Jump to content

Nellore Swarnala lake Beautification


Recommended Posts

  • 1 month later...
  • 3 weeks later...
Guest Urban Legend

Why are we obsessed with desert species ? Ekkada chusina palms pedutunnaru...: it won't be useful for any one!

 

avi beauty tress,water usage takkuva

mumbai delhi hyd yekkadiki vellina beautification kosam ive use chestunnaru india motham

u can cross check

and local trees kuda slow ga plant chestharu anta

Link to comment
Share on other sites

Guest Urban Legend

narayana garu matram chala goppadu, ventane work lo paddadu ga

 

i think its the only way he can recover

monna prakasam tdp meet, tarvatha capital designs and other works annitiki chusukuntunnaru

Link to comment
Share on other sites

avi beauty tress,water usage takkuva

mumbai delhi hyd yekkadiki vellina beautification kosam ive use chestunnaru india motham

u can cross check

and local trees kuda slow ga plant chestharu anta

Cheruvu gattu meeda beauty trees enduku annai?? Emanna high way center lo vestunnara endhi!
Link to comment
Share on other sites

Guest Urban Legend

Cheruvu gattu meeda beauty trees enduku annai?? Emanna high way center lo vestunnara endhi!

Necklace road antha ivey veetitho paatu verevi..vuntayi

But these trees entire stretch vuntayi

I am not saying this correct

There should be some logic behind this

Link to comment
Share on other sites

Necklace road antha ivey veetitho paatu verevi..vuntayi

But these trees entire stretch vuntayi

I am not saying this correct

There should be some logic behind this

I completely agree with your point. But we cannot increase green cover with these trees
Link to comment
Share on other sites

  • 4 weeks later...

మనకూ ట్యాంక్‌ బండ్‌!
స్వర్ణాల చెరువు మధ్యలో ద్వీపం
పడవ ప్రయాణంతో పరవశం
నడక మార్గం ఏర్పాటు
ఏడాదిన్నరలో ఆహ్లాదం అందుబాటు
రూ.36 కోట్లతో పనులు
ఈనాడు-నెల్లూరు
cUAS5GW.jpg

మనకూ ట్యాంక్‌ బండ్‌ను పోలిన ఆహ్లాద కేంద్రం రానుంది. వారం అంతా వివిధ వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడిపి.. సేద తీరటానికి ఒక కేంద్రం అందుబాటులోకి రానుంది. దశాబ్ధాలుగా వారాంతం వచ్చిందంటే.. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడపటానికి ఒక్క ప్రదేశం లేదు. సినిమా థియేటర్‌లు మాత్రమే ప్రత్యామ్నాయంగా మారాయి. వసతులు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురుచూపులే మిగిలాయి. నగరం విస్తరిస్తోంది. పట్టణీకరణ పెరుగుతున్నా ప్రజలకు వినోదాన్ని అందించటంలో మాత్రం వెనుకబాటే కనిపిస్తోంది. అవకాశం ఉన్న వాళ్లు ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ పొరుగునే ఉన్న చెన్నై తిరుపతి వంటి పట్టణాలకు వెళ్తున్నారు. ఏదో ఒక్కసారి ఇలా సాధ్యం అవుతుంది. ప్రతి వారం వెళ్లటం ఎవరికైనా వ్యయంతో కూడిన వ్యవహారమే. దీంతో పట్టణంలోనే ఆహ్లాదానికి ఒక కేంద్రం అందుబాటులోకి వస్తే.. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని నెల్లూరు చెరువు(స్వర్ణాల చెరువు) సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. భారీ మొత్తం వెచ్చించి చెరువు మధ్యలో ద్వీపాన్ని అభివృద్ధి.. పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆహ్లాదాన్ని పంచటానికి వీలుగా పలు కోణాల్లో నిర్మాణాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలో పనులకు టెండర్లను పిలిచి.. ఏడాదిన్నర వ్యవధిలో పూర్తి స్థాయిలో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దటానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లా ప్రజలకు ఇదొక పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ఇప్పటికే ఘాట్‌ల అభివృద్ధి
రొట్టెల పండుగ సమయంలో స్వర్ణాల చెరువుకు ఘాట్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కేవలం కొన్ని మొక్కలను నాటి.. లైట్లను అమర్చితేనే సాయంత్రం సమయంలో సేద తీరటానికి ప్రజలకు అక్కడికి వెళ్తున్నారు. ఇలాంటి చోట వినోదం.. ఆహ్లాదం మేళవింపుగా అభివృద్ధి చేస్తే రోజువారీ పనుల్లో సతమతం అవుతున్న నగరజీవికి ఒకింత వూరట లభిస్తుంది. దీనికోసం రూ.36 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలను అధికారులు తయారు చేశారు. పొరుగునే ఉన్న చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఆహ్లాదం కోసం ఎలాంటి నిర్మాణాలు అవసరం ఉంటుందన్న దానిపై ఒక నివేదికను తయారు చేశారు. అధికారులు తయారు చేసిన ప్రణాళిక పూర్తయితే.. స్వర్ణాల చెరువు రూపురేఖలే మారిపోనున్నాయి.

