Jump to content

Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)


Recommended Posts

12 లక్షల మందికి నిరుద్యోగ భృతి!

యువజనాభ్యుదయ శాఖ కసరత్తు

ఎంత, ఎలా ఇవ్వాలనే అంశంపై పరిశీలన

సామాజిక స్పృహ కూడా కల్పించాలని యోచన

అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిపై సమీక్ష

ఈనాడు - అమరావతి

నవ్యాంధ్రలో ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతిని ఇచ్చే కసరత్తు వూపందుకుంది. భృతి ఇవ్వడంతోపాటు వారిలో సమాజం పట్ల బాధ్యత పెంచేలా సామాజిక స్పృహను పెంపొందించనున్నారు. ఎంత ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి.. ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలి.. వంటి ప్రాథమిక అంశాలపై ముందుగా ఒక నిర్ణయానికి రావాలని ఏపీ యువజనాభ్యుదయ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాల్లో ఖాళీలు, ఎలాంటి అర్హతలున్నవారు అవసరం వంటి వివరాలను సేకరించి.. అర్హులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని పొందేందుకు 12 లక్షల మంది అర్హులైన నిరుద్యోగులున్నట్లు ప్రజాసాధికార సర్వే ప్రకారం ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంఖ్యపైనే ఆధార పడకుండా నిరుద్యోగులుగా ఎవరిని, ఎలా గుర్తించాలనే విధివిధానం ఖరారయ్యాక అర్హుల సంఖ్యను నిర్ధరించనున్నారు. నిరుద్యోగులే నమోదు చేయించుకునే ప్రక్రియను చేపట్టే దిశగానూ యోచిస్తున్నట్లు సమాచారం. కుటుంబ వార్షికాదాయ పరిమితి, విద్యార్హత, ఎంతకాలం నుంచి ఉద్యోగం లేదు వంటి ప్రాథమిక అంశాలతోపాటు ఉపాధికల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలనూ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భృతిగా నెలకు రూ.1500 ఇవ్వాలా? రూ.2 వేలు ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? వంటి అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు.

దేశంలో పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుద్యోగ భృతి పంపిణీ పథకం అమలు చేసినట్లు యువజనాభ్యుదయ శాఖ గుర్తించింది. కొన్ని సాంకేతిక కారణాలతో అక్కడ పథకం కుంటుపడింది. అమలులో లోపాలు, పరిష్కారానికి చర్యలు తదనంతర పరిణామాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత లోటుపాట్లు లేకుండా ఏపీలో పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించేలా సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కర్ణాటక తరహాలో..

కర్ణాటకలో నిరుద్యోగ యువతను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తున్న తరహాలోనే.. ఏపీలోనూ నిరుద్యోగ యువతలో సామాజిక స్పృహ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట చెలిమల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి ప్రభుత్వ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయనున్నారు. మొత్తంగా సామాజిక కార్యక్రమాలకే పరిమితం చేస్తే ఉద్యోగాల్లో చేరడంలో వెనుకబడే ప్రమాదం ఉన్నందున పర్యావరణం, ఆరోగ్యం, అక్షరాస్యత వంటి సామాజిక అంశాల్లో మాత్రమే భాగస్వాములను చేస్తే బాగుంటుందని నిరుద్యోగ భృతి కల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ప్రస్తుతం ఉపాధి కల్పన కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలతో అనుసంధానంగా నిరుద్యోగ భృతిని కొనసాగించనున్నారు. ఆయా శాఖల సమన్వయంతో ఉపాధి కల్పించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

ట్రిపుల్‌ ధమాకా!
 
