Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

 గన్నవరంలో,మరో ఐటి టవర్ కు, రేపు శంకుస్థాపన...

    Super User    
    22 November 2017 
    Hits: 218 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ వేగం పుంజుకుంటోంది. విజయవాడ కేంద్రంగా మరో ప్రతిష్టాత్మక ఐటీ టవర్ నిర్మాణానికి ఇవాళ పునాదిరాయి పడనుంది.   గురువారం (న‌వంబ‌ర్‌23) సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం మేధాట‌వ‌ర్స్ ప్రాంగ‌ణంలో నూత‌న ఐటీ ట‌వ‌ర్ నిర్మాణానికి జ‌రిగే భూమి పూజ కార్య‌క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన‌నున్నారు. రానున్న కొద్ధి రోజుల్లో  మరిన్ని ఐటీ సంస్థల ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఇప్పటి వరకూ రాష్ట్రానికి గణనీయమైన వృద్ధి నమోదైంది.  పెరుగుతున్న కంపెనీల దృష్ట్యా రాష్ట్రంలో కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు వేగవంతం చేసారు. 

it park 221120172

ఏడాది క్రితం ఖాళీ ఇయిన ఐటీ ట‌వ‌ర్‌మేధ ఇప్పుడు కొత్త కంపెనీలు, ప్ర‌ముఖ కంపెనీలు క్యూ కడుతుండ‌టంతో వాటికి స్థానం స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంది.ప్రస్తుతం ఇక్కడ 9 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.ఏ ఒక్క స‌మ‌స్య‌తోనూ ఐటీ అభివృద్ధి ఆగిపోకూడ‌ద‌నే ఆలోచ‌న‌తో కొత్త ట‌వ‌ర్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు. ఈ ట‌వ‌ర్‌ను అత్యంత వేగంగా, సుంద‌రంగా, ఐటీ కంపెనీల‌కు అనుకూలంగా ఉండేలా నిర్మించ‌నున్నారు. నూతన ఐటి టవర్ ద్వారా4.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
అందుబాటులోకి రానుంది. రెండో పార్కు నిర్మాణానికి ఎల్ అండ్ టీ, గురువారం (న‌వంబ‌ర్‌23) భూమి పూజ ఏర్పాట్లు చేసింది. ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా గురువారం (న‌వంబ‌ర్‌23) కార్యక్రమం జరగనుంది.  మంత్రిగా  లోకేశ్ బాధ్యతలు చేపట్టాక తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో ఐటీ రంగం క్రమేణా వృద్ధి సాధిస్తోంది. గన్నవరం విమానాశ్రయం వద్ద ఏడాది క్రితం వరకూ మేధా ట‌వ‌ర్స్‌లో ఐటీ కంపెనీల ఆక్యుపెన్సీ 10 శాత‌మే. అప్పటివ‌ర‌కూ ఉన్న అర‌కొర కంపెనీలు ఖాళీ చేశాయి. ఐటీ  కంపెనీల రాక‌కు మంత్రి లోకేశ్  చొరవ తీసుకోవటంతో పాటు  అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించారు. స‌రికొత్త ప్రోత్సాహాకాలు ప్రక‌టించారు.

it park 22112017 3

కొత్త పాలసీలతో ఐటీ కంపెనీలు న‌వ్యాంధ్రలో అడుగిడ‌డం మొద‌లు పెట్టాయి.మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయాల‌తో 2016 చివ‌రినాటికి ఖాళీగా ఐటీ ట‌వ‌ర్ మేధ ఇప్పుడు పూర్తిగా ఐటీ కంపెనీల కార్యక‌లాపాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఎంఎన్‌సీ కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతుండ‌టంతో సెకండ్ ఫేజ్ ఐటీ ట‌వ‌ర్ అత్యవ‌స‌రమైంది. ఏ ఒక్క స‌మ‌స్యతోనూ  ఐటీ అభివృద్ధి ఆగిపోకూడ‌ద‌నే ఆలోచ‌న‌తో కొత్త ట‌వ‌ర్  నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు. ఈ ట‌వ‌ర్‌ను అత్యంత వేగంగా, సుంద‌రంగా, ఐటీ కంపెనీల‌కు అనుకూలంగా ఉండేలా నిర్మించ‌నున్నారు. నూతన ఐటి టవర్ ద్వారా 4.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
అందుబాటులోకి రానుంది. 

