Jump to content

Govt. General Hospital, Guntur


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 101
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 5 weeks later...
ప్రపంచ ప్రమాణాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
08-09-2018 07:38:51
 
636719891313086621.jpg
  • రూ.65 కోట్లతో జీ ప్లస్‌ ఫైవ్‌
  • వారంలో టెండర్లు, అక్టోబర్‌లో శంకుస్థాపన
  • కలెక్టర్‌ కోన శశిధర్‌
గుంటూరు: ఎన్నారై డాక్టర్ల సహకారంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌ బ్లాక్‌) నిర్మిస్తున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు. శుశృతహాల్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతవారం అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ‘గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా’ (జింకానా) ద్వైవార్షిక సదస్సుకు కలెక్టర్‌ శశిధర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సు విశేషాలను మీడియాకు వివరించారు. రూ.65 కోట్లతో ఎంసీహెచ్‌ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, జింకానా ప్రతినిధులు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ భవనంలో చిన్న పిల్లల వైద్యం, స్ర్తీ, ప్రసూతి వైద్యానికి సంబంధించిన 600 పడకలు ఉంటాయన్నారు.
 
రెండేళ్లల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నారైలతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తును ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అఽధికారులు పూర్తి చేస్తారన్నారు. రెండు, మూడు, నాలుగు, ఐదు అంతస్తులను జింకానా ప్రతినిధులు నిర్మించి ఇస్తారన్నారు. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవడంతో సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వచ్చేవారంలో అంగీకార పత్రం (ఎంవోయూ) కుదుర్చుకుంటామని, వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి అక్టోబర్‌ చివరి నాటికి భవన నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పొదిల ప్రసాద్‌ బ్లాక్‌పై మరో రెండంతస్తులు నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. మరో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మాణానికి సహకరిస్తామని ఎన్నారై డాక్టర్లు హామీ ఇచ్చారని తెలిపారు. జింకానా సహకారంతో సిమ్యులేటర్ల సాయంతో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘కార్డియాక్‌ రీ-సక్సిటేషన్‌’పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
 
ఆశా, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, మహిళా స్వయం సహాయక బృందాలకూ ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నారై డాక్టర్ల బోధన సేవలను వినియోగించుకొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఇందుకోసం జీజీహెచ్‌లో ప్రతి వైద్య విభాగంలోసీనియర్‌ డాక్టర్లు అడ్వైయిజరీ కమిటీలుగా ఏర్పడాలని సూచించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్య విభాగం క్యాజువాల్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆర్ధోపెడిక్‌ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ జి.వరప్రసాద్‌ను క్యాజువాల్టీ విభాగం ఇన్‌చార్జ్‌గా నియమిస్తాం. జీజీహెచ్‌ అభివృద్ధికి వివిధ ప్రాంతాల్లో స్ధిరపడిన జింకోసా (గుంటూరు మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం) డాక్టర్లు కూడా విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డీఎస్‌ రాజునాయుడు, వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.ఫర్నీకుమార్‌, జింకానా కో ఆర్డినేటర్లు వి.బాలభాస్కరరావు, పీవీ హనుమంతరావు, వైద్యులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఆధునిక కంటి వైద్యం
11-09-2018 08:25:41
 
