Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

45 రోజుల్లోనే హెచ్‌సీఎల్‌కు భూమి

దేశంలో ఏ ప్రభుత్వమూ ఇంత వేగంగా స్పందించలేదు

125 రోజుల్లో క్యాంపస్‌ పూర్తి

5వేల మందికి ఉద్యోగాలు

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌

ఈనాడు - దిల్లీ

12ap-main5a.jpg

ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో అంతర్జాతీయస్థాయి పరిశోధన అభివృద్ధి, ఐటీ సేవలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థలు మరింత ముందడుగు వేశాయి. ఆ కేంద్రానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో 17.86 ఎకరాల భూమి కేటాయించింది. మార్చి 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా అన్ని అనుమతులు మంజూరుచేసింది. వీటికి సంబంధించిన పత్రాలను ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్‌ శుక్రవారం ఇక్కడ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఛైర్మన్‌ శివనాడార్‌కు అందించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ప్రాథమిక అవగాహన ఒప్పందం జరిగిన 45 రోజుల్లోనే ఓ సంస్థకు కావాల్సిన భూమితోపాటు అన్ని అనుమతులు ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. తొలిదశలో కేసరిపల్లిలో 17.86 ఎకరాల్లో ఐటీ కేంద్రం ఏర్పాటుచేస్తున్న హెచ్‌సీఎల్‌ రెండోదశలో అమరావతిలోని ఐనవోలులో 10 ఎకరాల్లో రెండో కేంద్రం ఏర్పాటుచేస్తుందన్నారు. ‘‘మార్చి 30న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రాథమిక అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం మూడురోజుల తర్వాత నేను ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. ఎవ్వరూ చేయని విధంగా 45 రోజుల్లోనే వారికి భూమి ఇచ్చాం.హెచ్‌సీఎల్‌ మూడునాలుగేళ్లలో విజయవాడ కేంద్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టి 5వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. సైబరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌తో ప్రారంభమైనట్లుగానే అమరావతి హెచ్‌సీఎల్‌ ద్వారా ప్రారంభమవుతోంది. నాడర్‌ ఏపీ గ్రామీణాభివృద్ధికి తన ఫౌండేషన్‌ద్వారా సాయం చేస్తామన్నారు. మదురైలో 128 రోజుల్లో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ కట్టారు. అమరావతి క్యాంపస్‌ను 125 రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయంచాం. జూన్‌ 2018కి మొదటి భవనం ప్రారంభిస్తారు. రాబోయే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐటీ రంగంలో ప్రస్తుతం ఎదురుగాలి వీస్తున్నప్పటికీ ఏపీలో తెలివైన యువత ఉన్నందునే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి శివనాడార్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఎంఓయూల్లో 78% పెట్టుబడులుగా.. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎంఓయూల్లో 78% పెట్టుబడులుగా మార్చాం. మున్ముందు మరిన్ని పెట్టుబడులొస్తాయి. ఉద్యోగాల విషయంలో మనవాళ్లు 60% నైపుణ్యలోపం, 40% కమ్యూనికేషన్స్‌ లోపం ఉన్నట్లు గుర్తించాం. వాటిని అధిగమించేందుకు ఈ రెండింటినీ పూర్తిస్థాయిలో నేర్పించి జాబ్‌ రెడీ యూత్‌ను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ప్రమాణస్వీకారం చేసిన 100వ రోజున నైపుణ్యాభివృద్ధిపై ముఖ్య ప్రకటన చేయబోతున్నాం’’ అని లోకేష్‌ వెల్లడించారు.

స్థానికులకే అన్ని ఉద్యోగాలు.. విజయవాడ సెంటర్‌లో 5వేల ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని హెచ్‌సీఎల్‌ ప్రతినిధి పవన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు అద్భుతంగా సహకరిస్తోందన్నారు. ఈ క్యాంపస్‌ వచ్చే ఏడాది జులైకల్లా ప్రారంభమవుతుందన్నారు. స్థానికంగా ఉన్న యువతకే అత్యుత్తమ శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. అమరావతి హెచ్‌సీఎల్‌ సెంటర్‌ క్లయింట్లన్నీ ఫార్చూన్‌ 500 కంపెనీలేనని, అందువల్ల ఆ సెంటర్‌లో పనిచేసేవారికి ప్రపంచస్థాయి నైపుణ్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ ఇన్‌ఛార్జి ముఖ్యకార్యదర్శి బి.శ్రీధర్‌, హెచ్‌సీఎల్‌ ఉపాధ్యక్షుడు వినీత్‌విజ్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