Link to comment
Share on other sites

మంత్రి లోకేష్‌ను కలిసిన ఏజిస్ సాఫ్ట్‌వేర్ ప్రతినిధులు
23-11-2017 13:15:03
అమరావతి: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఏజిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు గురువారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి కంపెన ప్రతినిధులకు మంత్రి వివరించారు. అలాగే డీటీపీ పాలసీ ద్వారా కంపెనీలకు సబ్సిడీతో ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేస్తున్నామని, విజయవాడలో ఉన్న ఏజిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పేర్కొనడంతో కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కాగా... త్వరలోనే పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తాం అని ఏజిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు మంత్రితో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

10 minutes ago, kumar_tarak said:

Ageis company already has an office in Vijayawada...

విజయవాడలో ఉన్న ఏజిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పేర్కొనడంతో కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కాగా... త్వరలోనే పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తాం అని ఏజిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులు మంత్రితో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు: లోకేష్
23-11-2017 18:15:53
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో చాలా కంపెనీలు ఏపీకి వస్తున్నాయి అని తెలిపారు. కొత్త టవర్‌లో మరో 4వేల మంది పని చేయనున్నారని తెలిపారు. మేథాటవర్స్‌ పరిసర ప్రాంతాల్లో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో 13లక్షల చదరవు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఐటీ టవర్స్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించనుంది.

Link to comment
Share on other sites

రాష్ట్రంలో ఐటీ వెలుగులు మొదలు: లోకేశ్‌
ఐటీపార్కు రెండో టవర్‌కు భూమి పూజ
గన్నవరం, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్రంలో ఐటీ వెలుగులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ రంగంలో లక్ష మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం’’ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విజవాయడ సమీపం గన్నవరంలోని ఐటీ పార్కు ఆవరణలో రెండో టవర్‌ నిర్మాణానికి గురువారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ప్రసంగిస్తూ.. ఇక్కడ ఐటీ పార్కు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. 8 నెలల క్రితమే పలు సంస్థలు కార్యకలపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయన్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో.. పూర్తి స్థాయిలో సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని, 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భూమి పూజ చేసిన రెండో భవనం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, ఆరు నెలల్లోపు పూర్తవుతుందని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో దేశంలో 10 సెల్‌ఫోన్‌లు తయారవుతుంటే.. మన రాష్ట్రంలో ఒక్క ఫోను తయారు కాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, సీఎం చంద్రబాబు ప్రారంభించిన మేడ్‌ ఇన్‌ ఆంధ్రా వల్ల రాష్ట్రంలో కార్బన్‌, సెల్‌కాన్‌, ఫోక్సాకాన్‌ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఫోక్సాకాన్‌లో 12 వేల మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారని, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి చూపడం ఆనందంగా ఉందని లోకేశ్‌ చెప్పారు. ఈ సంస్థల ఏర్పాటు వల్ల దేశంలో తయారవుతున్న 10 సెల్‌ఫోన్‌లలో రెండు ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారవుతున్నట్లు వివరించారు.

