Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

ఆమె చేయి తిరుగుతోంది
మొబైళ్ల తయారీలో మహిళల నైపుణ్యం
ఎల్‌ఈడీ టీవీలు, సీసీ కెమెరాలు, సెట్‌టాప్‌ బాక్సులు కూడా
ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్లలో వీరే క్రియాశీలకం
తిరుపతి నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
5ap-main3a.jpg

ఆధ్యాత్మిక నగరంగా అందరికీ సుపరిచితమైన తిరుపతి ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కేంద్రంగానూ మారేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. చిత్తూరు జిల్లాలోనే ఉన్న శ్రీసిటీలో ఇప్పటికే అనేక దిగ్గజ పారిశ్రామిక సంస్థలు కొలువుతీరగా.. ఇప్పుడు తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. రేణిగుంట, వికృతమాలల్లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలోని (ఈఎంఎస్‌) కంపెనీల్లో మహిళల చేతులు కంప్యూటర్‌ కీబోర్డులపై చకచకా కదులుతున్నాయి. చిన్నచిన్న పరికరాలు, వైర్లను అనుసంధానిస్తూ.. సీసీ కెమెరాలు, మొబైళ్లకు రూపమిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని 20 మండలాల్లో వెయ్యి మందికిపైగా మహిళలు, యువతీ యువకులు రోజూ ఉదయం 9 గంటలకే రేణిగుంట, వికృతమాల ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్లకు కంపెనీ బస్సుల్లో వచ్చి సాయంత్రం అవే వాహనాల్లో ఇళ్లకు చేరుకుంటున్నారు. రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి, రామాచంద్రపురం, వడమాలపేట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, పుత్తూరు, నగరి, నారాయణవనం తదితర గ్రామాల నుంచి వీరంతా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ కంపెనీల్లో అత్యధికంగా స్థానికులకు అవకాశం కల్పించడంతో హైదరబాద్‌, బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారంతా వెనక్కొచ్చి ఇక్కడి కంపెనీల్లో చేరుతున్నారు. జీతం ఎంతనే విషయం కంటే సొంతూర్లో ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉన్నామని ఇక్కడి  ఉద్యోగులు గర్వంగా చెబుతున్నారు. మరోవైపు, రేణిగుంట, వికృతమాల ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ల(ఈఎంసీ)లో రాబోయే రోజుల్లో మరో నాలుగు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.

5ap-main3h.jpg

* రేణిగుంట, వికృతమాల ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ల(ఈఎంసీ)లో ఉత్పత్తి ప్రారంభించిన రెండు కంపెనీల్లో వెయ్యి మందికిపైగా ఉద్యోగులు సేవలు అందిస్తుండగా.. వారిలో 900 మంది (90 శాతం) మహిళలే.
* ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సంబంధిత కంపెనీల్లో కేవలం ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉద్యోగాలన్న  అభిప్రాయం తప్పని ఈఎంఎస్‌ల్లో ఏర్పాటైన కంపెనీలు నిరూపిస్తున్నాయి.
5ap-main3i.jpg* పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన విద్యార్థినులు, మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు.
* 20 నుంచి 22 ఏళ్ల యువతులు చైనా తదితర దేశాల నుంచి వచ్చిన పరికరాలు ఉపయోగించి మొబైళ్లు, సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ టీవీలు, సెట్‌టాప్‌ బాక్సులను అవలీలగా తయారు చేస్తున్నారు.