  • నిరుద్యోగ భృతి..శిక్షణ కాలంలో భృతిగా 2 వేలు
  • కంపెనీల నుంచి స్టైఫండ్‌ 3 వేలు
  • ఉపసంఘం భేటీలో నిర్ణయం
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఈ భృతి ‘ఉద్యోగాలకు, ఉపాధికి కొత్త దారి’ చూపనుంది. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించుకుంది. అయితే, దీనిని ఊరికే ఇవ్వకుండా నిర్మాణాత్మకంగా, ఉపయుక్తంగా మలచాలని ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం... నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో వివిధ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో కంపెనీలు కూడా స్టైఫండ్‌ ఇస్తాయి. శిక్షణ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ఆపై కంపెనీ నిబంధనల ప్రకారం వేతనం అందుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిలిపివేస్తుంది. స్థూలంగా ఇదీ ‘నిరుద్యోగ భృతి’ పథకం అమలు పద్ధతి!
నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి, విధానాల ఖరారుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తొలిసారి సమావేశమైన ఈ కమిటీ నిరుద్యోగ భృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించింది.
 
అందులో భాగంగా.. వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైనా సబ్‌ కమిటీలో చర్చ జరిగింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా.. నిరుద్యోగులను కంపెనీలలో శిక్షణ కోసం చేరుస్తామని లోకేశ్‌ తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు వారికి చెల్లిస్తామని, దీంతోపాటు కంపెనీ స్టైఫండ్‌గా రూ.3 వేలు ఇస్తుందన్నారు. శిక్షణ పూర్తవ్వగానే సదరు కంపెనీ ఆ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి పూర్తిస్థాయి జీతం ఇస్తుందని వివరించారు. ఎంతమందికి ఈ విధంగా చేయగలమనే అంశాన్ని పరిశీలించాలని సబ్‌ కమిటీలో నిర్ణయించినట్లు లోకేశ్‌ తెలిపారు. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై జూన్‌ 5న పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, నిపుణులతో సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
 
నిరుద్యోగ భృతికి నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికే కేటాయించిన రూ.500 కోట్లకు తోడు అవసరమైతే మరిన్ని నిధులనూ కేటాయించాలని ఉపసంఘం అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికల నిధులను కూడా నిరుద్యోగ భృతికి అనుసంధానించే అంశాన్ని పరిశీలించింది. సమావేశం అనంతరం కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ భృతి అమలు కోసం యువజన శాఖతోపాటు అవసరమైతే ఇతర శాఖల నుంచీ నిధులను సమీకరిస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ఎలా జరగాలన్న దానిపై చర్చించామన్నారు. పల్స్‌ సర్వే నుంచి నిరుద్యోగుల వివరాలు తీసుకోవడంతో పాటు ఇతర మార్గాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. లబ్ధిదారుల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఒక బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
నిరుద్యోగ భృతిపై అధ్యయనం: యనమల
 
 
తొండంగి, మే 30: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయించనున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ క్రమంలో నూతన యువజన విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంగళవారం కాకినాడలోని తొండంగి మండలం ఏవీ నగరం గ్రామంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి పేద కుటుంబానికీ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్లు తేలిందన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
నిరుద్యోగ భృతి పది లక్షల మందికి!
28-07-2017 02:30:46
 
636368058744889429.jpg
  • 21-35 ఏళ్ల వారికిచ్చే యోచన.. 1000 కోట్లపైనే ఖర్చు
  • మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి మహా మథనం
  • భృతికి ప్రతిగా సేవలు.. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి
 
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతికి ప్రాతిపాదిక ఏమిటి.. ఎవరెవరికి ఇవ్వాలి.. ఎంత మందికి ఇవ్వాలి.. ఎంత ఇవ్వాలి.. అసలు నిరుద్యోగులెంత మంది ఉన్నారు? ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారమిక్కడ ఆరుగురు మంత్రులు, ఆయా శాఖల అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘ మథనం నిర్వహించారు. మూడు రోజుల క్రితం మంత్రుల బృందం భేటీలో చర్చించిన అంశాలకు అధికారులు కొద్దిగా మెరుగులు దిద్ది సీఎం ముందుకు తెచ్చారు. అయినా ఇంకా భిన్నాభిప్రాయాలు.. విభిన్న సూచనలు రావడంతో ముందుగా నిరుద్యోగుల లెక్కలు-సమాచారాన్ని నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
ఉపాధి-ఉద్యోగం లేకుండా ఉన్న యువతీ యువకుల సమాచారాన్ని కచ్చితంగా సేకరించి 15 రోజుల తర్వాత తిరిగి సమావేశానికి రావాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు, పి.నారాయణ, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్న ఈ భేటీలో క్రీడలు-యువజన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చారు.
 