636722511415805151.jpg
  • డయాబెటిక్‌ రెటినోపతికి ఉచిత ఆధునిక చికిత్సలు
  • లేజర్‌ ఫొటో కోయగ్లేషన్‌ శస్త్రచికిత్సలు
  • ప్రతి సోమ, మంగళవారాల్లో..
  • పేదలకు ఎంతో ఉపయుక్తం
గుంటూరు: దీర్ఘకాలిక మధుమేహ రోగుల్లో ఏర్పడే డయాబెటిక్‌ రెటినోపతి (కంటిచూపు మందగించడం) రోగులకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక లేజర్‌ ఫొటో కోయగ్లేషన్‌ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రెటినా సర్జన్‌ డాక్టర్‌ సమీరా ప్రతి సోమ, మంగళవారాల్లో జీజీహెచ్‌లో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రైవేటు వైద్యరంగంలో కూడా ఒకటి, రెండు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ కంటి శస్త్రచికిత్సలు అందుబాట్లో ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఈ శస్త్రచికిత్సలకు భారీగా ఖర్చు అవుతుంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రతి సోమ, మంగళవారాల్లో రెటినోపతి రోగులకు ఉచితంగా ఫొటో కోయగ్లేషన్‌ కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. నేత్ర వైద్య విభాగం ఓపీ వార్డులో సోమ, మంగళవారాల్లో సగటున 35-40 మంది రెటీనా సంబంధిత రోగులను డాక్టర్‌ సమీరా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు, నలుగురు రోగులకు లేజర్‌ శస్త్రచికిత్సలు అవసరం పడుతున్నాయి. తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన ఖరీదైన వైద్య పరికరాలను జీజీహెచ్‌కు తెచ్చి ఇక్కడ పేద రోగులకు చక్కటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
 
 
ఉచితంగా బోధన, చికిత్సలు!
విజయవాడలోని ఎల్‌ వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ అధినేత డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి. దీంతో ఆయన గుంటూరు జీజీహెచ్‌లోని కంటి వైద్య విభాగానికి, ఆప్తమాలజీ పీజీ విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా, ఆధునిక నేత్ర వైద్యశస్త్రచికిత్సల్లో మెళకువలు, నూతన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జీజీహెచ్‌ అధికారులతో ఆయన ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ నుంచి కంటి పాప (రెటీనా) వైద్యంలో నిపుణులైన డాక్టర్‌ సమీరా ప్రతి సోమ, మంగళవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నేత్ర వైద్య విభాగంలో సేవలు అందిస్తున్నారు. రెటీనా జబ్బులతో బాధపడే రోగులకు వైద్యం చేయడం, వాటిని పీజీ విద్యార్థులకు వివరిస్తున్నారు. వైద్య బోధనలో పీజీ విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
 
 
68 కార్నియాల సేకరణ
ఎల్‌వీ ప్రసాద్‌ సంస్థ తరపున గ్రీఫ్‌ కౌన్సెలర్‌ను ప్రభుత్వాస్పత్రి క్యాజువాల్టీలో నియమించారు. రోగులు మృతి చెందినప్పుడు వారి కుటుంబీకులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి నేత్రదాన ప్రాముఖ్యతను ఈ కౌన్సెలర్‌ వివరిస్తారు. ఈ విధంగా గ్రీఫ్‌ కౌన్సెలింగ్‌ చేయడం వల్ల ఇటీవలకాలంలో 68 నేత్రాలను సేకరించినట్లు జీజీహెచ్‌ నేత్ర వైద్య విభాగాధిపతి డాక్టర్‌ ఎం.ఫర్నీకుమార్‌ తెలిపారు. వీటిని 68 మంది అంధులకు అమర్చడం ద్వారా వారికి కొత్త జీవితం లభించినట్లు చెప్పారు. మధుమేహంతో బాధపడే రోగుల్లో కంటి చూపు తగ్గిన వారు రెటినోపతి స్ర్కీనింగ్‌ పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి రావాలని ఆయన కోరారు. అవరమైన వారికి ఉచితంగా లేజర్‌ ఫొటో కోయగ్లేషన్‌ ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.
Link to comment
Share on other sites

ఎంసీహెచ్‌ భవనానికి తొలగిన అడ్డంకులు
27-09-2018 07:03:52
 
636736286339775285.jpg
  • జింకానాతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
  • త్వరలో టెండర్లు... నవంబరులో నిర్మాణ పనులు
  • రూ.65 కోట్ల వ్యయంతో ఐదంతస్తులు
 
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో రూ.65కోట్ల భారీ వ్యయంతో మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌ (ఎంసీహెచ్‌ బ్లాక్‌) నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండ య్య సమక్షంలో సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జింకానా చీఫ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వి. బాలభాస్కరరావు, ఏపీ వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ బాబ్జీ అంగీకార పత్రాలపై సంతకాలు చేసి ఎంవోయూ కుదుర్చుకున్నారు.
 