కుటుంబానికి అండ
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గోవిందవరానికి చెందిన 32 ఏళ్ల ఈమె పేరు పద్మావతి. పదో తరగతి వరకు 5ap-main3c.jpgచదువుకున్న ఈమెకు అత్తారింటి నుంచి వారసత్వంగా వచ్చిన పసుపు తాళ్లు తయారీ మాత్రమే తెలుసు. వివాహ సమయంలో వధువు మెడలో కట్టే పసుపుతాడే కుటుంబానికి జీవనాధారం. వీటికి క్రమంగా ఆదరణ తగ్గడం, వృత్తిలోనూ పోటీ పెరగడంతో ఎదుగూ బొదుగూ లేని జీవితాన్ని గడుపుతున్న పద్మావతికి ‘డిక్సన్‌’ కంపెనీ చేదోడుగా నిలిచింది. ఎల్‌ఈడీ టీవీ, సీసీ కెమెరాల రూపకల్పనలో శిక్షణ పొందిన పద్మావతి సహచర ఉద్యోగుల కంటే చురుగ్గా పనిచేస్తూ వచ్చే జీతంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది.
మొబైళ్ల తయారీలో గుర్తింపు
తిరుపతిలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన సంధ్య ఇంటర్మీడియట్‌ చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లోఉన్న 5ap-main3d.jpgకుటుంబానికి చేదోడుగా ఉండాలనుకున్న ఆమెకు అనేక అవరోధాలు ఎదురయ్యాయి. ఉద్యోగం కోసం.. హైదరాబాద్‌, బెంగళూరు వెళ్లేందుకు సిద్ధపడ్డా కుటుంబసభ్యులు వద్దన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను ‘సెల్‌కాన్‌’ రూపంలో అదృష్టం వరించింది. సంస్థ ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకున్న సంధ్య మొబైళ్ల తయారీలో ఎంతో గుర్తింపు పొంది.. ప్రస్తుతం సొంతూరులోనే ఉద్యోగం చేస్తోంది.
ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్‌ 1
5ap-main3b.jpg
* రేణిగుంటలో 128 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్‌(ఈఎంసీ)-1ను అభివృద్ధి చేసి వివిధ సంస్థలకు భూములు కేటాయించారు. సెల్‌కాన్‌కు 19.28 ఎకరాలు, కార్బన్‌ మొబైల్స్‌కు 15 ఎకరాలు, లావాకు 15 ఎకరాలు, సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్క్‌కు 2.28 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) బదలాయించింది. గత ఏడాది జూన్‌ 22న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సెల్‌కాన్‌ యూనిట్‌ రోజూ 15 వేల మొబైళ్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. వీటితోపాటు సెట్‌టాప్‌ బాక్సులు, పవర్‌ బ్యాంకులు, ట్యాబ్‌లు తయారు చేస్తున్నారు.
* ఇదే క్లస్టర్‌లో 15 ఎకరాల్లో చేపట్టిన కార్బన్‌ మొబైల్స్‌ తయారీ యూనిట్‌ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెలలో ప్రారంభించే ఇందులోనూ రోజూ 10 వేల నుంచి 15 వేల మొబైళ్ల తయారీకి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్క్‌లోనూ వివిధ పనుల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. లావా మొబైల్‌ యూనిట్‌ పనులు ఈ నెల నాలుగో వారంలో ప్రారంభించనున్నారు.
ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ క్లస్టర్‌ 2
వికృతమాల క్లస్టర్‌లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన డిక్సన్‌లో ఎల్‌ఈడీ టీవీలు, సీసీ కెమెరాలు తయారు చేస్తున్నారు. నెలకు 1.25 లక్షల నుంచి 1.50 లక్షల ఎల్‌ఈడీ టీవీలు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా నవ్యాంధ్ర బ్రాండ్‌ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాలకు 1,100 ఎల్‌ఈడీ టీవీలను డిక్సన్‌ సరఫరా చేసింది. వివిధ సంస్థల నుంచి ఆర్డర్లు పెరగడంతో యూనిట్‌ విస్తరణ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 5 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం ఏపీఐఐసీకి ఇటీవలే డిక్సన్‌ ప్రతిపాదనలు పంపింది. డిక్సన్‌కు నొయిడా, దేహ్రాదూన్‌లో ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ భారీ యూనిట్లు ఉన్నాయి. అదే స్థాయిలో ఇక్కడ కూడా తయారీ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.
5ap-main3g.jpg

ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలి
స్థానికులకు ప్రాధాన్యం కల్పించే ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలి. సెల్‌కాన్‌లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే 5ap-main3e.jpgకల్పించి ప్రోత్సహిస్తున్నారు. నేను చేసింది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ అయినా నెలకు రూ.15 వేల జీతం ఇస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తే ఎక్కువ జీతం రావొచ్చు. అక్కడ ఖర్చులతో పోల్చిచూస్తే ఇక్కడ ఇస్తున్న వేతనం ఎక్కువే. ఎందుకంటే ఇంటి అద్దె లేదు. సంస్థే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఇంతకంటే ఇంకేం కావాలి?
- జి.శ్రీధర్‌కుమార్‌, ప్రోగ్రాం ఇంజినీర్‌, సెల్‌కాన్‌
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వద్దనుకుని వచ్చా
స్థానికంగా ఉద్యోగం అంటే కుటుంబసభ్యులకు దగ్గరగా ఉండొచ్చన్న ఉద్దేశంతో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం 5ap-main3f.jpgవదిలేసి డిక్సన్‌లో చేరా. ప్రారంభం కావడంతో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నా క్రమంగా సర్దుకుపోతానన్న నమ్మకం ఉంది. బయట రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడే కంటే స్థానికంగా ఉద్యోగం ఎంతో మేలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇలాంటి యూనిట్లు మరిన్ని ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే గ్రామాల్లో నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది.
- గాలి మనోజ్‌కుమార్‌, ఇంజినీర్‌, డిక్సన్‌ కంపెనీ
Link to comment
Share on other sites

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

వస్తోంది హోలీటెక్‌!
06-08-2018 02:04:42
 
636691178808103479.jpg
  • తిరుపతిలో కర్మాగారం ఏర్పాటు
  • రూ.1,400 కోట్ల పెట్టుబడి
  • ఆరు వేల మందికి ఉపాధి
  • 660 కోట్లతో ‘బెస్ట్‌’ కంపెనీ కూడా
  • నేడు సీఎం సమక్షంలో ఒప్పందాలు
అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రానున్న మరో ప్రపంచ ప్రఖ్యాత ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ పేరు విశ్వసనీయంగా తెలిసింది. అది చైనాకు చెందిన హోలీటెక్‌ సంస్థ అని సమాచారం. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది. ఫలితంగా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది. అయితే ఇతర రాష్ట్రాలు కూడా దీనికోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దాని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం బయటకు వెల్లడించలేదు. హోలీటెక్‌ ప్రతినిధులు సోమవారమిక్కడ చంద్రబాబును కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
 
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలన్నీ.. అసెంబ్లింగ్‌ చేసేవి మాత్రమే. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. ఇప్పుడు తొలిసారి దేశంలో హోలీటెక్‌ రూపంలో ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ లాంటి ప్రసిద్ధ కంపెనీలు తరలిరాగా.. ఇప్పుడీ జాబితాలో హోలీటెక్‌ కూడా చేరింది.
 