Link to comment
Share on other sites


గుంటూరు: మంగళగిరిలో ఐటీ సంస్థలకు మంత్రి లోకేష్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్షర ఎంటర్ ప్రైజెస్, కె.జె. సిస్టమ్స్‌ సంస్థలకు లోకేష్‌ శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ఐటీలో లక్ష..ఎలక్ట్రానిక్స్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, గత పాలకులు అమరావతి ప్రాంతంలో ఐటీని నిర్లక్ష్యం చేశారన్నారు. గన్నవరం మేధా టవర్స్ 2010లో పూర్తయినా ఒక్క సంస్థ కూడా రాలేదన్నారు. మేం వచ్చాక మేధా టవర్స్ నిండింది..రెండో దశకు శంకుస్థాపన చేశామని మంత్రి చెప్పారు. గన్నవరం ఐటీ సెజ్‌లో 50వేలు, మంగళగిరిలో 10వేల ఐటీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు 50శాతం అద్దె ప్రభుత్వం చెల్లిస్తోందని, కంపెనీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం
ఐటీ మంత్రి లోకేశ్‌
అమరావతి: 2022 నాటికి అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి ఆటోనగర్‌లో అక్షర ఎంటర్‌ప్రైజెస్‌, కేజే సిస్టమ్‌ ఐటీ సంస్థలకు మంత్రి లోకేశ్‌ ఇవాళ భూమి పూజ చేశారు. ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్‌లోనే 10వేల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. గన్నవరంలోని మేధాటవర్స్‌ నిర్మాణం 2010లోనే పూర్తయినప్పటికీ .. అప్పటి ప్రభుత్వం ఒక్క ఐటీ సంస్థను కూడా తీసుకురాలేకపోయిందన్నారు. తాము వచ్చిన తర్వాత మేధాటవర్స్‌ నిండిపోయి రెండో దశకు శంకుస్థాపన చేశామన్నారు. చిన్న ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, అనుమతులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. తాను కేవలం ఆరు గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నానని.. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావాలని లోకేశ్‌ కోరారు.

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌కు అంతా ఓకే
28-11-2017 02:17:27
 
636474344478308918.jpg
  • కేసరపల్లిలో 28.72 ఎకరాల కేటాయింపు
  • హెచ్‌సీఎల్‌, ఏపీఐఐసీల మధ్య సేల్‌ అగ్రిమెంట్‌
  • నేడు అమరావతికి శివనాడార్‌.. సీఎంతో భేటీ!
విజయవాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతంలో హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) ఆగమనానికి తొలి అడుగు పడింది! గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన 28.72 ఎకరాలను హెచ్‌సీఎల్‌కు ఇవ్వటానికి అధికారికంగా ఒప్పందం కుదిరింది.
 
ఏపీఐఐసీ అధికారులు, హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు సోమవారం సేల్‌ అగ్రిమెంట్‌ రాసుకుని గన్నవరం రిజిస్ర్టేషన్‌ కార్యాలయం లో రిజిస్టర్‌ చేయించారు. ఎకరం రూ.30 లక్షల చొప్పున రూ.8.61 కోట్లకు భూములు అప్పగించేలా ఒప్పందంలో నిబంధనలు పొందుపర్చారు. ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకా రం హెచ్‌సీఎల్‌ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మొత్తం 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామంది.
 
మంగళవారం అమరావతికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ వస్తున్నారు. సీఎం చంద్రబాబును ఆయన కలవనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ ఏం చేయబోతుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీఐఐసీకి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఎంఓయూ ప్రకారం ప్రాజెక్టును అమలులోకి తీసుకొచ్చిన తర్వాతే పూర్తి గా రిజిస్ర్టేషన్‌ చేస్తారు.
 
 
30 సంస్థలతో అగ్రిమెంట్‌
వీరపనేనిగూడెంలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసీ అభివృద్ధి పరిచిన మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో అమరావతి ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ తరపున సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు 59 ప్లాట్లను కేటాయించటం జరిగింది. వీటికి సంబంధించి 30 సంస్థలతో ఏపీఐఐసీ అధికారులు వారం కిందట సేల్‌ అగ్రిమెంట్‌ రాసుకున్నారు.
 
