Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

పక్షం రోజుల్లో హెచ్‌సీఎల్‌ ప్రారంభం!
07-08-2018 08:29:14
 
636692273538326517.jpg
  • మేథలో హెచ్‌సీఎల్‌ బ్లాక్‌ ఇంటీరియర్‌ పనులు పూర్తి
  • ఐటీ మంత్రి నారా లోకేష్‌చే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
విజయవాడ: ఎప్పుడా.. ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సేవలు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. కేసరపల్లి ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని ‘మేథ’ టవర్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సేవలను ప్రారంభించటానికి హెచ్‌సీఎల్‌ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించటానికి హెచ్‌సీఎల్‌ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆ సంస్థకు చెందిన ప్రతినిథి బృందం మేథ టవర్‌ను సందర్శించింది. హెచ్‌సీఎల్‌ బ్లాకులో గత కొద్దినెలలుగా ఇంటీరియర్‌ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. పూర్తయిన ఇంటీరియర్‌ పనులను హెచ్‌సీఎల్‌ బృందం పరిశీలించింది. గన్నవరంలోని ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో శాశ్వతంగా టెక్నాలజీస్‌ పార్క్‌ నిర్మాణానికి హెచ్‌సీఎల్‌ మరోవైపు చర్యలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఉండటం వల్ల డిజైన్లకు కేంద్రం నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున ఇక్కడ శంకుస్థాపన, హైరైజ్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘మేథ’ టవర్‌లో తాత్కాలికంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్‌ నిర్ణయించింది. లక్ష అడుగుల విస్తీర్ణాన్ని తీసుకుని గత ఆరు నెలలుగా పనులు చేయిస్తోంది.
 
హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే హెచ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. మేథ టవర్‌ నుంచి తాత్కాలికంగా సేవలు అందించనున్న హెచ్‌సీఎల్‌ స్థానికంగా ఉన్న వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటుందా అన్నదానిపై అనుమానంగా ఉంది. హెచ్‌సీఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం నూతనంగా నిర్మించబోయే హై రైజ్‌ బిల్డింగ్‌లో కార్యకలాపాలు ప్రారంభించటానికే స్థానికంగా ఉన్న యువతకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇంకా శంకుస్థాపన కూడా అక్కడ జరగలేదు. ఈ క్రమంలో తాత్కాలికంగా మేథ టవర్‌ నుంచి సేవలు అందించటానికి సన్నాహకాలు చేస్తున్నా .. తమ పాత సిబ్బంది ద్వారా విధులు నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఆ సంస్థ నిర్వాహకులు చేపట్టలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చూస్తే.. పూర్తి స్థాయిలో గన్నవరంలో నిర్మించే టెక్నాలజీస్‌ పార్క్‌లో మాత్రమే స్థానికంగా ఉన్న యువతను ఉద్యోగాలలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
13న స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌ ప్రారంభం
01-09-2018 07:25:03
 
636713835048453468.jpg
  • 900 మందితో కార్యకలాపాలు
  • ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హెచ్‌సీఎల్‌’ కల మరికొద్ది రోజులలో సాకారం కాబోతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా ‘ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ’లోని ‘మేధ’ టవర్‌లో సెప్టెంబర్‌ 13న హెచ్‌సీఎల్‌ సంస్థకు చెందిన సోదర సంస్థ ‘స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 900 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ. ఈ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు రాకను దృష్టిలో ఉంచుకుని ఏస్‌ అర్బన్‌- ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ ముస్తాబౌతోంది. ప్రధాన గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గాన్ని ఆధునికీకరించారు.
 
