Jump to content

Assembly seats to increase in AP and Telangana


Recommended Posts

6 minutes ago, ravindras said:

ap lo idi tdp ki plussaa ? minussaa?

Ysr vunnappudu state election commissioner ga Avs Reddy ni appointment cheyinchi vadiki kaavalsinattu    Niyojakavargalu split cheyinchadu (to weaken TDP). TDP strong ga vunde mandals Anni okay constituency lo kaka vere vere chota vachelaga chala planned chesadu. For ex. Rapthadu in anantapur district. Chittoor district lo Chittoor and Tirupati rendu parliament seats SC reserved cheyinchadam. Inka ila chala chesadu. Paina manam cheppinattu vinevallu vunte manaki chala plus avutundi

Link to comment
Share on other sites

52 minutes ago, rajanani said:

Ysr vunnappudu state election commissioner ga Avs Reddy ni appointment cheyinchi vadiki kaavalsinattu    Niyojakavargalu split cheyinchadu (to weaken TDP). TDP strong ga vunde mandals Anni okay constituency lo kaka vere vere chota vachelaga chala planned chesadu. For ex. Rapthadu in anantapur district. Chittoor district lo Chittoor and Tirupati rendu parliament seats SC reserved cheyinchadam. Inka ila chala chesadu. Paina manam cheppinattu vinevallu vunte manaki chala plus avutundi

gade venkatreddy played crucial role iuring that time

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

2021 ki New population list vasthadhi ga.. dhani base chesukuni seats penchochu ga.. edhaina 2019 elections taruvata cheyyadam best..

2021 ki ee govt. vuntado, better do it now.

Peddaga manipulation ki chance elago vundadu like YSR did, mandals atu itu maarchatam thappa.

Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కసరత్తు

06431526BRK123HOME.JPG

దిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. గతంలో నిలుపుదల చేసిన ప్రక్రియను హోం మంత్రిత్వశాఖ తిరిగి ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో గత మూడు నెలలుగా ఈ అంశంపై స్పష్టత తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న కేంద్ర హోంశాఖ అధికారులు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల వివరాలు తెలపాలని, ఎన్ని నియోజకవర్గాలు ఎస్పీ, ఎస్టీ జనరల్‌ కేటగిరీల్లో ఉన్నాయో చెప్పాలని, ఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ అడిగిన అంశాలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి హోం మంత్రిత్వశాఖ అభిప్రాయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల పూర్తి నివేదిక ఇంకా తయారు కాలేదని, 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చని రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన నివేదికను కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి పంపింది. ఇటీవల అధికారులతో ఈ అంశంపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గబా సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా పోలవరం ముంపు మండలాలపై కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పెంచిన నియోజకవర్గాలకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్లాలని హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపుపై హోంశాఖలో అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకుని, ఎన్నికల సంఘం ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం ఈ వారంలో కానీ, వచ్చే వారంలోకానీ నివేదిక ఇస్తుందనే అభిప్రాయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబరు 15-20 తేదీలోగా ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తుందనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తే వెనువెంటనే ఈ నిర్ణయాన్ని కేబినెట్‌ ముందుకు తీసుకువెళ్లి రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి పార్లమెంటులో కూడా చిన్న చిన్న సవరణలు చేయాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేసి, నియోజకవర్గాల పునర్విభజనకు హోంశాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

ఎన్నికల ముందు పశ్చిమ గోదావరిలో ‘కొత్త’ కుదుపు...
27-09-2018 15:08:39
 
636736577215893826.jpg
  • నియోజకవర్గాలపై మళ్ళీ కదలిక
  • ఒక్కసారిగా ఆశావహుల అప్రమత్తం
  • అప్పుడే లోలోన సమాలోచనలు
  • అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు
ఏలూరు/పశ్చిమ గోదావరి: రాష్ట్ర విభజన దరిమిలా అతి తక్కువ స్థానాలతో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగనుందంటూ విస్తృత ప్రచారం. కేంద్రా నికి ముందస్తు నివేదికలు... నియోజకవర్గాల సంఖ్య పెరిగేలా తగినంత మద్ధతు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి వేడుకోలు... అప్పట్లో తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరించింది కాబట్టి నియోజకవర్గాల పెంపుదల విషయంలో అనుకున్నదే సాధిస్తామని అనుకున్నారు. రానురాను ఇదికాస్తా సడలింది. నియోజకవర్గాల పునర్విభజన మరిచిపోయే అంశంగానే అధికార పక్షం భావించింది. ఆఖరుకి నియోజకవర్గాల నుంచి ఆశలు పెంచుకున్న వారందరికీ ఇది అప్పట్లోనే అతి పెద్ద నిరాశ కలిగించింది. కానీ తాజాగా నియో జకవర్గాల పునర్విభజన విషయంలో కొంత కదలిక రావడంతో ఆశావహుల ఆనందం అంతా ఇంతా కాదు. సరాసరిన ప్రతి జిల్లాలోనూ మూడు నుంచి ఐదు నియోజక వర్గాల చొప్పున సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని మరీ లెక్కకట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పరోక్షంగా ఇలాంటి సంకేతాలు ఇచ్చింది.
 
