Jump to content

NTR Housing Scheme


Recommended Posts

పదేళ్ల కాంగ్రెస్ హయాంలో కట్టామన్న 4 లక్షల ఇళ్లు అడ్రస్ దొరకటంలేదు ...కేసులు పెట్టామ్

వచ్చే ఏడాది మార్చికి...19లక్షల ఇళ్ల నిర్మాణమ్ పూర్తి చెయ్యాలి అయినా కూడా ..ఇంకా 20లక్షల మంది ..ఇళ్లు లేని వాళ్లుంటారని అంచనా

https://pbs.twimg.com/media/DczyzC4VMAA8GfL.jpg

Link to comment
Share on other sites

దేశంలో ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు.

కర్నూలు శివారులోని జగన్నాధ గట్టు పై నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహాలను ఆయన శనివారం పరిశీలించారు. రాష్జ్త్రంలోని అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 6 లక్షల 81 వేల ఇల్లు, జీ+3

https://pbs.twimg.com/media/Dcldf1bUwAALgW2.jpg

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి డా. పి. నారాయణ గారు గుంటూరు మునిసిపల్ కమిషనర్ తో కలిసి గుంటూరులోని అడవి టేకుల పాడులో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ సముదాయాల్ని పరిశీలించారు. ఈ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

https://pbs.twimg.com/media/DdPvGsuUQAATnlW.jpg

https://pbs.twimg.com/media/DdPvGsvU0AETr6S.jpg

Link to comment
Share on other sites

గామన్‌ వంతెన.. విద్యుత్‌కాంతులతో ధగధగ
19ap-state7a.jpg

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న గామన్‌ వంతెన రాత్రివేళల్లో విద్యుత్‌ కాంతులతో ఇలా ధగధగలాడుతోంది. సుమారు 4 కి.మీ.ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ దీపాలు రాత్రివేళల్లో ఇలా తళుకులీనుతున్నాయి. దిగువన గోదావరి నదిలోనూ ఈ కాంతుల తాలూకూ సోయగాలు ప్రతిబింబిస్తుండటంతో.. ఆ ప్రాంతమంతా మరింత శోభాయమానంగా కనిపిస్తూ చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

- ఈనాడు, ఏలూరు
Link to comment
Share on other sites

ఏపీకి 56వేల ఇళ్లు మంజూరు
01-06-2018 02:29:06
 
636634169530291384.jpg
న్యూఢిల్లీ/అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద మలి విడత ఇళ్ల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు అధిక ప్రాధాన్యం లభించింది. మొత్తం 10 రాష్ట్రాలలో రూ.7,227 కోట్లు వ్యయంతో, 1.50లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీటిలో మన రాష్ట్రానికి అత్యధికంగా 56,512 ఇళ్లు కేటాయించింది. వీటిని 22 నగరాల్లో రూ.3,184 కోట్లతో నిర్మిస్తారు. కేంద్రం తన వాటాగా రూ.848 కోట్లను ఇస్తోంది. మిగిలిన వాటిలో ఉత్తరప్రదేశ్‌కు 26060, మధ్యప్రదేశ్‌కు 17920, మహారాష్ట్రకు 13506, జార్ఖండ్‌కు 14520, ఛత్తీస్ గఢ్‌కు 7615, రాజస్థాన్‌కు 6576, ఒడిశాకు 4849, పంజాబ్‌కు 1909, అస్సోంకు 1520 ఇళ్లను కేటాయిస్తూ ‘కేంద్ర మంజూరు, పర్యవేక్షక కమిటీ’ 34వ సమావేశం నిర్ణయించింది.
 
 
దీనితో దేశంలో పీఎంఏవై కింద నిర్మిస్తున్న మొత్తం గృహాల సంఖ్య 47లక్షల 52వేల 751కు చేరింది. పథకం ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు విస్పష్ట ప్రతిపాదనల రూపకల్పన, చురుగ్గా సాగేలా మంజూరైన ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారించారు. దీనితో ఈ సారి రాష్ట్రానికి అత్యధికంగా చవక గృహాలు మంజూరయ్యాయి.
Link to comment
Share on other sites

