Jump to content

Chodavaram barrage ,Vijayawada.

Recommended Posts

కృష్ణాపై కొత్త కట్ట!
ప్రకాశం బ్యారేజి దిగువనే మరొకటి
నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రానికి వినతి
కేంద్ర మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ
ఈనాడు - హైదరాబాద్‌
11ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై మరో కొత్త బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి దిగువన మరొక ఆనకట్టను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు.

చంద్రబాబు లేఖ సారాంశమిదీ...
కృష్ణానదిపై ఉన్న నిర్మాణాల్లో ప్రకాశం బ్యారేజి చివరిది. ఈ బ్యారేజి నుంచి విడుదల చేసే నీరు సముద్రంలోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు నిల్వ చేసుకొనే సౌకర్యం లేక వరద నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రకాశం బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో కొత్త బ్యారేజీని ప్రతిపాదించింది. దీని వెడల్పు 1.2 కి.మీ. ఉంటుంది. మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తుతో ప్రత్యేకంగా స్మార్ట్‌ గేట్లు ఏర్పాటు చేస్తాం. ఈ గేట్లు ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఈ బ్యారేజీకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీలో ఉంది. బ్యారేజి నిర్మాణం వల్ల సుమారు 1.7 టీఎంసీలు నిల్వ చేయవచ్చని, తాగు, సాగు నీటికి ఉపయోగపడుతుంది. ఇది విజయవాడకు ఆనుకొని ఉంటుంది. నీటి అవసరాలు తీరడంతో పాటు జల క్రీడలకు, ఆహ్లాదకర వాతావరణ సృష్టికి అవకాశం ఉంటుంది. నదీ ప్రవాహానికి అడ్డంకి తక్కువగా ఉండేందుకు పూర్తి స్థాయిలో గేట్లు ఏర్పాటు చేస్తాం. ప్రకాశం బ్యారేజీ-కొత్త బ్యారేజీల నిర్వహణ సమీకృతంగా జరుగుతుంది. దీని వల్ల కొత్తగా నిల్వ చేసే నీటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వరుసగా ఇలా రెండు బ్యారేజీలు నిర్మించడం వినూత్నమైంది.. దేశంలోనే మొదటిది. ప్రకాశం బ్యారేజి నుంచి వదిలే వరద నీరు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని అనేక నదులపై వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొత్తగా చేపట్టిన ఈ బ్యారేజి నిర్మాణానికి జాతీయ హోదా కల్పించాలని విన్నవిస్తున్నాం. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, రాజధానికి ఎంతో ఉపయోగకరం... అని చంద్రబాబు ఉమాభారతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

బోర్డు అభిప్రాయం కోరిన కేంద్రం

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన బ్యారేజి నిర్మాణంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ కోరింది. ఈ మేరకు జలవనరుల మంత్రిత్వశాఖ అధికారి ఆర్‌.కె.కనోడియా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై బోర్డు తెలంగాణ అభిప్రాయాన్ని కోరే అవకాశం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన బ్యారేజి కాబట్టి బోర్డుతో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌కు కూడా వెళ్లాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.krishna.jpg

Edited by sonykongara
Link to post
Share on other sites
  • Replies 121
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

present elections aite marchipovachhu... full length storage inko 10 yrs ki try cheyyochu...

Guest Urban Legend

Pedhapulipaka and chodavaram greater Vijayawada lo kalipithe bavundedhii

em CRDA zamindar aada kuda land lu koni vunchava ?

Link to post
Share on other sites

prakasam barrage ki diguvuna inko barrage aa? ninnati varaku eguvuna Vykunthapuram dagara 5-10 TMC capacity tho barrage annaru. malli krindaki marchara? diguvuna kadithe tourism ki tapaa irrigation ki ela use vuntundi? more lifts?

Diguvuna barriage ani eppati nuncho vundhi.. first Bridge anukunnaru. But later changed to barriage

Paina kuda barriage vuntadhi..

Link to post
Share on other sites
Guest Urban Legend

prakasam barrage ki diguvuna inko barrage aa? ninnati varaku eguvuna Vykunthapuram dagara 5-10 TMC capacity tho barrage annaru. malli krindaki marchara? diguvuna kadithe tourism ki tapaa irrigation ki ela use vuntundi? more lifts?

brother

both proposals are there

e proposal aithey yeppati nuncho vundhi

even bza city ground water levels increase avuthayi anukuntunna

Link to post
Share on other sites

brother

both proposals are there

e proposal aithey yeppati nuncho vundhi

even bza city ground water levels increase avuthayi anukuntunna

ground water and tourism ki definite ga help avutundi. kani anduku barrage enduko naku artham kavatam la. 6-10 ft deep water vunde tatlu check dam kadithe chalada?

Link to post
Share on other sites
Guest Urban Legend

ground water and tourism ki definite ga help avutundi. kani anduku barrage enduko naku artham kavatam la. 6-10 ft deep water vunde tatlu check dam kadithe chalada?

bza city and surrounding areas ki drinking water supply cheyyochu with this extra 1.7 tmc

check dams ? 4 years ki oka sari floods vasthayi kottuku pothayi

and elagu bridge vasthudhi akkada part of ring road plan

dhaniki linked ga barrage gates pedatharu problem em vundhi indhulo ..even state govt asking central govt to take up this project

I don't think checkdams gets washed away in floods. I was not talking about fibre glass checkdams. any case, if it is part of the bridge then it is almost free of cost. so not a problem. but once we call it a barrage, river board/tribunal comes in to picture, TG has to approve ...etc issues vastayi ani rasaru kada aa article lo. ee 1.7 TMC daani valla 10 TMC daaniki kuda mottaniki problem vastundi ani naa bhayam. national project cheyyamani adigededo vykunthapuram daanni cheyyamani adagali gani deenni enduku?

Diguvuna unna manam kattalsina projects ki eguvuna unna TG objection endhi.... vinta!
Link to post
Share on other sites

Diguvuna unna manam kattalsina projects ki eguvuna unna TG objection endhi.... vinta!

yup, flood vacchinappudu mana permission lekundane krindaki water release chestaru, enni villages munigi poyina they don't need our permission. kani ade flood water lo miniscule percentage samudram lo kalavakunda aapataaniki valla permission kavalanta. this TG permissin thing is biggest joke.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...