Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 1 month later...
మేజెస్‌ ఎలక్ట్రా‌‌‌‌‌నిక్స్‌ పార్క్స్‌’తో ఒప్పందం..
29-11-2018 03:05:48
 
తిరుపతిలో గ్రీన్‌ఫీల్డ్‌ మెడికల్‌ ఎలక్ట్రా‌‌‌‌‌నిక్స్‌ వస్తువుల తయారీ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్న మేజెస్‌ ఎలకా్ట్రనిక్స్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ ఒప్పందం చేసుకుంది. లోకేశ్‌ సమక్షంలో బుధవారం ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, మేజెస్‌ సంస్థ ఎండీ ఇందు మౌలి సంతకాలు చేశారు.
Link to comment
Share on other sites

రూ.500 కోట్లతో తిరుపతిలో చైనా కంపెనీ 
తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఏర్పాటుకు సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ సంసిద్ధత 
2,500 మందికి ఉద్యోగాలు 
ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో నేడు ఒప్పందం 
3ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సమూహం(ఈఎంసీ)-2లో చైనాకి చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. దీంతో సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. కెమెరా మాడ్యూల్స్‌, ఆప్టికల్‌ కాంపోనెంట్స్‌ తయారీలో పేరెన్నికగన్న సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ...హువాయ్‌, జియోమీ, ఒప్పో, వివో, లెనోవో, సోనీ, పానాసోనిక్‌, ఒలంపస్‌, కార్ల్‌జిస్‌ లాంటి కంపెనీలకు మొబైల్‌ ఫోన్లు, టీచింగ్‌ సపోర్ట్‌, ఆప్టికల్‌ ఇమేజింగ్‌ ఉత్పత్తులు, సేవలను సమకూర్చుతోంది. చైనా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ వైస్‌ డైరెక్టర్‌ ఆరాస్‌తో సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్‌ తయారీరంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరించి పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు.


ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్ల నిర్వహణకు ముందుకొచ్చిన టాటా ట్రస్ట్‌

గ్రామీణ ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్లను దశలవారీగా నిర్వహించేందుకు టాటా ట్రస్ట్‌ ప్రతినిధులు ముందుకొచ్చారు. ట్రస్ట్‌ రాష్ట్ర విభాగ ప్రాంతీయ మేనేజర్‌ రాజేంద్రబాబు, ప్రోగ్రాం అధికారి డేవిడ్‌ మెండి సచివాలయంలో సోమవారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. కృష్ణా జిల్లాలో 4 క్లస్టర్లలో ఏర్పాటుచేసిన సుజల ప్లాంట్లను మొదట నిర్వహిస్తామని, మిగతావి దశలవారీగా చేపడతామని మంత్రితో మాట్లాడుతూ తెలిపారు.

Link to comment
Share on other sites

లోకేష్ సమక్షంలో చైనా కంపెనీ, ఏపీ మధ్య ఒప్పందం
04-12-2018 18:39:02
 
636795455431764325.jpg
అమరావతి: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సన్నీ ఆప్టికల్స్, ఏపీ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతిలో సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీలో సుమారు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చైనాకి చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ కంపెనీ పేర్కొంది.
 
 
కాగా, ఈ విషయమై మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014లో భారతదేశంలో 10 ఫోన్లు తయారైతే ఏపీలో ఒక్క ఫోన్ కూడా తయారయ్యేది కాదని, ఇప్పుడు 3ఫోన్లు రాష్ట్రంలో తయారవుతున్నాయని అన్నారు. ఏపీలో యూనిట్ ద్వారా స్థానికంగా 4వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని అన్నారు.
 
 
సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, నాయకత్వ లక్షణాలు నచ్చే ఏపీని ఎంచుకున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని సన్నీ ఆప్టికల్స్, ఎలక్ట్రానిక్స్ సీఈవో డేవిడ్ వాంగ్ తెలిపారు.
Link to comment
Share on other sites