ఉందిలే మంచి కాలం ముందుముందునా!
పట్టణ పేదల సొంతింటి కల సాకారం
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో సాధ్యం
రాజధాని జిల్లాల్లో 1,07,538 ఇళ్ల నిర్మాణం
గుడివాడ, న్యూస్‌టుడే
amr-top2a.jpg
రాజధాని జిల్లాల్లో పట్టణీకరణ పెరుగుతోంది. ఉపాధి కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపారాల నిమిత్తం పట్టణాల బాట పడుతున్న వారి సంఖ్య ఏటేటా అధికమవుతోంది. దీంతో జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా ఇళ్లకు గిరాకీ ఏర్పడింది. గ్రామాల నుంచి వలస వచ్చిన వారు, ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారు భారమైనా అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కొందరు ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో చిన్నపాటి గుడారాలు ఏర్పాటు చేసుకొని ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలతో పేదలు సొంతిల్లు నిర్మించుకునే పరిస్థితి పట్టణాల్లో కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వమే పేదలకు సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని  సంకల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.లక్షల్లో రాయితీలిస్తూ పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తున్నాయి. సదరు ఇళ్ల నిర్మాణం పరిస్థితి ఏమిటి.. ఆయా పట్టణాల్లో పనుల పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- అందరికీ ఇళ్ల పథకం కింద పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం కానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో పరిధిలోని రెండు కార్పొరేషన్లు, 20 పురపాలక సంఘాల్లో 1,07,538 ఇళ్లు మంజూరు కాగా 58,233 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తికావస్తోంది.
* కృష్ణా జిల్లాలో మొత్తం 60,490 గృహాల మంజూరు కాగా 31,904 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.
* గుంటూరు జిల్లా పరిధిలో 47,048 ఇళ్లు మంజూరుకాగా 26,329 నిర్మాణంలో ఉన్నాయి.
* ప్రధాన మంత్రి అవాస్‌ యోజన పథకం కింద పట్టణాల్లో అర్హులైన పేదలకు కేంద్ర ప్రభుత్వం Rs 1.50 లక్షల చొప్పున రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతేమొత్తం రాయితీ ఇస్తోంది.
* ఒక్కో లబ్ధిదారుకు మొత్తం Rs 3 లక్షలు మేర సబ్సిడీ లభిస్తుండగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జీఫ్లస్‌ త్రీ కింద ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

54 శాతానికి చేరిన నిర్మాణాలు
అందరికీ ఇళ్ల పథకం కింద రాజధాని జిల్లాల పరిధిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం 54 శాతానికి చేరిందని టిట్‌కో కృష్ణా ఈఈ చిన్నోడు, గుంటూరు ఈఈ ఆదినారాయణలు తెలిపారు. కొన్ని మున్సిపాలిటీల్లో భూ సమస్యలు కారణంగా నిర్మాణాల్లో వేగం మందగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ నిర్మాణాలను త్వరలో పూర్తిచేసి పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు.

amr-top2b.jpg
Link to comment
Share on other sites

Decoding NTR Housing scheme

 

1. NTR Rural Housing/MNREGA

AP Subsidy: 95,000

MNREGA : 55,000

Total: 1,50,000

GOI subsidy: ZERO

 

2. NTR Rural Housing/PMAY-G/MNREGA

AP Subsidy: 51000

GOI Subsidy: 72000

AP Govt Loan: 18,740

MNREGA: 58,250

 

3. NTR Urban Housing/PMAY-U

AP Subsidy: 1,00,000

GOI Subsidy: 1,50,000

Bank Loan: 75,000

Beneficiary: 25,000

 

4. NTR Nagar (Affordable Housing), PMAY

AP Subsidy: 2,56,000

GOI Subsidy: 1,50,000

Bank Loan+ Beneficiary Contribution: 2,65,000

Link to comment
Share on other sites

AP Govt అక్షరాలా 4 వేల 4 వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇది కన్స్ట్రక్షన్ కి ఖర్చు మాత్రమే.

ఇది కాకుండా దాదాపు 5 వేల కోట్లు విలువ చేసే భూమి ఇచ్చారు ఫ్రీ గా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం క్రింద.

AP Govt మొత్తం 9 వేల కోట్లు ఖర్చు పెట్టింది.

https://pbs.twimg.com/media/DfE4HmeUcAA-HjS.jpg

https://pbs.twimg.com/media/DfE4JnDUEAU8TZS.jpg

https://pbs.twimg.com/media/DfE4PoOU0AAxvAm.jpg

https://pbs.twimg.com/media/DfE4Rc0U0AEDNDj.jpg

Link to comment
Share on other sites

మోడీ మనకి ఎంత ఇచ్చాడు

రురల్ హోసింగ్ క్రింద - 995 కోట్లు

అర్బన్ హౌసింగ్ క్రింద - 1035 కోట్లు

మొత్తం - 2035 కోట్లు

లోటు బడ్జెట్ లో వున్నా రాష్టం 9000 వేల కోట్లు (డబ్బు +ల్యాండ్ ) ఇస్తే వీడు 2 వేల కోట్లు ఇచ్చాడు.

https://pbs.twimg.com/media/DfFESpHWkAAdSKg.jpg

https://pbs.twimg.com/media/DfFEb6iWkAAMBhj.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...