Jump to content

NTR Housing Scheme


Recommended Posts

గూడు..గోడు

క్షేత్రస్థాయిలో ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు

అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు

లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపు.. అన్నిటా జాప్యమే...

ఒంగోలు

pks-gen1a.jpg

సొంతిల్లు.. సగటు మధ్య తరగతి కుటుంబాల జీవిత కల. ప్రతి ఒక్కరికీ దీనిపైనే ఆశలు.. ఆపై ప్రభుత్వ సాయంపైనే ధ్యాస. మరోవైపు ప్రభుత్వాలు సైతం పేద, మధ్య తరగతిని ఆకట్టుకునే క్రమంలో ఇళ్ల పథకాలకు పెద్దపీట వేస్తుంటాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. చిక్కంతా అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతోనే వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం తీరు ఇందుకు అతీతంగా లేదు. ఇళ్ల నిర్మాణంలో వివిధ దశల్లో జాప్యం తప్పడం లేదు.

బిల్లొస్తేనే ఇల్లు పూర్తయ్యేది

ఈ చిత్రంలో ఉన్నది కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన రంగలక్ష్మి. ఏడాది కిందట నిర్మాణం ప్రారంభించిన ఈమె ఇల్లు ఇప్పటికి శ్లాబు దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ రూ.90వేల బిల్లు ఇవ్వాల్సి ఉండగా- రూ.40వేలు మాత్రమే అందాయి. నిర్మాణానికి రూ.2.50 లక్షలు వ్యయం చేశామని, బిల్లు ఇవ్వకుంటే ఇక నిర్మాణం పూర్తి చేయలేమని రంగలక్ష్మి అంటున్నారు. ప్రస్తుతం గుడిసెలో తలదాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఇళ్ల పథకానికి ఉపాధి తోడవడంతో ఇక నిర్మాణాలు జోరందుకుంటాయని భావించారు అంతా. కానీ.. ప్రధాన చిక్కు అక్కడే వచ్చి పడుతోంది. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాల ఆరంభం, దశల వారీగా కొనసాగడంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో బిల్లులు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వపరంగా ఇళ్ల పథకం బిల్లులు అందితే.. ఉపాధి బిల్లులు అందడం లేదు. ఉపాధి బిల్లులు అందిన చోట.. ఈ బిల్లులు రావడం లేదు.’

జిల్లాలో లక్ష్యం ఇలా...

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా జిల్లాకు ఏడాదిన్నర కిందటే 19,582 ఇళ్లు మంజూరయ్యాయి. అర్హులను గుర్తించి నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇవి పూర్తయితే మరో దశ మంజూరు ఉంటుంది. కానీ.. లబ్ధిదారుల గుర్తింపు నుంచి దశల వారీగా ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఈ కేటాయింపులు పూర్తి చేస్తే.. ఈ ఏడాది చివర్లో మరో దశలో జిల్లాకు పదివేల ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. నిర్మాణాల తీరు చూస్తే రెండేళ్లయినా పూర్తయ్యేలా లేవు.

Link to comment
Share on other sites



  • పీఎంఏవై ఇళ్లపై ప్రభుత్వం ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రధానంగా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతున్నందున ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. ప్రస్తుతం పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్లు, జిల్లా ఇనఛార్జ్‌ మంత్రి సమన్వయంతో జరుగుతోంది. అయితే ఇంతవరకు 78వేల ఇళ్లకుగాను కేవలం 35శాతం మందినే ఎంపిక చేశారు.

 

ఈ క్రమంలో ఇకపై ఇందులో ఇనఛార్జ్‌ మంత్రుల ప్రమేయం లేకుండా హౌసింగ్‌ కార్పొరేషన సహకారంతో నేరుగా కలెక్టర్లే ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిబంధనలు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్‌ నెలాఖరుకు ఎంపిక పూర్తిచేసి ఇళ్లకు పునాదులుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా,పేదల పక్కా ఇంటి కనీస విస్తీర్ణాన్ని 400 నుంచి 500 చదరపు అడుగులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం, పీఎంఏవై కింద చేపట్టే ఇళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇదిలాఉండగా, 2016-17లో రాష్ర్టానికి 73వేల ఇళ్లు కేటాయించిన కేంద్రం ప్రభుత్వం తాజా ఆర్థిక సంవత్సరంలో 46,600 ఇళ్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది.


