Jump to content

AP- Thunder alert system trial


Recommended Posts

Thunders ki feilds lo unna plus open lo unna vallu chanipotunaru....last year meeku grutundi ledo farmer family eddulato patu polam lone chanipoyaruu

 

AP signed contract to use this ALERT system

 

https://www.earthnetworks.com/blog/andhra-pradesh-relies-earth-networks-protect-residents-severe-weather/

 

 

 

చంద్రబాబు టెక్నాలజీ అని మాట్లాడితే చాలు, ఎగతాళి చేసే వారికి ఇదే సమాధానం... 4 నెలల క్రిందట ఒక ఆర్టికల్ రాసం.. "ఏపీలో పిడుగుపాటు గుర్తించే టెక్నాలజీ" http://www.amaravativoice.com/te/thunder-alert-to-save-lives-in-ap

ఈ ఆర్టికల్ కి ఎంత, ఎగతాళిగా కామెంట్స్ పెట్టారో, ఒక సైకో బ్యాచ్... చంద్రబాబు టెక్నాలజీ అంటాడు, ఎదో హడావిడి చేస్తాడో, పిడుగు ఎలా పడుతుందో ముందే ఎలా తెలుస్తుంది, మేమేమన్నా పిచ్చోల్లమా అని, ఎగతాళి చేసారు...

కట్ చేస్తే, ఇవాళ 8.30 గంటలకి విపత్తు నివారణ శాఖ ఒక అలెర్ట్ ఇచ్చింది... చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య మరో అరగంటలో పిడుగు పడే అవకాశం ఉందని, ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది...

విపత్తుశాఖ చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. విపత్తుశాఖ చెప్పినట్లుగానే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల మధ్య పిడుగుపడింది. ముందస్తు జాగత్రతో ఆయా గ్రామప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పిడుగుపాటుకు పలువురి ఇళ్లలో టీవీలు పాడయ్యాయి.

 

అయితే ఈ విషయాన్ని జనాలందరూ చాలా సిల్లీగానే తీసుకున్నా.. చెప్పిన సమయానికి పిడుగు పడటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఇలా జరగటం విపత్తుశాఖ చరిత్రలో మొదటిసారి. మొత్తానికి చూస్తే ఏపీ విపత్తుశాఖ మొట్టమొదటి ప్రయోగం ఫలించింది.

 

100 మీటర్ల పరిధిలో 45 నిమిషాల వ్యవధిలో రాష్ట వ్యాప్తంగా ఎక్కడైనా పిడుగుపాటును పసిగట్టే టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఈ టెక్నాలజీ కోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ లిమిటెడ్ సంస్థతో, ఇస్రా శాస్త్రవేత్తల సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే రాష్ట్రంగా, దేశంలోనే మొట్టమొదటి రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ప్రస్తుతం, ఇది కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు... త్వరలోనే

 

రాష్ట్రమంతా ఇది, అందుబాటులోకి రానుంది.

 

టెక్నాలజీ వల్ల పిడుగు పాటుకు ముందే ప్రజలు అప్రమత్తం కావడానికి దోహద పడుతుంది. విపత్తు నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సెల్ ఫోన్ లకు సందేశం పంపుతుంది. ఈ సందేశం తెలుగలోనే పంపటం కాని, లేక నిరక్షరాస్యులైన వారికి సందేశం చదివే వీలుకాదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ వాయిస్ కాల్ ద్వారా కాని పిడుగుపాటు సమాచారం ప్రజలకు తెలియచేస్తారు. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలను దాదాపగా నివారించే అవకాశం దొరుకుతుంది.

ఇప్పుడన్నా అర్ధమైందా చంద్రబాబు టెక్నాలజీ అని, ఎందుకు ఎప్పుడూ దాని వెనుక పరిగేడుతారో... కొంత మందికి, ఎప్పటికీ అర్ధం కాదు...

 

 

/*****The National Oceanic and Atmospheric Administration’s (NOAA) Awards Earth Networks 5-Year, Multi-Million Dollar Contract For Advanced Total Lightning Data

 

Link to comment
Share on other sites

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

VIJ_2017-05-17_maip1_12.jpg

 

 

VIJ_2017-05-17_maip7_11.jpg

 

CBN cheppina prati danni viparita ardalu lagatam sunakanandam pondatam....papam ayana emo edo melu chestundo telusukuni danni try chestadu....

 

2000 lo Inkudu guntalni ilane comedy chesaru..cut cheste 20 years taruvata Inkudu guntalu avasaram ardam ayyindi....