 
పార్టీల్లో చేరబోతున్న కొత్త ముఖాలకు ఈ ప్రతిపాదన సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే నియోజకవర్గాల సంఖ్య పెరిగేందుకు అవకాశం పెద్దగా లేదని తేల్చారో అప్పటి నుంచే రాజకీయ వేదికపై విర్రవీగే కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో జారుకోవాల్సి వచ్చింది. కొత్త ముఖాలు పెట్టుకున్న ఆశలన్నీ కేంద్రమే నేరుగా నీరుగార్చింది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చిన్న సమాచారం కూడా రాజకీయ పక్షాల్లో ఒక కుదుపు ఇస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. నియోజక వర్గాల పెంపుదల విషయంలో హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామాలపైనే అందరి దృష్టి పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి అంశం లేవనెత్తిందో అదికాస్తా ఇప్పుడు రాజకీయ పక్షాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అన్ని పక్షాల నేతలు బుధవారం రాత్రి ఇదే అంశంపై చర్చల్లో మునిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యా సాధ్యాలను వ్యక్తిగతంగా సమీక్షించుకున్నారు. వీరికి చాలా చోట్ల ఆశావహులు జతకలిశారు.
 
 
ఇంతకుముందు ఏం జరిగింది
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కుదిస్తారా, లేక పెరగబోతున్నాయా అనే చర్చ జరిగినప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17 లేదా 18కి చేరవచ్చంటూ అంచనా కట్టారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఎవరకు వారు నియోజకవర్గాల విభజన ఎలా జరగబోతుందో అంచనాకు వచ్చారు. దీనికి విరు గుడుగా మరికొందరు వేరే ప్రచారం తెరముందుకు తెచ్చారు. విభజన జరిగే నియోజకవర్గాల్లో చింతల పూడి, పోలవరంతో పాటు మరో రెండు నియోజక వర్గాలు ఉంటాయని వాదించిన వారూ లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ముంపు మండలాలు నేరుగా పోలవరం నియోజకవర్గంలో కలిసి నందున, పునర్విభజన తప్పక పోవచ్చనంటూ ప్రచారం జరిగింది. దీంతో సమాంతరంగా అతి పెద్ద నియో జకవర్గాల్లో చింతలపూడి కూడా ఉండడంతో దీనిలో మార్పులు, చేర్పులు ఉంటాయని రాజకీయాల్లో తల పండిన వారే అంచనాకు వచ్చారు.
 
 
ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెంచినట్టైతే అది ఏ పార్టీకి అనుకూలమో ఊహాగానాలతో విస్తృత ప్రచారాలకు తలపడిన వారు లేకపోలేదు. ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉంటాయని మరి కొందరు అంచనాకు వచ్చారు. ఏలూరు అర్బన్‌ నియోజకవర్గంగా మార్పులు చేసి రూరల్‌ ప్రాంతాన్ని దెందులూరు నియోజక వర్గంలో విలీనం చేయడం, అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న కొంత భాగాన్ని పొరుగున ఉన్న చింతలపూడిలో కలిపే అవకాశం ఉందని రకరకాల అంచనాకు వచ్చారు. ఇవన్నీ అన ధికారికంగా విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి తేనెతుట్టెను కదిపింది. ఆశావహుల్లో అంచనాలను పెంచింది. రాజ కీయంగా సరికొత్త దూకుడుకు అవకాశం కల్పించింది. నియోజక వర్గాల పెంపు సాధ్యమా, కాదా అనే విష యంపై రకరకాల సందేహాలు ఉన్నా రాజకీయ పార్టీల్లో మాత్రం ఇదే పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.
Link to comment
Share on other sites

Center playing it’s part in TG! 

 

Maha kutani leaders pai IT dadulu cheyinchi bhayapedadamani try chesaru... nobody cared!

 

now they want to confuse the opposition parties with the name of increasing seats. 

So that they want opposition to be short on preparations and help KCR huff and puff 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...