Jump to content

Krishna River Management Board


Recommended Posts

తెలంగాణ సాక్షి నివేదికపై ఏపీ సాక్షికి క్రాస్‌ ఎగ్జామినేషనా?
13-04-2018 04:14:58
 
  •  వైద్యనాథన్‌పై కృష్ణా ట్రైబ్యునల్‌ ఆగ్రహం
అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ తరఫున సాక్ష్య మిచ్చిన పళనిస్వామి నివేదికపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాక్షి పీవీ సత్యనారాయణను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఎలా చేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌పై కృష్ణా ట్రైబ్యు నల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణాజలాల వివాదంపై గురు వారం ఢిల్లీలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రారంభమైంది. పళనిస్వామి ఇచ్చిన నివేదికలోని గణాంకాలతో ఏకీభవిస్తారా? అంటూ సత్యనారాయణను వైద్యనాథన్‌ ప్రశ్నించారు. ఈ సమయంలో ట్రైబ్యునల్‌ జోక్యం చేసు కుంటూ ఒక రాష్ట్ర సాక్షి ఇచ్చిన నివేదికపై మరో రాష్ట్ర సాక్షిని ఎలా ప్రశ్నిస్తారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా వ్యవసాయ వాతావరణ పరిస్థితులపై ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నారా అని సత్య నారాయణను తెలంగాణ తరఫున వాదిస్తోన్న మరో న్యాయవాది రవీందర్‌రావు ప్రశ్నించారు. దీనికి.. సత్యనారాయణ కట్టుబడి ఉన్నానని వివరించారు. గ్రామానికీ గ్రామానికీ... ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య వ్యవసాయ వాతావరణంలో మార్పులుంటాయా అనే ట్రైబ్యునల్‌ ప్రశ్నకు.. ఉంటుందని సత్యనారాయణ సమాధానం చెప్పారు. వాతావరణంతో పాటు నేలల స్వభావమూ పంటకు అత్యంత కీలకమైనదని ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
త్వరలో విజయవాడకు కృష్ణా బోర్డు
27-04-2018 02:05:37
 
హైదరాబాద్‌, ఏపిల్ర్‌ 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ వేదికగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న బోర్డును అక్కడికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని ఉండటంతో ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే ఆ లోపు బోర్డుకు కొన్ని నియంత్రణాధికారాలను కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవల కేంద్ర జలవనరుల అభివృద్ధిశాఖ జాయింట్‌ సెక్రటరీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బోర్డు చైర్మన్‌ వై.కె.శర్మ కొన్ని ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించారు. పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. పలు సవరణలు చేసి, మళ్లీ పంపించాల్సిందిగా సూచించింది. ప్రధానంగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని బోర్డు కోరుతున్నది.
Link to comment
Share on other sites

బోర్డే సుప్రీం!
ప్రాజెక్టులు, కాలువలపైనా అజమాయిషీ
కృష్ణా నదీ బోర్డు పరిధిపై కేంద్రానికి ముసాయిదా నివేదిక
బదిలీపై వెళ్తూ కేంద్రానికి పంపిన ఛైర్మన్‌
సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటి ప్రస్తావన
తుంగభద్ర కాలువలూ దీని పరిధిలోకే
ఈనాడు - హైదరాబాద్‌
4ap-main1a.jpg

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా కృష్ణా బేసిన్‌లోని భారీ ప్రాజెక్టులను, కాలువలను బోర్డు పరిధిలోకి తెస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి పంపింది. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రత్యేక బోర్డు ఉండగా.. ఆ ప్రాజెక్టు పరిధిలోని ఎగువ, దిగువ కాలువలు మాత్రం కృష్ణా బోర్డు పరిధిలో ఉండేలా ముసాయిదాలో పేర్కొంది. బాక్రా-బియాజ్‌ యాజమాన్య బోర్డు తరహాలోనే కృష్ణా బోర్డు పని చేయనుందని జలవనరుల శాఖకు రాసిన లేఖలో వెల్లడించింది. కృష్ణా బోర్డు పరిధిపై రెండేళ్లకు పైగా చర్చలు జరుగుతున్నా ఓ అభిప్రాయానికి రాలేదు. తెలంగాణ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఏడాది నవంబరులో జరిగిన సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  బోర్డు ఛైర్మన్‌ వై.కె.శర్మ ఏప్రిల్‌ 19న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శితోనూ, 30న ఛండీగఢ్‌ కేంద్రంగా ఉన్న బాక్రా-బియాస్‌ బోర్డు కార్యదర్శితోనూ చర్చించారు. తర్వాత ఆయన కేంద్ర జలసంఘం సభ్యునిగా బదిలీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన గోదావరి బోర్డు ఛైర్మన్‌కు అదనపు బాధ్యతలు   అప్పగించి రిలీవ్‌ అయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే కృష్ణా బోర్డు పరిధిపై ముసాయిదా నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు పంపారు. ఇందులో బాక్రా-బియాస్‌ బోర్డు యాజమాన్యంలోని అంశాలు, కృష్ణా బోర్డు ప్రతిపాదించిన అంశాలను వివరంగా పేర్కొన్నారు.

