Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

రూ.వెయ్యి కోట్లతో చిత్తూరు జిల్లాలో జియో ఇండస్ట్రీ
18-04-2018 14:43:22
 
636596594031719181.jpg
  • వికృతమాల వద్ద 141 ఎకరాల్లో పరిశ్రమ
  • భూసేకరణకు ఉత్తర్వులు జారీ
  • వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభం
  • రూ. 1000 కోట్ల పెట్టుబడి
  • 1500 మందికి తొలి దశలో ఉపాధి
 
తిరుపతి-శ్రీకాళహస్తి నడుమ ప్రాంతం ఎలక్ట్రానిక్‌ హబ్‌గా రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో మొదలయ్యాయి. కొత్తగా జియో పరిశ్రమ ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఏర్పాటు కాబోతోంది. ఇందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
 
 
శ్రీకాళహస్తి, చిత్తూరు: వికృతమాల వద్ద 141.21 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్‌ జియో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతన్నాయి. 1000కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో తొలి దశలో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నెలాఖరులోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని భూములు సేకరించాలంటూ ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఏర్పేడు మండలం వికృతమాల వద్ద 81.21 ఎకరాలను కేటాయిస్తున్నారు.
 
ఇందులో 26.60 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది.. మిగిలిన భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇక రేణిగుంట మండలంలోని కొత్తపాళెం పరిధిలో 60 ఎకరాల భూమిని ఈ పరిశ్రమ కోసం సేకరిస్తున్నారు. ఈ నెలాఖరు లోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి ఏపీఐఐసీ అధికారులకు అప్పగిస్తారు. ఆ తరువాత వారు ఈ భూమిని రిలయన్స్‌ జియో వారికి అప్పగిస్తారు. మే నెల నుంచి పరిశ్రమ పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
 
తూర్పు వెలుగులు
  • శ్రీసిటీలో హీరో పరిశ్రము పనులు వేగంగా జరుగుతున్నాయి.
  • రేణిగుంట వద్ద సెల్‌కాన్‌ పరిశ్రమ ఏర్పాటు చేశారు.
  • తొట్టంబేడు మండలం తాటిపర్తి వద్ద కజారియా పరిశ్రమ, రౌతుసూరమాల వద్ద గ్రీన్‌ప్లే పరిశ్రమ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
  • ఏర్పేడు మండలం పాగాలి సమీపంలో 150 ఎకరాల్లో హీరో కంపెనీకి చెందిన రాక్‌మాన్‌ టైర్ల పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

6 minutes ago, sonykongara said:
రూ.వెయ్యి కోట్లతో చిత్తూరు జిల్లాలో జియో ఇండస్ట్రీ
18-04-2018 14:43:22
 
636596594031719181.jpg
  • వికృతమాల వద్ద 141 ఎకరాల్లో పరిశ్రమ
  • భూసేకరణకు ఉత్తర్వులు జారీ
  • వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభం
  • రూ. 1000 కోట్ల పెట్టుబడి
  • 1500 మందికి తొలి దశలో ఉపాధి
 
తిరుపతి-శ్రీకాళహస్తి నడుమ ప్రాంతం ఎలక్ట్రానిక్‌ హబ్‌గా రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో మొదలయ్యాయి. కొత్తగా జియో పరిశ్రమ ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఏర్పాటు కాబోతోంది. ఇందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
 
 
శ్రీకాళహస్తి, చిత్తూరు: వికృతమాల వద్ద 141.21 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్‌ జియో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతన్నాయి. 1000కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో తొలి దశలో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నెలాఖరులోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని భూములు సేకరించాలంటూ ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఏర్పేడు మండలం వికృతమాల వద్ద 81.21 ఎకరాలను కేటాయిస్తున్నారు.
 
