Jump to content

Amaravati ki Hyperloop?


sonykongara

Recommended Posts

Ippatike rojukoka bommalu choopi comedy avuthunnam, feasilbility lekunda endhuku ee articles comedy kaakapothe. Fessible ayithe MH/GJ eepaatiki start chesukunevi kada.

The first phase involves conducting the survey which lasts for six months on the possible routes to build this 27-mile Hyperloop

Link to comment
Share on other sites

అమరావతి-విజయవాడ మధ్య హైపర్‌లూప్‌

దేశంలోనే మొదటి ప్రాజెక్టు

ప్రయాణ సమయం ఐదు నిమిషాలే

ఈడీబీతో హెచ్‌టీటీ ఒప్పందం

ఈనాడు - అమరావతి

6ap-main8a.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నుంచి విజయవాడ వరకు హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ)తో హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ ఏర్పాటుకి కుదిరిన తొలి ఒప్పందం ఇది. ఈ విధానం వల్ల అమరావతి నుంచి విజయవాడకు ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడతారు. అవసరమైన నిధుల్ని ప్రాథమికంగా ప్రైవేటు పెట్టుబడుదారుల నుంచే సమీకరిస్తారు. మొదటి దశలో భాగంగా అక్టోబరు నుంచి ఆరు నెలలపాటు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై హెచ్‌టీటీ అధ్యయనం చేస్తుంది. అనువైన మార్గాన్ని గుర్తిస్తుంది. రెండో దశలో నిర్మాణం చేపడుతుంది. దీని వల్ల 2,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎంఓయూ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని హెచ్‌టీటీ ఛైర్మన్‌, సహ వ్యవస్థాపకుడు బిబాప్‌ గ్రెస్టా తెలిపారు. భవిష్యత్‌ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఆధునిక రవాణా వ్యవస్థలపై దృష్టి సారిస్తోందని ఈడీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

హైపర్‌లూప్‌పై ప్రజంటేషన్‌

4brk-91-hyperloop.jpg

అమరావతి: అత్యాధునిక రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ను ఏపీలో ప్రవేశపెట్టే ప్రతిపాదనలపై చర్యలు వూపందుకున్నాయి. ఈ విషయమై అమెరికాకు చెందిన హైపర్‌లూప్‌ వన్‌ సంస్థతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ ప్రతినిధులు దీనిపై అధ్యయనం ప్రారంభించారు. హైపర్‌లూప్‌ బాధ్యతల్ని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో హైపర్‌లూప్‌ ప్రతినిధులు బుధవారం మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. హైపర్‌లూప్‌ పనితీరుపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ప్రస్తుత రవాణా వ్వవస్థలపై ఈ సమావేశంలో చర్చించారు. దూర ప్రాంతాల మధ్య అనుసంధానం ఉండేలా హైపర్‌లూప్‌ను రాష్ట్రంలో ప్రారంభించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, దానికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలు జరుగుతున్నాయని రామకృష్ణారెడ్డి తెలిపారు. బుల్లెట్‌ రైళ్లు, విమానాల కంటే వేగంగా వెళ్లే వ్యవస్థ కావడంతో భద్రతపై ప్రధానంగా దృష్టి సారిస్తామని వివరించారు.

Link to comment
Share on other sites

Hyperloop Begins Preliminary Work in Amaravati India first HTT Hyperloop in Andhra Pradesh!Hyperloop Transportation Technologies (HTT) signed a memorandum of understanding with the Andhra Pradesh Economic Development Board (APEDB) in September to connect Vijayawada and Amaravati, the new capital of Andhra Pradesh in Guntur district. The representatives of the company have already started the Project Assessment. They gave a Special Presentation to Amaravati Metro Rail Corporation MD, Rama Krishna Reddy. They have discussed the geographical conditions and the present commuting systems between Vijayawada and Amaravati. These are preliminary examinations and the project will be given a go ahead only after thorough investigations. Hyperloop is expected to move faster than Bullet Trains and Aeroplanes. The distance between Vijayawada and Amaravati will be covered in just 5 minutes.

 
Link to comment
Share on other sites

నవ్యాంద్రలో హైపర్‌ లూప్‌!

