Jump to content

Krishna River Management Board


Recommended Posts

 

వరద వస్తేనే వదులుతారా?

12-09-2017 03:26:48

 
636407836244803355.jpg
  • మీ తీరు దారుణం.. తీవ్ర అన్యాయం
  • దుర్భిక్షంలో ఉన్నా.. కిందకు నీళ్లొదలరా?
  • మీకు కరెంటిస్తాం.. మాకు నీరివ్వండి
  • మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు బాబు లేఖలు
  • దిగువకు నీరందేలా జోక్యం చేసుకోండి
  • ప్రధాని మోదీకి మరో అభ్యర్థన లేఖ
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వరదలు వచ్చినప్పుడు మాత్రమే మహారాష్ట్ర, కర్ణాటకలు నీటిని కిందకు వదులుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇవి తమ ప్రాజెక్టులన్నిటినీ నీటితో నింపుకొని దిగువ రాష్ట్రాలు దాహంతో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని వాపోతున్నారు. కృష్ణా జలాల విడుదల కోసం ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలకు లేఖలు రాస్తున్నారు. విషయంలో జోక్యంచేసుకుని..దామాషా పద్ధతిలో నీరు వదిలేలా చూడాలని దిగువ రాష్ట్రాల నీటి కష్టాలు తీర్చాలని ప్రధాని మోదీని మరో లేఖలో అభ్యర్థించనున్నారు. ‘ఎగువ రాష్ట్రాలు దామాషా మేరకు దిగువ రాష్ట్రాలకు దామాషా మేరకు నీటిని విడుదల చేయడంపై దృష్టి సారించండి. కృష్ణా పరివాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాల్లో వర్షాభావం నెలకొంది.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు అడుగంటాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎగువన ఉన్న మహారాష్ట్ర , కర్ణాటకలలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయి. దిగువ రాష్ట్రాలేమో నీరు లేక అలమటిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రాలు మానవత్వం చూపడం లేదు. తమకు వరదలు వచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతున్నాయి. ఇది అన్యాయం. దారుణం. దీనిపై స్పందించండి’ అని ప్రధానిని కోరనున్నారు.
 
మా ప్రాజెక్టులు ఎండుతున్నాయి..
‘మా రాష్ట్రం సాగు, తాగు నీటికి కటకటలాడుతోంది. వర్షాభావంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. ఎగువన మీకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నాయి. ఇక ఏమాత్రం వరద వచ్చినా తట్టుకోలేని స్థితిలో కర్ణాటకలోని సాగు నీటి పథకాలున్నాయి. ఎగువన ఇలాంటి పరిస్థితి ఉంటే .. దిగువన ఉన్న మేం నీటి కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాం. అయినా మీలో ఏమాత్రం మానవీయ కోణం కనిపించడం లేదు.
 
దిగువ రాష్ట్రాల పట్ల కాస్త కరుణ చూపండి. వరదలొచ్చినప్పుడు మాత్రమే దిగువకు నీటిని వదులుతామనడం సరికాదు. అది అన్యాయం. నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణకు నీరిచ్చి మానవత్వాన్ని చాటుకోండి’ అంటూ కర్ణాటక సీఎంకు చంద్రబాబు లేఖ సిద్ధం చేశారు. సీఎం కార్యాలయం నేడో రేపో ఈ లేఖను సిద్ధరామయ్యకు పంపనుంది. ‘దిగువన మేం నీటి కొరతతో సతమతమవుతుంటే.. మహారాష్ట్రలోని కొయినా, టాటా విద్యుత్కేంద్రాల ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఏకంగా 94 టీఎంసీలను అరేబియా సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారు. ఇది సముచితం కాదు. కొయినా, టాటా కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ అంతా ఏపీ నుంచి మీకు అందిస్తాం. ఆ 94 టీఎంసీలను మాకివ్వండి’ అని మహారాష్ట్ర సీఎంను ఉద్దేశించి మరో లేఖను సిద్ధం చేశారు. నేడో రేపో నిర్ణయం తీసుకుని ఫడణవీ్‌సకు పంపనున్నారు. ఈ లేఖలపై ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

 

evadu ee article raasinodu koyna river krishna river lo kalusthadi aite

Link to comment
Share on other sites

this river system has multiple dams. one of the dam discharges in to arabian sea (Kolkewadi Dam). main reservoir (shivsagar) discharges in to Krishna

aina arebia sea ki discharge ayye water ni krishna river ki ela testharu? madyalo ghats vuntay kada  mana vallu nijamaga ala letter raasi vunte matram adi cheppina vaadiki sanmanam cheyochu

 

Kolekwadi dam western end of western ghats lo vuntadi sivasagar eastren end lo vuntadi

Link to comment
Share on other sites

aina arebia sea ki discharge ayye water ni krishna river ki ela testharu? madyalo ghats vuntay kada  mana vallu nijamaga ala letter raasi vunte matram adi cheppina vaadiki sanmanam cheyochu

 

Kolekwadi dam western end of western ghats lo vuntadi sivasagar eastren end lo vuntadi

 

Kolkewadi dam is fed from back waters of shivsagar reservoir after power generation through tunnel. that water is used in further stages of power generation. if power generaion is not needed, that tunnel can be stopped and same water can be released to Koyna downstream (to krishna).

Link to comment
Share on other sites

Kolkewadi dam is fed from back waters of shivsagar reservoir after power generation through tunnel. that water is used in further stages of power generation. if power generaion is not needed, that tunnel can be stopped and same water can be released to Koyna downstream (to krishna).

aa rojullone antha chain structure build chesara Maharashtra vallu :o
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...