ఇందులో 26.60 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది.. మిగిలిన భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇక రేణిగుంట మండలంలోని కొత్తపాళెం పరిధిలో 60 ఎకరాల భూమిని ఈ పరిశ్రమ కోసం సేకరిస్తున్నారు. ఈ నెలాఖరు లోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి ఏపీఐఐసీ అధికారులకు అప్పగిస్తారు. ఆ తరువాత వారు ఈ భూమిని రిలయన్స్‌ జియో వారికి అప్పగిస్తారు. మే నెల నుంచి పరిశ్రమ పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
 
తూర్పు వెలుగులు
  • శ్రీసిటీలో హీరో పరిశ్రము పనులు వేగంగా జరుగుతున్నాయి.
  • రేణిగుంట వద్ద సెల్‌కాన్‌ పరిశ్రమ ఏర్పాటు చేశారు.
  • తొట్టంబేడు మండలం తాటిపర్తి వద్ద కజారియా పరిశ్రమ, రౌతుసూరమాల వద్ద గ్రీన్‌ప్లే పరిశ్రమ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
  • ఏర్పేడు మండలం పాగాలి సమీపంలో 150 ఎకరాల్లో హీరో కంపెనీకి చెందిన రాక్‌మాన్‌ టైర్ల పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

:super:

Link to comment
Share on other sites

  • 1 month later...

AP’s ‘Silicon Corridor’ gaining traction in manufacturing

 
Shaukat Mohammed | TNN | May 28, 2018, 22:31 IST
 
 
 
HYDERABAD: The Andhra Pradesh government’s bid to push a 92-km stretch between Sri City economic zone in Chittoor district and Tirupati as a ‘Silicon Corridor’ for the manufacturing sector is gaining traction with scores of small electronics production facilities, according to a senior government official.

Talking to ToI, J.A. Chowdary, special chief secretary and advisor (information technology) to the AP chief minister, said that while Sri City has emerged as the home to several large manufacturing units, including automobile units like Isuzu, the ‘Silicon Corridor’ was finding traction among electronic component manufacturers.

“Electronic component manufacturers prefer to locate their units close to their markets, because they can make a profit only through lower transportation costs. This is on account of the fact that electronic devices and components have become commoditized, and the main route to profit for such manufacturers is by cutting costs elsewhere like in the cost of logistics,” Chowdary said.

While Chowdary declined to give the specific number of units currently having or proposing to set up manufacturing units in the ‘Silicon Corridor’, he said that most of the such units would be providing entry-level jobs to local residents. “Companies in the Silicon Corridor have a ready pool of potential workers who can be trained in the assembly of electronic components,” he said.

According to Chowdary, ‘Silicon Corridor’ was in the process on creating an ecosystem for the manufacture of electronic components and devices like mobile phones. “Mobile phone assembly companies have set up their plants to assembly such phones in Tirupati. The assembly units employ locals who are trained in-house. This helps in providing employment to high school graduates,” he said.
 
 
 

Apart from electronic component manufacturers, several producers of specialty plastics were also in the process of setting up their production facilities in ‘Silicon Corridor’, he said.
 
 
 

Tirupati has emerged as a key manufacturing hub in southern India with business groups like Amara Raja setting up world class production units in and around the town at the foot of the temple town of Tirumala.

Top Comment

any big names in industry or just fake companies floated by Mr Naidu to pump his loot back to make it white.abcd

 

 


Amara Raja Batteries Ltd — in partnership with Johnson Controls, Inc., with which it has a 20-year association — commissioned a two-wheeler battery manufacturing unit at the Amara Raja Growth Corridor in neighbouring Chittoor district, in December last year. The first phase of the unit has an installed capacity of 5 million units per annum. ARBL will be eventually investing Rs 700 crore in a second unit, which will increase the unit’s capacity to 17 million units. The two-wheeler battery unit of ARBL, the flagship of the Amara Raja group, will be employing 1,300 at full capacity.