మరోవైపు.. భారత్‌ ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ‘బెస్ట్‌’.. రాష్ట్రంలో బ్యాటరీల తయారీ కర్మాగారం పెట్టనుంది. రూ.660 కోట్లతో దీన్ని స్థాపిస్తారు. ఫలితంగా మూడేళ్లలో మూడువేల ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న లిథియం అయాన్‌ బ్యాటరీలకు భిన్నంగా ఈ కొత్త బ్యాటరీ ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. బ్యాటరీ పెట్టేందుకు పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదు. ఒక క్యూబిక్‌ మీటర్‌ స్థలంలోనే మెగావాట్‌ పవర్‌ ఉన్న బ్యాటరీని పెట్టుకోవచ్చు. ఆస్ర్టేలియాకు చెందిన ప్యాట్రిక్‌ గ్లిన్‌ దీనిని ఆవిష్కరించారు. సీఎం సమక్షంలో సోమవారం ఈ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నారు.
Link to comment
Share on other sites

ఏపీకి హోలీటెక్‌: 6వేల మందికి ఉపాధి

04483106BRK120-LOKESH.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే ఫోన్ల తయారీ కంపెనీలకు నెలవైన చిత్తూరు జిల్లాలో మరో కొత్త పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఫోన్ల విడిబాగాలను తయారుచేసే చైనా కంపెనీ హోలీటెక్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఒప్పందం ప్రకారం.. రూ.1400 కోట్లను హోలీటెక్‌ పెట్టుబడి పెట్టనుంది. మొత్తం 6 వేల మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తిరుపతిలో 75 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెలా 5 కోట్ల మొబైల్‌ విడి భాగాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించాలని హోలీ టెక్‌ కంపెనీ నిర్ణయించింది.

ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. దేశంలో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో 29 శాతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయని తెలిపారు. 240 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఏపీ నుంచే ఉత్పత్తి కావాలన్నది తమ లక్ష్యమని వివరించారు. ఏపీలో ఐదు రకాల వస్తువులను హోలీటెక్‌ తయారుచేస్తుందని తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు గురించి అనేక రాష్ట్రాలను సంప్రదించామని షామీ ఇండియా హెడ్‌ మనుజైన్‌ వివరించారు. ఏపీలో మాత్రమే నమ్మకమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. షామీ ఫోన్ల విడిభాగాలను హోలీటెక్‌ తయారు చేస్తుందని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
E-ప్రదేశ్‌!
20-08-2018 02:55:40
 
636703305423362710.jpg
  • ‘ఎలక్ట్రానిక్స్‌’లో రెండేళ్లలోనే మారిన సీన్‌
  • టాప్‌-3 కంపెనీల రాక.. సెల్‌ఫోన్ల తయారీలో దేశంలో నంబర్‌ 2
  • డీటీపీలో 9 వేల సీట్లు కేటాయింపు
  • మరో 2 వేల సీట్లకూ భారీ డిమాండ్‌
  • కొత్తవి ఏర్పాటు.. ఉన్నవి విస్తరణ
  • నెలాఖరుకు మరో 4 కంపెనీలు
  • రిలయన్స్‌ జియో ఫోన్లూ ఏపీలోనే!
  • వ్యూహాత్మకంగా సాగుతూ ముందుకు
  • హోలీటెక్‌ ప్రతినిధులకోసం ఓ విమానం
  • తిరుపతిలో చంద్రబాబు, లోకేశ్‌ భేటీ
  • భరోసా ఇచ్చిన తర్వాతే ఎంవోయూ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజనకు ముందు... సీమాంధ్రలో ఒక్కటంటే ఒక్క ఎలకా్ట్రనిక్‌ పరిశ్రమ లేదు! ‘నవ్యాంధ్రలో ఏముంది? ఒక పెద్ద నగరం లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. భారీ ఐటీ కంపెనీల చరిత్రా లేదు. మౌలిక సదుపాయాలూ అంతంత మాత్రమే! ఎలకా్ట్రనిక్‌ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎలా వస్తాయి?’’ అంటూ నిరాశపరిచే వ్యాఖ్యలు. ఈ పరిస్థితిని సర్కారు రెండేళ్లలోనే తిరగరాసింది. కంపెనీల దగ్గరకు నేరుగా వెళ్లడం, చర్చించడం, సత్వర అనుమతులపై భరోసా ఇవ్వడం... తదితర చర్యల ద్వారా పలు కంపెనీలను తీసుకొచ్చారు. వాటిని చూసి మరికొన్ని తరలి వచ్చాయి. వెరసి... ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ఏపీ దూసుకుపోతోంది. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో ఒక్క సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్‌ కూడా లేదు. ఇప్పుడు సెకనుకు నాలుగు ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఫోన్లు తయారుచేస్తున్న రాష్ట్రాల్లో కొత్తగా పుట్టిన ఏపీ రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ఎలక్ర్టానిక్స్‌లో ఫాక్స్‌కాన్‌, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వచ్చేశాయి. ఎలక్ర్టానిక్స్‌ తయారీలో పెద్ద కంపెనీ హోలీటెక్‌తో ఎంవోయూ కుదిరింది. కంపెనీ తన ఉత్పత్తిని వ చ్చే నెలలోనే తిరుపతి సమీపంలో ప్రారంభించేందుకు సిద్ధమైందని స మాచారం. సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌లాంటి సెల్‌ తయారీ కంపెనీలు రా ష్ట్రంలోనే తమ ఉత్పత్తుల్ని ప్రారంభించాయి. ఇక ఐటీలో హెచ్‌సీఎల్‌, ఫ్రాం క్లిన్‌ టెంపుల్టన్‌, పేటియం, కాన్‌డ్యుయంట్‌, ఏఎన్‌ఎ్‌సఆర్‌, జోహోలాంటి కంపెనీలు రాష్ట్రంలో అడుగుపెటా ్టయి. నెలాఖరులో మరో నాలుగు సం స్థలు ఏపీకి రానున్నాయి. ఒమిక్స్‌ ఇం టర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పల్సస్‌) విశాఖకు రానుంది. హెల్త్‌ జర్నల్స్‌కు సంబంధించిన టెక్నాలజీని అందించే ఈ కంపెనీ మూడువేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుందని సమాచారం. చిప్‌ డిజైనింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ‘సెరియం సిస్టమ్స్‌’ కూడా రాష్ట్రానికి రానుంది. ఇంటెల్‌కు ప్రధాన సరఫరాదారు ఈ కంపెనీయే కా వడం గమనార్హం. మరోవైపు ప్రముఖ బీపీవో సంస్థ ‘ఏజిస్‌’ విజయవాడలో తన కార్యాలయం ప్రారంభించనుంది. మావెరిప్‌ సొల్యూషన్స్‌ అనే కంపెనీ తిరుపతిలో వెయ్యి మంది ఉద్యోగులతో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది.
 
