Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

కృష్ణా జిల్లా గన్నవరంలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన లోకేశ్
 
636294073538648360.jpg
కృష్ణాః జిల్లాలోని గన్నవరం మేధా టవర్స్‌లో 7 ఐటీ కంపెనీలను బుధవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెస్లోవా, చందూసాఫ్ట్‌, స్పెయిన్‌కు చెందిన గ్రూపో ఆంటోలిన్‌, జర్మనీకి చెందిన ఐఈఎస్‌, ఎంఎన్‌సీ రోటోమేకర్‌, ఈసీసాఫ్ట్‌, యమైహ్‌ ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన ఐటీ కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఐటీ కంపెనీలు ప్రారంభమైనందున సుమారు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
Link to comment
Share on other sites

Try for biggies Oracle, Microsoft, Apple in AP rest of IT companies will fall in line to AP. Hope CBN & team will try to get at least 1 of these 3 in this week's US visit.

 

Microsoft vachhake Hyderabad became global player & MNCs started coming to Hyd. Appati varaku very few Indian companies vundevi.

Link to comment
Share on other sites

Amaravati ki thondralo  International chip design company?

అమరావతికి సిస్కో!

09-05-2017 02:13:09

636298928101411006.jpg
  • సీఎం బృందానికి ఐటీ దిగ్గజం ప్రత్యేక ప్రాధాన్యం
  • చర్చలు జరిపిన సిస్కో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌
  • 30 మంది ఐటీ సీఈవోలను పిలిచి మరీ అల్పాహార చర్చలు
  • చాంబర్స్‌ నివాసంలో 3 పర్యాయాలు సమావేశాలు
  • చంద్రబాబుపై ఎంతో గౌరవం... ఏపీపట్ల మాకు నిబద్ధత
  • దానికి ఈ భేటీయే సూచిక: జాన్‌ చాంబర్స్‌ ఉద్ఘాటన
  • అప్లయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ
  • ఏపీలో సెమీకండక్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆహ్వానం
  • విద్యుత్‌ చార్జీలు పెరగవు తగ్గుతాయి.. ప్రవాసులతో బాబు
అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో పెట్టుబడుల వేట సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి మరో విజయం ఎదురైంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ ‘సిస్కో’ అమరావతికి రాకపై సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. సాధారణంగా రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలవడానికి ఇష్టపడని... సిస్కో అధిపతి జాన్‌ చాంబర్స్‌ సీఎం బృందాన్ని స్వయంగా నివాసానికి ఆహ్వానించారు. అంతేకాదు... ఈ సమావేశంలో మరో 30 కంపెనీల సీఈవోలూ పాల్గొనేలా చూశారు. ఇది నవ్యాంధ్రకు సిస్కో ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని... అమరావతికి ఆ సంస్థ రావడం ఖాయమని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు. అమెరికా పర్యటనలో నాలుగోరోజున చంద్రబాబు, ఇతర ప్రతినిధులు శాన్‌హోజెలో పర్యటించారు. సిస్కో వరల్డ్‌ వైడ్‌ హెడ్స్‌ జాన్‌ చాంబర్స్‌, జాన్‌ కెర్న్‌తో సమావేశమయ్యారు. సిస్కో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న జాన్‌ చాంబర్స్‌ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. జాన్‌ చాంబర్స్‌ సీఎం బృందంతో మూడు పర్యాయాలు చర్చలు జరిపారు.
 
‘‘ఈ చర్చలు ఏపీ, భారత్‌ పట్ల మాకు ఉన్న నిబద్ధతకు అద్దం పడుతాయి. వ్యక్తిగతంగా చంద్రబాబు పట్ల నాకు ఉన్న గౌరవానికి సూచిక’’ అని జాన్‌ చాంబర్స్‌ తెలిపారు. ఆధునిక కమ్యూనికేషన్స్‌ వ్యవస్థ ప్రపంచాన్ని ఏవిధంగా అనుసంధానం చేస్తుందో సీఎం బృందానికి సిస్కో ప్రతినిధులు ప్రత్యేక ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ ఎగ్జిక్యూటివ్స్‌తో తన బోర్డు రూమ్‌ నుంచే సమావేశమయ్యే విధానాన్ని చాంబర్స్‌ సీఎంకి ప్రదర్శించి చూపారు. సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని చాంబర్స్‌ను సీఎం కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. సీఎం బృందానికి జాన్‌ చాంబర్స్‌ అల్పాహార విందు ఇచ్చారు. సెమీ కండక్టర్‌ చిప్‌ల తయారీలో పేరొందిన అప్లైయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారికి సీఎం ఆహ్వానం పలికారు.
 
ఇదీ ‘సిస్కో’
నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న సంస్థ సిస్కో! హార్డ్‌వేర్‌, టెలీకమ్యూనికేషన్స్‌ పరికరాలు, ఓపెన్‌ డీఎక్స్‌, వెబ్‌ ఎక్స్‌, జాస్పర్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (లాన్‌) సేవల్లో ప్రపంచంలోనే సిస్కో నెంబర్‌వన్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ కార్యాలయాల్లో 72 వేల మంది పనిచేస్తున్నారు. అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్ర ఐటీ రంగానికి అది పెద్ద ఊపు ఇస్తుందని సీఎం బృందంలోని అధికారులు ‘ఆంధ్రజ్యోతి’తో వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