 

 

 


Besides manufacturing units, the software sector too appears to be finding value in setting up development centres in Tirupati. In January this year, Zoho, a software products company, set up a development centre in Renigunta near Tirupati, which aims to employ 150 software specialists, all recruited from Tirupati.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎలక్ర్టానిక్స్‌లో భవిష్యత్‌ లీడర్‌ ఏపీనే
09-06-2018 02:48:32
 
636641093207143213.jpg
  • ఇక్కడ ఏటా 6 కోట్ల మొబైల్‌ ఫోన్ల తయారీ
  •  ఈ రంగంలో పెట్టుబడులకు అత్యుత్తమం
  •  తిరుపతిలో త్వరలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌
  •  ఇండియన్‌ సెల్యులార్‌ సంఘం అధ్యక్షుడు పంకజ్‌ మహేంద్రో
అమరావతి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘మన దేశం ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ర్టానిక్స్‌ పరికరాల విలువ ఎంతో తెలుసా! అక్షరాలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇది 10 లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు, దేశంలో ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులను పెంచేందుకు భారీ ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రక్రియకు ఆంధ్రప్రదేశే కీలకం కానుంది’ అని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పంకజ్‌ మహేంద్రో అన్నారు. తిరుపతిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మహేంద్రో శుక్రవారం అమరావతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
ఏపీ... వేగంగా
ఆంధ్రప్రదేశ్‌ గత నాలుగేళ్లలో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాల ఉత్పత్తిలో అత్యంత పురోగతి సాధించింది. ఏటా 6 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అత్యధిక తయారీ రాష్ర్టాల్లో రెండో స్థానానికి ఎగబాకింది. అంతే కాదు... భారత్‌లో ఎలక్ర్టానిక్స్‌ తయారీ పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగానూ నిలిచింది. సుపరిపాలన, నాయకత్వం, విశ్వసనీయత, ఉద్యోగుల లభ్యత, శాంతిభద్రతలు తదితర 43 అంశాల్లో పాయింట్లు కేటాయిస్తే అందులో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది.
 
తిరుపతిలో మరో భారీ ఈఎంసీ
దేశంలో ప్రస్తుతం ఏటా 22.5 కోట్ల సెల్‌ఫోన్లు తయారవుతున్నాయి. 2019 నాటికి దాన్ని 50 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ వద్ద నోకియా సెజ్‌ను మూసేయడంతో 25 వేల మందికి ఉద్యోగాలు పోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనకు అత్యధిక పాయింట్లు లభిస్తున్నాయి. తిరుపతి-శ్రీకాళహస్తి జోన్‌కు పలు సెల్‌ఫోన్‌ కంపెనీలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌ లాంటి అతిపెద్ద కంపెనీని తీసుకురాగలిగింది. పలు ఇతర సెల్‌ఫోన్‌ కంపెనీలూ వచ్చాయి. దీంతో రాబోయే కాలంలో దిగ్గజ సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీ రంగ సంస్థల్ని ఆకర్షించేందుకు ఒక మార్గం ఏర్పడింది. ఏపీ పురోగతి దేశానికీ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో తిరుపతిలో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. సెల్‌ఫోన్లపై పరిశోధన, లేటెస్ట్‌ డిజైన్లపై ఇది దృష్టిపెడుతుంది. మరోవైపు ఇప్పటికే తిరుపతి సమీపంలో వెంకటేశ్వర ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్‌ (ఈఎంసీ)ని ఏర్పాటుచేయగా.. పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇలాంటి మరో భారీ ఈఎంసీని ఆ సమీపంలోనే ఏర్పాటుచేయబోతున్నాం.
 