 
ఐటీ ‘సీట్లు’ ఫుల్‌
రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు ఏం చేయాలన్న కసరత్తు అనంతరం... కొన్ని విధానాలను కొత్తగా ప్రకటించారు. ఇందులో డీటీపీ పాలసీ ఒకటి. అంటే ‘డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌’. కంపెనీలకు నిర్మాణ స్థలం సమస్యను అధిగమించేందుకు, ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో కంపెనీలను ప్రారంభించేందుకు డీటీపీ విధానాన్ని తెచ్చామ ని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఈ విధానం కింద దాదాపు ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాలను విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నంలలో ఐటీ శాఖే తీసుకుంది. సగటున ప్రతి 75 చదరపు అడుగులకు ఒక సీట్‌ (కుర్చీ-కంప్యూటర్‌) చొప్పున ఏర్పాటు చేసింది. ఈ విధంగా సుమారు 11వేల సీట్లను ఏర్పాటుచేయగా... అందులో ఇప్పటికి 9 వేల సీట్లు నిండిపోయాయి. మిగతా 2 వేల సీట్లకు మించి ఇప్పటికే ఆఫర్లున్నా యి. ఈ విధానంలోనే విశాఖపట్నం మి లీనియం టవర్స్‌లో 2వేల సీట్లు కాన్‌డ్యుయెంట్‌కు కేటాయించారు. ఇక్కడ షిఫ్ట్‌లలో పనిచేయడం వల్ల ఒక్క సీటు సగటున ఇద్దరి వరకు ఉద్యోగాలు కల్పిస్తోం ది. కాన్‌డ్యుయంట్‌ తనకు కేటాయించిన 2వేల సీట్లకు... రెండు షిఫ్టుల్లో పనిచేసేలా 3,500ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఏఎన్‌ఎ్‌సఆర్‌ కంపెనీకి 1200సీట్లు ఇవ్వగా.. అది దాదాపు 4వేల మందికి ఉద్యోగాలిస్తోంది. ఇక్కడ మూడు షిఫ్టు ల్లో ఉద్యోగులు పనిచేసేలా ఆ కంపెనీ ప్రణాళిక వేసుకుంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కంపెనీకి భూకేటాయింపు, సొంత భవనం నిర్మాణం సమయం పట్టడంతో ప్రస్తుతానికి 197సీట్లు డీటీపీ విధానం కింద ఇచ్చారు. పాత్రా బీపీవోకు 800ల సీట్లు ఇవ్వగా 1600ల మందికి ఉద్యోగాలిస్తోంది. మొత్తంగా ఒక్క డీటీపీ విధానంలో ఇచ్చిన సీట్ల వల్లే 36వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగామని ఎపిటా సీఈ వో తిరుమలరావు చామళ్ల పేర్కొన్నారు. ఈ విధానంతో సంబంధం లేకుండా పలు కం పెనీలు వచ్చాయి. కంపెనీలకు వాటిస్థాయిని బట్టి, ఉద్యోగాల క ల్పనను బట్టి నేరుగా భూములు కేటాయిస్తున్నారు. అయితే ప్రతి కంపె నీ భూమి అడగడం ఒక సమస్యగా మా రిందని ఐటీ శాఖ పేర్కొంటోంది.
 
 
రిలయన్స్‌తో మరింత ఊపు
సెల్‌కాన్‌, డిక్సన్‌, కార్బన్‌ సెల్‌ఫోన్లు తిరుపతి సమీపంలో తయారవుతున్నాయి. ఫాక్స్‌కాన్‌ శ్రీసిటీలో ఉత్పత్తి చేస్తోంది. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌, హోలీటెక్‌తో ఒప్పందాలు కుదిరాయి. దీంతో ప్రపంచంలోనే పెద్ద ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ ల్లో 3 ఏపీకి వచ్చినట్లయుంది. వీటికితోడు రిలయన్స్‌ జియో ఉత్పత్తుల్లో 80శాతం ఏపీలోనే చేసేందుకు ఒ ప్పందం కుదుర్చుకుంది. దీనికోసం లోకేశ్‌ గతంలో ముం బై వెళ్లి ముఖేష్‌ అంబానీతో చర్చలు జరిపారు. తరువా త అంబానీ అమరావతికి వచ్చి చర్చించారు. తిరుపతి వద్ద 125 ఎకరాలు రిలయన్స్‌కు కేటాయిస్తున్నారు. దీనితో ఎలక్ర్టానిక్స్‌ తయారీ రంగానికి రాష్ట్రంలో మరింత ఊపు వస్తుంది. ‘‘43 అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ తీస్తే... ఏపీ నెంబర్‌వన్‌. అందుకే ఆ రాష్ట్రానికే కంపెనీల తొలి ఓటు’’ అని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పంకజ్‌ మహేంద్రో వ్యాఖ్యానించడం విశేషం!
 