Link to comment
Share on other sites

లక్షా పదివేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు: మంత్రి నారాయణ
 
636289091195486503.jpg
కర్నూలు: రాష్ట్రంలో లక్షా పదివేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించామని మంత్రి నారాయణ తెలిపారు. నంద్యాలలో 13 వేల ఇళ్ల నిర్మాణానికి మే 1న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని నారాయణ అన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి అని మంత్రి నారాయణ చెప్పారు. పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ఫౌండేషన్ కోర్సు, ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

కృష్ణా జిల్లాకు 26, 400 ఎన్టీఆర్‌ ఇళ్ళు
 
విజయవాడ: కృష్ణాజిల్లాలో సొంత ఇల్లు లేని ప్రజలకు గృహ యోగం పట్టబోతోంది. రానున్న రెండు సంవత్సరాలకు కలిపి జిల్లాకు అదనంగా 26,400 ఇళ్ళను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2016 - 17 ఆర్థిక సంవత్సరానికి 17 వేల ఇళ్ళను మంజూరు చేసింది. వీటి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. 2017 - 18 ఆర్థిక సంవత్సరానికి 13,200 ఇళ్ళను, 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి 13,200 ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం కలిపి 26,400 ఇళ్ళను జిల్లాకు మంజూరు చేసింది. వీటిని నియోజకవర్గాల వారీగా కేటాయిస్తారు. ప్రస్తుతం చేపడుతున్న ఇళ్ళ నిర్మాణ పనులు చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. వేలాది సంఖ్యలో ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసుకుని ఉండటంతో రానున్న కాలంలో ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండేలా చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం అదనంగా ఇళ్ళను మంజూరు చేసింది. విజయవాడలో జక్కంపూడి ప్రాంతంలో హౌసింగ్‌ టౌనషిప్‌ నిర్మాణం చేయటానికి వీలుగా 20 వేల ఇళ్ళకు అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే జక్కంపూడిలో హౌసింగ్‌ టౌనషిప్‌ పనులు జరగనున్నాయి.
Link to comment
Share on other sites

1.2 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం

2011 జనాభా లెక్కల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి ఆవాస యోజన(పీఎంఏవై) కింద గత రెండేళ్లలో కేటాయించిన 1,20,943 ఇళ్ల కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపిక పూర్తయ్యాక ఈ జాబితాలను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో కేంద్రమంత్రి అరవింద్‌ పనగడియాను కలిసి కేంద్ర సర్వే ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తే తలెత్తే ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్ల కోసం అర్హుల ఎంపికకే రెండేళ్ల సమయం పట్టే అవకాశాలున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం గుర్తించిన కచ్చా ఇళ్లలోగల కుటుంబాలను ఎంపిక చేస్తుందని, తదుపరి కేంద్రం సహకరించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలో కొద్ది రోజులుగా పీఎంఏవై ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ప్రధానమంత్రి ఆవాస యోజనలో రాష్ట్రానికి కేంద్రం 2016-17లో 72,885, 2017-18లో 48,058 గ్రామీణ ఇళ్లను మంజూరు చేసింది. వీటి కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల వారీగా గ్రామ సభలు నిర్వహించి ఇప్పటికీ సొంతింటికి నోచుకోని, కచ్చా ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు.

ఉపాధి హామీతో అనుసంధానం

పీఎంఏవై కింద మంజూరు చేసిన ఇళ్లకు జాతీయ ఉపాధిహామీ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేయనున్నది. ఈ విధంగా ఒక్కో ఇంటివిలువను రూ.2లక్షలు చేస్తున్నారు. పీఎంఏవైలో కేంద్రం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1.30 లక్షల వరకు సాయం అందిస్తోంది. మరో రూ.70 వేలును ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు ఉపయోగించుకునేలా ప్రతిపాదిస్తున్నారు.