 

2000 lo 3 ports modalu pedite CBN benami lu dobbestunaru asalu Chennai port undaga Krishnapatnam etla workout avuddi ani allegations chesaru....

 

Family lo andaru pillalu agri ki velte "kamatalu" split lo chinnavi ayipoyi labham radu studies ki vellali ante danni kuda piki lagaru wrong meaning lo...

 

 

okati emundi le chala unnai....

Link to comment
Share on other sites

VIJ_2017-05-17_maip1_12.jpg

 

 

VIJ_2017-05-17_maip7_11.jpg

 

CBN cheppina prati danni viparita ardalu lagatam sunakanandam pondatam....papam ayana emo edo melu chestundo telusukuni danni try chestadu....

 

2000 lo Inkudu guntalni ilane comedy chesaru..cut cheste 20 years taruvata Inkudu guntalu avasaram ardam ayyindi....

 

2000 lo 3 ports modalu pedite CBN benami lu dobbestunaru asalu Chennai port undaga Krishnapatnam etla workout avuddi ani allegations chesaru....

 

Family lo andaru pillalu agri ki velte "kamatalu" split lo chinnavi ayipoyi labham radu studies ki vellali ante danni kuda piki lagaru wrong meaning lo...

 

okati emundi le chala unnai....

My only wish is CBN regulates the agricultural land rate! Real estate Potta nimpadam tappa normal farmers/future farmers ki Agri lands rates ekkuvaga undatam valla use ledu...

 

Some may say, ala chesthey raitu potta kottinattey ani...

Raitu ki produce meeda ladham raavali kaani.... labham kosam polam ammakudadu....

 

Unemployed/uneducated youth kuda agriculture vaipu ravali antey land rates bhareega taggali.... raitu pandinchina panta ki saraina gittubatu dhara raavali!

 

Edo oka chinna aasa!

Link to comment
Share on other sites

Excellent. Vellu edo radar alternative kooda istam antunnarugaa. Mahesh lanti weather enthusiasts ki pandage

 

  • SfericMaps – delivers real-time collaboration capabilities for users to make intelligent weather-related decisions and increase response planning lead time for severe weather events. Users can also receive customized mobile alerting for iOS and Android devices.
  • PulseRad – delivers an advanced radar alternative able to provide an interactive map of convective weather occurring even in the most remote geographic areas where deployment, operation and maintenance of traditional radars are problematic.

 

IMD gallaki oka dannam raa babu

Link to comment
Share on other sites

Excellent. Vellu edo radar alternative kooda istam antunnarugaa. Mahesh lanti weather enthusiasts ki pandage

 

  • SfericMaps – delivers real-time collaboration capabilities for users to make intelligent weather-related decisions and increase response planning lead time for severe weather events. Users can also receive customized mobile alerting for iOS and Android devices.
  • PulseRad – delivers an advanced radar alternative able to provide an interactive map of convective weather occurring even in the most remote geographic areas where deployment, operation and maintenance of traditional radars are problematic.

IMD gallaki oka dannam raa babu

imd valla deggara chala info vundi edavalu share cheyyaru correct gaa
Link to comment
Share on other sites

పిడుగుపాటునూ పసిగట్టారు


636305828201136831.jpg



  • గంట ముందుగానే సమాచారం
  • ఊర్లలో దండోరాలు, సెల్‌ఫోన్లకు సందేశాలు
  • చిత్తూరులో హెచ్చరికలు అంతలోనే పడిన 2 పిడుగులు
  • తప్పిన ప్రాణ నష్టం
  • ఇస్రో, ఎర్త్‌ నెట్‌వర్క్‌తో ఏపీ ఒప్పందం ఫలితం
  • 15 చోట్ల ప్రత్యేక సెన్సర్లు
  • నెలరోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి టెక్నాలజీ

 (అమరావతి, విశాఖపట్నం, తిరుపతి - ఆంధ్రజ్యోతి): ‘‘అందరూ వినండహో... ఈ రోజు రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య మన ఊరి పరిసరాల్లో పిడుగులు పడే అవకాశముంది. ఎవ్వరూ బయటికి వెళ్లద్దు’’... మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం-పలమనేరు పరిసరాల్లోని పలు గ్రామాల్లో దండోరాలు మోగాయి! స్థానికుల సెల్‌ఫోన్లకు ‘వాయిస్‌ మెసేజ్‌’లు వచ్చాయి. అధికారులు, స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు. అనుకున్నట్లుగానే... ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 10.30 గంటల వరకు ఆకాశం అల్లకల్లోలంగా మారింది. చెవులు చిల్లులు పడేలా ఉరుములు... కళ్లు మిరిమిట్లు గొల్పేలా మెరుపులు! కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల శివార్లలో రెండు పిడుగులు కూడా పడ్డాయి!