 
భారీ నగరం లేకపోవడం ఏపీ మైనస్‌
ఈ నాలుగేళ్లలో సెల్‌ఫోన్‌ తయారీ రంగంలో ఏపీ సాధించిన పురోగతి, ఆకర్షించిన పెట్టుబడులు అద్భుతం. అయితే ఈ రాష్ట్రంలో ఒక భారీ నగరం లేకపోవడం మైనస్‌. సెల్‌ఫోన్ల తయారీలో నంబర్‌వన్‌గా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు నోయిడా నగరం ఉంది. అలాగే కర్ణాటకకు బెంగళూరు ఉంది. అయితే ఇది ప్రతికూలాంశమైనా ఈ నాలుగేళ్లలో దిగ్గజ సెల్‌ఫోన్‌, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలను తీసుకురావడంలో ఏపీ విజయం సాఽధించింది. భవిష్యత్తులో ఈ రంగంలో చైనాను ఢీకొట్టే అవకాశం ఏపీకి ఉంది. ప్రపంచంలో అత్యధిక సెల్‌ఫోన్లు తయారుచేసే దేశాల్లో ఇటీవలే భారత్‌ రెండోస్థానంలోకి వచ్చింది. వియత్నాంను అధిగమించి ఈ స్థానం దక్కించుకుంది. అయితే నెంబర్‌వన్‌గా కావడమే లక్ష్యం. దానికి ఏపీనే కీలకం.
Link to comment
Share on other sites

తిరుపతిలో ఎక్స్‌లెన్స్‌ కేంద్రం
ఐసీఏ అధ్యక్షుడు పంకజ్‌ మొహింద్రో
8busi8a.jpg

ఈనాడు అమరావతి: మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహం, మౌలిక వసతులు వంటి 43 అంశాల ప్రాతిపదికగా తమ సంస్థ రూపొందించిన ‘కాంపిటీటివ్‌ ఇండెక్స్‌’లో ఆంధ్రప్రదేశ్‌ మూడేళ్లుగా దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోందని ఇండియన్‌ సెల్యులర్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) అధ్యక్షుడు పంకజ్‌ మొహీంద్రో వెల్లడించారు. అయితే చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడేందుకు ఇంకా ఎన్నో రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొబైల్‌ ఫోన్ల డిజైన్లు, ఇన్‌క్యుబేషన్‌, టూలింగ్‌కు సంబంధించి తిరుపతి సమీపంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.  తిరుపతి, శ్రీసిటీ ప్రాంతం ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, మొబైల్‌ ఫోన్ల తయారీకి ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో దేశీయంగా ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉందన్నారు. గ్రేటర్‌ నోయిడా, ముంబయి, బెంగళూరు వంటి రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడిన ఏపీకి చాలా ప్రతికూలతలు ఉన్నా... మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్ని ఆకర్షించేందుకు చాలా కృషి చేస్తోందని, అది సత్ఫలితాలనూ ఇస్తోందని వివరించారు. దేశంలో అన్ని వసతులతో కూడిన పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తమకు చిరకాల మైత్రి ఉందని, ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రానికి ఫాక్స్‌కాన్‌ పరిశ్రమను తీసుకురావడానికి చాలా కృషి చేశామని చెప్పారు. ఫాక్స్‌కాన్‌, తిరుపతి సమీపంలో శ్రీ వేంకటేశ్వర ఈఎంసీ వంటివి వచ్చాక... మొబైల్‌ తయారీ పరిశ్రమల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. శ్రీసిటీని బాగా నిర్వహిస్తున్నారని, అలాంటి ఇండస్ట్రియల్‌ పార్కులు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పన్ను విధానం వ్యాట్‌ నుంచి జీఎస్టీకి మారే క్రమంలో మొబైల్‌ తయారీ పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వాటిని పరిష్కరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.