 
గుంటూరు: జీజీ హెచ్‌లో ఎంసీహెచ్‌ బ్లాక్‌ భారీ భవన నిర్మా ణానికి అడ్డంకులు తొల గిపోయాయి. భవన నిర్మాణాల డిజైన్‌లు ఇప్పటికే రూపొందించడంతో వీటిని ఆమోదిం చడం ఇక లాంఛనమే. త్వరలో టెండర్లు పిలిచి నవంబ రు నెలాఖరునాటికి భవన నిర్మాణ పనులు ప్రారంభించా లని నిర్ణయించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏటా సగ టున 1200 కాన్పులు జరుగుతుంటాయి. పడకల సంఖ్య, ఇతర సౌకర్యాలు తక్కువగా ఉండటంతో ఇద్దరు బాలిం తలను ఒకే మంచంపై ఉంచక తప్పడం లేదు. ఇది తల్లులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు భారీస్థాయి లో నూతన భవనం నిర్మించాలని నాలుగేళ్ల కిందటే నిర్ణయించినా... నేటికి ఇది కార్యరూపం దాల్చలేదు. పలు ఆటంకాలతో నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
 
నిర్మాణ పనులు ఇలా...
భవన నిర్మాణానికి అయ్యే రూ.65కోట్ల వ్యయంలో కేంద్రప్రభుత్వం రూ.20కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.15 కోట్లు, జింకానా ప్రతినిధులు రూ.30 కోట్లు వెచ్చించేం దుకు ఆమోదం లభించింది. ఐదంతస్తులతో 2 లక్షల 69వేల 245 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో నిర్మాణం జరుగుతుంది. కొత్తగా కుదిరిన ఎంవోయూ ప్రకారం... మూడు దశల్లో నిర్మా ణం జరుపుతారు. తొలి ఽధశ పనులకు రూ.20కోట్లు (కేంద్ర ప్రభుత్వ నిధులు, రెండో దశ పనులకు రూ.30 కోట్లు (సగం రాష్ట్రప్రభుత్వం, సగం జింకానా నిధులు), మూడో దశ నిర్మాణ పనులకు రూ.15కోట్లు (జింకా నా నిధులు) వెచ్చి స్తారు. ఫౌండేషన్‌, సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తును ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవ లు, మౌలిక సదుపా యాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) ఈ పనులు చేపడుతుం ది. రెండు, మూడు, నాలుగు, ఐదు అంత స్తులను జింకానా చేప డుతుంది. రెండేళ్లల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
ఆధునిక నిర్మాణ శైలితో...
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో చేపట్టే ఎంసీహె చ్‌ బ్లాక్‌ ఆధునిక నిర్మాణ శైలితో రూపొందించారు. అక్టోబర్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి నవంబర్‌ మొద టివారం నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బహుళ అంతస్తుల భనవం లో స్ర్తీ, ప్రసూతి వైద్యం కోసం 300 పడకలు, శిశు వైద్యం కోసం 200 పడకలు ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా పీడియాట్రిక్‌ ఐసీయూ వార్డులో 27 పడకలు, నియోనేటల్‌ ఐసీయూ వార్డులో 40 పడకలు ఏర్పాటుచేస్తారు. స్పెషల్‌ కేర్‌ న్యూబార్న్‌ యూనిట్‌లో 30పడకలు ఉంటాయి. వైద్యబోధన సిబ్బంది కోసం మొత్తం 30 గదులను నిర్మిస్తారు. 300 మంది కూర్చునేవిఽధంగా సమావేశ మందిరాన్ని కూడా నిర్మిస్తారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...