తర్వాత... ఏ వయసు నుంచి ఏ వయసువారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి? విద్యార్హత ఎంతవరకు పెట్టాలి? ఎన్నేళ్లపాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలి? మిగిలిన ప్రాతిపదికలు ఏమిటి? అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిరుద్యోగులకు మూడు విధాలుగా ప్రభుత్వ సాయం అందించవచ్చనే సూచనలు వచ్చాయి. 1) వయసు, విదార్హతల ప్రాతిపదికలను నిర్ణయించి వారికి నేరుగా భృతి ఇవ్వడం. దానికి ప్రతిగా వారినుంచి ఏదో ఒక రూపంలో సేవలను రాబట్టడం.
 
ప్రధానంగా విద్యారంగంలో వినియోగించుకోవడం. 2) స్వయం ఉపాధిపై ఆసక్తి చూపేవారికి వారికి నైపుణ్యం-ఆసక్తి ఉన్న రంగాల్లో పని-పరికరాలు ఇవ్వడం. 3) నైపుణ్యాభివృద్ధి పథకాల కింద చదువుకున్న యువకులకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా ఉపాధి కల్పించడం. ఇందులో మొదటి కేటగిరీకి ప్రతి నెలా భృతి ఇవ్వాలి. రెండో కేటగిరీకి ఒకేసారి సాయం చేయాలి. మూడో కేటగిరీలో శిక్షణకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం భరించాలని సూచించారు.
 
నిరుద్యోగులపై తలో లెక్క
ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నిరుద్యోగులు 9.5 లక్షల మంది. ప్రజా సాధికార సర్వేలో పదో తరగతి, ఆ పైన చదవి.. నిరుద్యోగులుగా ఉన్నవారు 34 లక్షలని తేలింది. వీరి వయసు 18-39 ఏళ్ల మధ్య ఉంది.
 
వీరిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారెంతమంది.. అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నవారు ఎందరు.. స్వయం ఉపాధి చూసుకున్నవారెందరు.. తదితర వివరాలు లేవు. పదో తరగతి, ఇంటర్‌ చదివినవారిని కూడా నిరుద్యోగ భృతి కోసం పరిగణనలోకి తీసుకోవాలా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కనీస వయసును 18 ఏళ్లుగా తీసుకోవడం తగదనే అభిప్రాయం కూడా ముందుకొచ్చింది. డిగ్రీ చదివి ఒక ఏడాది ఖాళీగా ఉండేవారి వయసు కనిష్ఠంగా 21 ఏళ్లు ఉంటుంది.
 
కాబట్టి కనీస వయసును 21గా, గరిష్ఠ వయసును 35గా పరిగణించాలన్న అభిపాయ్రంతో ముఖ్యమంత్రి ఏకీభవించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి 39 ఏళ్లుగా ఉన్నందున.. నిరుద్యోగ భృతికి కూడా అదే పరిమితిని పెట్టాలని ఒకరిద్దరు సూచించగా.. యనమల విభేదించారు. ప్రపంచవ్యాప్తంగా యువతకు 35 ఏళ్లనే గరిష్ఠ వయసుగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
 