హైవే - 16 వెంబడి గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గంలో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. హెచ్‌సీఎల్‌ సంస్థ మేధ టవర్‌లో తన సోదర సంస్థ కోసం 900 సీట్ల ఆక్యుపెన్సీ ఉన్న స్థలాన్ని తీసుకుంది. పూర్తిగా మేథ టవర్‌లో ఒక బ్లాక్‌ అన్నమాట. దాదాపుగా నాలుగునెలలుగా మేధ టవర్‌లో జరుగుతున్న ఇంటీరియర్‌ పనులు పూర్తయ్యాయి. ‘స్టేట్‌ స్ర్టీట్‌’ కార్యకలాపాలు నిర్వహించటానికి వీలుగా అధికారుల ఛాంబర్లు, సమావేశపు హాల్‌, వర్కింగ్‌ గ్రూప్‌లతో పాటు సిబ్బందికి రెస్ట్‌ రూమ్స్‌ వంటివి కూడా ఏర్పాటయ్యాయి. హెచ్‌సీఎల్‌ ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలిపేందుకు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా సమయం ఉండటం వల్ల అధికారికంగా తర్వాత ప్రకటిద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
 
ఏస్‌ అర్బన్‌ సంస్థ నిర్వాహకులు మాత్రం మేధ టవర్‌లోకి మీడియాను అనుమతించటం లేదు. ప్రస్తుతం స్టేట్‌ స్ర్టీట్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నా.. హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రధాన కార్యకలాపాలు ప్రారంభించటానికి ఇంకాస్త సమయం ఉంది. హెచ్‌సీఎల్‌ సంస్థకు గన్నవరంలోని ఆర్టీసీ జోనల్‌ డ్రైవింగ్‌ కాలేజీకి చెందిన 27 ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ, హెచ్‌సీఎల్‌ సంస్థల మధ్య సేల్‌ డీడ్‌ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ స్థలాన్ని హెచ్‌సీఎల్‌ అధికారులు చదును చేశారు. ఇక్కడ టెక్నాలజీస్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇక్కడ హై రైజ్‌ భవనం నిర్మించిన తర్వాత స్థానికంగా ఉన్న పట్టభద్రులకు ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించే తన సోదర సంస్థలో మాత్రం పాత ఉద్యోగులే ఉంటారని సమాచారం. హెచ్‌సీఎల్‌ సోదర సంస్థ మేధలో కాలు పెట్టనుండటంతో ఐటీ పార్క్‌కే కళ వచ్చింది.
 
మేధ టవర్‌ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్‌ ఐటీ కంపెనీగా ‘స్టేట్‌ స్ర్టీట్‌ ’ సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసర పల్లికి మహర్దశ పట్టుకుంది
Link to comment
Share on other sites

రాజధానికి.. ఐటీ శోభ
03-09-2018 08:12:42
 
636715591610119924.jpg
  • నేడు మ్యాక్స్‌ ఐటీ టవర్స్‌కు శంకుస్థాపన
  • భూమి పూజ చేయనున్న మంత్రులు
  • కేఈ కృష్ణమూర్తి, నారా లోకేష్‌, పుల్లారావు రాక
  • చినకాకాని వద్ద ఏర్పాట్లు పూర్తి
 
మంగళగిరి: మంగళగిరి ప్రాంతం టెక్నాలజీ శోభతో విస్తరిస్తుంది. రాజధాని ప్రాంతంలోని పలు పట్టణాల్లో అనేక ఐటీ కంపెనీల ఏర్పాటుతో అత్యధిక మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారతదేశంలోనే టెక్నాలజీని ఉపయోగించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగంలో నిలుపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పలు నూతన కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి వెంబడి మంగళగిరి వద్ద చినకాకాని గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మ్యాక్స్‌ ఐటీ టవర్స్‌ శంకుస్ధాపన కార్యక్రమానికి సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఐటీఈ అండ్‌సీ ప్రిన్సిపల్‌ సెక్రటరి కె.విజయానంద్‌, మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి హాజరై భూమిపూజ నిర్వహించనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటుగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు భాగస్వాములై భావితరాల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సంస్ధ నిర్వాహకులు బిట్రా వెంకటేష్‌, తుమ్మా సాంబశివరావు, జోగి వెంకటేశ్వరరావులు తెలిపారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషి అభినందనీయమన్నారు. 11 అంతస్థులతో నిర్మాణం చేసే మ్యాక్స్‌ ఐటీ టవర్స్‌ మొదటి ఫేజ్‌లో 15వేల మందికి, 2వ ఫేజ్‌లో మరో 15వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇంటిగ్రిటీ ఐటీకమ్యూనిటీస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా.. ట్రైనింగ్‌, రెసిడెన్సీ, ఉద్యోగం అన్ని ఒకే చోట ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నామన్నారు. మంత్రుల రాకను దృష్టిలో ఉంచుకుని శంకుస్ధాపన ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. సోమవారం శంకుస్థాపన కార్యక్రమ నిర్వాహణకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడలో హెచ్‌సీఎల్‌ ఎస్‌ఎస్‌హెచ్‌ఎస్‌