AP Impresses HCL With Record Speed A Team of Andhra Pradesh Government officials headed by IT Minister Nara Lokesh has visited HCL Office in Noida and will be meeting with HCL Chairman Shiva Nadar. Lokesh will be handing over the land allotment letter and a file with all necessary permissions. The company is amazed at the speed the government has cleared everything. HCL had entered into an MOU with Andhra Pradesh government to set up two BPOs in Gannavaram and Amaravati. The Company will be developing a SEZ on the 17 acres land allotted near Gannavaram and will be investing 500 Crore here. A majority of the jobs will be given to Krishna, Guntur, and Godavari districts. HCL will be setting up Skill Development Centers to train the locals and will later hire them. HCL will begin the construction here very soon. 

 

Link to comment
Share on other sites

125 రోజుల్లో హెచ్ సీఎల్‌!
 
636302374649870863.jpg
  • అప్పటికల్లా నిర్మాణం పూర్తి.. 2018 జూలై నుంచి కార్యకలాపాలు
  • 45 రోజుల్లోనే అనుమతులు.. నైపుణ్య శిక్షణపై త్వరలో ప్రకటన: లోకేశ్‌
  • హెచసీఎల్‌ అధినేతతో భేటీ.. ఐటీలో చంద్రబాబే మేటి: శివనాడార్‌
  • 21 కంపెనీలకు ఎన్నారైలు ఓకే!.. అమెరికా నుంచి తిరిగొచ్చిన సీఎం
న్యూఢిల్లీ, మే 12(ఆంధ్రజ్యోతి): సనరైజ్‌ స్టేట్‌ ఏపీలో 125 రోజుల్లోనే ఐటీ దిగ్గజం హెచసీఎల్‌ ఏర్పాటు కానుంది. అప్పటికల్లా నిర్మాణం పూర్తి చేసుకుని, 2018 జూలైలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని ఐటీ మంత్రి లోకేశ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో హెచసీఎల్‌ చైర్మన శివనాడార్‌తో భేటీ అయ్యారు. కంపెనీకి అవసరమైన భూమి, ఇతర అనుమతుల పత్రాలను హెచ్‌సీఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విజ్‌కు ఏపీ ఐటీ శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి బి. శ్రీధర్‌ మంత్రి లోకేశ్‌ సమక్షంలో అందజేశారు. అనంతరం లోకేశ మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 45 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పారు. ఒకప్పుడు సైబరాబాద్‌ను చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్‌ సంస్థతో ప్రారంభించారని, ఇప్పుడు తాను అమరావతిలో ఐటీ పరిశ్రమను హెచసీఎల్‌తో మొదలు పెడుతున్నానని చెప్పారు. మున్ముందు మరెన్నో సంస్థలు వస్తాయన్నారు.
 
హెచసీఎల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ను కొనుగోలు చేస్తోందని, వాటన్నింటి పైన అమరావతి క్యాంప్‌సలో అభివృద్ధి, పరిశోధన జరుపుతుందన్నారు. అంతటి గొప్ప సంస్థ కాబట్టే తాను ఎక్కువ చొరవ తీసుకున్నానని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని, 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తారని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, యువతీ యువకుల ప్రతిభ కారణంగానే ఈ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. అమరావతి క్యాంప్‌సలో ఉద్యోగులుగా స్థానిక యువతను మాత్రమే ఈ సంస్థ తీసుకుంటుందన్నారు. తద్వారా వారికి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు.
 
రికార్డు స్థాయిలో 125 రోజుల్లోనే దీని నిర్మాణం జరుగుతుందని, 2018 జులైలో ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు. తాను గతంలోనే చెప్పినట్లుగా రాబోయే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టానని, ఈ దిశగా హెచసీఎల్‌ ఏర్పాటు తొలి అడుగని, అమరావతిలో ఐటీ రంగ నిర్మాణానికి గట్టి పునాది అని వివరించారు. రాష్ట్ర యువతీ యువకులను కాలేజీల్లోనే ఉద్యోగానికి సిద్ధం చేసేందుకు తగిన నైపుణ్య శిక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి చెప్పారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నైపుణ్య శిక్షణపై కీలక ప్రకటన చేస్తానని చెప్పారు.
 