జిల్లా సంస్కృతి ప్రతిబింబిస్తూ..
పర్యటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేయటానికి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వెంకటగిరి చీరలపై ఉన్న నమూనాలో రంగులు అద్ది.. ఉదయగిరి బాతిక్‌ రంగులను గుర్తుకు తీసుకువచ్చే విధంగా స్వాగత ద్వారాలు. ఇక్కడ ఏర్పాటు చేసే దుకాణాలపై ఇదే తీరులో రంగులతో అలంకరణ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల జిల్లా సంప్రదాయ కళలను మరచిపోకుండా ప్రజలకు గుర్తు చేయటంతో పాటు.. పర్యటక ప్రాంతానికి అదనపు హంగు తీసుకువస్తుందని నిర్ణయించారు.

* ప్రాజెక్టులో ప్రధానంగా చెరువు మధ్యలో ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ద్వీపం మధ్యలో ఏర్పాటు చేసి.. చుట్టూ ఆహ్లాదాన్ని అందించే రంగురంగుల విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ ఉద్యమంలో జిల్లా నుంచి కీలకంగా వ్యవహరించిన ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌లో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రీతిలో ప్రత్యేకంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఒడ్డు నుంచి ద్వీపానికి వెళ్లటానికి రెండు అత్యాధునిక మర పడవలను ఏర్పాటు చేసి ప్రజలకు పడవ ప్రయాణ అనుభూతిని తీసుకురానున్నారు. ద్వీపం చుట్టూ నీటిని చిమ్మే ఫౌంటేన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ద్వీపం మధ్యలో పార్కును అభివృద్ధి చేసి.. అక్కడికి వెళ్లే ప్రజలకు మరపురాని జ్ఞాపకంగా ఉండేలా చేయాలన్నదే ఆలోచన.

* చెరువు దగ్గర ఉన్న మొత్తం ఏడు ఎకరాలను అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో యోగా కేంద్రం, క్రీడల కోసం ప్రత్యేక ప్రదేశం.. విద్యుత్తు వెలుగులతో పనిచేసే ఫౌంటేన్‌, శిక్షణ కేంద్రం, జిల్లా సంప్రదాయ వంటల రుచులను విక్రయించే ఆహార దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

* చెరువు చుట్టూ ఆరు కి.మీల కట్ట ఉంది. దీన్ని హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ మాదిరి అభివృద్ధి చేయటానికి ప్రణాళికలను తయారు చేశారు. దీని చుట్టూ సైకిల్‌ ట్రాక్‌, నడక దారిని అభివృద్ధి చేయనున్నారు. వాహనాలను అనుమతించకుండా.. ఆహ్లాదం కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఎప్పటికి పూర్తవుతుందంటే..
సుందరీకరణ పనులు నిర్వహించటానికి ఇప్పటికే అమృత్‌ పథకం కింద కేంద్రం నుంచి రూ.36 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. ఈ మొత్తంతో టెండర్ల పక్రియను నిర్వహింటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉండాలనే దానిపై నిపుణుల బృందం ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసింది. టెండర్ల పక్రియ.. నిర్మాణాలు కొలిక్కి రావటానికి ఏడాదిన్నర వ్యవధి పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అంటే.. ఏడాదిన్నర ఎదురుచూడాల్సిందే.

Link to comment
Share on other sites

  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...