043335BRK105-HCL.JPG

న్యూదిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌.. అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఐటీ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 63వేల చదరపు అడుగల విస్త్రీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌ ఏర్పాటు ద్వారా 1000మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బ్యాక్‌ ఆఫీస్‌, పెట్టుబడి నిర్వహణ, పరిపాలన విభాగం, బ్రోకరేజ్‌ సేవలు మొదలైన వాటిని ప్రారంభిస్తామని బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించింది.

‘ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మా సేవలు మరింత విస్తరిస్తాయని విశ్వాసంతో ఉన్నాం. అంతేకాదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. యువత సొంత రాష్ట్రంలో ఉపాధి పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు అనూప్‌ తివారి తెలిపారు.

Link to comment
Share on other sites

రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి కృషి

072600AMR-BRK8A.JPG

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలకు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడల యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో మేధాటవర్‌లో నూతనంగా ఏర్పాటు జెమిని కన్సల్టెంట్ సర్వీసు సాఫ్ట్‌వేర్ సంస్థని మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్టణం ఎంపీ కొనకళ్ల నారాయణ కలిసి ప్రారంభించారు. అమరావతిలో ఇప్పటికే 57 ఐటీ సంస్థలు రావటం జరిగిందన్నారు. మరిన్ని సంస్థలు త్వరలో రానున్నాయిని వీటి కోసం భవనాలు నిర్మాణదశలో ఉన్నాయని తెలిపారు. జెమిని సాఫ్ట్‌వేర్ సంస్థ ఏర్పాటుకు ముందకు రావటం శుభ పరిణామం అన్నారు. దింతో 120 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

Link to comment
Share on other sites

సైబర్‌వాడలోకి మరో ఐటీ దిగ్గజం
17-09-2018 09:59:11
 
636727751484553094.jpg
  • ‘మేధ’లోకి జెమిని కన్సల్టింగ్‌ సర్వీస్‌ శాఖ
  • 5 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు.. 100 మందికి ఉపాధి
  • సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌కు రూపకల్పన
  • రాజధాని ప్రాంతంలో 9వ శాఖ ..
  • ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల
 
విజయవాడ: సైబర్‌వాడ కేసరపల్లి ‘మేధ’ ఐటీ టవర్‌లోకి మరో పరిశ్రమ వచ్చిచేరింది. జెమిని క న్సల్టింగ్‌ సర్వీసెస్‌ (జీసీఎస్‌) కంపెనీ ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన శాఖను ఆదివారం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావులు జీసీఎస్‌ నూతన శాఖను ప్రారంభించారు. తొలుత వందమందికి స్థానికంగా ఉపాధి కల్పించింది. విభజన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్న ఏపీ ఎన్‌ఆర్‌టీ సంప్రదింపులతో ఏర్పాటు చేసిన తొలి సంస్థగా జీసీఎస్‌ నిలిచింది.
 