అందరికంటే ముందు చంద్రబాబు: శివనాడార్‌
దేశంలో ఐటీ రంగాన్ని అందరికంటే ముందు ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడేనని హెచసీఎల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శివనాడార్‌ అన్నారు. చంద్రబాబు ఒక విజన ఉన్న నాయకుడని, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి ఏపీని ఐటీ హబ్‌గా మార్చారని కితాబునిచ్చారు. చంద్రబాబును తాను చాలాసార్లు కలిశానని, ప్రతిసారీ రాష్ట్ర ఐటీ అభివృద్ధి గురించే ఆయన మాట్లాడేవారని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తీసుకురావటమే తన అజెండా అనేవారని గుర్తు చేసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి, విలువలతో కూడిన వ్యాపారమే హెచసీఎల్‌ విజయరహస్యమన్నారు.
Link to comment
Share on other sites

21 ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎన్నారైలు ఓకే
 
  • అమెరికా నుంచి రాష్ర్టానికి చేరుకున్న చంద్రబాబు
  • గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం
అమరావతి, గుంటూరు, మే 12(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు స్వరాష్ర్టానికి చేరుకున్నారు. ఏడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరిన ఆయన... అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాష్ర్టానికి భారీ పెట్టుబడులు వచ్చేలా, వేలాది మందికి ఉపాధి కల్పించేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు శనివారం నెల్లూరు వెళ్తారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
 
ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా అనేక మంది ఎన్నారైలు ఆయనతో భేటీ అయ్యారు. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధానిలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, సంస్థలను ఏర్పాటు చేయడానికి 21 మంది ముందుకొచ్చారు. ఏపీ ఎన్నార్టీ కన్వీనర్‌ డాక్టర్‌ రవి, అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరామ్‌, నాట్స్‌ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, తానాకు చెందిన సతీ్‌షవేమన తదితరుల సమక్షంలో ఎన్నారైలు సీఎం చంద్రబాబుతో చర్చించి తమ అంగీకారం తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
Andhra Pradesh to generate 200,000 jobs in IT, electronics manufacturing State Minister Nara Lokesh said that govt will generate 2 lakh jobs in electronics & IT within 2 yrs

Press Trust of India  |  New Delhi  June 28, 2017 Last Updated at 21:13 IST

 
1498334661-212.jpg
Andhra Pradesh minister invited Prasad in the inauguration of six IT companies in the state in the coming six months
  •  
  •  

Andhra Pradesh will generate around two lakh jobs in electronics manufacturing and IT sector within two years, state minister Nara Lokesh said today.

The Andhra Pradesh IT minister said, "To meet the target, apart from manufacturing of mobile phones and consumer durables, focus will be also on manufacturing of medical devices."

 


He met Union Information Technology Minister Ravi Shankar Prasad today and sought his assistance for a variety of IT projects which are in the pipeline and has the potential to generate jobs.

"The Union minister assured us help as Andhra Pradesh is growing fast in both the sectors (electronics manufacturing and IT) with large investments pouring in," Lokesh, who is the son of Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, said.

He invited Prasad in the inauguration of six IT companies in the state in the coming six months.

Besides, he also held talks with drone-manufacturing companies and Indian Cellular Association (ICA), a body comprising mobile manufacturers, brand owners and other, for bringing more investments to the state.

"We received good response, feedback and suggestions from the ICA during the interactions," he said.

Last week, Lokesh, who also handles the Panchayat Raj portfolio, had said that the state government is committed to generating six lakh jobs in the state in various sectors by 2019.

Link to comment
Share on other sites

ee IT companies vasthunnayi. 

విజయవాడకు ఏడు ఐటీ కంపెనీలు

ఈనాడు, అమరావతి: విజయవాడకు ఐటీ కంపెనీల రాక పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ హెచ్‌సీఎల్‌ సహా పలు కంపెనీలు కాలుమోపిన సంగతి తెలిసిందే. ఈనెల రెండోవారంలో విజయవాడ మహానాడు రోడ్డులోని ఐటీ భవనంలో ఏడు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఏలెర్న్‌, ఎంపవర్‌, సుప్రీమ్‌ నెట్‌సాఫ్ట్‌, ఎంబీఎం ఇన్ఫో సెర్వ్‌, డాక్టర్‌ కంప్యూటర్‌, ఇన్‌స్పైర్‌ ల్యాబ్స్‌, పిక్జెంటియా కంపెనీలను రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించనున్నారు.

