Jump to content

Vijayawada Outer Ring Road


sonykongara

Recommended Posts

Ee Road complete ayi vunte Benz circle dagara 90% traffic taggipoyedhi..

 

2 years gaa Aa bridge construction aaparu CBN.. taruvata Gamman vadi dagara dabbu karuvu vachindhi.. ee project inko min 5 years ayina patudhi emo..

CBN enduku apedu bro?

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
విజయవాడ - గుండుగొలను రోడ్డు బీఓటీ రద్దు !!
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు బీఓటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతోంది. ఈపీసీ విధానంలో తిరిగి టెండర్లు పిలవాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా పనులు ప్రారంభించకుండా అంతులేని తాత్సారం చేస్తున్న ‘గామన’ సంస్థ.. తనకు ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా కాలదన్నుకోవటంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీఓటీ విధానాన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జూన మొదటివారంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏపీ రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి జరిగే సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి ఆ సంస్థకు జాతీయ రహదారుల సంస్థ (ఎనహెచ) ఇచ్చిన మూడు నెలల గడువు ముగియటంతో ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘విజయవాడ - గుండుగొలను ’ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణజైట్లీ ఒక విషయాన్ని ప్రస్తావించారు. గామన సంస్థ ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోయిందని, బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి పరపతి సౌకర్యం లభించటం లేదని, కాబట్టి ఈ ప్రాజెక్టును ఇక ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని భావిస్తున్నట్టుగా చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయంపై జాతీయ రహదారుల సంస్థ (ఎనహెచ) అఽప్రమత్తమైంది. తదనుగుణ చర్యలు చేపట్టడానికి అధికారికంగా ఆదేశాలు అందాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి జూన మొదటి వారంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ అధికారులు, మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రద్దు చేసిన ప్రాజెక్టుల్లో రెండోది..
జాతీయ రహదారుల విస్తరణకు పిలిచిన ప్రాజెక్టులకు సంబంధించి రద్దు చేసుకోవటం తాజాగా కృష్ణాజిల్లాలో ఇది రెండవదిగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇంతకు ముందు విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల జాతీయ రహదారి ప్రాజెక్టు/బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టులను బీఓటీ విధానంలో మధుకాన సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థకు నిధులు సర్దుబాటు కాకపోవటంతో ఈ పాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో బీఓటీని రద్దు చేసి టెండర్లు పిలిచారు. ఇదే కోవలో తాజాగా విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టు కూడా తయారైంది. దాదాపు 104 కిలోమీటర్ల మేర విజయవాడ బైపాస్‌, జంక్షన బైపాస్‌లతో అంతర్భాగంగా ఆరు వరసల రోడ్డు ప్రాజెక్టుగా పనులు చేపట్టవలసి ఉంది. దాదాపుగా 98 శాతం మేర భూ సేకరణ జరిగి పరిహారం అందించటం కూడా జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభం కాకపోవటంతో భూములిచ్చిన రైతుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఏడాది కాలహరణం తప్పదు
బీఓటీ ప్రాజెక్టును రద్దు చేసి ఈపీసీ విధానంలో టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో, విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టు వ్యయం పెరగటంతో పాటు మరో ఏడాది సమయం కూడా కాలహరణం జరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ - మచిలీపట్నం ప్రాజెక్టునే తీసుకుంటే.. బీఓటీని రద్దు చేయటం వల్ల వ్యయం పెరిగింది. ఆ తర్వాత ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనా.. ఇవి పూర్తి కావటానికి మరో రెండేళ్ళ సమయం పట్టే అవకాశం ఉంది. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈపీసీ విధానంలో పిలిస్తే .. రూ.1400 కోట్ల ఈ ప్రాజెక్టు కనీసం రూ. 2500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత రేట్ల ప్రకారం చూసినా... నాలుగులేన్ల బైపాస్‌లను ఆరు లేన్లు చేస్తున్న నేపథ్యంలో, వ్యయం పెరిగే అవకాశం ఉంది. టెండర్లను ఖరారు చేయటానికి ఏడాది సమయం పడుతుంది. ఈ క్రమంలో 2018 మొదటి అర్థ సంవత్సరంలో టెండర్లు పిలిస్తే.. 2018 చివరి పావు సంవత్సరంలో కానీ , 2019 మొదటి అర్థ సవత్సరంలో కానీ పనులు చేపట్టే పరిస్థితి రాదు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
హతవిధీ..
23-06-2017 08:17:49
 