ముసాయిదాలోని అంశాలివి..
* రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను కృష్ణా జలవివాదట్రైబ్యునల్‌-2 ఖరారుచేస్తుంది. అప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని బోర్డు నిర్ణయిస్తుంది.
* రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసే తూముల వద్ద బోర్డు సిబ్బందిని నియమించి రోజూవారీ నీటి లెక్కలను తీసుకుంటారు. ముఖ్యమైన చోట్ల టెలిమెట్రీ యంత్రాలుంటాయి.
* శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, ముచ్చుమర్రి, కల్వకుర్తి, హంద్రీనీవాతోపాటు, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొనేలా ప్రారంభించే ప్రాజెక్టులన్నింటి వద్ద సాగునీటి నిర్వహణను సిఐఎస్‌ఎఫ్‌ సాయంతో బోర్డు సిబ్బందే నిర్వహిస్తారు.
* నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువల హెడ్‌రెగ్యులేటర్లు, ఎ.ఎం.ఆర్‌.పి. ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే తూము వద్ద, సాగర్‌ ఎడమకాలువ నుంచి రెండు రాష్ట్రాలకు నీటిని సరఫరా చేసే బ్రాంచి కాలువల వద్ద కూడా సిఐఎస్‌ఎఫ్‌ సాయంతో బోర్డు సిబ్బందే నిర్వహణ చూస్తారు.
* నీటి యాజమాన్యానికి అవసరమైన అత్యవసర మరమ్మతులు, చిన్న చిన్న మరమ్మతులను బోర్డే చేస్తుంది.
* నీటి వినియోగాన్ని 15 రోజులకోసారి బోర్డు, రెండు రాష్ట్రాల ఎస్‌.ఇ.లతో కూడిన కమిటీ లెక్కకడుతుంది. ఎక్కువ తక్కువ వినియోగం ఉంటే సర్దుతుంది.
* రెండు రాష్ట్రాల ఇ.ఎన్‌.సి.లు, బోర్డు సభ్యకార్యదర్శితో కూడిన త్రిసభ్య కమిటీ ప్రతి మూడు నెలలకోసారి లేదా ఎప్పుడు అవసరమైతే అప్పుడు బోర్డుకు నివేదిస్తుంది.
* ఆయా రాష్ట్రాల్లో హెడ్‌వర్క్స్‌ ఉన్న జూరాల, సుంకేశుల, పులిచింతల, ప్రకాశం బ్యారేజి మొదలైన వాటి నిర్వహణ బాధ్యతను ఆ రాష్ట్రాలే చూస్తాయి.
* ప్రాజెక్టుల వారీగా ప్రతి సీజన్‌కు ఎంత నీరు అవసరమో నీటిపారుదల శాఖ లెక్కగట్టి బోర్డుకు ఇవ్వాలి.
* రెండు రాష్ట్రాలు కోరే నీరు, అందుబాటులో ఉన్న నీటిలో వారి వాటాను బట్టి ఎంత విడుదల చేయాలన్నది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది.
* ఉమ్మడి ప్రాజెక్టులలో విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలను బోర్డే పర్యవేక్షిస్తుంది.

ముసాయిదాలో పేర్కొన్న ప్రాజెక్టులు ఇవే..
కృష్ణా నదిపై ఉన్న తాగు, సాగు, విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయాల్సిన అన్ని ప్రాజెక్టుల వివరాలను ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. శ్రీశైలం రివర్‌ స్లూయిస్‌లు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి పూర్తిగా బోర్డు నిర్వహణలో ఉంటాయి. కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల ద్వారా నీటి విడుదల నిర్ణయం, పర్యవేక్షణ బోర్డుదే. నాగార్జునసాగర్‌ రివర్‌ స్లూయిస్‌లు, కుడికాలువ, ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌, ఈ కాలువ కింద 2 రాష్ట్రాలకు సంబంధించిన బ్రాంచి కాలువలు, డిస్ట్రిబ్యూటరీలన్నీ బోర్డు ఆధీనంలోనే. ఇందులో 8 బ్రాంచి కాలువలున్నాయి. ఎ.ఎం.ఆర్‌.పి. పూర్తిగా బోర్డు పర్యవేక్షణలోనే. ఇక్కడ కూడా విద్యుత్తు కేంద్రాల ద్వారా నీటి విడుదలను బోర్డు పర్యవేక్షిస్తుంది. జూరాల, ఆర్డీఎస్‌, సుంకేశుల ద్వారా కేసీ కాలువకు, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ-కాలువలు, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటి విడుదలను బోర్డు పర్యవేక్షిస్తుంది. అవసరమైన మేరకు బోర్డు సిబ్బందిని, సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించాలని, ఆ వ్యయాన్ని 2 రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