Link to comment
Share on other sites

రాజధాని జిల్లాలో నియోజకవర్గానికి కొత్తగా 2,200 ఇళ్లు
 
636301712297218873.jpg
  • రెండేళ్లలో తీరనున్న కొరత
  • మొదటి దశలో 16,750 ఇళ్లు మంజూరు
  • యూనిట్‌ ధర రూ.1.50 లక్షలు
(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)
పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం వేల సంఖ్యలో అర్హులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా మొదటి దశలో జిల్లాకు 16,750 ఇళ్లు మంజూరయ్యాయి. ఇంకా అధిక సంఖ్యలో అర్హులు ఉండటంతో కొత్తగా నాలుగు లక్షల ఇళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆశలు అధికమ వుతున్నాయి. మొదటి దశలో 16,750 ఇళ్లు రాగా, ఇప్పుడు కొత్తగా నియోజకవర్గానికి 2200 ఇళ్లు మంజూరు కానున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా యూనిట్‌ ధర లక్షా 50వేలకు పెంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో రెండు మూడేళ్లు గ్యాప్‌ రావడంతో ఇళ్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య అధికమైంది. మీ కోసం, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఎన్టీఆర్‌ ఇళ్ల కోసం జిల్లాలో దాదాపు లక్షా 80 వేల మంది దరఖాస్తు చేసుకోగా, వాటన్నింటినీ నిబంధనల ప్రకారం వడపోసి అర్హుల జాబితాను ఇటీవల తేల్చారు. ఆ సంఖ్య లక్షా తొమ్మిది వేలు ఉండగా, వీటిలో మొదటిదశలో 16,750 మందికి ఇళ్లు మంజూరు జరిగింది. ఒకపక్క ఆర్థిక లోటును ఎదుర్కొంటూనే ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నా ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడుతున్నారు. ఆ దిశగా నిర్దేశించిన లక్ష్యాలు అధిగ మించడంలోను అధికారులు విఫలమవుతున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 16,750 ఇళ్లలో ఇప్పటికి 10వేల ఇళ్లను ప్రారంభించడం కష్టమైంది. ఇంకా 6,750 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
ఇళ్ల నిర్మాణాల ప్రారంభం కోసం గృహనిర్మాణ సంస్థ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నా లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి ఎదురవుతోంది. ఇందుకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలతల సమస్యతో పాటు ముహూర్తాలు, తదితర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలన్నీ గ్రౌండ్‌ కావడం లేదు. బిల్లుల చెల్లింపులోను జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటి ప్రభావం పథకం అమలుపై పడుతోంది. ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి యూనిట్‌ ధర లక్షా 50 వేలు కాగా, ఈ మొత్తాన్ని ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీ కింద అందిస్తోంది. రూ.98 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుం డగా, మిగిలిన రూ.52 వేలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా సమకూరుస్తున్నారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా అంతకు మించిన విస్తీర్ణం లో అక్కడక్కడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సమస్యగా మారుతున్నాయి. ఈ నేపఽథ్యంలో కొత్తగా మంజూరైన ఇళ్ల విషయంలో నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు జరగాల్సి ఉంది. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధి విధానాలు వెలువడ్డాక లబ్ధ్దిదారుల గుర్తింపునకు చర్యలు మొదలు పెడతారు.
ఎన్టీఆర్‌ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులు జిల్లాలో ఇప్పటికి 92 వేల మందికి పైగా ఉన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టకముందు నుంచి ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాలు, వారం వారం నిర్వహించే మీ కోసం ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్షా 80 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో లక్షా తొమ్మిది వేల మందిని హౌసింగ్‌ అధికారులు అర్హులుగా గుర్తించారు. మొదటి దశలో 16,750 ఇళ్లు మంజూరు కాగా, లబ్ధ్దిదారుల ఎంపిక పూర్తయింది. దీంతో అర్హుల సంఖ్య 92,250కి చేరింది.
తాజాగా రాష్ట్రంలో 13 జిల్లాలకు నాలుగు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క నియో జకవర్గానికి ఏడాదికి 1100 ఇళ్లు చొప్పున 2017-18, అలాగే 2018-19 సంవత్సరాలకు కేటాయింపులు చేయనున్నారు. దీంతో జిల్లాలో 13 నియోజకవర్గాలకు 28,600 ఇళ్లు మంజూరు కానున్నాయి. ఈ కేటాయిం పులు పోను జిల్లాలో ఇంకా 63,650 మంది అర్హులు మిగిలి ఉంటారు. మొదటి దశలో 10వేల ఇళ్లు మాత్ర మే ప్రారంభించారు. నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే కొత్తవారికి కేటాయిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఇళ్లతోపాటు జిల్లాకేంద్రమైన మచిలీపట్నంకు హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం ద్వారా కేటాయించిన 1850 ఇళ్ల పరిస్థితి అలాగే ఉంది. బందరు పట్టణానికి ఈ ఇళ్లు మంజూరు కాగా, లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ఇప్పటికి 500 ఇళ్లు మాత్రమే ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ఈ ఇళ్ల యూనిట్‌ ధర రూ.3లక్షల 50 వేలు ఉంది. వీటిలో రూ. 2.5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుండగా, రూ.75 వేలు బ్యాంకు రుణం సమకూరుస్తుంది. లబ్ధిదారుని వాటాగా రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇళ్లను సైతం నిర్మించుకోవడానికి అర్హులు ముందుకు రావడం లేదు.
 