 పిడుగులు పడతాయని ముందే చెప్పడం ఎలా సాధ్యమైందనుకుంటున్నారా? ఈ అత్యాధునిక వాతావరణ పరిజ్ఞానాన్ని రాష్ట్రం సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారిగా... మంగళవారం దీనికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాటు వల్ల రాష్ట్రంలో ఏటా పదుల మంది చనిపోతున్నారు. ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. పిడుగుపాటుపై ముందే హెచ్చరిస్తే దీనిని నివారించవచ్చు. అందుకే... వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. ఇస్రోతోపాటు అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్క్‌ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు పిడుగులను పసిగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారానే మంగళవారం హెచ్చరికలు జారీ చేయగలిగింది. నెల రోజుల్లో ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు... పిడుగుపడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడున్న సెల్‌ టవర్ల పరిధిలో ఉన్న అన్ని మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎమ్మె్‌సలు వెళతాయి.

 

ఇలా చెప్పవచ్చు...

ఎర్త్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థ ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. ప్రతి 200 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సెన్సర్లు ఏర్పాటు చేసింది. క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినపుడు వాటిలో విద్యుత ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఆ చర్య జరుగుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. ఆ సమాచారం ఆధారంగా పిడుగుపాటును ముందే ఊహించగలుగుతారు. ఈ సమాచారాన్ని సెన్సర్‌ కేంద్రాల నుంచి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అక్కడి నుంచి సంబంధిత ప్రాంతానికి చేరవేస్తారు. ఇస్రో దీనికి సంబంధించి మరో ప్రయోగం చేస్తోంది.

 


Link to comment
Share on other sites

విశాఖ, ప్రకాశం జిల్లా వాసులకు హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ శాఖ
18-05-2017 16:34:36
636307224704086709.jpg

అమరావతి: విశాఖపట్నం , ప్రకాశం జిల్లా వాసులకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి 3 కిలోమీటర్ల పరిధిలో 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
 
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి 3 కిలోమీటర్ల పరిధిలోనూ పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. భూపతిపల్లి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

yes

 

నర్సీపట్నం మండలం కసిరెడ్డిపాలెంలో చెక్‌డ్యామ్‌ దగ్గర పిడుగు పడింది. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. పిడుగు పడుతుందని విపత్తు నిర్వహణ శాఖ ముందే హెచ్చరించింది. చిత్తూరు టౌన్ సమీపంలో 3 కిలోమీటర్ల పరిధిలో 30 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

చెప్పినచోటే పిడుగులు పడ్డాయ్‌!

ఈనాడు, అమరావతి: విపత్తుల నిర్వహణ శాఖ గురువారం సాయంత్రం నుంచి పిడుగులకు సంబంధించిన హెచ్చరికల్ని విడుదల చేయడం మొదలుపెట్టింది. విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగుపాటుకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయికి చేరవేశారు. కైజాలా యాప్‌ ద్వారా సంబంధిత ప్రాంతాల తహసీల్దార్లకు సమాచారమిచ్చి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిందిగా సూచించారు. తొలుత విశాఖ జిల్లా నర్సీపట్నం, లంబసింగి ప్రాంతాల్లో పిడుగులపై హెచ్చరించారు. అయితే ఎక్కువగా పిడుగులుపడే సూచనలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. అందుకు తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో చోటు చేసుకొన్న వాతావరణపరమైన మార్పులే కారణమని ఏపీఎస్‌డీఎంఏ వర్గాలు తెలిపాయి. ఆ ప్రభావం చిత్తూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలపైనా పడిందన్నారు. తాము సూచించిన ప్రాంతాల పరిధిలోనే పిడుగులు పడ్డట్లు గుర్తించామని చెప్పారు.

Link to comment
Share on other sites

పిడుగుపాటుపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు
19-05-2017 17:20:11
636308113168344376.jpg
అమరావతి: పిడుగుపాటుపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లె మండలంలోని నాగసముద్రం, పోలేటిపల్లె, పల్లెన్నగారిపల్లె, చెన్నేకొత్తపల్లె.. ఎర్రచిన్నమాగరిపల్లి, ఎర్రంపల్లిలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని గానెపల్లి, దొనకొండ, మాగటూరు, పోతురాజుటూరు, యాచవరం, వీరభద్రపురం, బాసిరెడ్డిపల్లిలో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని మల్లారెడ్డి, కండ్రిగ గ్రామంలో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
Link to comment
Share on other sites

