Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

  • 2 weeks later...

గన్నవరంలో నిర్మించే హెచ్‌సిఎల్ కంపెనీకి తొలగిన ప్రధాన అడ్డంకి...

   
hcl-10072018.jpg
share.png

గన్నవరంలో నిర్మించే హెచ్‌సిఎల్ కంపెనీకి, ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వద్ద రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్)కు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతులు ఇచ్చింది. రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్) అనుమతి ఇవ్వాలని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కేంద్రాన్ని కోరింది. ఇక్కడ ఐటి, ఐటి ఆధారిత సేవల సంస్థలను నెలకొల్పేందుకు సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సిఎల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను వాణిజ్య శాఖ పరిశీలించింది. వాణిజ్య అంతరంగిక బోర్డు సమావేశం అయ్యి, ఈ విషయం చర్చించింది. ఈ బోర్డు సమావేశానికి వాణిజ్య శాఖ కార్యదర్శి రీతా టియోటియా అధ్యక్షత వహించారు. సుమారు 10.43 హెక్టార్లలో సెజ్‌ను ఏర్పాటు చేయాలన్న హెచ్‌సిఎల్ ప్రతిపాదనను ఆమోదించింది.

 

hcl 10072018 2

హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటకు, కేంద్రానికి దరఖాస్తు చేస్తుకుంది. ఇప్పుడు అనుమతులు రావటంతో, ఇక నిర్మాణం ప్రారంభించనున్నారు. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.

hcl 10072018 3

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు రెండు వేల మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

Link to comment
Share on other sites

అధునాతనంగా ఏపీఐఐసీ హెడ్‌క్వార్టర్స్‌ రెడీ!
18-07-2018 07:16:37
 
636674949981432023.jpg
  • మంగళగిరి ఐటీ పార్కులో రాష్ట్ర ప్రధాన కార్యాలయం
  • అత్యంత అధునాతనంగా జీ+10 భవన సముదాయం
  • రూ.90 కోట్ల వ్యయంతో పూర్తయిన సివిల్‌ పనులు
  • వచ్చే నెలలో శుభారంభం
మంగళగిరి: రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల కల్పనాసంస్థ (ఏపీఐఐసీ) ప్రధాన కార్యాలయం మంగళగిరిలో కొలువుదీరబోతుంది. రాష్ట్ర విభజనానంతరం ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సొంత భవనాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనతో మంగళగిరి కేంద్రంగా సదరు కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం మంగళగిరి ఆటోనగర్‌ పక్కనే సరికొత్తగా 22.17 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కు పేరుతో వేసిన వెంచర్‌లో తమ సంస్థ ప్రధాన కార్యాలయం కోసం జీ+10 భవన సముదాయ నిర్మాణాన్ని చేపట్టింది. ఐటీ పార్కులో కామన్‌ ఫెసిలిటీస్‌ సెంట రు కోసం వుద్దేశించిన 2.26ఎకరాల్లో ఈ బహుళ అంత స్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. రూ.90 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణాన్ని ఏపీఐఐసీ శరవేగంతో పూర్తిచేసింది. ఏడాది పూర్తికాకుండనే నిర్మాణ పనులను పూర్తిచేయడం విశేషం.
 
 
రెండో భవనం కోసం ఏర్పాట్లు
ప్రస్తుతం ఐటీ పార్కు కామాన్‌ పెసిలిటీస్‌ సెంటరులో నిర్మించిన ప్రస్తుత జీ+10 భవన సముదాయానికి దక్షిణంగా మరో నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు ఏపీఐఐసీ సన్నద్ధమవుతోంది. మంగళగిరి ఏరియాను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలగా వుండడంతో ఐటీ సంస్థల ఏర్పాటుకు వీలుగా మరో బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించి అద్దెలకు ఇవ్వాలని ఏపీఐఐసీ భావిస్తుంది. ఈ మేరకు డీపీఆర్‌ కోసం కన్సల్టెన్సీని కూడ నియామకం చేశారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా ఈ నూతన భవనాన్ని నిర్మించాలని ఏపీఐఐసీ ప్రతిపాదించింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి భవన సముదాయం ప్రారంభోత్సవంతో పాటే సదరు రెండో భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడ జరిపించాలని ఏపీఐఐసీ పాలకవర్గం భావిస్తోంది.
 