కృష్ణా బోర్డు ముసాయిదా ప్రకటనపై అభ్యంతరం
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంది
  కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు పరిధికి సంబంధించిన ముసాయిదా ప్రకటన పట్ల అభ్యంతరం తెలుపుతూ కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏప్రాజెక్టుల్లో నీటి యాజమాన్యం చేయాలి, ఏప్రాజెక్టుల్లో పర్యవేక్షణ చేయాలో బోర్డు ఛైర్మన్‌ ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని, ఇది రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించకుండా బోర్డు పరిధిని నోటిఫై చేయవద్దని విజ్ఞప్తి చేసింది. బాక్రా-బియాస్‌ యాజమాన్యబోర్డు లాగానే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయడానికి ముసాయిదాను కృష్ణాబోర్డు ఛైర్మన్‌ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి పంపారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు జరగకుండా బోర్డు పరిధిని ఎలా నిర్ణయిస్తారంటూ రెండేళ్లుగా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బోర్డు సమావేశాల్లో చెప్పడంతో పాటు కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖకు లేఖలు రాసింది. జలవనరుల మంత్రిత్వశాఖతోనూ, బాక్రా-బియాస్‌ యాజమాన్యబోర్డు అధికారులతో చర్చించిన కృష్ణాబోర్డు ఛైర్మన్‌, ముసాయిదాను ఖరారు చేసి శుక్రవారం కేంద్రానికి పంపారు. బోర్డు ఛైర్మన్‌గా ఆయన రిలీవ్‌ అయిన రోజే పంపించారు.

ముసాయిదాపై చర్చ: కృష్ణాబోర్డు ముసాయిదాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శనివారం అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం, నీటిపారుదల శాఖ ఇ.ఎన్‌.సిలతో సమావేశమై చర్చించారు. ముసాయిదా ప్రకటన పట్ల అభ్యంతరం తెలుపుతూ కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌కు జోషి శనివారం లేఖ రాశారు. వచ్చే నీటిసంవత్సరంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరేలా చేసి నీటి యాజమాన్యం చేయకుండా, అవార్డు లేకుండానే నీటి యాజమాన్యానికి బోర్డు పరిధిని నోటిఫై చేయాలని లేఖ రాయడం పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రిజర్వాయర్లకు ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ లేకుండా బోర్డు పరిధిని నోటిఫై చేయమనడం సరికాదన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులపై వాదనలు వింటున్నదని, ప్రస్తుతం జరుగుతున్న నీటి వినియోగం తాత్కాలిక ఏర్పాటేనని, నీటి కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించి వాటా పొందేందుకు ప్రయత్నిస్తుందని వివరించారు. ముసాయిదాలో తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను విస్మరించారన్నారు. కృష్ణాబోర్డుకు 328 మంది సిబ్బంది కావాలని, పర్యవేక్షణ, మరమ్మతులకు 260 మంది, కేఆర్‌ఎంబీ సెక్రటేరియట్‌కు 27 మంది కావాలని ముసాయిదాలో పేర్కొన్నారని కేంద్ర కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికే ఏడాదికి రూ.75 కోట్లు ఖర్చవుతుందని, దీనికి అదనంగా క్యాంపులను నిర్మించాలని, ఇంత వ్యయాన్ని, సిబ్బందిని ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. మరోవైపు గత మూడేళ్లలో బోర్డు పనితీరు ప్రోత్సాహకరంగా లేదని, 2016 జూన్‌లో కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో రెండు నెలల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొంటే ఇప్పటివరకు పూర్తిగా అమలు జరగలేదన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కృష్ణా జలాలపై తేలని పంచాయితీ
వినియోగంపై ఏపీ, తెలంగాణ భిన్నాభిప్రాయాలు
బోర్డు కమిటీలూ నిర్ణయం తీసుకోలేదు
వివాదాస్పదంగానే మిగిలిన అంశాలు
ఈనాడు - హైదరాబాద్‌
21ap-main11a.jpg

కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అంశాలపై ఏర్పాటైన కమిటీలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎవరి వాదన వారు వినిపించగా బోర్డు ప్రతినిధులు ఏ రాష్ట్రం అభిప్రాయంతోనూ ఏకీభవించలేదు. దీంతో నీటి ఆవిరి, తాగునీటికి కేటాయించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం తదితర అంశాలు వివాదాస్పదంగానే మిగిలిపోయాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం తాగునీటికి కేటాయించే నీటిలో 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, మిగిలిన 80 శాతం తిరిగి నదిలోకే చేరుతుందని, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటికి నాగార్జునసాగర్‌ చేరుతున్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అనధికారికంగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలంగాణ పేర్కొంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద తమ వాటాగా విడుదల చేసిన నీరు చేరడం లేదని, ఎక్కువ ఆవిరైనట్లుగా తెలంగాణ చెబుతోందని ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లు, ఆయా ప్రాజెక్టుల ఇంజినీర్లు, బోర్డు ప్రతినిధులు ఇలా మొత్తం ఆరుగురితో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు పలు దఫాలు చర్చించి ఓ అంగీకారానికి రావడమో, సిఫార్సు చేయడమో కాకుండా తమ అభిప్రాయం చెప్పి మళ్లీ బోర్డే నిర్ణయం తీసుకోవాలని సూచించాయి.