అరగంటలో చిత్తూరు జిల్లాలో పిడుగు!
20-05-2017 16:57:56
636308963826972174.jpg
అమరావతి: ‘ఔనా... నిజమేనా!? పిడుగుపాటును ముందే కనిపెడుతున్నారా? ఇది ఎలా సాధ్యమవుతోంది?’... అనేక రాష్ట్రాలు ఆసక్తిగా సంధిస్తున్న ప్రశ్నలివి. ఏపీలో అందుబాటులోకి వచ్చిన ఈ పరిజ్ఞానంపై అనేక రాష్ట్రాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం తుండ, కోన, శంబరలో కాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులను విపత్తు నివారణ సంస్థ అప్రమత్తం చేసింది. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో మరో 30 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఏపీలో పిడుగుపాటును ముందే పసిగట్టే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అమెరికా ఎర్త్ నెట్ నుంచి ఈ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అరగంట ముందే హెచ్చరికలు జారీ అవుతాయి. అయితే దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ఆ టెక్నాలజీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో పిడుగు పడుతుందని ముందే అధికారుల పసిగట్టి మండలంలోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగారు.
Link to comment
Share on other sites

9 జిల్లాల్లో విపత్తులను గుర్తించే టవర్లు

కోడూరు, న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాల రాకను 48 గంటల ముందే గుర్తించి సమాచారం ఇచ్చే టవర్లను తొమ్మిది జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. 77 తహసీల్దార్‌ కార్యాలయాల ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ డిప్యూటి ఇంజినీర్‌ సీహెచ్‌ విజయ చెప్పారు. కృష్టాజిల్లాలోని కోడూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ..సముద్రతీరం వెంబడి ఉన్న 77మండల కేంద్రాల్లో ఎల్‌ అండ్‌ టి సంస్థ వీటి నిర్మాణాన్ని చేపడుతుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే 48గంటల ముందు టవర్‌పై అమర్చిన సైరన్‌ మోగుతుందని తెలిపారు. దీని ఆధారంగా అధికారులు వెంటనే స్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారన్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చేస్తారని, అప్పటికే వెళ్లిన వారిని వెనక్కి రప్పించడానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. కోడూరు తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ఒక టవర్‌నునిర్మిస్తుండగా, హంసలదీవిశివారు పాలకాయతిప్ప వద్ద పర్యాటకశాఖ మరోటి ఏర్పాటుచేస్తుందని వివరించారు.

Link to comment
Share on other sites

అరగంటలో గుంటూరు, తెనాలి పట్టణాల పరిధిలో పిడుగు!
 
636309845701180247.jpg
గుంటూరు: 'ఔనా... నిజమేనా!? పిడుగుపాటును ముందే కనిపెడుతున్నారా? ఇది ఎలా సాధ్యమవుతోంది?'... అనేక రాష్ట్రాలు ఆసక్తిగా సంధిస్తున్న ప్రశ్నలివి. ఏపీలో అందుబాటులోకి వచ్చిన ఈ పరిజ్ఞానంపై అనేక రాష్ట్రాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం సుద్దపల్లె, చేకూరు, వడ్లమూడి గ్రామాల్లో మరో 30 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా గుంటూరు, తెనాలి పట్టణాల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులను విపత్తు శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
 
ఏపీలో పిడుగుపాటును ముందే పసిగట్టే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అమెరికా ఎర్త్ నెట్ నుంచి ఈ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో అరగంట ముందే హెచ్చరికలు జారీ అవుతాయి. అయితే దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ఆ టెక్నాలజీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో పిడుగు పడుతుందని ముందే అధికారుల పసిగట్టి మండలంలోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Link to comment
Share on other sites

30 నిమిషాల్లో విజయవాడలో పిడుగు!
 
636309875661818068.jpg
అమరావతి: ఆధునిక టెక్నాలజీతో ముందే సంభవించే విపత్తులను పసిగడుతున్నారు. క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినపుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఆ చర్య జరుగుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. ఆ సమాచారం ఆధారంగా పిడుగుపాటును ముందే ఊహించగలుగుతారు. మరో 30 నిమిషాల్లో విజయవాడలో పిడుగుపడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి, శంఖవరం, పునుగోడులో మరో 30 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. అలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం చిన్నదాసుమర్రు, బొప్పూడి, మురికిపూడి, తాతపూడి గ్రామాలతో పాటుగా సత్తెనపల్లి పట్టణంలో పిడుగు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగుపాటును ముందే పసిగట్టడం ద్వారా ప్రాణ, ఆస్తినష్టాన్ని అధికారులు నివారించగలుగుతున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...