636428747397528704.jpg



  • అత్యంత వేగవంతమైన పౌర రవాణా వ్యవస్థ
  • కాలుష్యరహితం.. అతి తక్కువ ప్రయాణ ఖర్చు
  • విజయవాడ, అమరావతి కేంద్రంగా 4 మెగా కారిడార్లు
  • బెజవాడ-అమరావతి- గుంటూరు-తెనాలి కారిడార్‌కూ ప్రతిపాదన
  • హైపర్‌ లూప్‌ సంస్థతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చర్చలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : అత్యంత వేగవంతమైన పౌరరవాణా వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘హైపర్‌ లూప్‌’ను నవ్యాంధ్రలో ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. హైస్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ ట్రైన్ల కంటే వేగవంతమైన, కాలుష్యరహిత, చౌక ప్రయాణం హైపర్‌ లూప్‌తో సాధ్యమవుతుంది. ఈ కారణంతోనే అన్ని దేశాలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి. దుబాయ్‌ ఏకంగా 100 కిలోమీటర్ల మేర హైపర్‌ లూప్‌ను ఏర్పాటు చేసుకోవటానికి హైపర్‌ లూప్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించటంతోపాటు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కి అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి రెండు రోజులుగా హైపర్‌లూప్‌ సంస్థ ప్రతినిధుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా.. విజయవాడ నుంచి అమరావతికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు, అమరావతి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా బెంగళూరుకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా చెన్నైకు నాలుగు మెగా కారిడార్లను ఏర్పాటు చేసే అవకాశాలపై వీరు చర్చలు జరుపుతున్నారు. తాము సూచించిన నాలుగు రూట్లలో హైపర్‌ లూప్‌ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఏఎంఆర్‌సీ ఎండీ హైపర్‌ లూప్‌ సంస్థ ప్రతినిధులను కోరారు. వీటితోపాటు విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నడుమ ఇంతకు ముందు ప్రతిపాదించిన హైస్పీడ్‌ ట్రైన్‌ స్థానంలో హైపర్‌లూప్‌ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలనూ పరిశీలించాలని సూచించారు. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికలు ఇవ్వాలని కోరారు.

 

గరిష్ఠ వేగం 1200 కిలోమీటర్లు

అమెరికా నుంచి వచ్చిన హైపర్‌లూప్‌ సాంకేతిక బృం దం రామకృష్ణారెడ్డికి హైపర్‌లూప్‌ వ్యవస్థ గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. కనిష్ఠంగా 300 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 1200 కిలోమీటర్ల వేగంతో హైపర్‌లూప్‌ ప్రయాణించగలదని వారు తెలిపా రు. పరిమిత కిలోమీటర్ల కంటే సుదూర ప్రాంతాలకు ఈ వ్యవస్థ అత్యుత్తమంగా ఉంటుందని, గరిష్ఠంగా 300 కిలోమీటర్లు ఆపైన అయితే బాగుంటుందని వివరించారు. హైపర్‌లూప్‌ కారిడార్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే స్టేషన్స్‌ ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి సర్క్యులర్‌ కారిడార్‌లో గరిష్ఠంగా ఐదు స్టాపులకు అవకాశం కల్పిస్తే హైపర్‌లూప్‌ను ఏర్పాటు చేయవచ్చా అని ఏఎంఆర్‌సీ ఎండీ ప్రశ్నించారు. దీనికి హైపర్‌లూప్‌ ప్రతినిధులు స్పందిస్తూ.. అధ్యయనం చేసిన చెబుతామని తెలిపారు.

 

ఏమిటీ హైపర్‌లూప్‌?

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా 2014 నుంచి హైపర్‌లూప్‌ సంస్థ పనిచేస్తోంది. హైపర్‌లూప్‌లు విద్యుత్‌ చోదక శక్తితో పనిచేస్తాయి. హైపర్‌లూప్‌ కోచ్‌లు ప్రయాణించేందుకు భూగర్భంలో కానీ.. భూమిపై పిల్లర్ల మీద కానీ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఆరు మీటర్ల వెడల్పుతో కూడిన భారీ ట్యూబును హైపర్‌ లూర్‌ కారిడార్‌ పొడవునా నిర్మిస్తారు. ఈ ట్యూబ్‌లో హైపర్‌లూప్‌ కోచ్‌లు నడుస్తాయి. విద్యుత్‌ శక్తితోపాటు ట్యూబ్‌ లోపల ఏర్పాటు చేసే మాగ్నటిక్‌ లెవిటేషన్‌, ఏరో డైనమిక్‌ ట్రాక్‌ వ్యవస్థ వల్ల ఈ కోచ్‌ ఎటూ పడిపోకుండా గంటకు 300 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కో కోచ్‌లో 50 మంది వరకు ప్రయాణించవచ్చు. పాసింజర్‌ కోచ్‌లతోపాటు సరుకు రవాణా కోచ్‌లు కూడా ఉంటాయి. సాధారణ రైళ్లలో ఒక్కసారిగా గరిష్ఠ వేగం నుంచి కనిష్ఠ వేగానికి.. కనిష్ఠ వేగం నుంచి గరిష్ఠ వేగానికి చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ హైపర్‌ లూప్‌ వ్యవస్థలో ఈ ప్రక్రియ సత్వరం జరగడం విశేషం.