వివిధ కేటగిరీలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను ఈ సంస్థ తయారు చేసి అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, మధ్య తూర్పు భారతదేశంలో తన శాఖలతో విస్తరించి అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను అందిస్తోంది. బహ్రెయిన్‌, కువైట్‌, దుబాయ్‌, ఒమన్‌ వంటి దేశాలతో పాటు భారతదేశంలో హైదరాబాద్‌, భువనేశ్వర్‌లలో శాఖలను విస్తరించిన జీసీఎస్‌ అమరావతి రాజధాని ప్రాంతంలో తొమ్మిదో శాఖను ఏర్పాటు చేసింది. వాస్తవానికి తొమ్మిదో ఈ శాఖ విశాఖలో ప్రారంభించాలని యాజమాన్యం భావించింది. బాపట్ల ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించటం ద్వారా వారి లో ప్రతిభా సంపత్తిని వెలుగులోకి రావడంతో రాజధాని ప్రాంతంలో వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంక ల్పంతో ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది.
 
ముందుగా నైపుణ్య శిక్షణ ద్వారా ఎంపిక చేసుకున్న వందమందికి ఉద్యోగాలు కల్పించింది. వర్కింగ్‌ గ్రూపులు, ఛాంబర్లు, వర్క్‌ స్టేషన్లు, అధునాతన కంప్యూటర్లు, హై ఎండ్‌ స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ వంటి సదుపాయాలను కల్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ బ్రాంచి ద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ద్వారా వృద్ధి సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. జీసీఎస్‌ కంపెనీ ఐఎన్‌సీ-5000 గుర్తింపును పొందింది. ప్రైవేటు ఐటీ పరిశ్రమలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటిగా 2014, 2015, 2016 సంవత్సరాలలో నిలిచింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అభివృద్ధి
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఐటీని ఎంతో అభివృద్ధి చేశారు. విభజన తర్వాత 99 శాతం ఐటీ కంపెనీలన్నీ తెలంగాణాలో ఉన్నాయి. ఏపీలో కూడా ఐటీని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో అనేక రాయితీలు కల్పించటంతో పాటు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయి. ఐటీ కంపెనీలకు ఆఫీసు స్పేస్‌ కల్పించటానికి ఏపీ ఎన్‌ఆర్‌టీ సహకారం ఎంతగానో ఉంది. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, అమరావతి వంటి నగరాలలో కూడా ఐటీ అభివృద్ధి చేయాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి చొరవతో హీరో, అశోక్‌ లేల్యాండ్‌, కియా వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని , హార్డ్‌వేర్‌ హబ్‌గా ఏపీ మారుతోంది. తయారీ రంగంలో దేశంలో 30 శాతం వాటా ఏపీ నుంచే వెళుతోంది. జీసీఎస్‌ వంటి సంస్థ ఇక్కడ సేవలు అందించటం సంతోషకరం.
- మంత్రి కొల్లు రవీంద్ర
 
భవితకు భరోసా
ఐటీ ఉన్న చోట ఉపాధి, ఆదాయం ఉంటుంది. ఐటీపరంగా అభివృద్ధి చెందిన నగరాలన్నీ అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు కృషి కారణంగా ఐటీ అంటే ప్రపంచంలో హైదరాబాద్‌ను గుర్తించారు. ఏపీలో ఐటీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. మంత్రి నారాలోకేష్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉండటం వల్ల కూడా ఐటీ రంగం పురోగమిస్తోంది. ఎన్నో పరిశ్రమలు కొలువు తీరుతున్నాయి.
- ఎంపీ కొనకళ్ల నారాయణరావు
 
కంపెనీల సామర్ధ్యాన్ని చూడండి..
ఐటీ పరిశ్రమ వస్తుందనగానే ఎన్నికోట్ల పెట్టుబడితో పెడుతున్నారు? ఎంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఐటీ అంటే పెట్టుబడి, ఉపాధిని చూడకూడదు. సమర్ధతను చూడాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐటీ రంగాన్ని బలోపేతం చేసుకోవటానికి, వృద్ధి చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది.
- రవి వేమూరు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు
 
ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తాం
చెరువుల వ్యాపారం చేసే నేను అనూహ్యంగా ఐటీ రంగంలో కాలు మోపాను. జెమిని కన్సల్టింగ్‌ సర్వీసె్‌సను స్థాపించాను. ఉత్తర అమెరికాతో పాటు దేశీయంగా బ్రాంచీలను ఏర్పాటు చేసి ప్రపంచస్థాయిలో అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు చేయటం జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మా తొమ్మిదవ శాఖను ఏర్పాటు చేశాం. ఇక్కడి వారిలో ఎంతో టాలెంట్‌ ఉంది. వారికి మేమే శిక్షణనిచ్చి ఇక ్కడి బ్రాంచీలో పని చేయటానికి వంద మందికి ఉద్యోగాలు కల్పించాం.
- శ్రీని రజనీకాంత్‌, జీసీఎస్‌ సీఈవో
Link to comment
Share on other sites

మేథ’ను మరపించేలా..
18-09-2018 10:00:33
 
636728616306489761.jpg
  • హైటెక్‌ సిటీలో శరవేగంగా రెండో ఐటీ టవర్‌ నిర్మాణం
  • రూ.300 కోట్ల వ్యయంతో జీ ప్లస్‌ 6 విధానంలో నిర్మాణం
  • పార్కింగ్‌తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
  • ప్రస్తుతం జీ ప్లస్‌ త్రీ వరకు నిర్మాణ పనులు పూర్తి
  • భూ గర్భంలోనే జీ ప్లస్‌ 1 ఫ్లోర్లు
  • 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ‘మేథ’కే కళ్లు కుట్టేంతగా... సైబర్‌వాడ కేసరపల్లిలోని ‘ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ’ హైటెక్‌ సిటీలో రెండవ ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మేథ టవర్‌ కంటే దాదాపు రెట్టింపు విస్తీర్ణంలో, రెట్టింపు స్పేస్‌తో రెండవ ఐటీ టవర్‌ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. మరో మూడు నెలల్లోనే ఇది ఆర్కిటెక్చర్‌ డిజైన్‌కు అనుగుణంగా పూర్తి రూపం సంతరించుకోనుంది. నూతన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలోనే ఎన్నికల ముందుగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభోత్సవం చేసుకు నేందుకు వీలుగా వేగంగా పనులు జరుగుతున్నాయి. కేసరపల్లి హైటెక్‌ సిటీలో జరుగుతున్న రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులను సోమవారం ఆంధ్రజ్యోతి పరిశీలించింది. నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం...
 
 
ఒక్క అడుగు.. మరో అడుగుకు పునాది వేసింది! ఏడాది కాలంలోనే కళ్లు చెదిరే ఐటీ టవర్‌ సాక్షాత్కరించబోతోంది. కేసరపల్లి హైటెక్‌సిటీలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు తుది అంకానికి వచ్చాయి. హైటెక్‌సిటీలో మొట్టమొదటి టవర్‌గా ఏర్పడిన ‘మేథ’ కు వెనుక భాగంలో రూ.300 కోట్ల వ్యయంతో రెండో ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తం పార్కింగ్‌తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఐటీ టవర్‌ ను జీ ప్లస్‌ 6 విధానంలో నిర్మిస్తున్నారు. హైటెక్‌ సిటీకి అభిముఖంగా జాతీయ రహదారి - 16 కు అవతల వైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్తులో ఎత్తు అవరోధంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో భూమిలోనే జీ ప్లస్‌ 1 నిర్మాణం ఉండేలా నిర్మించటం రెండవ ఐటీ టవర్‌ నిర్మాణం ప్రత్యేకత. రెండవ ఐటీ టవర్‌ రెండు భవనాల కలబోతగా ఉంటుంది. ఒక భవనం నిర్మాణం జీ ప్లస్‌ 4 వరకు వచ్చింది. మరో భవనానికి సంబంధించి అతి కీలకమైన బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు భవన నిర్మాణాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు ఒక మహా సంగ్రామాన్నే తలపిస్తున్నాయి.
 
