Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

  • 3 weeks later...

HCL Technologies seeks government nod to set up SEZ in Andhra Pradesh

HCL Technologies has sought government approval to set up a new IT/ITeS special economic zone (SEZ) in Vijayawada, Andhra Pradesh, with a proposed investment of Rs 408.48 crore.

RTXYOMM-770x433.jpg
 
 
 
 
NSElive
13 Jun, 2018 15:56
923.70
8.90 (0.97%)
 
Volume 1056853
Todays L/H 914.05925.80
graph&format=json&watch_app=true&range=1
 
More
 

HCL Technologies has sought government approval to set up a new IT/ITeS special economic zone (SEZ) in Vijayawada, Andhra Pradesh, with a proposed investment of Rs 408.48 crore.

The company's proposal will be considered by an inter-ministerial Board of Approval, headed by Commerce Secretary Rita Teaotia, at its meeting on June 19, a commerce ministry official said.

HCL Technologies has proposed to develop the project at an area of 10.43 hectares.

 

The board would also consider cancellation of formal approval given to OSE Infrastructure as the developer has not made any significant progress on the project. The company was developing an IT special economic zone in Noida.

 
 
 
 
Link to comment
Share on other sites

విజయవాడలో ఐటీ సెజ్‌
కేంద్ర అనుమతి కోరిన హెచ్‌సీఎల్‌ టెక్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఐటీ/ఐటీఈఎస్‌ సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు నిమిత్తం కేంద్ర ప్రభుత్వ అనుమతిని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కోరింది. మొత్తం 10.43 హెక్టార్ల స్థలంలో ఈ సెజ్‌ను అభివృద్ధి చేసేందుకు కంపెనీ  రూ.408.48 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నెల 19న జరిగే సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా నేతృత్వంలోని మంత్రివర్గ బోర్డు, హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రతిపాదనను పరిశీలించనుంది. అలాగే నోయిడాలోని ఐటీ ప్రాజెక్టుకు సంబంధించి ఓఎస్‌ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చిన సూత్రప్రాయ అనుమతులు రద్దు చేసే అంశాన్ని కూడా బోర్డు చర్చించనుంది. ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడమే ఇందుకు కారణం. దేశీయ ఎగుమతులు, తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో 2005లో సెజ్‌ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశం మొత్తం ఎగుమతుల్లో సెజ్‌ల ద్వారా అయ్యే ఎగుమతులు 25% వరకు ఉంటాయి.

Link to comment
Share on other sites

విజయవాడలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ సెజ్‌
14-06-2018 02:29:10
 
636645401624562247.jpg
  • రూ.408 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వ అనుమతి కోరిన కంపెనీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ ఐటి/ఐటిఈస్‌ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ సెజ్‌ కోసం 408.48 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ఈ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నెల 19న వాణిజ్య శాఖ సెక్రటరీ రీటా టియోటియా సారథ్యంలోని అనుమతులకు సంబంధించిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ బోర్డు సమావేశంకానుంది. ఈ సందర్భంగా హెచ్‌సిఎల్‌ టెక్‌ ప్రతిపాదనను పరిశీలించనున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. 10.43 హెక్టార్ల విస్తీర్ణంలో తన ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు కంపెనీ ప్రతిపాదించింది. దేశం నుంచి ఎగుమతులు పెంచడానికి, తయారీ రంగానికి ఊతం ఇవ్వడానికి సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో సెజ్‌ల వాటా 25 శాతంగా ఉంది. సెజ్‌ యూనిట్లు, డెవలపర్లకు ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 223 సెజ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో ఐటి, ఫార్మా, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లెదర్‌, బయోటెక్నాలజీ, డైమండ్‌ పాలిషింగ్‌కు సంబంధించిన 5,146 యూనిట్లున్నాయి. 
Link to comment
Share on other sites

అమరావతిలో ఐటీ
15-06-2018 01:56:19
 
  • తొలి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పాటు
  • 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • 29న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
  • 22న ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌కు భూమిపూజ
అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో తొలి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పాటుకానుంది. ఇప్పటివరకూ అమరావతికి సమీపంలోని మంగళగిరి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పలు బీపీవో కంపెనీలు, ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీలు వచ్చాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందేందుకు, ఐటీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రిసెర్చ్‌ సంస్థలు అవసరం. ఆ దిశగా తొలి అడుగు పడనుంది. నూతన రాజధాని అమరావతి పరిధిలోనే ఇది రానుంది.
 
ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు వల్ల ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబుతో దీనికి శంకుస్థాపన చేయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గ్లోబల్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న ఇన్వికాస్‌ కంపెనీకి ఆ రోజు శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీతో పాటు మరో 10 సెమీకండక్టర్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ కంపెనీలు రానున్నాయి. ఈ కంపెనీలన్నింటితో కలిపి సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు ఏర్పడుతుంది. అమరావతిలోని నీరుకొండ గ్రామ ప్రాంతంలో ఇది ఏర్పాటుకానుంది. దీనికి 50 ఎకరాలు కావాలని సదరు కంపెనీలు అడుగుతున్నాయి. అయితే ప్రభుత్వం 37-40ఎకరాల మధ్యలో కేటాయించనుందని సమాచారం. అమరావతిలో ఐటీ అభివృద్ధికి ఈ సెమీకండక్టర్‌ డిజైన్‌ పార్కు మరింత ఊతమిస్తుందని అంటున్నారు.
 
 
రూ.400 కోట్లతో ఏపీఎన్‌ఆర్‌టీ భవనం: మరోవైపు రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌కు ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. రూ.400కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. ఐదు ఎకరాల్లో... 33 అంతస్థులు.. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంటుంది. ఒక ఐకానిక్‌ భవనంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ దీనికి నిధులు సమకూరుస్తుంది. ఈ భవనంలో ఐటీ కంపెనీలు, వివిధ సంస్థల కార్యాలయాలు కూడా ఏర్పాటవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఐకానిక్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనంలోని 120 ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలకు విక్రయిస్తారు. వారు వీటిలో నివాసం ఉండొచ్చు.. లేకుంటే ఏవైనా ఐటీ కంపెనీలకు అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఒక చదరపు అడుగు ధర రూ.5,500లుగా నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేసేందుకు దరఖాస్తులు ఇప్పటివరకూ ఆహ్వానించకున్నా... 500 మంది తాము కొనుగోలు చేస్తామంటూ ఆసక్తి వ్యక్తం చేస్తూ అడిగారని... ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవికుమార్‌ వేమూరి తెలిపారు.
 
 
నగరం మొత్తం చూడొచ్చు!
ఏపీఎన్‌ఆర్‌టీ ఐకానిక్‌ భవనం నివాస, వ్యాపార, వాణిజ్యాల మిశ్రమంగా అనేక ప్రత్యేకతలతో ఉండనుంది. ఇందులో కొంత భాగాన్ని ఐటీ కంపెనీల కోసం ఇస్తారు. మరికొంత భాగం విక్రయిస్తారు. కొనుగోలు చేసినవారు కూడా నివాసానికి కానీ, ఐటీ కార్యాలయాలకుగానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ భవనంలో ఐటీ క్యాంపస్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌, మైగ్రేంట్స్‌ రిసోర్స్‌ సెంటర్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటాయి. నగరం మొత్తాన్నీ వీక్షించేలా ఒక రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

గుంటూరుకు ఐటీ కళ.. 29 సీఎం చేతుల మీదుగా..
25-06-2018 09:52:51
 
636655171722992791.jpg
  • నగరంలో ప్రప్రథమంగా ఐటీ కంపెని
  • వేద ఐఐటీ అండ్‌ ఇన్వేకాస్‌ సంస్థలు రాక
  • విద్యానగర్‌లో జీ+6 టవర్‌ నిర్మాణం పూర్తి
  • 29న సీఎం చేతుల మీదగా ప్రారంభం
గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రప్రథమంగా ఐటీ(ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ) కంపెనీ ప్రారంభం కాబోతోంది. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమయ్యాయి. డెస్కుటాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రాసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహించబోతున్నట్లు ఆయా సంస్థలు జిల్లా యంత్రాంగానికి నివేదించాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఈ నెల 29వ తేదీన ఉదయం దీనిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని కలెక్టర్‌ కోన శశిధర్‌కు ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం అందింది.
 