636338028556262305.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును పట్టి వేలాడుతున్న ‘గామన్‌ ’ ను వదిలిస్తారనుకుంటే ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై ప్రేమచూపింది. తాను చెయ్యదు... మరెవరినీ చెయ్యనీయని చందాన మూడేళ్ళుగా రోడ్డు ప్రాజెక్టు పనులను పూర్తి చేసే విషయంలో దోబూచులాడుతున్న గామన్‌ సంస్థకు మరో రెండు నెలల గడువును కేంద్రం ఇచ్చిందన్న విషయం వెలుగు చూసింది. ఇప్పటికి ఎన్నోసార్లు ఆర్థిక వనరులు సర్దుబాటు చేసుకోవటానికి గడువు ఇచ్చినా.. ఆ దిశగా విఫలమైన గామన్‌ సంస్థ కిందటి దఫా కొంత సమయాన్ని కోరింది.
 
 
ఈ క్రమంలో ‘గామన్‌ ’ సంస్థకు చివరిగా అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించి మరో మూడు నెలల గడువును ఇచ్చింది. ఈ దఫా పురోగతి కనిపించకపోతే ఇక ఇదే ఆఖరి అవకాశమని అంతా భావించారు. ప్రాజెక్టుకు సంబంధించి మూడు నెలల్లో అంగుళం మట్టి కూడా కదలలేదు. కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక వనరులు కూడా సమకూరలేదు. ఇలాంటి క్రమంలో ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలుకుతుందని అంతా భావించారు. విజయవాడ నగరం మీద విపరీతమైన ట్రాఫిక్‌ భారం పడుతోంది. నగరంలో భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా ప్రస్తుతం జరుగుతోంది.
 
రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీగా ట్రాఫిక్‌ పెరిగిపోయింది. పెరిగిపోయిన ట్రాఫిక్‌ ఒక ఎత్తు అయితే... జరుగుతున్న పనుల వల్ల పరిస్తితి మరింత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టుపైనే చర్చించుకుంటున్నారు. గామన్‌ సంస్థ తగిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికే రోడ్డు పనులు పూర్తయ్యి ఉండేవి.
 
దీనికి భిన్నంగా ఉండటం వల్ల అసంపూర్తిగా ఉన్నాయి. చివరి అవకాశాన్ని కూడా కాలదన్నుకోవటంతో గామన్‌కు ఉద్వాసన పలకటం ఖాయమని తేలింది. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు విషయంలో ఈపీసి విధానంలో వెళ్తామని చెప్పారు. దీనికి భిన్నంగా ఈపీసీ మళ్ళీ గామన్‌కే ఎందుకు కట్టబెట్టారన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ లోపైనా గామన్‌ సంస్థ ఆర్థిక వనరులు సమకుపార్జించుకుని పనులు ప్రారంబిస్తుందో లేదో చూడాల్సిందే.
Link to comment
Share on other sites

Guest Urban Legend

kachiatam ga kaavalani chestunnaru gadkari batch ...

its very clear

sare vadu july lopu source chesina ah project aithey complete cheyyadu

Link to comment
Share on other sites

  • 1 month later...

‘గామన్‌’ గ్రహణం!

04-08-2017 02:33:02
 
636374107839633382.jpg
  • పట్టాలెక్కని బెజవాడ-గుండుగొలను ప్రాజెక్టు
  • మూడో విడత గడువూ ముగిసింది
  • ఐదేళ్లుగా అడుగు ముందుకు పడని వైనం
  • విజయవాడ ట్రాఫిక్‌ కష్టాలకు లభించని పరిష్కారం
 
విజయవాడ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): విజయవాడ- గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు.. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైనది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ కష్టాలను తీర్చటంతోపాటు, రాజధాని అమరావతిని ఉభయ గోదావరి జిల్లాలతో అనుసంధానం చేసే ‘విజయవాడ-గుండుగొలను’ రోడ్డు ప్రాజెక్టుకు మోక్షం కలగటం లేదు. ఈ ప్రాజెక్టును బీవోటీ విధానంలో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ‘గామన్‌’ ఐదేళ్లుగా పనుల ఊసే ఎత్తడం లేదు. రైతుల సహకారంతో అతి సునాయాసంగా 98శాతం భూ సేకరణ జరిగినా.. ఏళ్ల తరబడి పనులు ప్రారంభం కాని ప్రాజెక్టు బహుశా దేశంలో ఇదే కావచ్చు.
 