ఆగస్టుకు సన్నీ
05-12-2018 02:37:24
 
636795742445337772.jpg
  • లోకేశ్‌ సమక్షంలో కుదిరిన ఒప్పందం
  • త్వరలో టీసీఎల్‌, రిలయన్స్‌ కంపెనీల భూమి పూజ
  • 500 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
  • ఎలక్ర్టానిక్స్‌ రంగానికి రాష్ట్రమే గమ్యస్థానం: మంత్రి
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): చైనాకు చెందిన మల్టీనేషనల్‌ సంస్థ ‘సన్నీ ఆప్టికల్‌ ఎలక్ర్టానిక్స్‌’ కంపెనీ రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించింది. సెల్‌ఫోన్లలో ఉపయోగించే కెమెరా లెన్సులు, కెమెరా మాడ్యుల్స్‌ను రాష్ట్రంలో తయారుచేస్తుంది. వచ్చే ఆగస్టు నాటికి కర్మాగార నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌-సన్నీ ఆప్టికల్‌ ఎలక్ర్టానిక్స్‌ సీఈవో డేవిడ్‌ వాంగ్‌ల మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. రూ.500కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ కంపెనీ ద్వారా సుమారు నాలుగువేల మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
 
ఒక ఐప్యాడ్‌ తయారుచేయాలంటే దానిలో 200 విడిభాగాలు కావాలని, ఆ విడిభాగాలు తయారుచేసే కంపెనీలన్నీ ఏపీకి రావాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామన్నారు. దానిలో భాగంగానే చైనా పర్యటనలో సన్నీ ఆప్టికల్‌ ఎలక్ర్టానిక్స్‌ సీఈవోను కలిసి చర్చలు జరిపినట్లు చెప్పారు. మరిన్ని ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలను కూడా తీసుకొస్తామన్నారు. రాబోయే 15 ఏళ్లలో దేశంలో ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తుల ఉత్పత్తి లక్ష కోట్ల డాలర్లు అవుతుందని, అందులో సగం ఏపీ నుంచే ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని, దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని లోకేశ్‌ వివరించారు. ఎలక్ర్టానిక్స్‌ రంగానికి రాష్ట్రమే గమ్యస్థానం కావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే టీసీఎల్‌, రిలయన్స్‌ జియో కంపెనీల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని తెలిపారు.
 
సన్నీప్లాంట్‌ ఎక్కడ పెడతారని విలేకరులు ప్రశ్నించగా... కంపెనీ సీఈవో బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి... ఎక్కడ పెట్టాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. సన్నీ ఆప్టికల్‌ ఎలకా్ట్రనిక్స్‌ సీఈవో డేవిడ్‌ వాంగ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అనుకూల పరిస్థితులు తమను ఆకట్టుకున్నాయని, అందుకే ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నామన్నారు. నెలకు 2 కోట్ల కాంపొనెంట్లను ఏపీలో ఉత్పత్తి చేస్తామన్నారు. తమ ప్లాంటు చైనా బయట మరెక్కడా లేదని, తొలిసారి ఏపీలో పెడుతున్నామన్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యాక... పరిశోధన, అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలపై కూడా తాము దృష్టిపెడతామన్నారు.
Link to comment
Share on other sites

రూ.500 కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉపాధి! 
8 నెలల్లో చైనా దిగ్గజ కంపెనీ ఏర్పాటు 
రాష్ట్ర సర్కారుతో సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ ఒప్పందం 
4ap-main11a.jpg

ఈనాడు, అమరావతి: చైనాకు చెందిన బహుళజాతి సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రంలో రూ.500కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో మంగళవారం ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌శాఖల మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి కె.విజయానంద్‌, సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వాంగ్‌ వెంజిఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 200 ఎకరాల్లో ఎనిమిది నెలల వ్యవధిలో కంపెనీ ఏర్పాటుచేసి ఆగస్టులో కెమెరా, లెన్స్‌, వెహికల్‌ కెమెరా మాడ్యూల్స్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా వాంగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. కంపెనీలో 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 2005లో స్థాపించిన తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 28,540 మంది పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సానుకూలతను గమనించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని వాంగ్‌ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విధానాల ప్రకారం సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌కి అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తామని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంపై కంపెనీ ప్రతినిధులకు లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి, శ్రీసిటీ ఎక్కడైనా కంపెనీ కోరినచోట భూములు కేటాయించి ఏకగవాక్ష విధానంలో అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌లో 200 రకాల పరికరాలు తయారుచేసే ఇలాంటి కంపెనీలు త్వరలో మరిన్ని రాష్ట్రానికి రాబోతున్నాయని వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఐటీ ఏజెన్సీ ముఖ్య కార్యనిర్వాహకాధికారి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఎలక్ట్రానిక్‌ కంపెనీలు తిరుపతి బాట
రూ.2,190 కోట్ల పెట్టుబడితో మరో 3 కంపెనీలు