 
అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. రెండు రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.
 
 
తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి.
 
 
వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు, అంతకంటే గంట ముందే లోకేష్‌ రానున్నారని సమాచారం రావడంతో ఆదివారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్‌పీ విజయారావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు ఇతర అధికారులు ఇన్వేకాస్‌ టవర్‌ని సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యానగర్‌ ఒకటో లైనులో ఆక్రమణలు తొలగించి కొత్తగా బీటీ లేయర్‌తో రోడ్డుని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
 
 
సీఎం ఆ రోజున హెలికాప్టర్‌లో తొలుత పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చి గంట వ్యవధిలోపే కార్యక్రమాన్ని ముగించుకొని అమరావతి రాజధానికి తిరుగు ప్రయాణమౌతారని కలెక్టర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఈ కార్యక్రమానికి 30 సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారని, వారితో సీఎం సమావేశమై సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి చర్చిస్తారని వివరించారు.
Link to comment
Share on other sites

గుంటూరుకు... ఐటీ సొబగులు
29-06-2018 09:38:00
 
636658618813416572.jpg
  • ప్రప్రథమంగా ఐటీ కంపెనీ
  • నేడు సీఎం చంద్రబాబుచే ప్రారంభం
గుంటూరు (ఆంధ్రజ్యోతి): వ్యాపార, వాణిజ్య నగరంగా రాష్ట్రంతో పాటు, దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న గుంటూరు నగరం ఐటీ కళ సంతరించుకోనుంది. జిల్లా కేంద్రంలో ప్రప్రథమంగా ఐటీ కంపెనీ నేడు ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు నగరలో శుక్రవారం నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. డెస్క్‌టాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రోసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహిస్తున్న సంస్థ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.
 
 
ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞపి మేరకే నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం చేశారు. దానిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకోచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధికల్పించారు. గడిచిన వారంలోనే రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో జిల్లా ఐటీ హబ్‌గా మారనుంది.
 
24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇందులో వందల సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. ఈ టవర్‌ ఉదయం 1.30గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 30 సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
 
 
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలదేరి 12.15గంటలకు మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
 
 
అక్కడి నుంచి 12.20కు రోడ్డు మార్గం ద్వారా విద్యానగర్‌ 1వలైన్‌కు చేరుకుని 1.30గంటలకు ఐటీ సంస్థలను ప్రారంభిస్తారు.
 
తిరిగి 2.15నిమిషాలకు హెలికాప్టర్‌లో కాకినాడకు బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
 
పటిష్ఠ బందోబస్తు
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌ ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన అధికారులు, సిబ్బందికి బందోబస్తుపై తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటించే మార్గంలో ఆయన కార్యక్రమానికి వచ్చి వెళ్లే కొద్ది సమయం ముందు వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. సీఎం పర్యటన ముగిసే వరకు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం: చంద్రబాబు 02542729BRK102-BABU.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. సెమీ కండక్టర్ల తయారీలో పేరుగాంచిన ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఇన్‌వెకాస్‌ సంస్థను గుంటూరులోని విద్యానగర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులకు నవ్యాంధ్ర అనుకూలమని అన్నారు. టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోందన్నారు. ఎండలు ఎప్పుడు వస్తాయో, వర్షాలు, పిడుగులు ఎప్పుడు పడతాయో.. ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో తదితర సమాచారాన్ని తెలుసుకొనే వెసులుబాటు టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చేసిందన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. సాంకేతికతలో అమరావతి ముందంజలో ఉండాలనేదే తన అభిలాష అన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో పిల్లలకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏపీలో తొలిసారి సెమీకండక్టర్ల తయారీ సహా శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. సెమీకండక్టర్లను ఇన్‌వెకాస్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది. బెంగళూరు, అమెరికా పర్యటనల్లో పలుమార్లు మంత్రి నారా లోకేశ్‌ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుడులు పెట్టేందుకు ఆయన ఆ సంస్థను ఒప్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌, ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...