పకడ్బందీ వ్యూహం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ కంపెనీని అడగాలి? అడిగితే కంపెనీలు వచ్చేస్తాయా? అనేదే ఇక్కడ కీలకం. ఇదంతా ఒక పద్ధతి, వ్యూహం ప్రకారం జరుగుతోంది. ఇప్పటికే ఉన్న ప్రధాన కంపెనీలు విస్తరణ ప్రతిపాదనలు చేస్తున్నాయా అనేది తెలుసుకుంటున్నారు. రకరకాల మార్గాలు, సంస్థలు, వ్యక్తులు, శ్రేయోభిలాషుల ద్వారా ఈ సమాచారం సేకరిస్తున్నారు. ఆ తర్వాత... వారిని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించాలంటే, ఆకర్షణీయమైన విధానాలుండాలి. దీనికి అనుగుణంగానే డీటీపీ విధానం, ఉద్యోగాలు కల్పించినందుకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో ఉన్న నైపుణ్య యువత, కల్పించే సౌకర్యాలు అన్నింటిపై సరికొత్త విధానాలు రూపొందించారు. ఆయా కంపెనీలను ఆహ్వానించే తీరులోను వైవిధ్యం ప్రదర్శిస్తోంది. ఉదాహరణకు యాపిల్‌ మినహా ఐదు అత్యంత ప్రసిద్ధ మొబైల్‌ తయారీ కంపెనీలకు విడిపరికరాలను అందించే హోలీటెక్‌ విషయానికి వస్తే... ‘మా రాష్ట్రానికి రండి’ అని ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు కూడా ఆ సంస్థను అడిగాయి. వాస్తవానికి నోయిడాలో ఇప్పటికే అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆ కంపెనీ వాళ్లు అక్కడికెళ్లి పరిశీలించారు. మరికొన్ని రాష్ట్రాలకూ వెళ్లారు. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌ వారికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించి తిరుపతికి తీసుకొచ్చారు. సీఎం, మంత్రి ఇచ్చిన హమీల ఫలితంగానే... హోలీటెక్‌ తిరుపతికి వచ్చింది.
 
 
ఐబీపీఎస్‌లో 11,200 సీట్లు
ఇండియా బీపీవో డెవల్‌పమెంట్‌ స్కీంను (ఐబీపీఎస్‌) ఉపయోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందుంది. దీనికింద గ్లోబల్‌ రెవెన్యూ సైకిల్‌ పార్ట్‌నర్స్‌-హెల్త్‌కేర్‌ కంపెనీకి 11,200ల సీట్లు కేటాయించేలా చేశారు. ఒక్కో సీటుకు 5వేలు సదరు కంపెనీ డిపాజిట్‌గా కేంద్రానికి కట్టాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్‌ను సదరు కంపెనీ ఇప్పటికే చెల్లించింది. ఈ కంపెనీకి సీట్ల కేటాయింపు కూడా ఏపీలో ప్రారంభించారు. వీటన్నింటినీ విశాఖలోనే ఇవ్వనున్నారు.
 
 
ఇదీ మా లక్ష్యం!
‘‘ఐటీలో ఫార్చ్యూన్‌-500కంపెనీల్ని కూడా ఏపీకి తేగలిగాం. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ఉద్యోగాలు పొందుతున్నవారిలో 75శాతం మహిళలే. అందరికంటే ముందే ఆలోచించడం, ఒకడుగు ముందుగానే వేయడం, అందరి టీం వర్క్‌తోనే ఇది సాధ్యమవుతోంది. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో 2024నాటికి 200 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల (సుమారు 14లక్షల కోట్లు) విలువైన ఎలక్ర్టానిక్‌ పరికరాలను ఏపీలో తయారయ్యేలా చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ప్రపంచానికే ఏపీని ఒక ఎలక్ర్టానిక్స్‌ తయారీ హబ్‌గా చేయాలన్న లక్ష్యాన్ని సాధిస్తాం’’
- ఐటీ మంత్రి లోకేశ్‌
Link to comment
Share on other sites

