

నిధుల కేటాయింపుతో పనులు వేగవంతం

- వంగలపూడి అనిత, ఎమ్మెల్యే, పాయకరావుపేట

మంత్రి లోకేశ్‌ ఇచ్చిన హామీని నెరవేర్చారు. దీనికి రూ.80 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగవంతం కానున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చాలని కలలు కన్నా. దానికి అనుగుణంగానే ఆది నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించా. సుమారు లక్షన్నర మందికి తాగునీరు అందుతుంది. పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నా. అతి త్వరలోనే పనులు పూర్తికానున్నాయి. నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 2 months later...

11 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌!
07-12-2017 00:53:27

 
636482048082650523.jpg
  • ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరే లక్ష్యం
  • త్వరలో 10 వేల కోట్లతో తొలి దశ పనులు
  • జలవాణి, సోషల్‌ మీడియా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు
  • తక్షణం ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకం:లోకేశ్‌
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిఇంటికీ రక్షిత తాగునీటి సరఫరా కోసం రూ.21,968 కోట్ల అంచనా వ్యయంతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. త్వరలో రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో తొలి దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి కార్పొరేషన్‌ ద్వారా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ సుజల కార్యక్రమంలో 100 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, 2018 జూన్‌లోపు అన్ని క్లస్టర్ల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు. ఉద్ధానం ప్రాంతంలో మిగిలిన ఇచ్ఛాపురం, మందస క్లస్టర్ల ఏర్పాటు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు.
 
ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్ల ఏర్పాటు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు. ఇకపై ఎన్టీఆర్‌ సుజల కార్యక్రమంపై ప్రతిరోజూ సమీక్ష చేస్తానని తెలిపారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల మరమ్మతులకు నిధులు కేటాయించామని, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని సూచించారు. జలవాణి, సోషల్‌ మీడియా ద్వారా వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని ఈ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
 
ఉపాధిహామీ పథకం కింద గత 6 నెలల్లో తక్కువ పనులు జరిగిన గ్రామాలను సగానికిపైగా తగ్గించగలిగామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 13 పంచాయతీల్లో ఉపాదిహామీ పథకం కింద ఒక్క పని కూడా ఎందుకు జరగలేదని మంత్రి అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని చోట నియామకాలు జరపాలని ఆదేశించారు. ప్రతిగ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 2018 మార్చి నాటికి కనీసం రూ.20 లక్షలకు తగ్గకుండా పనులు జరగాలని సూచించారు. ఉపాధిహామీ పనులు బాగా జరుగుతున్న గ్రామాలు, పనితీరు సంతృప్తికరంగా లేని గ్రామాల మధ్య బేరీజు వేసి నివేదిక అందజేయాలని కోరారు. ఈ పథకంలో రోజుకీ సగటున రూ.141 వేతనం అందజేస్తున్నామని త్వరలో దీన్ని రూ.165కు పెంచే ప్రయత్నం చేస్తున్నామని మంత్రికి అధికారులు వివరించారు.
 
2.91 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించామని అధికారులు తెలుపగా, 7 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు. ఉపాధిహామీ పథకం అనుసంధానంతో జరిగే కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. డంపింగ్‌ యార్డుల నిర్మాణం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, మరుగుదొడ్ల నిర్మాణం, పంటకుంటల నిర్మాణంపై జిల్లాల వారీగా చర్చించారు.
 
6300 డంపింగ్‌ యార్డులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 3534 కేంద్రాల పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఎన్టీఆర్‌ జలసిరి-2 కార్యక్రమంలో భాగంగా 35వేల బోర్‌వెల్స్‌ తవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ 17,749 బోర్‌వెల్స్‌ తవ్వకాలు పూర్తయ్యాయని, ఇందులో 3644 బోర్‌వెల్స్‌కు సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేశామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో 30 లక్షలకు పైగా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు తెలుపగా, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

 

22 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌
29-12-2017 02:29:50
 
636501165369476746.jpg
  •  ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు
  •  తొలి విడతలో 6330 కోట్లతో 8 జిల్లాల్లో
  •  రెండో విడతలో 9400 కోట్లతో 5 జిల్లాల్లో
  •  బ్యాంకులు, ప్రైవేటు సంస్థల నుంచి రుణం
  •  వాటర్‌ గ్రిడ్‌ పనుల్ని ముమ్మరం చేయండి
  •  అధికారులకు మంత్రి లోకేశ్‌ ఆదేశం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు ఏపీ తాగునీటి కార్పొరేషన్‌ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా రూ.22వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌కు రూపకల్పన చేసింది. వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా 48,363 నివాసిత ప్రాంతాల్లో 13,163 పనులు చేపట్టి రక్షిత తాగునీటిని అందించనున్నారు. ఈ భారీ పథకానికి రెండు పద్ధతుల్లో నిధులను సమీకరించాలని నిర్ణయించారు. తొలి విడతలో.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి వనరులను కల్పించేందుకు బ్యాంకుల నుంచి రుణం పొందనున్నారు. ఈ 8 జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులను అమలు చేసేందుకు మొత్తం రూ.6330 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో బ్యాంకుల నుంచి రూ.5300 కోట్లు రుణంగా సమీకరించుకోవాలని నిర్ణయించారు. మిగిలిన రూ.1030 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 12 ఏళ్ల పాటు బ్యాంకులకు రుణాలను 7.90% వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. ఏపీ తాగునీటి కార్పొరేషన్‌ ఇప్పటికే ఆంధ్రాబ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎస్బీఐ, విజయా బ్యాంకు, కెనరాతదితర బ్యాంకులను రుణం కోసం సంప్రదించింది. విజయా బ్యాంక్‌ రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రెండో దశలో మిగిలిన ఐదు జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ పనులను చేపట్టనున్నారు. దీని కోసం ప్రైవేట్‌ సంస్థల నుంచి రుణాల్ని సేకరించాలని తాగునీటి కార్పొరేషన్‌ భావిస్తోంది. రెండో దశలో తాగునీటి కార్పొరేషన్‌ వార్షిక చెల్లింపుల విధానంలో రూ.9400 కోట్లతో తాగునీటి సౌకర్యాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఆయా సంస్థలు, ప్రభుత్వం 75:25 నిష్పత్తిలో నిధులు భరించనున్నాయి. ఇవి కాకుండా ఇతర తాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు రూ.6277 కోట్లను విదేశీ సంస్థల నుంచి లేక ఇతర బ్యాంకుల నుంచి పొందాలని భావిస్తున్నారు.
 
వాటర్‌ గ్రిడ్‌పై సమీక్ష
వాటర్‌గ్రిడ్‌కి సంబంధించిన రుణసేకరణ, ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై దృష్టి సారించి వాటిలో వేగం పెంచాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 5 నుంచి ప్రతి రోజూ గ్రామాల్లో 10 వేల ఎల్‌ఈడీ బల్బులు అమర్చనున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. 2018 ఏప్రిల్‌ నాటికి గ్రామాల్లో 10 లక్షల బల్బులు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...