 
రెండు లక్షల చదరపు అడుగల విస్తీర్ణం
జీ+10 రూపంలో మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా ఈ భవన నిర్మాణం గావించారు. ఇందులో పార్కింగ్‌ నిమిత్తం రెండు సెలార్లను ఏర్పాటుచేశారు. గ్రౌండు ఫ్లోర్‌ను కూడ పార్కింగ్‌ కోసమే వినియోగించనున్నారు. భవన సముదాయంలో తొలి మూడు అంతస్తులను ఏపీఐఐసీ తన కార్యాలయాలకోసం వినియోగించుకోనుంది. ఆ తరువాతి రెండు అంతస్తులను పరిశ్రమల శాఖకు కేటాయించారు. మిగతా ఐదు అంతస్తులను, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, మరికొన్ని ఐటీ సంస్థల కోసం అద్దెలకు ఇవ్వనుంది. ఇంచుమించు సివిల్‌ పనుల మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ భవన సముదాయానికి ప్రస్తుతం తుది మెరుగులను అద్దుతున్నారు. వచ్చే నెల మొదటివారానికల్లా అన్నిరకాల పనులను పూర్తి చేయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత భవనాన్ని ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

సెజ్‌ పరిధిలోకి హెచ్‌సీఎల్‌..!
23-07-2018 09:38:10
 
636679354897615768.jpg
  • స్థల పరిశీలనలో సంస్థ ప్రతినిధులు
విజయవాడ: స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) పరిధిలోకి హెచ్‌సీఎల్‌ వచ్చినట్టు సమాచారం! దీనిపై అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది! దాదాపుగా సెజ్‌కు కేంద్రం నుంచి సూత్ర ప్రాయ అంగీకారం రావటంతో.. హెచ్‌సీఎల్‌ సంస్థ గన్నవరంలో తన పనులు ముమ్మరం చేసింది. గత పక్షంరోజులుగా పలుమార్లు హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు గన్నవరంలో ప్రభుత్వం కేటాయించిన ఏపీఎ్‌సఆర్‌టీసీ జోనల్‌ కాలేజీ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, డిజైన్‌, మాస్టర్‌ ప్లాన్‌పై ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తమకు కేటాయించిన 27 ఎకరాల స్థలాన్ని ఎప్పుడో స్వాధీనం చేసుకున్న హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు ప్రకృతి నడుమ భవనాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్వాధీనం చేసిన ఏపీఎ్‌సఆర్‌టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో ఉన్న భవనాలను మాత్రమే హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు తొలగించారు. భవనాల తొలగింపు పూర్తయింది.
 
నేలను పూర్తిగా చదును చేశారు. భవన నిర్మాణానికి ఇబ్బందులు ఉన్నచోట మాత్రమే కొన్ని చెట్లను తొలగించారు. భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఆరునెలల నుంచి సంవత్సర వ్యవధిలో పూర్తవుతాయి. అప్పటికి చెట్లను నాటి మహావృక్షాలను చేయాలంటే కనీసం 10 నుంచి 20 ఏళ్ళ సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆవరణలో ఉన్న వృక్షాలను అలానే ఉంచారు. ఈ వృక్షాల మధ్యన ఉన్న ప్రాంతంలోనే భవన నిర్మాణం జరుగుతుంది. భవన నిర్మాణానికి సంబంధించి డిజైన్లలో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. మార్పులకు సంబంధించి హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. హె చ్‌సీఎల్‌కు సంబంధించిన వివరాలు అటు మేనేజ్‌మెంట్‌ నుంచి కానీ, ఇటు ఏపీఐఐసీ వర్గాల నుంచి కూడా బహిర్గతం కావటం లేదు. సెజ్‌ కోసం ఇప్పటి వరకు జాప్యం చేసిన హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూలత రావటంతో అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తుంది. టెక్నాలజీస్‌ పార్క్‌ను వీలైనంత త్వరగా నిర్మించటానికి శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...