హైటెక్‌ సిటీ ఆవరణలో పనుల తీరు చూస్తే దీని నిర్మాణ పనులు ఎంత మహోధృతంగా జరుగుతున్నాయో అర్థమౌతుంది. హైటెక్‌ సిటీలోని నిరుపయోగ ప్రాంతాన్ని కాంట్రాక్టు సంస్థ స్వాధీనంలోకి తీసుకుంది. భారీగా కంకర, ఐరన్‌, సిమెంట్‌, ఇసుక తదితర మెటీరియల్‌ను డంప్‌ చేసుకుంది. బయటకు ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్నీ హైటెక్‌ సిటీలోనే అందుబాటులో ఉంచుకుంది. ఆవరణలోనే కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నిరంతరాయంగా కాంక్రీట్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఐరన్‌ బెండింగ్‌ వర్క్స్‌ పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఐటీ టవర్‌ నిర్మాణాన్ని భారీ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ క్రేన్‌ నిర్మిస్తోంది. సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో నిర్మాణ పర్యవేక్షణ జరుగుతోంది.
Link to comment
Share on other sites

33 minutes ago, sonykongara said:
మేథ’ను మరపించేలా..
18-09-2018 10:00:33
 
636728616306489761.jpg
  • హైటెక్‌ సిటీలో శరవేగంగా రెండో ఐటీ టవర్‌ నిర్మాణం
  • రూ.300 కోట్ల వ్యయంతో జీ ప్లస్‌ 6 విధానంలో నిర్మాణం
  • పార్కింగ్‌తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
  • ప్రస్తుతం జీ ప్లస్‌ త్రీ వరకు నిర్మాణ పనులు పూర్తి
  • భూ గర్భంలోనే జీ ప్లస్‌ 1 ఫ్లోర్లు
  • 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ‘మేథ’కే కళ్లు కుట్టేంతగా... సైబర్‌వాడ కేసరపల్లిలోని ‘ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ’ హైటెక్‌ సిటీలో రెండవ ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మేథ టవర్‌ కంటే దాదాపు రెట్టింపు విస్తీర్ణంలో, రెట్టింపు స్పేస్‌తో రెండవ ఐటీ టవర్‌ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. మరో మూడు నెలల్లోనే ఇది ఆర్కిటెక్చర్‌ డిజైన్‌కు అనుగుణంగా పూర్తి రూపం సంతరించుకోనుంది. నూతన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలోనే ఎన్నికల ముందుగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభోత్సవం చేసుకు నేందుకు వీలుగా వేగంగా పనులు జరుగుతున్నాయి. కేసరపల్లి హైటెక్‌ సిటీలో జరుగుతున్న రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులను సోమవారం ఆంధ్రజ్యోతి పరిశీలించింది. నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం...
 
 
ఒక్క అడుగు.. మరో అడుగుకు పునాది వేసింది! ఏడాది కాలంలోనే కళ్లు చెదిరే ఐటీ టవర్‌ సాక్షాత్కరించబోతోంది. కేసరపల్లి హైటెక్‌సిటీలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు తుది అంకానికి వచ్చాయి. హైటెక్‌సిటీలో మొట్టమొదటి టవర్‌గా ఏర్పడిన ‘మేథ’ కు వెనుక భాగంలో రూ.300 కోట్ల వ్యయంతో రెండో ఐటీ టవర్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తం పార్కింగ్‌తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఐటీ టవర్‌ ను జీ ప్లస్‌ 6 విధానంలో నిర్మిస్తున్నారు. హైటెక్‌ సిటీకి అభిముఖంగా జాతీయ రహదారి - 16 కు అవతల వైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్తులో ఎత్తు అవరోధంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో భూమిలోనే జీ ప్లస్‌ 1 నిర్మాణం ఉండేలా నిర్మించటం రెండవ ఐటీ టవర్‌ నిర్మాణం ప్రత్యేకత. రెండవ ఐటీ టవర్‌ రెండు భవనాల కలబోతగా ఉంటుంది. ఒక భవనం నిర్మాణం జీ ప్లస్‌ 4 వరకు వచ్చింది. మరో భవనానికి సంబంధించి అతి కీలకమైన బేస్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు భవన నిర్మాణాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. రెండవ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు ఒక మహా సంగ్రామాన్నే తలపిస్తున్నాయి.
 