సేల్‌ అగ్రిమెంట్‌ ప్రకారం ఈ సంస్థలు తక్షణం తమ పనులను ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ సంస్థలకు పూర్తిస్థాయిలో ఏపీఐఐసీ భూములు రిజిస్ర్టేషన్‌ చేసి ఇస్తుంది. అభివృద్ధికి ఖర్చు చేసిన మొత్తాన్నే భూముల ధరగా అప్పట్లో నిర్ణయించారు. ఎకరానికి 40 లక్షల చొప్పున ధరను నిర్ణయించారు.
 
 
వారంలో మల్లవల్లి కారిడార్‌ లే అవుట్‌!
మల్లవల్లిలో 1,260 ఎకరాలలో రూపుదిద్దుకుంటున్న ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు సంబంధించి లే అవుట్‌ రెడీ అవుతోంది. వారం రోజుల్లో దీనిని ఫైనల్‌ చేస్తారు. భారీ పరిశ్రమలకు సంబంధించి ...అశోక్‌ లేల్యాండ్‌, గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, స్పిన్‌టెక్‌ ఇండస్ర్టీస్‌తో పాటు వంద సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో త్వరగా.. లే అవుట్‌ రెడీ చేసి ప్లాట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని ఏపీఐఐసీ భావిస్తోంది.
Link to comment
Share on other sites

చంద్రబాబుతో ఐటీ దిగ్గజం శివనాడార్ భేటీ
636474954873491835.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో ఐటీ దిగ్గజం శివనాడార్ భేటీ అయ్యారు. హెచ్‌సీఎల్ క్యాంపస్‌ ఏర్పాటుపై సీఎంతో శివనాడార్ చర్చించారు. నూతన భవన ఆకృతులపై సీఎంకు శివనాడార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతి, విజయవాడలో 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబడులు, 7,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 2019 జూన్ నాటికి విజయవాడలో హెచ్‌సీఎల్ క్యాంపస్ సిద్ధం చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

జనవరిలో భూమిపూజ
2019 మార్చికల్లా గన్నవరం వద్ద హెచ్‌సీఎల్‌ కార్యాలయం నిర్మాణం
ఐటీ పార్కుల ఆకృతులను ప్రదర్శించిన సంస్థ
12500 మందికి ఉద్యోగాలిస్తామని వెల్లడి
ముఖ్యమంత్రితో శివనాడార్‌ భేటీ
29ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: ప్రముఖ ఐటీ సంస్థ ‘హెచ్‌సీఎల్‌’ రాష్ట్రంలో తన కార్యాలయ నిర్మాణానికి జనవరిలో భూమి పూజ నిర్వహించనుంది. ఈ మేరకు హెచ్‌సీఎల్‌ సంస్థ వ్యవస్థాపకులు శివనాడార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. ఆలోపు హెచ్‌సీఎల్‌ భూములకు కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాలని కోరారు. మంగళవారం ముఖ్యమంత్రితో శివనాడార్‌ భేటీ అయ్యారు. విజయవాడ, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన హెచ్‌సీఎల్‌ ఐటీ పార్కుల నమూనా ఆకృతులను సీఎంకు చూపించారు. మూడు టవర్ల రూపంలో... అమరావతి వైభవం, తెలుగు సంస్కృతులు మేళవించేలా ఈ కార్యాలయ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. గన్నవరం విమానశ్రయం వద్ద 28 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న హెచ్‌సీఎల్‌ ఐటీసెజ్‌ నిర్మాణానికి జనవరిలో భూమిపూజ చేసి  2019 మార్చికల్లా పూర్తిచేస్తామని చెప్పారు. అమరావతిలో కూడా ఐటీ పార్కు నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. మొత్తం రూ.750 కోట్ల పెట్టుబడితో 12,500 మందికి ఇక్కడ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు శివనాడార్‌ తెలిపారు. ఐటీ కార్యాకలాపాలు కాకుండా ఐటీలో పరిశోధన, నైపుణ్యాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు. విజయవాడలో వెయ్యి మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు స్థలం అవసరమన్నారు. తమ ప్రమాణాలు పరిశీలించడానికి చెన్నైలోని హెచ్‌సీఎల్‌ కార్యాలయాన్ని ఒకసారి సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూనే... హెచ్‌సీఎల్‌ చూపించిన ఆకృతులు చాలా బాగున్నాయని తెలిపారు. ఉద్యోగులు తాము పనిచేస్తున్న చోట చక్కటి వాతావరణం ఉంటే మరింత సంతోషంగా పనిచేస్తారని, ఆంధ్ర ప్రజలు ఐటీలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నారని వివరించారు. సీఎం కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కార్యాలయం, కేంద్ర కమాండ్‌ కంట్రోల్‌ రూమును శివనాడార్‌ సందర్శించారు.