Link to comment
Share on other sites

చిత్తూరు జిల్లాలో లిథియం అయాన్‌ సెల్స్‌ ప్రాజెక్టు
12-06-2018 00:03:21
 
న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లలో విరివిగా వినియోగిస్తున్న లిథియం అయాన్‌ సెల్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్టు ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసిఎ) తెలిపింది. మునోత్‌ ఇండస్ర్టీస్‌ ఈ మేడ్‌ ఇన్‌ ఇండియా లిథియం అయాన్‌ సెల్స్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఎలక్ర్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతోందని, దీని కోసం కంపెనీ 799 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. 2019 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టు మొదటి విడత పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టు వల్ల 1,700 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మొదటి విడతలో పెట్టుబడి 165 కోట్ల రూపాయలు ఉంటుందని, రోజుకు ఉత్పత్తి సామర్థ్యం రెండు లక్షల యాంపియర్‌ హవర్‌ (ఎహెచ్‌) వరకు ఉంటుందని ఐసిఎ పేర్కొంది.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీల తయారీ ఏప్రిల్‌ నుంచి
మూడు దశల్లో రూ. 799 కోట్ల పెట్టుబడులు
దిల్లీ: లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తి దేశీయంగా 2019 ఏప్రిల్‌ నాటికి ప్రారంభమవుతుందని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మునోథ్‌ ఇండస్ట్రీస్‌ మూడు దశల్లో రూ.799 కోట్లతో తొలి లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశ నుంచి ఏప్రిల్‌ 2019 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐసీఏ వెల్లడించింది. రూ.165 కోట్లతో ప్రాజెక్టు తొలి దశలో రోజుకు 2,00,000 ఏహెచ్‌ (ఆంపియర్‌ అవర్‌) ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు దశలు పూర్తయితే రోజుకు 10 లక్షల ఏహెచ్‌ ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంటు సొంతమవుతుంది. ప్రస్తుతం లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌ను దిగుమతి చేసుకొని భారత్‌లో బ్యాటరీ ప్యాక్‌లను అసెంబుల్‌ చేస్తున్నారు. ఇప్పటివరకూ భారత్‌లో లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌ తయారీకి ప్లాంటు లేదు. మునోథ్‌ ఇండస్ట్రీస్‌ ఒక్కటే ఇప్పుడు ఈ రంగంలో ఉంది. ఇదిలా ఉంటే దేశంలో 20 బ్యాటరీ ప్యాక్‌ అసెంబ్లింగ్‌ యూనిట్లు ఇప్పటికే ఉన్నాయి.
 
 
 

ప్రధానాంశాలు

 
Link to comment
Share on other sites

ఈఎంసీ-2 అభివృద్ధికి ఆమోదం
మౌలిక వసతుల కల్పనకు రూ.30 కోట్లు
మంత్రిమండలిలో నిర్ణయం
ఈనాడు-తిరుపతి : తిరుపతి పరిసర ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే రేణిగుంట పరిసర ప్రాంతంలో చరవాణి కంపెనీలు తమ పరిశ్రమలను స్థాపించాయి. మరోవైపు విమానాశ్రయానికి అవతలి వైపు ఉన్న వికృతమాల ప్రాంతంలో మరో ఈఎంసీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కంపెనీలు అక్కడ పరికరాల ఉత్పత్తిని ప్రారంభించాయి. త్వరలో ఇక్కడ మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించే విధంగా చర్యలు తీసుకునేందుకు మంగళవారం మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేణిగుంటలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా సుమారు 150 ఎకరాల్లో శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెల్‌కాన్‌ సంస్థ తమ చరవాణులను ఉత్పత్తి చేస్తోంది. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే అక్కడ తమ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అదనంగా విమనాశ్రయానికి అవతలివైపు సుమారు 322 ఎకరాల్లో ఈఎంసీ-2ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రభుత్వం తరఫునే కొన్ని నిర్మాణాలు చేశారు. తద్వారా ఇప్పటికే డిక్సన్‌తోపాటు కొన్ని కంపెనీలు తమ పరిశ్రమలను నెలకొల్పాయి. మరికొన్ని కంపెనీలు పరిశ్రమ స్థాపనకు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో అక్కడ మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో వసతుల కల్పనకు సుమారు రూ.30.27 కోట్లు ఖర్చు చేసేందుకు ఐటీఈ అండ్‌ సీ శాఖకు నిధులు కేటాయించేందుకు ఆమోదించారు.  ఇక్కడ వసతులు ఏర్పడితే సుమారు రూ.2827.5 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా సుమారు 52,930 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తోంది. మంత్రిమండలి సైతం ఈఎంసీ-2 అభివృద్ధికి ఆమోదముద్ర వేయడంతో రానున్న రోజుల్లో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు మరింత వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు

 
Link to comment
Share on other sites

వచ్చే ఆరు నెలల్లో, మన రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే, 15 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇవే...

Super User
03 July 2018
Hits: 39
 
electronics-03072018.jpg
share.png

విభజన అనంతరం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఆర్థిక పరంగానూ, ఉపాధి పరంగానూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోంది. కేవలం ఆరునెలల వ్యవధిలో దాదాపు 15 కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందినవి కావడం విశేషం. పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించడం, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడం, కేవలం నెల రోజుల వ్యవధిలో అనుమతులిచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం వంటి కార్యక్రమాలతో ఇవన్నీ సాధ్యపడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, అనుమతులు ఇవ్వడం ఒకెత్తయితే, ఈ కంపెనీల ఏర్పాటుకు భూ కేటాయింపులు మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగిన నేపద్యంలో ఈ కంపెనీలు కోరిన విధంగా భూములు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరకంగా తలకుమించిన భారమే.

 

electronics 03072018 2

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కష్టాలను వెరవక భూ కేటాయింపులకు ప్రత్యేక డ్రైవ్ పెట్టి మరీ పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తూ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. గత నాలుగేళ్లుగా అనేక దఫాలుగా చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పటికీ అవన్నీ కార్యరూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్న ఆయా కంపెనీలు రెండు నుండి ఆరు నెలల వ్యవధిలో తమ సంస్థల కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.24,802 కోట్ల పెట్టుబడులతో వచ్చే సంస్థల్లో 82, 750 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే 13,900 మందికి ఉపాధి కల్పించినట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ నివేదికను రూపొందించారు.

electronics 03072018 3

వచ్చే ఆరు నెలల్లో, కొత్తగా ఏర్పాటు కాబోయే సంస్థల్లివే...స్పెక్షం ఇల్యూమినస్ అనే ఎల్ఈడీ బల్బులు తయారుచేసే సంస్థ రెండు నెలల్లో తమ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. అదేవిధంగా ఆర్క్ సిస్టమ్స్ అనే ఎనర్జీ మీటర్ల తయారీ సంస్థ రెండు నెలల్లోనూ, సంజ్యాన్ జియాన్ ఎలక్ట్రానిక్స్ అనే ఛార్జర్ల కంపెనీ మూడు నెలల్లోనూ, పారామౌంట్ అనే మెకానిక్ సంస్థ 3నెలల్లోనూ, పీజీ ప్లాస్ట్ అనే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 5 నెలల్లోనూ, ఐజేఏ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీలను తయారుచేసే సంస్థ 5 నెలల్లోనూ, జియామన్ ప్రెసిసన్ అనే కొలతల పరికరాల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, సిగ్టఫుల్ అనే మెడికల్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, విస్టియన్ అనే ఆటో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ సంస్థ 6 నేలల్లోనూ, డబ్ల్యూయూఎస్ ప్రింటెడ్ సర్క్యూట్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, నోబుల్ మౌల్డ్ అనే ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, అప్లైడ్ మెటీరియల్స్ అనే నానోటెక్ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, వర్త్ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ తమతమ కంపెనీల ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