హైటెక్‌ సిటీ ఆవరణలో పనుల తీరు చూస్తే దీని నిర్మాణ పనులు ఎంత మహోధృతంగా జరుగుతున్నాయో అర్థమౌతుంది. హైటెక్‌ సిటీలోని నిరుపయోగ ప్రాంతాన్ని కాంట్రాక్టు సంస్థ స్వాధీనంలోకి తీసుకుంది. భారీగా కంకర, ఐరన్‌, సిమెంట్‌, ఇసుక తదితర మెటీరియల్‌ను డంప్‌ చేసుకుంది. బయటకు ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్నీ హైటెక్‌ సిటీలోనే అందుబాటులో ఉంచుకుంది. ఆవరణలోనే కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నిరంతరాయంగా కాంక్రీట్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఐరన్‌ బెండింగ్‌ వర్క్స్‌ పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఐటీ టవర్‌ నిర్మాణాన్ని భారీ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ క్రేన్‌ నిర్మిస్తోంది. సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో నిర్మాణ పర్యవేక్షణ జరుగుతోంది.

evari ki anna ardam ayithe naku konchem cheppandi

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రాజధానిలో ఐటీ విస్తరణకు అడుగులు
05-10-2018 07:44:37
 
636743222764135293.jpg
  • కేసరపల్లిలో 66 ఎకరాల వెటర్నరీ కళాశాల భూముల సేకరణ!
  • అంగీకరించని కాలేజీ యాజమాన్యం
  • సమీపంలోని భూముల కోసం అన్వేషణ
  • సంప్రదింపులతో సానుకూలత కోసం ప్రయత్నాలు
 
కేసరపల్లిలో ఐటీ పార్క్‌ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన భూములపై దృష్టి సారించింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు సమీపంలోనే పశుసంవర్థక శాఖకు చెందిన 66 ఎకరాల భూములను ఇందుకు ఎంపిక చేసుకుంది. అయితే ఈ భూములు వెటర్నరీ కళాశాల వినియోగంలో ఉన్నాయి. ఆ శాఖకు ప్రత్యామ్నాయ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రతిపాదనకు కళాశాల యాజమాన్యం విముఖత వ్యక్తం చేస్తోంది. సంప్రదింపులతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
 
 
సైబర్‌వాడగా రూపాంతరం చెందుతున్న కేసరపల్లిలో ‘గచ్చిబౌలి’ తరహా ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు కేటాయించిన పక్కనే పశు సంవర్థక శాఖకు చెందిన భూముల్లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపుగా 66 ఎకరాల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో ఐటీ పార్కును ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సంకల్పించింది. తాజాగా అధికారులు ఈ భూములను పరిశీలించారు. అయితే వెటర్నరీ కళాశాల యాజమాన్యం విముఖత వ్యక్తం చేస్తోంది. సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
 
 
విజయవాడ: రాజధాని ప్రాంతంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్న, మధ్య తరహా ఐటీ పరిశ్రమలన్నింటినీ ఒకే చోట కొలువు తీరటానికి వీలుగా తగిన మౌలిక సదుపాయాలతో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం కేసరపల్లిలో పశు సంవర్థక శాఖ అధీనంలో ఉన్న భూములను సేకరించనుంది. తర్వాత వీటిని ఏపీఐఐసీకి స్వాధీనం చే స్తారు. ఏపీఐఐసీ ఇందులో లే అవుట్‌ వేసి ప్లాట్లుగా వర్గీకరణ చేపడుతుంది. వివిధ రకాల సైజులలో ప్లాట్లను వర్గీకరిస్తారు. లే అవుట్‌ ప్రకారం రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి కనెక్షన్‌, విద్యుత్తు వంటి సదుపాయాలను ఏపీఐఐసీ కల్పించనుంది.
 