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌ డిజైన్లు సిద్ధం
29-11-2017 02:10:01
636475182024483527.jpg
  • ముఖ్యమంత్రితో శివనాడార్‌ భేటీ
  • క్యాంపస్‌ భవనాల ఆకృతులపై ప్రజెంటేషన్‌
  • 750 కోట్ల పెట్టుబడి.. 12500 ఉద్యోగాలు
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రాష్ట్రంలో స్థాపించనున్న గ్లోబల్‌ ఐటీ డెవల్‌పమెంట్‌, శిక్షణ కేంద్రాల డిజైన్లు సిద్ధమయ్యాయి. కంపెనీ చైర్మన్‌ శివనాడార్‌ మంగళవారమిక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గన్నవరంలో నిర్మించనున్న భవనాల డిజైన్లను చూపించారు. హెచ్‌సీఎల్‌ భవనాలు అద్భుతమైన కాంతుల వెలుగులో రాత్రిపూట ఎలా ఉంటాయి? పగలు ఎలా ఉంటాయి? లోపల ఇంటీరియర్‌ ఎలా ఉంటుంది అన్న చిత్రాలను ప్రదర్శించారు.
 
 
ఈ ప్రాజెక్టులో హెచ్‌సీఎల్‌ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయని శివనాడార్‌ తెలిపారు. సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలు కొలువుదీరనున్నాయి. 2019 జూన్‌కల్లా గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సిద్ధమవుతుంది. ఐటీలో ఏపీ నాయకత్వం వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఐటీ పట్ల ఉన్నత దృక్పథంతో ఉంటారని, ఇలాంటి ప్రాజెక్టులు ఇటు విద్యార్థులు, అటు ప్రొఫెషనల్స్‌ అత్యంత సమర్థ స్థాయికి చేరేందుకు ఉపయోగపడతాయన్నారు. చెన్నైలోని హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సను సందర్శించాలని చంద్రబాబును శివనాడార్‌ ఆహ్వానించారు. అదెంత అద్భుతంగా ఉందో పరిశీలించాలన్నారు.
 
 
ఆర్‌టీజీ రాష్ట్ర కేంద్రం చూపించిన లోకేశ్‌
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో మొదటి బ్లాక్‌లో ఏర్పాటుచేసిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ రాష్ట్ర కేంద్రాన్ని శివనాడార్‌కు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చూపించారు. అంతకుముందు శివనాడార్‌కు ఆయన సచివాలయంలో స్వాగతం పలికారు. సీఎంతో సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయానికి తోడ్కొని వెళ్లి వీడ్కోలు పలికారు.
 