డిగ్రీ చదివినవారే సుమారు 16 లక్షల మంది ఉంటారని అధికారులు లెక్క చెప్పారు. ఇంటర్‌తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్‌ వంటి డిప్లొమా కోర్సులు చదివినవారికి నైపుణ్య శిక్షణతో కంపెనీలలో ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కల్పన కేటగిరీల్లో అవకాశం ఇవ్వొచ్చని సూచించారు. రాష్ట్రంలో 3 లక్షల మందికి మించి శిక్షణ ఇచ్చే సామర్థ్యం లేనందున పరిశ్రమలతో చర్చించి వారి వద్ద నైపుణ్య శిక్షణ ఇప్పించేలా చూడాలని సీఎం ఆదేశించారు. లెక్కలు తేలాక సుమారు 10 లక్షల మందికి రూ.1000 కోట్లకు పైగా సాయం చేయవలసి రావచ్చని అంచనా వేశారు.
 
ఇతర రాష్ట్రాల్లో పరిశీలన
నిరుద్యోగ భృతిని వివిధ రూపాల్లో అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించాలని మంత్రుల బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికి సీఎం సరేనన్నారు. మొత్తం 10 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో యువజన విధానాన్ని అమలు చేస్తున్నాయని అధికారులు వివరించారు. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కచ్చితమైన సమాచారం కోసం ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ప్రజా సాధికార సర్వే డేటాకు తోడు యూనివర్సిటీల నుంచీ సమాచారం తెప్పించుకోవాలన్నారు. 15-20 రోజులు సమయం ఇచ్చి నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూడాలని సూచించారు.
 
లక్ష్యమూ..ప్రాధాన్య రంగాలు
ఓ విద్యార్థి పట్టభద్రుడై.. ఉద్యోగాన్వేషణలో ఉన్న సమయంలో.. ఆర్థిక ఇబ్బందులను తగ్గించే ఉద్దేశంతోనే నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. విద్య, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఉపాధి-నైపుణ్య శిక్షణ, రాజకీయాలు-పరిపాలనలో భాగస్వామ్యం, క్రీడలు, కమ్యూనిటీ సర్వీస్‌, సామాజిక న్యాయం తదితర రంగాలను ప్రాధాన్య రంగాలుగా పరిగణించినట్లు అధికారులు తెలిపారు. ఏ కేటగిరీలోనైనా ఆర్థికంగా వెనుకబడిన తెల్ల రేషన్‌ కార్డుదారులను మాత్రమే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
డిసెంబర్లో నిరుద్యోగ భృతి
11-10-2017 02:46:36
 
636432867969505918.jpg
  • వచ్చే నెలలో అన్న క్యాంటీన్లు
  • పార్టీ సమావేశంలో చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): యువతకు నిరుద్యోగ భృతి పథకాన్ని డిసెంబరులో అమలు చేసే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన పార్టీ.. ప్రభుత్వం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ‘ఈ నెలలో రైతు రుణ మాఫీ మూడో విడత నిధులు విడుదల చేశాం. ఈ నెలంతా దీనిపైనే చర్చ జరగాలి. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. తర్వాతి నెలలో నిరుద్యోగ భృతి చేపడతాం’ అని తెలిపారు. నిరుద్యోగ భృతిపై పరిశీలన చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం.. విధివిధానాలను సత్వరం ఖరారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
 
రైతు రుణ మాఫీకి సంబంధించి రైతులకు జారీ చేస్తున్న రుణ విముక్తి పత్రాలు, బ్యాంకులకు విడుదల చేస్తున్న నిధుల వివరాలను ప్రతి రోజూ తన డ్యాష్‌ బోర్డుకు పంపాలని సూచించారు. ‘నాకు ఊరికే కాకి లెక్కలు వద్దు. నిర్దిష్టంగా ఏ రోజు ఎన్ని నిధులు విడుదల చేశారో రావాలి. నేను వాటిని ప్రతి రోజూ చూస్తాను’ అని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇస్తామన్నారు. ‘పింఛన్లు ఇప్పటికే 95 శాతం మంది అర్హులకు అందుతున్నాయి. మిగిలిన వారికి ఇవ్వడం పెద్ద సమస్య కాదు’ అని అన్నారు. విశాఖలో రూ.760 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్ధ ఏర్పాటు చేస్తున్నామని, పైన ఎక్కడా ఇక తీగలు ఉండవని తెలిపారు. ఇది విజయవంతంగా ఏర్పాటైతే మొత్తం కోస్తా అంతా ఇదే విధానం అవలంబిస్తామని చెప్పారు.
 