అభివృద్ధి పరిచిన ప్లాట్లను లీజు ప్రాతిపదికన కానీ, ఔట్‌ రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీఐఐసీ అభివృద్ధి చేపట్టిన ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)లకు సంబంధించి చూస్తే అన్నింటి కీ ఔట్‌రేట్‌ సేల్‌ విధానాన్నే అనుసరిస్తున్నందున ఈ ఐటీ పార్క్‌ విషయంలో కూడా ఇదే అనుసరించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఐటీ పార్క్‌లో ప్లాట్లను దక్కించుకున్న సంస్థలు ఇక్కడే తమ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
 
కేసరపల్లిలో ఇప్పటికే ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలో ఏర్పడిన మేథ ఐటీ టవర్‌లో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇందులోనే దీనికి రెట్టింపు విస్తీర్ణంలో మరో భారీ ఐటీ టవర్‌ నిర్మాణం జరుగుతోంది. ఐటీ పార్క్‌కు కూతవేటు దూరంలోనే హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి 27 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములు ఆర్టీసీకి చెందినవి. ఈ భూములలో ఆర్టీసీకి చెందిన జోనల్‌ డ్రైవింగ్‌ కాలేజీ, ఆర్టీసీ అకాడమీలు ఉండేవి. ఈ భూములను ఆర్టీసీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి సూరంపల్లిలో భూములను కేటాయించింది. హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌కు కేటాయించిన భూముల పక్కనే పశుసంవర్థక శాఖ భూములు ఉన్నాయి. ఎన్‌ టీఆర్‌ వెటరినరీ కళాశాల సమీపంలోనే ఉంది. ఈ భూములు వెటరినరీ కళాశాల వినియోగంలో ఉన్నాయి. వెటరినరీ కాలేజీకి చెందిన లైవ్‌స్టాక్‌ కాంప్లెక్స్‌ తో పాటు ఒకటి, రెండు చిన్నపాటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవిపోతే దాదాపుగా ఖాళీ భూములు ఉన్నాయి.
 
ప్రత్యామ్నాయంగా కొండపావులూరులో భూములు
పశు సంవర్థక శాఖకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. బుధవారం పశుసంవర్థకశాఖ, వెటరినరీ కాలేజీ యాజమాన్యంతో పాటు, రాష్ట్ర ఐటీ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు కొండపావులూరులో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశారు.
 
వెటర్నరీ కళాశాల యాజమాన్యం విముఖత
ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన భూములను పరిశీలించిన తర్వాత వెటరినరీ కళాశాల యాజమాన్యం ఆ భూములను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ భూములు దూరాన ఉండటం వల్ల తమకు సమస్యగా ఉంటుందని రెవెన్యూ అధికారులకు సూచించినట్టు సమాచారం. కళాశాల ఒకచోట, లైవ్‌స్టాక్‌ దూరాన ఉంటే ఇబ్బందిగా ఉంటుందని తెలిపినట్టు సమాచారం. వెటర్నరీ కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన ప్రతిస్పందనను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళనున్నారు.
 
 
సంప్రదింపులతో ముందుకు
వెటర్నరీ భూములను స్వాధీనంలోకి తీసుకు వెళ్ళటానికి, కాలేజీ పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏపీఐఐసీ, రెవెన్యూ యంత్రాంగాలు సంప్రదింపుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్ళాలని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా దగ్గర్లో భూములు ఎక్కడ ఉన్నాయన్నదానిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...