ఎలక్ట్రానిక్స్‌ తయారీలో ఏపీ సూపర్‌
27-08-2018 03:09:29
 
636709404622426397.jpg
విభజనతో విసిరిపడేశారు. ఎలాంటి సదుపాయాలూ లేవు. అలాంటి రాష్ట్రాన్ని చూస్తే ఎవరైనా బెంబేలెత్తిపోతారు. కానీ అనుభవం కలిగిన నాయకత్వం.. శూన్యం నుంచే ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రణాళికాబద్ధమైన చర్యలు ఆంధ్రప్రదేశ్‌ను ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాయి. ఏడుకొండలవాడి చల్లని దీవెనలతో తిరుపతి క్లస్టర్‌ వేల మందికి ఉపాధి కల్పించేలా ఎదిగింది. త్వరలోనే ఈ సంఖ్య లక్షకు చేరబోతోంది.
  • నంబర్‌ వన్‌ దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం
  • 15వేల కోట్ల రిలయన్స్‌ పెట్టుబడి.. 25వేల ఉద్యోగాలు
  • ఇప్పటికే దిగ్గజ కంపెనీల రాక
  • లక్షమంది ఒకేచోట పనిచేసేలా మెగా ఫ్యాక్టరీ తదుపరి లక్ష్యం
  • త్వరలో చైనా పర్యటనకు లోకేశ్‌
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగంలో రాష్ట్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఒకేచోట 14వేల మంది మహిళలు ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఒకేచోట లక్ష మంది పనిచేస్తే ఎలా ఉంటుంది? ఆ సంతోషం మాటలకు కూడా అందదు. ఈ దిశగా టీడీపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ కాదు కదా.. చిన్న ఎలకా్ట్రనిక్‌ వస్తువు తయారీ కూడా లేదు. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌ తయారీలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానానికి ఎదిగింది. దేశీయ కంపెనీ సెల్‌కాన్‌ నుంచి అంతర్జాతీయ కంపెనీ ఫ్లెక్స్‌ట్రాన్‌ వరకు రాష్ట్రానికి వచ్చాయి. దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్‌ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారయ్యే స్థాయికి చేరుకున్నాం. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎలకా్ట్రనిక్స్‌ తయారీ జోన్‌లో ఒకేచోట 14వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. త్వరలోనే రిలయన్స్‌ కంపెనీ కూడా రూ.15వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఏకంగా 25వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ క్రమంలోనే ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ భారీ లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. రాష్ట్రంలో తెలివైన, నైపుణ్యం కలిగిన యువత ఉండటంతో.. ఒకేచోట లక్ష మంది పనిచేసే మెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. చైనాలోని షెన్జెన్‌, తైవాన్‌లోని షింజు నగరాల్లో లక్షమంది ఒకేచోట పనిచేసే కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీని ఆకర్షించేందుకు త్వరలో చైనా వెళ్తున్నారు.
 
ఆగమేఘాలపై అనుమతులు
రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడమే కాకుండా.. వాటికి ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చింది. తిరుపతి సమీపంలో రెండు ఎలకా్ట్రనిక్‌ తయారీ జోన్లను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన భూమి, మౌలిక సదుపాయాలు కల్పించింది. సులభతర వ్యాపారంలో దేశంలోనే నంబరువన్‌గా ఉండటం, ఏపీకి వెళ్తే అన్ని అనుమతులు సత్వరం వచ్చేస్తాయి, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందనే భరోసా కల్పించారు. ఈ విఽధానం ఆకట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. తిరుపతి సమీపంలో రిలయన్స్‌ భారీ ఎలకా్ట్రనిక్స్‌ తయారీ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది.
 
రోజుకు 10లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, ఇతర వస్తువులను తయారు చేయబోతున్నారు. ఈ సంస్థను తీసుకొచ్చేందుకు గత ఏడాది అక్టోబరు నుంచీ మంత్రి లోకేశ్‌ తీవ్రంగా శ్రమించారు. త్వరలోనే కంపెనీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. డిక్సన్‌, కార్బన్‌ మొబైల్‌ లాంటి అనేక కంపెనీలు ఇప్పటికే తిరుపతి క్లస్టర్లలో ఉత్పత్తి ప్రారంభించాయి. తాజాగా హోలీటెక్‌ కూడా వచ్చి చేరనుంది. దేశంలోనే తొలిసారిగా ఏపీకి హోలీటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ తయారీ సంస్థ వచ్చింది. తిరుపతిలోని క్లస్టర్‌ రెండులో ఈ కంపెనీ కార్యక్రమాలు ప్రారంభించనుంది. రూ.1400కోట్ల పెట్టుబడితో 6వేల మందికి ఉపాధి కల్పించనుంది.
 
త్వరలో ఫ్లెక్స్‌ట్రానిక్స్‌
ప్రపంచంలోనే అతిపెద్ద ఐదు ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాష్ట్రంలో తన కార్యక్రమాలు ప్రారంభించనుంది. మొబైల్‌ ఫోన్లు, సర్క్యూట్‌ బోర్డ్‌ తదితర వస్తువులను తయారు చేయనుంది. వివిధ నగరాల నుంచి పోటీ ఉన్నా ఆ కంపెనీతో పలుమార్లు మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా అంగీకరింపచేశారు. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాకతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలు కూడా ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. చైనాలోని షెన్జెన్‌లో ఉన్న ఆస్ట్రల్‌ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. రూ.100కోట్ల పెట్టుబడితో వెయ్యిమందికి ఉపాధి కల్పించనుంది. సెల్‌ఫోన్ల తయారీయే కాకుండా వాటి డిజైన్‌ కూడా ఇక్కడే రూపొందించే కంపెనీలనూ రాష్ట్రానికి తీసుకొచ్చారు.
 