 
తిరుపతి ఐఐడీటీకి దేశంలో నాలుగో స్థానం
తిరుపతిలోని ఏడాది క్రితం ప్రారంభించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడీటీ) దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ సంస్థల్లో ఆఫర్‌ చేస్తున్న అనలటికల్‌ కోర్సులు, వాటిలోని అధ్యాపకులు, ప్లేస్‌మెంట్స్‌ కోసం చేసుకున్న ఒప్పందాలు తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ ర్యాంకు ఇచ్చారు. ఐఐఎం-కోల్‌కతాలోని పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలటిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కతా ప్రాక్సీస్‌ బిజినెస్‌ స్కూల్‌, బెంగళూరు మణిపాల్‌ గ్లోబల్‌ అకాడమీ ఆఫ్‌ డాటా సైన్స్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రారంభించిన కొద్దికాలంలోనే తిరుపతి ఐఐడీటీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనలటిక్స్‌ ఇండియా సంస్థ ఈ ర్యాంకింగ్‌లిచ్చింది.
Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ కామెంట్ తో, ఫుల్ ఖుషీలో చంద్రబాబు...

   
hcl-29112017-1.jpg
share.png

2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరనుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రాష్ట్రంలో స్థాపించనున్న గ్లోబల్‌ ఐటీ డెవల్‌పమెంట్‌, శిక్షణ కేంద్రాల డిజైన్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం సచివాలయంలో కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయం దగ్గర నిర్మించే హెచ్‌సీఎల్ భవన ఆకృతులపై ముఖ్యమంత్రికి శివనాడార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యాంపస్ నిర్మాణ విశేషాలను వివరించారు.

 

hcl 29112017 2

కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ఇలా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా, అమరావతి బౌద్ధ శిల్ప శైలిలో హెచ్‌సీఎల్ నూతన భవంతుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయని శివనాడార్‌ తెలిపారు.ఆకృతులపై ముఖ్యమంత్రి చాలా సంతోషం వ్యక్తం చేశారు... అమరావతి భావనలు కూడా ఇలా ఐకానిక్ గా ప్లాన్ చేస్తున్నామని, మీరు కూడా ఇదే థీంతో ఉన్నారని అన్నారు... ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శివనాడార్‌కు చెప్పారు.

hcl 29112017 3

సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలు కొలువుదీరనున్నాయి. 2019 జూన్‌కల్లా గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సిద్ధమవుతుంది. ఐటీలో ఏపీ నాయకత్వం వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమరావతి, విజయవాడలో సుమారు 50 ఎకరాల్లో రెండు క్యాంపస్‌లు నెలకొల్పుతున్న హెచ్‌సీఎల్ వీటి నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనుంది. ఇందుకోసం మొత్తం రూ. 750 కోట్లు ఖర్చుపెట్టనుంది. ఇవి పూర్తయితే 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

 
Advertisements
Link to comment
Share on other sites

మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కొత్త ఐటీ పాలసీ
01-12-2017 17:25:50
 
636477459513620743.jpg
అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కొత్త ఐటీ పాలసీ తెచ్చేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు ఏపీని వేదిక చేసేందుకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఈ కొత్త పాలసీ రానుంది. వాక్ టూ వర్క్ కాన్సెప్ట్‌తో పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ సాఫ్ట్‌వేర్ సర్వీసులకు కాలం చెల్లడంతో అధునాతన టెక్నాలజీలపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దీంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఐఓటి, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్‌, ఫిన్‌టెక్ టెక్నాలజీ కంపెనీలను తీసుకురావడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
 
            అధునాతన టెక్నాలజీల అభివృద్ధికి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే కంపెనీలకు భూ కేటాయింపులు జరుగుతాయని.. త్వరితగతిన అనుమతులు, రాయితీలు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగాల కల్పనపై రాయితీ, స్టేట్ జిఎస్టి రాయితీ, ఫైబర్ కనెక్టివిటీ, సబ్సిడీపై విద్యుత్, తాగునీటి సరఫరాతో పాటు ఎంప్లాయ్ హౌసింగ్‌తో సహా పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తామని సర్కార్ స్పష్టం చేసింది. హైఎండ్ ఐటీ ఉద్యోగాలు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు ఫార్చ్యూన్ 500 కంపెనీ అయ్యి ఉండాలన్నదే కావాల్సిన అర్హత. రూ. 250 కోట్ల కనీస పెట్టుబడి ఉండాలని సర్కార్ షరతు పెట్టింది.
Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...