Jump to content

Veera Bus building Unit IN ANANTAPUR


Recommended Posts

పరిశ్రమలకు నజరానా
 
  • అపోలో టైర్ల కంపెనీ.. వీరా వాహన ఉద్యోగ్‌ లిమిటెడ్‌ ఎలక్ర్టోనా, ఎనర్జీలకు భారీ రాయితీలు
  • పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని చిన్నపందూరులో రూ.4025 కోట్లతో మూడు దశలో స్థాపించే అపోలో టైర్ల ప్లాంట్‌కు ప్రోత్సాహకంగా భారీ నజరానాను అందజేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ అరోకియారాజ్‌ ఉత్తర్వు జారీ చేశారు. ప్రత్యక్షంగా 1400 మందికి ఉపాధిని కల్పించే ఈ పరిశ్రమకు 100 శాతం వ్యాట్‌, సీఎస్ టీ, ఎస్‌జీఎస్ టీ రాయితీ 20 ఏళ్లపాటు కొనసాగుతుంది. ఏడేళ్లపాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ రాయితీ కూడా ఇస్తారు. ప్రతి రోజూ 100 కేఎల్‌ నీటిని జల వనరుల శాఖ సరఫరా చేస్తుంది. రూ.2.2 కోట్లతో అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తారు. రూ.4 కోట్లతో రెండు 132 కేవీ విద్యుత సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులకు హౌస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రోజంతా నిరంతరాయంగా విద్యుత సరఫరా జరుగుతుంది.
ఎలక్ట్రోనా ఎనర్జీకి నజరానా
నెల్లూరు జిల్లా మాంబట్టు ఇండస్ట్రియల్‌ పార్కులో సోలార్‌ సెల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ని స్థాపించే ఎలక్ట్రోనా ఎనర్జీకి కూడా నజరాలను ఇస్తూ పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఎలక్ట్రోనా రూ.3970 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. 250- 500 మెగావాట్ల వరకూ తయారు చేసే మాడ్యూల్స్‌ కోసం యూనిట్‌కు రూపాయి చొప్పున, 500-1 జిగావాట్‌ సెల్స్‌ తయారుచేస్తే యూనిట్‌కు రూ.1.25 చొప్పున, ఒక గిగావాట్‌ కంటే అధికంగా మాడ్యూల్స్‌ తయారు చేస్తే యూనిట్‌కు రూ.1.50 చొప్పున 5 ఏళ్లపాటు విద్యుత రాయితీ ఇస్తారు. రూ.1500 కోట్ల వరకు స్వచ్ఛభారత ప్రోత్సాహకం కింద రూ.50 కోట్ల వరకు, మరో రూ.1500 కోట్ల పెట్టుబడి వరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు రూ.50 కోట్ల వరకు ప్రోత్సాహకం ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీలో 100 శాతం రాయితీ ఉంటుంది. రూ.5 కోట్ల వరకు క్యాపిటల్‌ సబ్సిడీ ఉంటుంది. వ్యాట్‌, సీఎస్ టీ, వ్యాట్‌ 10 ఏళ్లపాటు 100 శాతం రాయితీ ఉంటుంది. ఇదే విధంగా విశాఖ అచ్యుతాపురంలో నెలకొల్పే రిషిల్‌ డెకార్‌ లిమిటెడ్‌కూ ప్రోత్సాహకాలు ఇస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వు జారీ చేసింది.
 
‘వీరా’కు వీరతాడు
అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.600 కోట్లతో 7000 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీవీయూపీఎల్‌)కు ప్రోత్సాహకాన్ని అందించేందుకు పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. రెండు దశల్లో వీరా బస్సు బాడీలను తయారు చేస్తుంది. దీనికి 120 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఏడేళ్లపాటు 100 వ్యాట్‌/సీఎస్ టీ/ఎస్ జీఎస్ టీ రాయితీని ఇస్తామని ప్రకటించింది. ఏడేళ్లపాటు విద్యుతకు యూనిట్‌పై రూపాయి రాయితీ ఇస్తారు.
Link to comment
Share on other sites

http://www.nandamurifans.com/forum/index.php?/topic/364577-%E2%80%98%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E2%80%99-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C/

 

18 March 2016 - 12:53 PM

  • 635938683333898822.jpg
  • భూమి కేటాయింపునకు ప్రభుత్వంతో చర్చలు 

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : బెంగళూరుకు చెందిన ‘వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (వివియుపిఎల్‌) కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వంద ఎకరాల్లో వాహనాల సమగ్ర ఉత్పత్తికి దోహదం చేసేలా ఈ కొత్త ప్లాంట్‌ నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెచ్‌పి మోహన్‌ కుమార్‌ చెప్పారు. అందుబాటు ధరల్లో భూమి సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్‌, లేదా తెలంగాణల్లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే రెండు రాష్ట్రాల సిఎంలను కలవబోతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌ ద్వారా నేరుగా 5,000 మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. కాగా ఇప్పటి వరకు కోచ్‌ బస్సుల తయారీలో ఉన్న వీరా ఇపుడు కొత్తగా టర్మాక్‌ కోచ్‌ బస్సుల తయారీకి సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల్ని విమానాల వరకు తీసుకెళ్లేందుకు ఈ బస్సుల్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశం వీటిని పూర్తిగా దిగుమతి చేసుకుంటోంది. old news dora kuda gattigane trychesadu AP ki vacche vatini ,,,,,

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...