ప్రముఖ చిప్‌ డిజైనింగ్‌ కంపెనీ ఇన్వెకా్‌స వచ్చింది. అమరావతిలో ఈ కంపెనీ ఒక సెమీకండక్టర్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 5వేల హైఎండ్‌ ఉద్యోగాలు కల్పించనుంది. కాగా, విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగ హబ్‌గా, అమరావతిని పరిశోధన-అభివృద్ధి హబ్‌గా రూపొందించేందుకు పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పెంచాలన్న లక్ష్యంతో.. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విధానం 2018-20ని ఇటీవల లోకేశ్‌ తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఈ విధానం ద్వారా కృషి చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాలకు అవసరమైన చార్జింగ్‌ పాయింట్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని వినియోగించే వారికి రాయితీలు ఇవ్వడంతోపాటు త్వరలోనే స్మార్ట్‌ మొబిలిటీ కార్పొరేషన్‌ను నెలకొల్పనున్నారు.
Link to comment
Share on other sites

A.P. emerging as electronics hub as major firms step in

author-deafault.png Staff Reporter
Vijayawada, August 27, 2018 23:56 IST
Updated: August 27, 2018 23:56 IST
 

Many companies to set up units

Buoyed by the recent inking of a pact with Holitech, a leading Chinese manufacturer of compact camera modules supplying exclusively to smart phone maker Xiaomi, for the establishing of its unit at Tirupati, and many other done deals with the likes of Foxconn in his kitty, Minister for Information Technology Nara Lokesh is heading to China in September scouting for more investments in the electronics manufacturing sector.

According to official sources, the government’s objective is to make the State a hub for electronics manufacturing but not limit the scope to mobile phones. It targets to meet the requirement of even the defence establishments.

As part of this expansion binge in electronics manufacturing, the A.P. government had roped in Reliance Jio to set up its mobile phone and set-top box making unit near Tirupati in 125 acres.

 

Land allotment

Mr. Lokesh is in touch with senior executives of Reliance Industries to get the Jio project grounded at the earliest, having completed the land allotment and other formalities. Reliance Jio has already submitted its detailed project report.

Flextronics, a major player in designing, assembling and testing of printed circuit boards, is setting up its unit in the electronics manufacturing cluster at Tirupati.

Invecas, a leading semiconductor manufacturer, has also entered into an MoU with the State government and it is poised to materialise soon.

Besides, consumer electronics major Dixon, Celkon and Karbonn and a host of other companies are foraying into A.P.

A senior official in the Department of IT, Electronics and Communications said the government’s endeavour has been to develop Tirupati as the hub for electronics manufacturing and Visakhapatnam as a world-class destination for IT companies.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
తిరుపతిలో టీసీఎల్‌ పెట్టుబడులకు సంసిద్ధత 
ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సీఈవో మైకెల్‌ వాంగ్‌ 
మరో 15 కంపెనీలనూ తీసుకురావాలని కోరిన లోకేష్‌ 
ఈనాడు - అమరావతి 
20ap-main17a.jpg

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. చైనాకు చెందిన ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ టీసీఎల్‌ దేశంలోనే మొదటిసారి ఏపీలోని తిరుపతిలో తమ సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి లోకేష్‌ సమక్షంలో ఐటీ కార్యదర్శి విజయానంద్‌తో టీసీఎల్‌ కంపెనీ సీఈవో మైకెల్‌ వాంగ్‌ గురువారం ఒప్పందం చేసుకున్నారు.

ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు మా రాష్ట్రంలోనే.. 
చైనా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ షేన్జెన్లోలో గల టీసీఎల్‌ కంపెనీ సీఈవో మైకెల్‌ వాంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనువైన ప్రదేశమని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధానాలు అమలు చేస్తున్నామని, దేశంలో మూడు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని మంత్రి వివరించారు. టీసీఎల్‌తోపాటు విడి భాగాలు సరఫరా చేస్తున్న 15 కంపెనీలను కూడా తీసుకురావాలని కోరారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఈవో వాంగ్‌ తిరుపతిలో   కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌శాఖ సీఈవో భాస్కర్‌రెడ్డి, టీసీఎల్‌ కంపెనీ భారత ప్రాంతీయ సంచాలకులు భరద్వాజ్‌, టీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. బీజింగ్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదికపై గురువారం మంత్రి లోకేశ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, నాలుగో పారిశ్రామిక విప్లవం తదితర అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సాంకేతిక వినియోగంతో ప్రజలకు కల్పిస్తున్న మెరుగైన సదుపాయాలను మంత్రి వివరించారు.

టీసీఎల్‌ సంస్థ ప్రత్యేకతలు.. 
* టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్జుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీల్లో టీసీఎల్‌ ఒకటి. 
* ఏటా 80 లక్షల టీవీ ప్యానళ్లు తయారు చేస్తూ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 
* టీసీఎల్‌లో 75 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

Link to comment
Share on other sites

5 వేల కోట్ల పెట్టుబడి
02-10-2018 03:10:19
 
636740466181794637.jpg
  • ఎలక్ర్టానిక్స్‌ రంగంలో రాబడతాం
  • అవసరమైతే మళ్లీ చైనా వెళ్తా: లోకేశ్‌
  •  4న తిరుపతిలో డిక్సన్‌ ప్రారంభం
 
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్స్‌ రంగంలో రాష్ర్టానికి రూ.35వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 500 బిలియన్‌ డాలర్ల ఎలక్ర్టానిక్స్‌లో రాష్ట్రం నుంచే 250 బిలియన్‌ డాలర్ల విలువైనవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నామన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి లోకేశ్‌ విలేకరులతో మాట్లాడారు. తన 7 రోజుల చైనా పర్యటన విజయవంతమైందని చెప్పారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూచాంఫియన్‌ వార్షిక సమావేశాలు, ఇతర 40 సమావేశాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. బ్లాక్‌ చైన్‌, డ్రోన్‌ వంటి టెక్నాలజీతో రాష్ట్రంలో 4వ పారిశ్రామిక విప్లవం వస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్‌ రంగానికి షన్‌జన్‌ ఎలాగో తిరుపతి అలాగే ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా తయారవుతుందని చెప్పారు. అవసరమైతే 3, 4 నెలల్లో మళ్లీ చైనా వెళతానని, మరికొన్ని ఒప్పందాలు చేసుకువస్తానని తెలిపారు. ఈ నెల 4వ తేదీన డిక్సన్‌ ప్లాంట్‌ను తిరుపతిలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.
 
