Jump to content

Vijayawada Outer Ring Road


sonykongara

Recommended Posts

  • 3 weeks later...
బెజవాడ ఐఆర్‌ఆర్‌ వెంట స్థిరాస్తి జోరు
23-02-2019 05:27:40
 
636864964586976634.jpg
  • రూ.5 కోట్ల వరకు పలుకుతున్న విల్లాలు
  • రూ.6 కోట్లకు చేరిన ఎకరా భూమి ధర
 
విజయవాడ అంతర్‌ వలయ రహదారి (ఐఆర్‌ఆర్‌) వెంట స్థిరాస్తి రంగం జోరందుకుంది. అనేక అంశాలు ఇందుకు కలిసొస్తున్నాయి. ఈ రహదారి విస్తరించిన రామవరప్పాడు జంక్షన్‌ నుంచి పాయకాపురం కూడలి వరకు అనేక వెంచర్లు వెలిశాయి. పెద్ద సంఖ్యలో లగ్జరీ విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఊపందుకుంది. దీంతో ధరలూ చుక్కలంటుతున్నాయి. బెజవాడ ఐఆర్‌ఆర్‌ ప్రాంతంలో నెలకొన్న రియల్టీ జోరుపై ప్రత్యేక స్టోరీ..
 
 (ఆంధ్రజ్యోతి, అమరావతి)
విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రాంతంలో స్థిరాస్తి రంగం జోరందుకుంది. ఈ రోడ్డుకు ఇరువైపులా రామవరప్పాడు జంక్షన్‌ నుంచి పాయకాపురం కూడలి వరకు పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ఐఆర్‌ఆర్‌కు సమీపంలోని పంట భూములు, నివాస స్థలాలు, అపార్ట్‌మెంట్ల ధరలకు ఊపొచ్చింది. లగ్జరీ విల్లాలు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, ఎకరా పంట భూములు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఐఆర్‌ఆర్‌కు దగ్గరి వెంచర్లలో గజం స్థలం రూ.55,000 నుంచి రూ.60,000 వరకు ఉంది. అయినా కొనుగోలుదారులు వెనకాడడం లేదు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి గిరాకీ తథ్యమన్న అంచనాలతో పలువురు బిల్డర్లు, డెవలపర్లు ఇక్కడ తమ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని ప్రముఖ పాఠశాలలు, వాణిజ్య సంస్థలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి.
 
ఎందుకీ ఐఆర్‌ఆర్‌
విజయవాడ నగరాన్ని ట్రాఫిక్‌ రద్దీల నుంచి తప్పించేందుకు మూడేళ్ల క్రితం ఐఆర్‌ఆర్‌ను నిర్మించారు. ఈ రహదారి రామవరప్పాడు రింగ్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి పాయకాపురం, అజిత్‌సింగ్‌ నగర్‌, వై.వి.రావు ఎస్టేట్స్‌, చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌, విద్యాధరపురం మీదుగా గొల్లపూడిని చేరుతుంది. ఆశించిన విధంగానే ఈ రహదారి బెజవాడ నగరాన్ని ట్రాఫిక్‌ కష్టాల నుంచి చాలావరకు రక్షించింది. కనకదుర్గమ్మ ఫ్లైవోవర్‌ నిర్మాణంలో చోటు చేసుకుంటున్న జాప్యంతో విజయవాడలోని పలు ప్రదేశాలు ట్రాఫిక్‌ జామ్‌లలో చిక్కుకుని విలవిలలాడాల్సిన అగత్యమూ ఈ రహదారితో తప్పింది.
 
ప్రశాంత జీవనం
విజయవాడ నగరం ఇప్పటికే విద్య, ఉద్యోగ, వ్యాపారాలతో కిక్కిరిసి పోయింది. ఈ అవసరాల కోసం తప్పనిసరిగా నగరంలో ఉండాల్సి వారిలో, చాలా మంది ఆ దశలను దాటిపోయారు. ఇలాంటి వారిలో కొందరు నగరానికి దగ్గరగా ఉంటూనే, ఇంకొకవైపు ప్రశాంతంగా ఉండే ఐఆర్‌ఆర్‌ పరిసరాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఐఆర్‌ఆర్‌ మీదుగా అటు విజయవాడ, ఇటు ఏలూరు, నూజివీడు, మైలవరం, హైదరాబాద్‌ వంటి ప్రదేశాలకు వెళ్లడం సులభం. దీంతో ఈ ప్రాంతంలో రియల్టీ మార్కెట్‌ ఊపందుకుంది. అమరావతిని కృష్ణా జిల్లాతో నేరుగా అనుసంధానిస్తూ, కృష్ణానదిపై సూరాయపాలెం- గొల్లపూడి మధ్య, ఇబ్రహీంపట్నం సంగమ ప్రదేశం- ఉద్ధండరాయునిపాలెం మధ్య వంతెనలు నిర్మించబోతున్నారు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత, వాటి మీదుగా విజయవాడను తాకకుండానే గన్నవరం విమానాశ్రయానికి చేరుకునేందుకు ఐఆర్‌ఆర్‌ దగ్గరి దారి అవుతుంది. దీనికి తోడు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కేసరపల్లి, కొండపావులూరుల పక్కగా 80 అడుగుల రహదారిని నిర్మించి, దానిని గుణదల సరిహద్దుల్లో ఐఆర్‌ఆర్‌కు అనుసంధానం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అమరావతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.
 
ఇరువైపులా నిర్మాణాలు
రామవరప్పాడు రింగ్‌ రోడ్డు నుంచి ప్రారంభమయ్యే ఐఆర్‌ఆర్‌పై ఇప్పటికే రెండు చోట్ల ఫ్లైవోవర్లు నిర్మించారు. ఈ రెండు ఫ్లైవోవర్ల మధ్య ఉన్న సుమారు కిలోమీటరున్నర ప్రాంతంలో అనేక గ్రూప్‌ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు, లగ్జరీ విల్లాలు వెలిశాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 10 నుంచి 20 డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లున్న సుమారు 10 అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం పూర్తయింది. మరికొన్నింటి నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. నలభై నుంచి వంద లోపు ఫ్లాట్లున్న మరో రెండు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు నిర్మాణం జరుగుతోంది. ఈ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు సగటున రూ.3,400 నుంచి రూ.3,800 వరకు ఉంది.
 
గేటెట్‌ కమ్యూనిటీలు
ఇవి కాకుండా.. సకల వసతులుండే, వందలాది లగ్జరీ ఫ్లాట్లతో కూడిన రెండు భారీ గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఐఆర్‌ఆర్‌ పక్కన వస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో సుమారు 175 ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లుండే ఈ వెంచర్లను అధునాతన సౌకర్యాలతో, సువిశాల ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.4,200కు కాస్త అటూ ఇటూగా ఉన్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే ఈ ధర తక్కువే. దీంతో పలువురు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
 
లగ్జరీ విల్లాలు
మరోపక్క ఐఆర్‌ఆర్‌కు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని, దానికి సమీపంలో విలాసవంతమైన విల్లాలను కొందరు డెవలపర్లు ప్లాన్‌ చేస్తున్నారు. ఒక్కొక్కటి 400 చదరపు గజాల్లో, అత్యధునాతన సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ విల్లాల ధర రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య చెబుతున్నారు. 275 చదరపు గజాల్లో నిర్మించే విల్లాల ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 years later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...