Link to comment
Share on other sites

  • 6 months later...

hyperloop

రాజధానిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ
ప్రతిపాదనలు అందజేసిన హెచ్‌టీటీ సంస్థ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) సంస్థ శుక్రవారం ప్రాథమిక ప్రతిపాదనలు అందజేసింది. ఆ సంస్థ ఛైర్మన్‌ బిబాప్‌ గ్రెస్టా సారథ్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో శుక్రవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశమైంది. దీనిలో ఇంధన, ఐ ఐండ్‌ ఐ, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈఓ జాస్తి కృష్ణకిశోర్‌ పాల్గొన్నారు. మొదట అమరావతిలో 5-10 కి.మీ.మేర పైలట్‌ ప్రాజెక్టుగా, రెండోదశలో విజయవాడ-అమరావతి మధ్య వాణిజ్య ప్రాతిపదికన, మూడోదశలో అనంతపురం-అమరావతి-విజయవాడ- విశాఖపట్నం మధ్య చేపట్టవచ్చని హెచ్‌టీటీ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 900 కి.మీ. మేర ఈ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం ఉన్నట్టు బిబాప్‌ తెలిపారు. రైలులో 8 గంటలు, కారులో 6 గంటలు, హైస్పీడ్‌ రైలులో 3 గంటలు, విమానంలో గంటన్నరలో చేరుకునే దూరాన్ని కేవలం 35 నిమిషాల్లో చేరుకోవచ్చని వివరించారు. మెట్రో, హైస్పీడ్‌ రైళ్లతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చన్నారు. ఒక కి.మీ. మెట్రో మార్గం నిర్మాణానికి 120 మిలియన్‌ డాలర్లు, హైస్పీడు రైలుకి 150 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని, అదే హైపర్‌లూప్‌ వ్యవస్థకు 20 నుంచి 40 మిలియన్‌ డాలర్లు సరిపోతుందని తెలిపారు. గరిష్ఠంగా గంటకు 1223 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చన్నారు. తొలుత అమరావతిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకి సాధ్యాసాధ్యాల (ఫీజిబిలిటీ) నివేదిక ఇవ్వాలని, దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అజయ్‌జైన్‌ సూచించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో హైపర్‌లూప్‌!
05-05-2018 03:21:55
 
636610873193882460.jpg
  • సాధ్యాసాధ్యాలపై చర్చ.. ఏపీలో 900 కి.మీకి ఆస్కారం
  • హైపర్‌లూప్‌ సంస్థ ప్రతిపాదన
  • 8 గంటల ప్రయాణం 35 నిమిషాల్లోనే
  • పూర్తి నివేదిక కోరిన ఏపీసీఆర్డీఏ
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంతవేగవంతమైన ప్రతిపాదిత రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ ఏర్పాటు అవకాశాలపై హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) సంస్థ ప్రతినిధులతో ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే నిర్మించవచ్చని భావిస్తున్న హైపర్‌లూప్‌ వ్యవస్థను తొలుత అమరావతిలో, ఆ తర్వాత దశలవారీగా అనంతపురం, విశాఖపట్నాలకు విస్తరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో సుమారు 900 కిలోమీటర్ల పొడవున ఈ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశాలున్నాయని హైపర్‌లూప్‌ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించారు. హెచ్‌టీటీ సంస్థ చైర్మన్‌ బిబాప్‌ గ్రెస్టా మాట్లాడుతూ.. ప్రస్తుతం రైళ్ల ద్వారా 8 గంటలు, కార్లలో 6 గంటలు, హైస్పీడ్‌ ట్రెయిన్‌ ద్వారా 3 గంటలు, విమానం ద్వారా గంటన్నరలో చేరుకోగలిగిన దూరాన్ని తాము ప్రతిపాదిస్తున్న హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ ద్వారా 35 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ప్రపంచ రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చివేసే ఈ వ్యవస్థను అమెరికా, ఫ్రాన్స్‌, స్లొవేకియా, అబుదాబి తదితర దేశాల్లో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హైస్పీడ్‌, మెట్రో రైళ్లతో పోల్చితే హైపర్‌లూప్‌ వ్యవస్థను అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చన్నారు. వాటికయ్యే ఖర్చులో దీన్ని మూడు నుంచి నాలుగొంతుల తక్కువతోనే నిర్మించొచ్చని పేర్కొన్నారు. విద్యుదయస్కాంత శక్తితో పనిచేసే ఈ వ్యవస్థ కాలుష్యం రహితం, సురక్షితమని చెప్పారు. పైపుల్లాంటి నిర్మాణాల్లో గంటకు సుమారు 1223 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైపర్‌లూప్‌ 30 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వ్యాసార్థ్యం, 20 టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. 2050 కల్లా అమరావతిలో ఉండబోయే 35 లక్షలమందితోపాటు నిత్యం ఆ నగరానికి వివిధ పనులపై వచ్చే లక్షలాదిమంది రవాణా అవసరాలను ఈ వ్యవస్థ తీర్చగలదని అన్నారు. తొలిదశలో ఈ వ్యవస్థను అమరావతిలో 10 కిలోమీటర్ల పొడవున ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయవచ్చని, ఆ తర్వాత విజయవాడ-అమరావతి మధ్య వాణిజ్య ప్రాతిపదికన దీన్ని విస్తరించవచ్చునని, 3వ దశలో అనంతపురం-అమరావతి, విజయవాడ-విశాఖపట్నం మధ్య నిర్మించవచ్చని ప్రతిపాదించారు. ఏపీసీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌.. హైపర్‌లూప్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను వివరించే నివేదికను సమర్పించాల్సిందిగా ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణకిశోర్‌, సీఆర్డీఏ ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...