 
ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచంలో 2 స్థానంలో ఉన్న టీసీఎల్‌... ఏపీలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని, నవంబరు చివరివారంలో ఆ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ లోగా డీపీఆర్‌, 135 ఎకరాల భూమి కేటాయింపులు వంటి పనులు పూర్తి అవుతాయన్నారు. భాగస్వామ్య సదస్సులు, ఇప్పటి వరకూ జరిగిన ఎంవోయూల ద్వారా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. 1994లో ఐటీ రంగానికి ఎలా పేరు వచ్చిందో.. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌రంగానికి కూడా అలాగే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల లోపు 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటవుతాయన్నారు. తన పర్యటనపైన, సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనపైన అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.
Link to comment
Share on other sites

మరో టాప్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్లాంట్ రెడీ... ఈ నెల 4న డిక్సన్‌ ప్లాంట్‌ ప్రారంభం...

 

dixon-02102018-1.jpg
share.png

ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 500 బిలియన్‌ డాలర్ల ఎలక్ర్టానిక్స్‌లో రాష్ట్రం నుంచే 250 బిలియన్‌ డాలర్ల విలువైనవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నామన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి లోకేశ్‌ విలేకరులతో మాట్లాడారు. తన 7 రోజుల చైనా పర్యటన విజయవంతమైందని చెప్పారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూచాంఫియన్‌ వార్షిక సమావేశాలు, ఇతర 40 సమావేశాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. బ్లాక్‌ చైన్‌, డ్రోన్‌ వంటి టెక్నాలజీతో రాష్ట్రంలో 4వ పారిశ్రామిక విప్లవం వస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్‌ రంగానికి షన్‌జన్‌ ఎలాగో తిరుపతి అలాగే ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా తయారవుతుందని చెప్పారు. అవసరమైతే 3, 4 నెలల్లో మళ్లీ చైనా వెళతానని, మరికొన్ని ఒప్పందాలు చేసుకువస్తానని తెలిపారు.

 

dixon 02102018 2

ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచంలో 2 స్థానంలో ఉన్న టీసీఎల్‌... ఏపీలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒప్పందం చేసుకున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని, నవంబరు చివరివారంలో ఆ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ లోగా డీపీఆర్‌, 135 ఎకరాల భూమి కేటాయింపులు వంటి పనులు పూర్తి అవుతాయన్నారు. భాగస్వామ్య సదస్సులు, ఇప్పటి వరకూ జరిగిన ఎంవోయూల ద్వారా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. 1994లో ఐటీ రంగానికి ఎలా పేరు వచ్చిందో.. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌రంగానికి కూడా అలాగే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల లోపు 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటవుతాయన్నారు.

dixon 02102018 3

ఈ నెల 4వ తేదీన డిక్సన్‌ ప్లాంట్‌ను తిరుపతిలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. తిరుపతి రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో టీవీలు,సెక్యురిటి కెమెరాలుని డిక్సన్ కంపెనీ తయారు చేయ్యనుంది. త్వరలో సెల్ ఫోన్లు, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రారంభించేందుకు డిక్సన్ కంపెనీ రెడీ అవుతుంది. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో మొట్టమొదట కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీగా డిక్సన్ కంపెనీ పేరు తెచ్చుకుంది. మార్కెట్లోని వివిధ కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేసి ఇస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో 150 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అయితే 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

TCL in a statement announced to manufacture India’s first Google-certified Android QLED and AI TVs in Andhra Pradesh

 

Now Andhra switching gears to go further in electronics

 

brahmi-dance.gif

TCL to Set Up New TV Manufacturing Facility in Andhra Pradesh

TCL has partnered Andhra Pradesh government for the new plant

The manufacturing facility will be set up in Tirupati. The company says it plans to integrate QLED and AI tech Chinese consumer electronics firm TCL on Wednesday partnered with the Andhra Pradesh government to set up a new manufacturing facility in Tirupati.

The announcement underlines TCL's plans to introduce several smart entertainment solutions in the Indian market to fulfil the evolved entertainment sensibilities of the growing young consumer base, the company said in a statement.

The company is aiming to disrupt the premium home entertainment segment by introducing India's first Google-certified Android QLED TV on Amazon.in.

"Our partnership with the Andhra Pradesh government and the establishment of our Tirupati manufacturing unit would allow us to provide Indian consumers with innovative smart TVs driven by the latest cutting-edge QLED and AI technologies," Mike Chen, Country Manager-TCL India, said in a statement.

The announcement also marks the company's long-term vision of building localised capabilities in order to better cater to the growing market demand for home entertainment solutions across the country.

The Tirupati unit would enable TCL to actively contribute towards the "Make in India" initiative by generating substantial employment opportunities for the country's young workforce.

The firm has also tied up with large offline electronics retailers such as Croma, Reliance Digital and Vijay Sales, as well as major regional channel partners to build a robust, pan-India sales and distribution channel.

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

1 minute ago, Dravidict said:

But TCL isn't top 5 smartphone seller globally :thinking:

....xiaomi di TCL manufacture outsource ante adi kakapovachu as they are rivals....if both are different then double bonanza Dasara....

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...