గుంటూరు జిల్లా కాజ నుచి కృష్ణానది మీదుగా ఎన్‌హెచ్‌ - 65ను ఎన్‌హెచ్‌ - 16తో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టును అమరావతికి రాజమార్గంగా ఉపయోగించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఉన్న నాలుగు వరుసల ప్రతిపాదనను సవరించి ఆరు వరుసలుగా నిర్మించాలని ఆలోచన చేసింది. కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్‌ వంతెనను కూడా ఆరువరుసలుగా నిర్మించటానికి సిద్ధమైంది. ఈ సవరణలకు అయ్యే ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సమాయత్తమైంది. కాజ నుంచి గుండుగొలను వరకు విస్తరిస్తున్న రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా రెండు బైపా్‌సలు ఉన్నాయి.
 
గుంటుపల్లి మీదుగా సూరంపల్లి, బీబీ గూడెం, పెద అవుటపల్లి వరకు 48 కిలోమీటర్ల వరకు విజయవాడ బైపాస్‌ నిర్మించాల్సి ఉంది. విజయవాడ బైపాస్‌ వల్ల హైదరాబాద్‌ , ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను, చెన్నై నుంచి వచ్చే ట్రాఫిక్‌ను విజయవాడ బైపాస్‌ మీదుగా పెద అవుటపల్లికి డైవర్షన్‌ చేయవచ్చు. దీంతో విజయవాడలోకి లారీల రాకపోకలకు పూర్తిగా బ్రేక్‌ పడుతుంది. దీంతో బెజవాడ ట్రాఫిక్‌ కష్టాలకు ఉపశమనం లభిస్తుంది. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు 42 కిలోమీటర్ల వరకు రెండో బైపా్‌సను నిర్మించాల్సి ఉంటుంది.
 
కీలక ప్రాజెక్టుపై కాంట్రాక్ట్‌ సంస్థ నిర్లక్ష్యం
నవ్యాంధ్రకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టు సంస్థ గామన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక ఇబ్బందులలో ఉండటంతో కొంత మేర మట్టిలెవలింగ్‌ పనులు మాత్రమే చేసి పనులు ఆపేసింది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థకు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు పదేపదే నోటీసులు జారీ చేశారు. అయినా పనులు చేపట్టకపోవటంతో గామన్‌ సంస్థను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు నోట్‌ పంపించారు. దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఆ సంస్థకు గడువు ఇచ్చారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆస్ర్టేలియన్‌ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్‌తో పనులు చేయించేందుకు ప్రయత్నాలు చేసినా.. గామన్‌ నుంచి సహకారం లభించలేదు. మొత్తం మూడు విడతలుగా గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 2 తో మూడో విడత గడువు కూడా ముగిసింది.
 
2017 నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు
తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును 2017 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును 103.59 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1684 కోట్లు. మార్చి 21 , 2012న ఈ సంస్థతో ఎన్‌హెచ్‌ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబరు 1 , 2014 న ఎన్‌హెచ్‌ అపాయింట్‌ డేట్‌ ఇచ్చింది. గామన్‌ సంస్థకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా పనులు చేపట్టకపోవడంతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాల్సి వస్తే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.1600 కోట్లు కాగా మరో రూ.900 కోట్ల మేర వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన రూ.2500 కోట్లకు ఈ ప్రాజెక్టు చేరుకుంటుందన్నమాట.
 
కాంట్రాక్టు సంస్థ గామన్‌పై కేంద్ర ప్రభుత్వం అమిత ప్రేమ చూపుతోంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) టెర్మినేట్‌ చేయమని సిఫారసు చేసినా పట్టించుకోకుండా ‘గామన్‌’కు గడువుల మీద గడువులు ఇస్తూ అవకాశాలను కల్పిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గామన్‌ సంస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పాటికే అమరావతికి అత్యద్భుతమైన రాజమార్గం సాకారమై ఉండేది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎంతో మైలేజీ తీసుకువచ్చేది.
 
state govt. inka emi pressure cheyyali? state govt want to get rid of Gaman. edo criticize cheyyalani chesinatlu ga vundi chivarlo.
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...