Link to comment
Share on other sites

విజయవాడ: 2019లో రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విజయవాడలో ఏడు ఐటీ కంపెనీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సంస్థల ద్వారా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. తాను మంత్రి పదవి చేపట్టిన 90 రోజుల్లోనే 3వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.కంపెనీలు ప్రారంభించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. చిన్న సంస్థలను ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలుగా మారతాయన్నారు. ప్రపంచంలో ఏ కంపెనీలో చూసినా అధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఉంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ ఒకేచోట ఉండేలా విధంగా విజయవాడ, విశాఖలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా పాలసీలు రూపొందించామని... డెవలపర్స్‌కు 50శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తోందని వెల్లడించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి పెద్ద ఐటీ కంపెనీలు రానున్నాయని లోకేశ్‌ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరుకల్లా అమరావతి నుంచి హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని లోకేశ్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

విశాఖలో డ్రోన్ల తయారీ!


636353405216967187.jpg



  • రాష్ట్రవ్యాప్తంగా ఐటీ కంపెనీల విస్తరణ
  • గన్నవరంలో 100 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌
  • ఐటీ శిక్షణ కేంద్రంగా మంగళగిరి
  • 20న ఐటీ శిక్షణ కేంద్రాలకు శ్రీకారం: లోకేశ్‌
  • విజయవాడలో 7 ఐటీ కంపెనీలు ప్రారంభం

 

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా డ్రోన్ల తయారీ పరిశ్రమ రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఏడు ఐటీ సంస్థలను ఆయన ప్రారంభించారు. ఆటోనగర్‌ కె-బిజినెస్‌ సెంటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ఎలెర్న్‌, సుప్రీం నెట్‌సాఫ్ట్‌, క్రెసోల్‌ ఇన్‌ఫోసెర్వ్‌, డీఆర్‌ కంప్యూటర్‌,్స ఇన్‌స్పైర్‌ల్యాబ్స్‌, ఎన్వీరా, స్టీమ్జ్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలు విజయవాడ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంస్థల్లో ప్రాథమికంగా 300 మందికి, ఆతర్వాత మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. విశాఖలో డ్రోన్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రఖ్యాత సంస్థ ముందుకు వచ్చిందని ప్రకటించారు. విశాఖలో త్వరలోనే మరిన్ని మేజర్‌ ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని తెలిపారు. దక్షిణాసియాలోనే అత్యంత పెద్దదైన బిగ్‌ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గన్నవరం వద్ద 100 ఎకరాల్లో ఐటీ క్లస్లర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం కాపులుప్పాడ వద్ద రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని, ఫిన్‌టెక్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్లాక్‌చైన్‌, పేటియం వంటివి స్థాపించేందుకు ఆ సంస్థలు ముందుకు వస్తున్నాయని లోకేశ్‌ చెప్పారు. భవిష్యత్తులో రైతులు ఎరువులు వేయాలన్నా.. క్రిమి సంహారక మందులు చల్లాలన్నా డ్రోన్‌లను వినియోగించే రోజులు సమీపంలోనే ఉన్నాయని చెప్పారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇంటెలిజెన్స్‌నూ విశాఖలో స్థాపించనున్నామని చెప్పారు. 90 రోజుల్లో రాష్ట్రంలో 36 ఐటీపరిశ్రమలు ప్రారంభమయ్యాయన్నారు.

 

హెచ్‌సీఎల్‌తో భారీ ఉపాధి

గన్నవరం సమీపంలో గతంలో 15 ఎకరాల్లో ఐటీ కార్యకలాపాలను చేపట్టి 3000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ముందుకొచ్చిన హెచ్‌సీఎల్‌ సంస్థ ఇప్పుడు 30 ఎకరాలను కోరుతోందని లోకేశ్‌ తెలిపారు. సంప్రదాయ ఐటీ విధానాలను కాకుండా క్లౌడ్‌ ఆధారిత ఐటీ పరిశ్రమలను స్థాపిస్తామని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే .. గ్లోబల్‌ ఇన్‌హౌజ్‌ సెంటర్‌, డీటీపీ పాలసీలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం .. త్వరలోనే కేబినెట్‌ ముందుకు క్లౌడ్‌ హబ్‌ పాలసీని తీసుకువస్తుందని వివరించారు. 90 రోజుల్లోనే ఏపీఎన్‌ఆర్‌టీ 7 సంస్థలను విజయవాడకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. అక్టోబర్‌లో డిక్సన్‌ వస్తోందని చెప్పారు. విశాఖలో 7 అసెంబ్లింగ్‌ యూనిట్‌లను స్థాపిస్తామని చెప్పారు. మంగళగిరిలో ఐటీ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 28న పైడేటా సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. 20న పలు ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రులు దేనినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవి వేమూరు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...