Link to comment
Share on other sites

రాష్ట్రానికి మరో ఎలక్ట్రానిక్‌ కంపెనీ
తిరుపతిలో ఏర్పాటుకు ఆస్ట్రమ్‌ సంస్థ అంగీకారం
4ap-state4a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఆస్ట్రమ్‌ ముందుకొచ్చింది. తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ తయారీ సముదాయం (క్లస్టర్‌)లో కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రస్తుతం చైనాలోని షెన్‌జేన్‌లో ఉన్న సంస్థ కర్మాగారంలో ఆడియో పరికరాలు, ఎల్‌ఈడీ లైట్లు, సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ విడిభాగాలు, గేమ్‌ కంట్రోలర్లు వంటి ఎలక్ట్రిక్‌ పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. బుధవారం సచివాలయంలో ఆస్ట్రమ్‌ సంస్థ సీఈవో మనోజ్‌ కుమార్‌, డైరెక్టర్‌ అలోక్‌ మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఐటీశాఖ కార్యదర్శి విజయానంద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా మారుతోంది. విభజన సమయానికి రాష్ట్రంలో ఒక్క మొబైల్‌ ఫోన్‌ కూడా తయారు కాలేదు. కేవలం నాలుగేళ్లలో దేశంలో తయారవుతున్న ప్రతి 100 ఫోన్లలో 26 ఏపీలోనే తయారవుతున్నాయి’’ అని వివరించారు. త్వరలోనే కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఆస్ట్రమ్‌ కంపెనీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
సెల్‌కాన్‌ కంపెనీకి పారిశ్రామిక ప్రోత్సాహకాలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: సెల్‌కాన్‌ ఇంపెక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. టాబ్లెట్స్‌, సెటాప్‌ బాక్సులు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీపై ప్రోత్సాహకాలు ప్రకటించింది.   ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ విధానంలో భాగంగా ఈ ప్రోత్సాహకాలను ఇస్తూ జీవోను జారీ చేసింది.
Link to comment
Share on other sites

తిరుపతిలో రిలయన్స్‌ ఎలక్ట్రా‌నిక్‌ సెజ్‌
02-08-2018 03:42:37
 
636687781579605267.jpg
  • 80 శాతం జియో ఫోన్లు అక్కడే తయారీ.. 125 ఎకరాల భూమి కేటాయింపు
  • అమరావతిలో 10 ఐటి కంపెనీలు ప్రారంభం
అమరావతి (ఆంధ్రజ్యోతి): మంగళగిరి ఐటి పార్కు, గన్నవరం మేధా టవర్స్‌, విజయవాడల్లో ఏర్పాటుకాబోయే 10 ఐటి కంపెనీలను బుధవారం తాడేపల్లిలోని ఎపిఎన్‌ఆర్‌టి భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐటి మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటి రంగ ప్రగతిపై మాట్లాడారు. ఎన్నికల నాటికి ఐటిలో లక్ష మందికి, ఎలక్ట్రా‌నిక్స్‌లో 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతిలో రిలయన్స్‌ ఎలక్ట్రా‌నిక్స్‌ సెజ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ డిపిఆర్‌ సమర్పించిందన్నారు. 125ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తామన్నారు. రిలయన్స్‌ తయారుచేసే జియో ఫోన్లు, టీవీలు, సెట్‌టాప్‌ బాక్సుల్లో 80ు ఇక్కడే తయారవుతాయన్నారు. ఆనాడు రాళ్లు, రప్పల మధ్యలో చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించారన్నారు. ఇప్పుడు ఎపిలో ఐదు సైబరాబాద్‌లు ఏర్పాటుచేయాలని, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నవాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలని సిఎం దిశానిర్దేశం చేశారని లోకేశ్‌ తెలిపారు. కాగా, వివిధ కంపెనీలు, సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వాస్తవ రూపంలో తీసుకురావడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉందని లోకేశ్‌ తెలిపారు. 216 ఒప్పందాలను అమలు చేసి గుజరాత్‌ నంబర్‌వన్‌గా ఉంటే, 214 ఒప్పందాలను అమలు చేసి ఏపీ రెండోస్థానంలో ఉందన్నారు.
 