అంశం: హైదరాబాద్‌ తాగునీరు, మిషన్‌ భగీరథకు ఇచ్చే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ వాదన
* బచావత్‌ ట్రైబ్యునల్‌లో పేర్కొన్నట్లు పునరుత్పత్తి అయిన నీరు మళ్లీ నదిలోకి రావడం లేదు. మొత్తం నీటిని తెలంగాణ కోటాలోనే వేయాలి.
* 2017-18వ సంవత్సరానికి సంబంధించి బోర్డు ఇచ్చిన సమాచారం ప్రకారం మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదల చేసిన నీరు పునరుత్పత్తి ద్వారా వచ్చిందని తేల్చలేదు. ఇది వానల ద్వారా వచ్చిందే.
* కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలంటే మిగిలిన 80 శాతం తిరిగి నదిలోకి వచ్చి చేరిందని శాస్త్రీయంగా నిరూపించాలి.
* బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చేవరకు మొత్తం నీటిని తెలంగాణ కోటాగానే పరిగణించాలి.
* మిషన్‌ భగీరథ కొత్తది. దీని గురించి బచావత్‌ ట్రైబ్యునల్‌లో ఏమీ లేదు కాబట్టి ఈ అంశం గురించి చర్చించలేం.

తెలంగాణ వాదన
* బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం తాగునీటికి కేటాయించిన నీటిలో ఎంత తిరిగి వచ్చిందనేది సంబంధం లేదు. మొత్తం నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
* ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు దీనికి అంగీకరించి అమలు చేశాయి.
* బచావత్‌ ట్రైబ్యునల్‌లోని 7వ నిబంధన ప్రకారం పునరుత్పత్తయిన నీరు తిరిగి చేరిందని తేల్చాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8)(ఎ) ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దీనిని అమలు చేసి తీరాల్సిందే. గత మూడేళ్లుగా దీనిని అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ నష్టపోయింది.
* మిషన్‌ భగీరథ కూడా తాగునీరే అయినందున దీనికి కూడా 20 శాతమే అమలు చేయాలి.

బోర్డు ప్రతినిధుల అభిప్రాయం
బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు నాలుగు దశాబ్దాల క్రితం 1976లో వచ్చింది. తాగునీరు, పురపాలక సంఘాల్లో వినియోగించే నీరు కృష్ణా నదిలో నామమాత్రమే. అయితే ఇప్పుడు తాగునీటి అవసరాలు చాలా ఎక్కువయ్యాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 20 శాతం లెక్కగడితే మిగిలిన 80 శాతంలో ఎంత తిరిగి నదిలోకి వచ్చిందో చెప్పలేం. దీనిని ఎలా లెక్కగట్టాలన్నదానిపై తగిన అథార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు రాష్ట్రాలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో బోర్డే దీనిపై నిర్ణయం తీసుకోవాలి.

అంశం: శ్రీశైలం నుంచి విడుదల చేసిన మొత్తం నీరు నాగార్జునసాగర్‌కు చేరకపోవడం

ఆంధ్రప్రదేశ్‌ వాదన
* అన్ని మార్గాల నుంచి శ్రీశైలంలోకి వచ్చిన నీరు ఎంత? స్పిల్‌వే ద్వారా ఎంత విడుదల చేశారు? నాగార్జునసాగర్‌కు వచ్చింది ఎంత అన్నదానిపై కేంద్ర జలసంఘంతో అధ్యయనం చేయించాలి.
* శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరడంలో ఉన్న తేడాలు 1984 నుంచి ఉన్నాయి.
* నాగార్జునసాగర్‌కు కొత్త కెపాసిటీ టేబుళ్లు అమలు చేసిన తర్వాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ తేడా ఎక్కువగా ఉంటే, కొన్నిసార్లు తక్కువగా ఉంది.
* పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కులు తీసుకొనేలా వ్యవస్థ సిద్ధంగా లేదు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు అధ్యయనం చేయించాలి.