ఈనాడు, అమరావతి: తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ క్లస్టర్‌(ఈఎంఎస్‌)లో దేశ, విదేశాలకు చెందిన పలు సంస్థలు మరో రూ.2,190 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,880 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒకటి, రెండు రోజుల్లో నిర్వహించే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ కంపెనీల ఏర్పాటుకు తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు అభివృద్ధి చేశారు. వీటిలో ఎక్కువగా చైనాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) కంపెనీకి ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. మరో మూడు ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా పరిశ్రమలశాఖను ఆశ్రయించాయి. ఈ ప్రతిపాదనలను ఎస్‌ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు నివేదిక రూపొందించారు.

కొత్తగా వచ్చే సంస్థలివే..
* భారత్‌కు చెందిన ప్రఖ్యాత వోల్టా ఎలక్ట్రానిక్‌ కంపెనీ రేణిగుంట ఈఎంసీ-2లో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.653 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తయారు చేస్తున్న ఈ కంపెనీ ఏర్పాటుతో 1,680 మందికి ఉపాధి లభించనుంది.
* చైనాకు చెందిన అప్టోడిస్ల్పే టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రేణిగుంట ఈఎంఎస్‌ క్లస్టర్‌లో 70 ఎకరాల్లో రూ.308 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. టెలిఫోన్‌, టెలివిజన్‌, మొబైల్‌ ఫోన్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, ఎయిర్‌ కండీషనర్లు ఈ సంస్థ తయారు చేయనుంది. ఉపాధి కల్పనపై ఈ కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
* చైనాకు చెందిన మరో ఎలక్ట్రానిక్‌ కంపెనీ పేనల్‌ ఆప్టోడిస్ల్పే టెక్నాలజీ రేణిగుంటలో 70 ఎకరాల్లో రూ.1,229 కోట్ల పెట్టుబడులతో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఎల్‌సీడీ ప్యానళ్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ప్రారంభంతో ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్వాహకులు మూడు విడతల్లో ప్రాజెక్టుని పూర్తి చేయనున్నారు.

Link to comment
Share on other sites

ఏపీకి టీవీ కంపెనీలు
14-12-2018 03:30:45
 
  • తిరుపతి కేంద్రంగా ప్లాంట్లు
  • వోల్టాస్‌, టీటీఈ, పీవోటీపీఎల్‌ సుముఖత
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): టెలివిజన్‌, మొబైల్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, పరికరాలను తయారు చేసే ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామంటూ ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌లో వీటిని స్థాపిస్తామంటూ ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన వోల్టాస్‌ రూ.653 కోట్ల పెట్టుబడితో 1680 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. మరో ప్రముఖ సంస్థ టీటీఈ కూడా రూ.65.03 కోట్లు, ప్యానెల్‌ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీవోటీపీఎల్‌) రూ.1229.34 కోట్లు పెట్టుబడిగా పెడతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. వీటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలియజేసింది. ఈ సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైనా స్పష్టత ఇచ్చింది. ఎస్‌ఐపీసీ చేసిన సిఫారసులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ఆమోదించింది.
 
 
ప్లాంట్ల స్థాపన ఇలా..!
వోల్టాస్‌: రూ.653కోట్ల పెట్టుబడి. 1680 మందికి ఉద్యోగాలు. తిరుపతి ఈఎంసీలోని 100 ఎకరాల్లో 3 దశల్లో ప్లాంట్‌ ఏర్పాటు.
టీటీఈ: రూ.65.03కోట్ల పెట్టుబడి.
పీవోటీపీఎల్‌: రూ.1229.34 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 700 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 1500 మందికి ఉపాధి.
Link to comment
Share on other sites

నవ్యాంధ్రలో మరో భారీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ
18-12-2018 17:20:58
 
636807505216436764.jpg
 
 
 
అమరావతి: నవ్యాంధ్ర రాష్ట్రానికి మరో వరం లభించింది. భారీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్థాపనకు ఆసన్నమైంది. డిసెంబర్ 20న తిరుపతిలో టీసీఎల్‌కు భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీసీఎల్ ఛైర్మన్ లీ దాంగ్ షెన్గ్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు టీసీఎల్‌ కంపెనీ ముందుకొచ్చింది. దాదాపు 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
 
 
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద టీవీ ప్యానల్స్‌ను టీసీఎల్ కంపెనీ తయారీ చేయనుంది. ఏడాదికి 60 లక్షల టీవీలు తయారీ చేయాలని కంపెనీ లక్ష్యం పెట్టుకుంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 2019 నాటికి ఈ కంపెనీ ఏర్పాటుకానుంది.
Link to comment
Share on other sites

just trolling &matalathone politics nadustunna mana states lo "development achievements "  anevi mana only strength...