సోమవారం భారీ ప్రకటన
సోమవారం ఒక భారీ ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీతో ఒప్పందం ఉండనుందని లోకేష్‌ తెలిపారు. ప్రపంచంలోని 4 పెద్ద ఎలక్ట్రా‌నిక్స్‌ కంపెనీలను ఎపికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటికే కొన్ని వచ్చాయని, మిగిలినవీ రాబోతున్నట్లు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ఏపిలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ... 1400 కోట్ల పెట్టుబడి, 6 వేల ఉద్యోగాలు... 6 వ తారీఖున ఎంఓయి...

 

company-04082018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ కి మరో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ రాబోతోంది. ఇప్పటి వరకూ మన దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కానీ మొదటి సారి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ రాబోతుంది. ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ తయారీ లో వినియోగించే కెమెరా మాడ్యూల్స్,టిఎఫ్టి స్క్రీన్స్ తయారు చెయ్యబోతుంది. తిరుపతిలో ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో ఏర్పాటు కాబోతోంది. రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంది. 1400 కోట్ల పెట్టుబడి ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టనుంది. నేరుగా 6 వేల మందికి ఈ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ కంపెనీ మొదటి సారి మన దేశంలో పెట్టుబడి పెట్టబోతుంది. అధునాతన సాంకేతికత,పరిశోధన మరియు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు కంపెనీ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డేవేలప్మెంట్ కూడా ఈ కంపెనీ ఏర్పాటు చెయ్యబోతుంది...

 

ఢిల్లీ లోని నోయిడా రీజియన్,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి తీవ్రమైన పోటీ ఎదురైన కంపెనీ చివరికి ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గుచూపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ బృందం ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు రెండుసార్లు చైనాకి పర్యటించింది. మరో సారి మంత్రి నారా లోకేష్ స్వయంగా కంపెనీ ప్రతినిధులని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించి ఆంధ్రప్రదేశ్ కి రావాలి అని ఆహ్వానించారు. ఈ కంపెనీ దేశంలో ఉన్న అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు విడిభాగలు సప్లై చేసే అవకాశం ఉంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఆగస్ట్ 6 వ తారీఖున ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి సమక్షంలో అనంతరం ముఖ్యమంత్రి గ్రీవెన్ హాల్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఈ ప్రెస్ మీట్ లో కంపెనీ ప్రతినిధులు పాల్గొని కంపెనీ ఏర్పాటు వివరాలు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 20 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ లో 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.మరో పక్క తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో సెల్ కాన్,డిక్సన్ ప్రారంభం అయ్యాయి.త్వరలోనే కార్బన్ కూడా ప్రారంభం కాబోతోంది.రిలయన్స్ జియో సమగ్ర ప్రొజెక్ట్ రిపోర్ట్ తయారు అయ్యింది.125 ఎకరాల్లో జియో మొబైల్స్,ఎలక్ట్రానిక్స్ తయారీ మెగా కంపెనీ త్వరలోనే ఏర్పాటు కాబోతోంది.

ఇటీవల కాలంలోనే ఫ్లెక్స్ ట్రానిక్స్,ఇన్వెకాస్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి.అలాగే లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది...ఈ రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.అనేక కంపెనీల ప్రతినిధులను దేశంలోని వివిధ నగరాలు,వివిధ దేశాల్లోనూ,వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులోనూ వివిధ కంపెనీలను కలిసి రాష్ట్రం గురించి వివరించారు.దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.వచ్చే నెల నుండి ప్రతి నెలా ఒకటి లేదా రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రానున్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం.ఎంఓయూ కన్వెర్షన్ లో దేశంలో నెంబర్ 2 లో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.... ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపథ్యంలో ఈ కంపెనీ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి...6 వ తారీఖున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కార్యక్రమంలో కంపెనీ వివరాలు వెల్లడించనున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...