తెలంగాణ ఏమంది?
* మళ్లీ అధ్యయనం అనవసరం. ఇది కాలయాపనకు మాత్రమే పనికొస్తుంది.
* శ్రీశైలం నుంచి సాగర్‌కు చేరిన నీటిలో తేడా గత 40 ఏళ్లతో పోల్చితే 2017-18లోనే ఎక్కువగా ఉంది.
* పోతిరెడ్డిపాడు గేట్ల ద్వారా రోజూ వెయ్యి నుంచి మూడువేల క్యూసెక్కుల వరకు లీకేజి ఉంది. ఈ సంవత్సరంలోనే 20 టీఎంసీలు అదనంగా వెళ్లింది. బోర్డు బృందం పర్యటించినప్పుడూ ఈ విషయం బయటపడింది. ఈ 20 టీఎంసీలను కూడా ఆంధ్రప్రదేశ్‌ కోటాలోనే వేయాలి.
* శ్రీశైలం నుంచి 234.737 టీఎంసీలు విడుదల చేస్తే నాగార్జునసాగర్‌కు వచ్చింది 187.780 టీఎంసీలే. అంటే 46.957 టీఎంసీలు తేడా ఉంది. మొత్తం నీటిలో ఇది 20 శాతం.

బోర్డు అభిప్రాయమేమిటి?
1984-85 నుంచి 2017-18 వరకు శ్రీశైలంలోకి వచ్చిన నీరు, బయటకు వదిలింది, సాగర్‌కు చేరిన నీటిపై తెలంగాణ ఇచ్చిన వివరాలను బోర్డు విశ్లేషించింది. 2012-13లో కొత్త కెపాసిటీ టేబుళ్లు అమలు చేసిన తర్వాత తేడాలు ఎక్కువగా ఉన్నట్లు బోర్డు అభిప్రాయపడింది. నెలవారీ వివరాలను, ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన వివరాలను కూడా విశ్లేషించింది. రిజర్వాయర్లలో నీటిమట్టం ఎక్కువగా ఉండి తక్కువ గేట్లను నిర్వహించినపుడు తేడా ఎక్కువగా ఉందని, గేట్లను ఎక్కువ తెరిచినప్పుడు రిజర్వాయర్‌ మట్టం తక్కువగా ఉన్నప్పుడు తేడా తక్కువగా ఉందని వివరించింది. స్పిల్‌ నిర్వహించినప్పుడు, కొత్త టేబుళ్లను అమలు చేసిన తర్వాత తేడాలు ఎక్కువగా ఉన్నాయని,  దీనిపై తటస్థ సంస్థతో అధ్యయనం చేయించాలని సూచించింది. పోతిరెడ్డిపాడు వద్ద లీకేజీలు తగ్గించడానికి చర్యలు తీసుకోవడంతోపాటు టెలిమెట్రీ వ్యవస్థను వేగం చేయాలని పేర్కొంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సమగ్ర ప్రాజెక్టు నివేదికలేవి?
అవి లేకుండా అభిప్రాయాలు ఎలా చెప్పడం
ఏపీ13, తెలంగాణ 8 ప్రాజెక్టుల నివేదికలివ్వాలి
కృష్ణానదీ యాజమాన్య బోర్డు
ఇరురాష్ట్రాలతో ఆరున సమావేశం
తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనలకు దక్కని చోటు
నిర్వహణ కరదీపికపై బోర్డు దృష్టి
ఈనాడు - హైదరాబాద్‌

కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికల(డీపీఆర్‌)పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించనుంది. గత ఏడాది ఆగస్టు నుంచి జరిగిన బోర్డు సమావేశాల్లో డీపీఆర్‌లు అందజేయాలని కోరినా రాష్ట్రాలు పట్టించుకోలేదని, ఇవి లేకుండా అభిప్రాయం చెప్పడం, సాంకేతిక అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ 13 ప్రాజెక్టులు, తెలంగాణ వాటర్‌గ్రిడ్‌తో సహా ఎనిమిది ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు అందజేయాలని పేర్కొంది. ఈ నెల ఆరో తేదీన జరగనున్న ఎనిమిదవ సర్వసభ్య సమావేశంలో చర్చించే అంశాలను బోర్డు ఖరారు చేసింది. ఈ బోర్డు సమావేశంలో చర్చించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేసిన ప్రతిపాదనలకు మాత్రం అజెండాలో చోటు లభించలేదు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అనేక అంశాలను పక్కనపెట్టింది. 2014 సెప్టెంబరు నుంచి అనేక దఫాలుగా చర్చించినా నిర్వహణ కరదీపిక (వర్కింగ్‌ మాన్యువల్‌) ఖరారు కాలేదని, ఇప్పటికైనా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బోర్డు పేర్కొంది. పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, పాలేరు కాలువ వద్ద టెలిమెట్రీల ఏర్పాటు, రెండవ దశ టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు గురించి అజెండాలో చేర్చింది. పుణెలోని నీరు-విద్యుత్తు పరిశోధనా కేంద్రం సిఫార్సు చేసినట్లుగా మొదటి దశలోని 15 టెలిమెట్రీల వద్ద అదనంగా ప్రవాహ సెన్సార్లను ఏర్పాటు చేయడం, టెలిమెట్రీ కేంద్రాల్లో మార్పు, రెండవ దశకు సంబంధించి నిర్ణయం తదితర అంశాలున్నాయి. తాగునీటికి కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి తక్కువగా ఉండటంపై ఏర్పాటు చేసిన కమిటీలిచ్చిన నివేదికలు, 2017-18లో నీటి వినియోగం, 2018-19లో నీరు, విద్యుత్తు పంపిణీ అంశాలపై కూడా ఆరున జరిగే బోర్డు సమావేశం చర్చించనుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలివి
* కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలి.
* బోర్డు ఛైర్మన్‌ మే నాలుగో తేదీన కేంద్రానికి పంపిన పరిధి ముసాయిదాలో నీటి కేటాయింపునకు సంబంధించి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 2015 జూన్‌లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయం ప్రకారం వినియోగం అని మార్చాలి.
* ఆర్డీఎస్‌ పైన మూడు చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి.
* పాలేరు రిజర్వాయర్‌ నుంచి భక్తరామదాసు ఎత్తిపోతలకు, గోదావరినుంచి కృష్ణాబేసిన్‌కు తెలంగాణ తరలించే 214 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
* జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవడంతో పాటు, ఈ రిజర్వాయర్‌ నుంచి మొత్తం వినియోగంపై పరిమితులుండాలి.
* తెలంగాణ ప్రభుత్వం కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, తుంగభద్రపై చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్‌లను బోర్డు, కేంద్రజలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలనకు పెట్టాలి. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పురాకుండా కొత్త ప్రాజెక్టులపై ముందుకు పోవద్దని తెలంగాణకు సూచించాలి.
* మిషన్‌కాకతీయ కింద చెరువులను బాగు చేయడం, వర్షాలు బాగున్నప్పుడు అన్ని చెరువులు నిండనున్నందున చిన్ననీటివనరుల కింద తెలంగాణకు ఉన్న మొత్తం కేటాయింపు 89.15 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
* జూరాల నుంచి విడుదల చేసిన మొత్తం నీరు శ్రీశైలానికి రాకపోవడం, జూరాల వినియోగం, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్ననీటివనరుల కింద వినియోగించిన నీటిని తక్కువగా చూపడం, సాగర్‌ ఎడమకాలువ పరిధిలో క్రాస్‌వాల్స్‌ తొలగించడం, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నియామకం, సాగర్‌-పులిచింతల మధ్య ఎత్తిపోతల ద్వారా తీసుకొనే నీటికి లెక్కలు చెప్పడం తదితర అంశాలను అజెండాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది.

తెలంగాణ ప్రతిపాదనలివి
* పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకొని తక్కువగా చూపించారు. ఈ తేడాను కూడా లెక్కల్లోకి తీసుకోవాలి.
* గోదావరి నుంచి మళ్లించే నీటిలో తెలంగాణ వాటాను ఎ.ఎం.ఆర్‌-ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు కేటాయించడం.
* కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని వినియోగించుకొన్న రాష్ట్రం వాటాను తర్వాత సంవత్సరంలో తగ్గించడం.
* రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఏకపక్షంగా బోర్డు పరిధిపై కేంద్రానికి బోర్డు ఛైర్మన్‌ లేఖ రాయడంపై చర్చించాలి.

Link to comment
Share on other sites

తక్షణమే అమరావతికి తరలిరండి
04-06-2018 02:23:58
 
  • కేఆర్‌ఎంబీని డిమాండ్‌ చేసిన ఏపీ
ఆమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే అమరావతికి తరలి రావాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లవుతున్నా... చట్టంలో పేర్కొన్న విధంగా కేఆర్‌ఎంబీ ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా ఇంకా హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు సాగించడం ఏంటని నిలదీసింది. ఈ నెల ఆరో తేదీన కృష్ణానదీ జలాల వార్షిక కేటాయింపులపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో అజెండాలో చేర్చాల్సిన అంశాలను పేర్కొంటూ కేఆర్‌ఎంబీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ లేఖ రాశారు. అందులోని అంశాలు..
  • కేఆర్‌ఎంబీ తక్షణమే ఏపీకి తరలి రావాలి.
  • జూరాల నీటి వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
  • బోర్డు పరిధిపై రూపొందించిన ముసాయిదాలో సవరణలు చేయాలి.
  • రాజోలిబండ మళ్లింపు పథకంపైన టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలి.
  • నాలుగేళ్లయినా ఇప్పటికీ బోర్డు పరిధిలోని ప్రాజెక్టులపై కేఆర్‌ ఎంబీకి నియంత్రణ లేకపోవడం సరికాదు.
Link to comment
Share on other sites