ఇంటింటికీ టీడీపీ భేష్‌..
ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం బాగా జరుగుతోందని, పోయినసారి వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత బాగా వేగం పుంజుకుందని సీఎం తెలిపారు. గత నెల రోజుల్లో 49 లక్షల ఇళ్లకు వెళ్లారంటూ నేతలను అభినందించారు. దీనిద్వారా ఇప్పటికి తొమ్మిది లక్షల సమస్యలు అందాయని, వీటి పరిష్కారంపై చర్చించేందుకు బుధవారం శాఖాధిపతుల సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
నేతల మనస్తత్వం, ప్రవర్తన సక్రమంగా ఉంటే వచ్చే రెండు మూడు ఎన్నికల్లోనూ తేలికగా గెలుపొందవచ్చన్నారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో చేసిన పనిని ప్రచారం చేయడానికి ఫేస్‌ బుక్‌ పేజ్‌ ఏర్పాటు చేసుకోవాలని, అయితే ఇందులో పాజిటివ్‌ ప్రచారమే తప్ప నెగటివ్‌ ప్రచారం చేయవద్దని చెప్పారు. తమకు కేటాయించిన పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏ సమస్య వచ్చినా ఇన్‌చార్జి మంత్రులు పార్టీ ఆదేశం కోసం ఎదురుచూడకుండా వెంటనే వాలిపోయి దానిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
 
గుంటూరు జిల్లాలో ఇటీవల ఇసుక క్వారీ వివాదం చోటు చేసుకుందని, అలాంటి సందర్భాల్లో ఇన్‌చార్జి మంత్రులు త్వరగా స్పందించాలన్నారు. మనసులో ఒక మహా సంకల్పం అనుకుని బయల్దేరితే.. దేవుడు కూడా సహకరిస్తారనడానికి రాయలసీమలో భారీ వర్షాలే నిదర్శనమని సీఎం చెప్పారు. ‘నేను చెప్పింది ఊరికే హాస్యానికని అనుకోవద్దు. నా పెళ్లి సమయంలో అందరూ పెళ్లిమండపానికి బయల్దేరుతుంటే మా మామగారు ఎన్టీఆర్‌ అందరినీ ఆపారు. పది నిమిషాల్లో నాలుగైనా వాన చినుకులు పడతాయని.. ఆ తర్వాతే వెళ్దామని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వాన పడింది. సంకల్పం గొప్పదైతే ఫలితం కూడా అలాగే ఉంటుంది‘ అని పేర్కొన్నారు.
 
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి చేయాలన్న నిబంధన సడలించాలని కడప జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోవర్ధనరెడ్డి ఈ సందర్భంగా చేసిన ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించలేదు. ‘ప్రమాదాల్లో యువత మరణిస్తే ఆ కుటుంబాల్లో ఎంతో క్షోభ నెలకొంటుంది. ఆ పరిస్థితిని నివారించడానికే హెల్మెట్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతున్నాం.’ అన్నారు.
 
ఈసారి ఆనంద దీపావళి..
ఈసారి దీపావళి సందర్భంగా ఆనంద దీపావళి కార్యక్రమాన్ని విశాఖ బీచ్‌, విజయవాడ పవిత్ర సంగమం, తిరుపతిలో నిర్వహిస్తున్నామని, వాటిని విజయవంతం చేయాలని టీడీపీ నేతలకు సీఎం సూచించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...