అమెరికాలో పెట్టుబడుల అన్వేషణ సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి మరో విజయం దక్కింది. నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌ లో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా పేరున్న సిస్కో అమరావతికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలిసేందుకు ఇష్టపడని సిస్కో చీఫ్ జాన్ చాంబర్స్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించారు. అంతేకాక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 30 కంపెనీల సీఈవోలు పాల్గొనేలా చూడడం ఏపీకి ఆయనిచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అమరావతిలో సిస్కో సంస్థ అడుగుపెట్టేందుకు దాదాపు సిద్ధంగా ఉందని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా సిస్కో అధిపతి జాన్ చాంబర్స్ మాట్లాడుతూ ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్, భారత్ పట్ల తమకున్న నిబద్ధతకు అద్దం పడతాయని, వ్యక్తిగతంగా చంద్రబాబు పట్ల తనకున్న గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని కోరగా, చాంబర్స్ స్పందిస్తూ అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. అయితే మరో వైపు బీపీఓ సేవల సంస్థ పట్రా కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ఎస్ సింప్సన్, చంద్రబాబుతో సమావేశమై, తమ సంస్థ ఏపీలో విస్తరణ పట్ల ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్థలం లభించక రాయ్ పూర్ కు తరలి వెళ్లామని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, పెట్రా కార్ప్ కు టెక్ మహీంద్రా బిల్డింగ్ ను కేటాయించాలని అక్కడికక్కడే ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు.

 

Link to comment
Share on other sites

నేడు శివనాడార్‌తో లోకేశ్‌ భేటీ
 
అమరావతి/న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి హోదాలో నారా లోకేశ్‌ తొలిసారి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ వచ్చిన ఆయన బుధవారం ఉదయం 7:30 గంటలకు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌తో సమావేశమవుతారు. అమరావతిలో ఆర్‌ అండ్‌ డీ, సేవారంగాలు, శిక్షణ కేంద్రాలను హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా ఐదువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఒప్పందం మేరకు కేవలం 45 రోజుల్లోనే అన్ని అనుమతుల మంజూరుతోపాటు.. కంపెనీ ఏర్పాటుకు అవసరమయ్యే 17.86 ఎకరాల భూమి పత్రాలను సిద్ధం చేయించిన లోకేశ వాటిని శివనాడార్‌కు అందజేయనున్నారు. రెండేళ్లలో రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు, ఐదు లక్షల తయారీ రంగం ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా లోకేశ్‌ ఐటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతోనూ, సాయంత్రం 3 గంటలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్‌తో ఆయన భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌కు 17 ఎకరాల భూమి

గన్నవరం వద్ద ఆర్టీసీ డ్రైవింగ్‌ పాఠశాల స్థలం కేటాయింపు

నేడు దిల్లీలో పత్రాల అందజేత

శివనాడార్‌తో భేటీ కానున్న మంత్రి నారా లోకేష్‌

ఈనాడు, అమరావతి: దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌కు గన్నవరం వద్ద ప్రభుత్వం 17 ఎకరాల ఆర్టీసీ డ్రైవింగ్‌ పాఠశాల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, ఐటీ శాఖాధికారుల బృందం శుక్రవారం నోయిడాలోని హెచ్‌సీఎల్‌ కార్యాలయాన్ని సందర్శించనుంది. అక్కడ సంస్థ అధినేత శివనాడార్‌తో లోకేష్‌ భేటీ అవుతారు. ఈ సమావేశంలో భూముల కేటాయింపు పత్రాలను, సంస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను అప్పగించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ నగరంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహించడానికి హెచ్‌సీఎల్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో అది ఒక పెద్ద బీపీవో ఏర్పాటు చేయనుంది. దానికంటే ముందుగా గన్నవరం వద్ద బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. స్థానికంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గన్నవరం వద్ద ఇచ్చే స్థలాన్ని ఆ సంస్థ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిగా అభివృద్ధి చేయనుంది. ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని, ప్రధానంగా కృష్ణా, గుంటూరు, కోస్తా జిల్లాల్లోని వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. బయట ప్రాంతాల నుంచి ఉద్యోగులను తీసుకోవడం కంటే స్థానికంగా ఉండే వారికి శిక్షణ ఇచ్చి వారినే నియమించుకోవాలనే సంప్రదాయాన్ని హెచ్‌సీఎల్‌ పాటిస్తుంటుంది. ఇప్పటికే ఇక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఆ సంస్థ ప్రారంభించింది. ‘త్వరలోనే ఇక్కడ హెచ్‌సీఎల్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు మొదలుపెడతామ’ని సంస్థ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్ చైర్మన్‌ శివనాడార్‌తో లోకేశ్‌ భేటీ
 
ఢిల్లీ: హెచ్‌సీఎల్ చైర్మన్‌ శివనాడార్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. శివనాడార్‌, లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, హెచ్‌సీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. ఏపీలో హెచ్‌సీఎల్ ఏర్పాటుకు అనుమతి పత్రాలను శివనాడార్‌కు లోకేశ్‌ అందజేశారు.
Link to comment
Share on other sites

చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన శివనాడార్‌
 
636302030143790096.jpg
ఢిల్లీ: సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని హెచ్‌సీఎల్ చైర్మన్‌ శివనాడార్‌ కొనియాడారు. అందరికంటే ముందే ఐటీరంగాన్ని ప్రోత్సహించారని చెప్పారు. శివనాడార్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. శివనాడార్‌, లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, హెచ్‌సీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. ఏపీలో హెచ్‌సీఎల్ ఏర్పాటుకు అనుమతి పత్రాలను శివనాడార్‌కు లోకేశ్‌ అందజేశారు. ఈ సందర్భంగా శివనాడార్ మాట్లాడుతూ చంద్రబాబును అనేక సందర్భాల్లో కలిశానని, ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండా అని చెప్పేవారని గుర్తుచేశారు. నైపుణ్య అభివృద్ధి, విలువలతో కూడిన వ్యాపారమే హెచ్‌సీఎల్ కంపెనీ విజయ రహస్యమని శివనాడార్ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...