ఏపీ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవద్దు
కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణానదీ యాజమాన్య బోర్డులో చర్చకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఎనిమిదవ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశానికి అజెండాను బోర్డు ఖరారు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి అజెండాలో చేర్చాల్సిన అంశాలపై బోర్డు ప్రతిపాదనలు కోరింది. వచ్చిన ప్రతిపాదనల్ని అజెండాలో చేర్చలేదు. అయితే అధ్యక్షుడు అనుమతి ఇస్తే సమావేశంలో వీటిని చర్చించే అవకాశం ఉంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించిన 214 టీఎంసీలు, భక్తరామదాసు, మిషన్‌భగీరథ, బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు ఇలా పలు అంశాలను అజెండాలో చేర్చాలని ఏపీ కోరింది. ఈ అంశాలపై సిద్ధం కావడానికి తగిన సమయం లేకుండా చివర్లో వచ్చినందున అజెండాలో చేర్చవద్దని తెలంగాణ కోరినట్లు తెలిసింది. తెలంగాణ తరఫున ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి,  ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేందరరావు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ ప్రతిపాదనలు చేర్చకుంటే తెలంగాణ అంశాలకు ఆ రాష్ట్రం  అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఏపీ తరఫున కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు హాజరుకానున్నారు. మరోపక్క.. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఒడిశా, తెలంగాణలు దీనిపై సంయుక్త కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.

Link to comment
Share on other sites

కృష్ణా నదీ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వాడీ వేడీ చర్చలు
06-06-2018 17:45:21
 
హైదరాబాద్‌: జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు కీలక సమావేశం జరిగింది. కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్ చైర్మన్ హెచ్‌కే సాహు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, టెలిమెట్రిల ఏర్పాటు, నీటి వినియోగం, వాటాలపై వాడి వేడి చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి.. ఇంకా ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. నదీ జలాల పంపకం ఇంకా పెండింగ్‌లోనే ఉందని, మరోసారి సమావేశమై దీనిపై చర్చిస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
137 టీఎంసీలెక్కువ
తెలంగాణ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దు
బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఏపీ దరఖాస్తు
ఈనాడు - హైదరాబాద్‌

కృష్ణాబేసిన్‌లో తమ అవసరాలు 936.58 టీఎంసీలని సాంకేతిక సలహా కమిటీ తయారు చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఈ నెల ఏడున, తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ ఈ నెల 21న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను కోరుతూ దరఖాస్తు (ఐ.ఎ) దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట రెండు రాష్ట్రాలు తమ వాదనను స్టేట్‌మెంట్‌ ఆప్‌ కేస్‌గా దాఖలు చేశాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలోనివి, ప్రతిపాదనలో ఉన్నవి అన్నీ కలిపి 799.22 టీఎంసీలు కేటాయించాలని గతంలో తెలంగాణ కోరగా, 1059.03 టీఎంసీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. రెండు రాష్ట్రాల వాదనలోని అంశాలు, సమర్పించిన ఆధారాలు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ట్రైబ్యునల్‌ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయనుంది. ఇదే సమయంలో కృష్ణాబేసిన్‌లో నీటి అవసరాలపై తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గోపాలరెడ్డి ఛైర్మన్‌గా సాంకేతిక సలహా కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌) తయారు చేసింది. దీని ప్రకారం కృష్ణాబేసిన్‌లో తెలంగాణ అవసరాలు 936.58 టీఎంసీలుగా ఈ  కమిటీ తేల్చింది. ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలపై తెలంగాణ తరఫున వాదనలు వినిపించేందుకు నీటిపారుదల రంగ నిపుణులు గణశ్యాం జా దాఖలు చేసిన అఫిడవిట్‌కు అనుబంధంగా సాంకేతిక సలహా కమిటీ తయారు చేసిన ప్రణాళికను కూడా ట్రైబ్యునల్‌కు సమర్పించారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం చెబుతూ అనుబంధంగా దాఖలు చేసిన ఈ ప్రణాళికను తిరస్కరించాలని దరఖాస్తులో కోరింది. రెండు రాష్ట్రాలు తమ స్టేట్‌మెంట్‌ ఆప్‌ కేసును దాఖలు చేయాలని 2016 అక్టోబరు 19న ట్రైబ్యునల్‌ ఆదేశించిందని, 2017 ఏప్రిల్‌ 11న తెలంగాణ, 17న ఆంధ్రప్రదేశ్‌ ఈ మేరకు దాఖలు చేశాయని పేర్కొంది. ఏయే అంశాలపై వాదనలు జరగాలన్నదానిపై 2017 జులైన నిర్ణయం తీసుకున్న ట్రైబ్యునల్‌ అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ 11 డాక్యుమెంట్లు దాఖలు చేసింది. తాజాగా గణశ్యాం జా అఫిడవిట్‌కు అనుబంధంగా సాంకేతిక కమిటీ నివేదికను జత చేసింది. 2017 ఏప్రిల్‌ 11న దాఖలు చేసిన స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేసులో మార్పులు చేసేలా సాంకేతిక సలహా కమిటీ నివేదిక ఉందని, మొదట దాఖలు చేసిన దానికంటే 137.36 టీఎంసీలు ఎక్కువ చూపారని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. గణశ్యాం జా సాంకేతిక సలహా కమిటీలో సభ్యుడు కూడా కాదని, సాంకేతిక సలహా కమిటీ నివేదికను సాక్ష్యంగా చూపే సామర్థ్యం ఆయనకు లేదని పేర్కొంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

http://www.newindianexpress.com/states/telangana/2018/sep/20/andhra-pradesh-witness-fails-to-convince-tribunal-on-krishna-water-sharing-1874593.html

 

Andhra Pradesh witness fails to convince tribunal on Krishna water sharing

Therefore, there is no additional in flows at Prakasam barrage.

fb.pngtwitter.pngg-plus.pngmail.png

Published: 20th September 2018 05:04 AM  |   Last Updated: 20th September 2018 05:04 AM  |  A+A-

1-5.jpg

The Second Krishna Water Disputes Tribunal delivered its verdict.