 

Tirupati now has 

- Worlds No#1 Foxconn

- Worlds 2nd top electronics FLEXTRONICS

- World's top TV&screen mfg'er TCL

- Worlds FOURTH top cell seller XIAOMI

- Reliance to mfg'er 7-10 lakh instruments a day with new unit

 

Lokesh lures electronics major TCL, manufacturing unit in Tirupati

http://timesofindia.indiatimes.com/articleshow/67147601.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

Link to comment
Share on other sites

టీసీఎల్‌కు రేపే శంకుస్థాపన
19-12-2018 02:33:26
 
  • 2200 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటు
  • ఏటా 60 లక్షల టీవీల ఉత్పత్తి
  • 8 వేల మందికి ఉద్యోగాలు
  • త్వరలోనే రిలయన్స్‌ జియో పార్కు
  • అదే బాటలో సన్నీ ఓపోటెక్‌, హోలీటెక్‌
  • నేడు అమరావతిలో 6 ఐటీ సంస్థలకు శ్రీకారం
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్స్‌ దిగ్గజ కంపెనీ, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద టీవీ ప్యానల్స్‌ తయారీ సంస్థ టీసీఎల్‌ తిరుపతికి రానుంది. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంటును నెలకొల్పనుంది. ఏటా 60 లక్షల టీవీలను ఇక్కడ తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 8 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ గురువారం ఈ ప్లాంటుకు భూమిపూజ చేయనున్నారు. టీసీఎల్‌ చైర్మన్‌ లీ డాంగ్‌ షెంగ్‌ కూడా పాల్గొంటారు. తిరుపతి ఎలక్ర్టానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటవుతోంది. లోకేశ్‌ చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్‌ కంపెనీని రాష్ట్రానికి వచ్చేలా ఒప్పించారు. ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా తిరుపతి ఆవిర్బవించేందుకు ఈ కంపెనీ కూడా కీలకం కానుంది. ఇక్కడే 150 ఎకరాల్లో రిలయన్స్‌ జియో ఎలక్ర్టానిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. సన్నీ ఓపోటెక్‌ కూడా రూ.500 కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో వస్తోంది.
 
కెమెరా మాడ్యూల్స్‌, స్ర్కీన్స్‌ తయారీలో దిగ్గజ సంస్థ అయిన హోలీటెక్‌.. 75 ఎకరాల్లో రూ.1400 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కేవలం విడిభాగాల అసెంబ్లింగ్‌ మాత్రమే కాకుండా.. ఎలక్ర్టానిక్స్‌ పరికాల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్స్‌ నుంచి సర్క్యూట్‌ బోర్డు తయారీ వరకు అన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలని లోకేశ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. రాష్ట్ర రాజధాని అమరావతికి మరో ఆరు ఐటీ కంపెనీలు రానున్నాయి. మంగళగిరి, విజయవాడల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ చిన్నతరహా కంపెనీలు.
 
 
ఏపీఎన్‌ఆర్‌టీ చొరవతో 87 సంస్థలు
అమరావతికి రానున్న ఆరు కంపెనీల్లో ఐదింటిని తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌లో లోకేశ్‌ బుధవారం ప్రారంభించనున్నారు. జీటీ కనెక్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, పారికరం ఐటీ సొల్యూషన్స్‌, టెక్‌స్కేప్‌, ట్రెండ్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌, డియాగ్నో స్మార్ట్‌ సొల్యూషన్స్‌ కంపెనీలు ఇందులో ఉన్నాయి. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ రామచంద్రనగర్‌లోని కే బిజినెస్‌ స్పేసెస్‌ కార్యాలయంలో ఏపీ ఆన్‌లైన్‌ కంపెనీని ప్రారంభించనున్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ చొరవతో ఇప్పటివరకు 87 ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. 4,710 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరి తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...