రెండేళ్ళ కేటాయింపులు ఒకేసారి...
శరత్‌బాబు, హౌసింగ్‌ పీడీ
కొత్తగా మంజూరైన ఎన్టీఆర్‌ ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి రెండేళ్ళ కేటాయింపులు ఒకేసారి చేపడతాం. మొదటి దశలో 2016-17 సంవత్సరానికి జిల్లాకు 16,750 ఇళ్ళు మంజూరయ్యాయి. తాజాగా రాష్ట్రానికి 4 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గానికి 2017-18.. 2018-19కిగాను 2200 ఇళ్ళు మంజూరు కానున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంతకుముందు మాదిరిగానే జన్మభూమి కమిటీల ద్వారానే జరుగుతుంది. ఆయా కమిటీల ద్వారా వచ్చిన లబ్ధిదారుల జాబితాలు ఎమ్మెల్యేల ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నుంచి కలెక్టర్‌కు చేరతాయి. ఈవిధంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Link to comment
Share on other sites

జిల్లాకు 18,500 ఇళ్లు మంజూరు

రానున్న రెండేళ్ల కాలానికి ఒకేసారి కేటాయింపు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే

viz-top2a.jpg

జిల్లాకు ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద 18,500 ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలిసారిగా 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు మొత్తంగా ఒకేసారి ఇళ్లు మంజూరు చేయడం గమనార్హం. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

గృహనిర్మాణాలు ఏటా ఆర్థికసంవత్సరం మధ్యలో లేదా చివర్లో మంజూరు చేయడం జరుగుతుంది. లబ్ధిదారులకు అనుమతుల జారీ, నిర్మాణాలు ప్రారంభించడంలో జాప్యంతో ఏళ్ల తరబడి నిర్మాణాలు సాగుతున్నాయి. దీనికి తొలివిడతలో మంజూరైన నిర్మాణాల ప్రగతే ఇందుకు అద్దంపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రానున్న రెండేళ్లకు ముందస్తుగానే ఇళ్లను మంజూరు చేసింది. దీనివల్ల నిర్మాణాల్లో ప్రగతి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇలా చేసిందన్న ప్రచారం లేకపోలేదు.

నియోజకవర్గానికి 1100 ఇళ్లు

ఒక నియోజకవర్గానికి 1100 ఇళ్లు చొప్పున కేటాయించారు. పురపాలక పరిధిలో ఉన్న ఒక నియోజకవర్గానికి (మిక్స్‌డ్‌ అర్బన్‌) 450 ప్రాతిపదికన మంజూరు చేశారు. జిల్లాలో ఒక ఏడాదికి 9,250 చొప్పున రెండేళ్లకు 18,500 ఇళ్లు మంజూరు జరిగినట్లు గృహనిర్మాణశాఖ పీడీ రమణమూర్తి తెలిపారు.

viz-top2b.jpg

Link to comment
Share on other sites

గ్రామీణ పేదలకు 25,100 వేల గృహాలు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పేదలకు ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల గృహాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా జిల్లాలోని పేదలకు 25,100 గృహాలు మంజూరు చేశారు. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 12,550 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో నిర్మాణానికి రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.55 వేలు అందజేయనున్నారు. ఏడాదికి మంజూరు చేసిన గృహాల్లో ఎస్సీలకు 2,189, ఎస్టీలకు 512, మైనారిటీలకు 642, ఓసీలకు 9,207 కేటాయించారు.

Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌ గృహాలు మంజూరు
 
636306970822867540.jpg
ఆంధ్రజ్యోతి-గుంటూరు :పేదలకు ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహాలను మంజూరు చేసిందని, దీనికి గానూ జిల్లాలోని లబ్ధిదారులను గుర్తించి వెంటనే నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆదేశించారు. జడ్పీ మీటింగ్‌ హాల్లో బుధవారం జిల్లాలో శాశ్వత గృహ నిర్మాణాలపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ నాగశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంతిలాల్‌ మాట్లాడారు. ప్రభుత్వం 2016-17, 2017-18, 2018-19 వార్షిక సంవత్సరాలకు గానూ పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టబోతోందన్నారు.
 
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికీ 3,500 నుంచి 5 వేల వరకు శాశ్వత గృహాలు మంజూరయ్యాయని చెప్పారు.పక్కా గృహాలకు గతంలో కన్నా అదనంగా రూ.25వేలు మంజూరయ్యాయన్నారు. అసంపూర్తిగా ఉన్న పక్కా గృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణశాఖ డీఈలు, మండల అధికారులతో చర్చించి శాసనసభ్యుల ద్వారా పక్కా గృహ లబ్ధిదారుల జాబితాలను ఈనెల 31 లోపు తయారు చేయాలన్నారు. జాబితాలను ఇన్‌చార్జి మంత్రి నుంచి అనుమతిని తీసుకోవాలన్నారు.
 
అసంపూర్తి ఇళ్లపై దృష్టి పెట్టాలి
పక్కా గృహాలు నిర్మించుకునే పేదలు వివిధ కారణాల వల్ల వాటిని పూర్తి చేయలేకపోయారని అభిప్రాయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే అభిప్రాయం వ్యక్తంజేశారు. ఎంపీడీవోలతోనూ, తహశీల్దార్లతోనూ గృహ నిర్మాణశాఖ సిబ్బంది చర్చించాలని, అసంపూర్తి ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను వెంటనే నిర్ధారించాలన్నారు.ప్రభుత్వం ఈ ఏడాది గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టిందని, దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పని తీరును మెరుగుపర్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ రాష్ట్ర కార్యాలయ అధికారి శ్రీరాములు, పీడీ నాగశివరావు ప్రసంగించారు.
 
మూడు విడతల్లో బిల్లు ఆ దిశగా ప్రభుత్వం...
సత్తెనపల్లిరూరల్‌: ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు 5 విడతల్లో కాకుండా 3 విడతల్లో బిల్లు చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే చెప్పారు. మండలంలోని రెంటపాళ్ళ, కట్టావారిపాలెం గ్రామాలను బుధవారం సందర్శించారు. రెంటపాళ్ళలోని డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మోడల్‌ కాలనీలో 90 గృహాల నిర్మాణం అభినందనీయమన్నారు. ఒక కొత్త కాలనీలో ఇలా 90 ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. అనంతరం లబ్ధిదారుల గృహాలను సందర్శించి వారితో మాట్లాడారు. గృహ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న లక్షా 50 వేల రూపాయలు సరిపోవటంలేదని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మరొక రూ. 20 వేలు ఇప్పిస్తే బాగుంటుందని దండేకు లబ్ధిదారులు వివరించారు. కట్టావారిపాలెం గ్రామాన్నీ సందర్శించి నిర్మాణంలో ఉన్న గృహాలు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మక్కపాటి రామచంద్రరావు, సర్పంచులు మక్కపాటి శ్యామల భాస్కరరావు, దాశరది సాంబయ్య, ఎంపీటీసీ కోట విజయకుమారి వీరాంజనేయులు, హౌసీంగ్‌ పీడీ నాగశివరావు, ఎస్‌ఈ శ్రీరాములు, ఈఈ ప్రసాదరావు, డీఈ శివలింగం, ఏఈ సుబ్బారావు, తహసీల్దార్‌ శంకరబాబు ఉన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...