By Express News Service

HYDERABAD: Continuing his cross-examination before Krishna Water Disputes Tribunal on Wednesday, Telangana counsel C S Vaidyanathan asked Andhra Pradesh witness and retired engineer M Visweswara Rao that would there be any need to draw water from Krishna delta of Nagarjuna Sagar project if their requirement is met by drawing water from Godavari river and Pulichintala project. Replying to this, Visweswara Rao said that the additional diversion of water from Godavari at Polavaram to an extent of 80 tmcft was to be accounted for Nagarjuna Sagar Project, which includes 21 tmcft to Karnataka, 14 tmcft to Maharashtra and 45 tmcft above Nagarjuna Sagar.

Therefore, there is no additional in flows at Prakasam barrage. The 80 tmcft that is now being supplied from NSP would be supplied from Polavaram. Regarding the flows from the catchment areas of  Pulichintala, which is around 53 tmcft, the total available would be 133 tmcft and the balance would to be supplied from Pulichintala.

He added, the live storage of Pulichintala being 36 tmcft there was a balance of 20 tmcft which was required to take the flow variations and the demand variations of Krishna Delta as there was no storage at Prakasam barrage. Meanwhile, Vaidyanathan asked whether it was correct of AP to utilise Godavari waters to supply water to area under NSLC through Chintalapudi lift irrigation scheme. To this, the AP witness said they were still studying the case. Meanwhile, Tribunal chairman Brijesh Kumar issued order that the case would be taken up again on October 3 and the cross examination would continue till October 5.

 
 
Link to comment
Share on other sites

https://www.thehindu.com/news/national/telangana/water-diverted-from-godavari-not-sufficient-for-krishna-delta-says-expert/article24988895.ece

Water diverted from Godavari not sufficient for Krishna Delta, says expert

author-deafault.pngB. Chandrashekhar
HYDERABAD, SEPTEMBER 19, 2018 23:26 IST
UPDATED: SEPTEMBER 19, 2018 23:26 IST
  • SHARE ARTICLE
  •  
  •  
  •  
  •  
  •  
  • PRINT
  • A A A
 

New proposals to divert Godavari water, Krishna Water Disputes Tribunal told

The diversion of water from Godavari basin to the Krishna basin has to be considered while working out an operational protocol based on the principles of Tungabhadra model for water management in all projects in the States of Telangana and Andhra Pradesh during the deficit years.

This was suggested by AP’s witness before the Krishna Water Disputes Tribunal (KWDT-II) M. Viseveswara Rao, a retired irrigation engineer, during the tribunal hearing in New Delhi on Wednesday.

He was cross-examined by senior counsel appearing for Telangana C.S. Vaidyanathan for the second day on Wednesday.

During the cross-examination, Mr. Rao, while responding to a poser that supplementation to Krishna Delta from Nagarjunasagar may not be required in future, stated that about 20 tmc ft water has to be supplemented even after diversion of 80 tmc ft from Polavaram and utilisation of another 53 tmc net flows available downstream of Pulichintala reservoir.

“The additional diversion from Godavari at Polavaram to an extent of 80 tmc ft is to be accounted for the areas above Nagarjunasagar including 21 tmc ft for Karnataka, 14 tmc ft to Maharashtra and 45 tmc ft above Nagarjunasagar (in Telangana). The 80 tmc ft being supplied to Krishna Delta from Nagarjunasagar now will be supplied from Polavaram,” the AP’s witness explained to the tribunal.

Diversion of water

(Andhra Pradesh is already diverting Godavari water to Krishna basin with the help of Pattiseema lift irrigation project even without completion of Polavaram. According to official statistics, over 120 tmc ft water was diverted during the last water year alone. A year before, the diversion was to the tune of 59 tmc ft.)

Mr. Visveswara Rao admitted before the tribunal that he was aware of AP’s plans to meet the part water requirements of Nagarjunasagar Left Canal command area with the help of Chintalapudi lift irrigation scheme and another scheme to meet the substantial water requirement of Nagarjunasagar Right Canal command area, both with Godavari waters. However, he said he did not study the two proposals and he would respond after studying them.

Meanwhile, the tribunal posted the further cross-examination of Mr. Visveswara Rao from October 3 to 5 and fixed the next hearing from November 28 to 30.

 

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...