Jump to content

Vijayawada Outer Ring Road


sonykongara

Recommended Posts

గామన్ కు మళ్లీ విజయవాడ - గుండుగొలను అవుటర్‌ రింగ్‌ బాధ్యతలు!
 
636157408284782969.jpg
  •  ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నా పట్టించుకోని కేంద్రం 
  • రద్దు చేసిన సంస్థకు అప్పగించటంలోని ఆంతర్యం ఏమిటో? 
  • అవుటర్‌ గ్రహణం ఎప్పుడు వీడేనో?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):విజయవాడ - గుండుగొలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు బాధ్యతలు మళ్లీ ‘గామన’ కే అప్పగినున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. పీపీపీ విధానంలో అందరినీ పక్కనపెట్టి కాంట్రాక్టును దక్కించుకుని.. 90 శాతం మేర భూ సేకరణ జరిగినా.. రెండేళ్ళుగా ప్రాజెక్టు పనులు చేపట్టలేని సంస్థను మళ్లీ కట్టబెట్టాలనుకోవటం ఏ రకమైన సంకేతంగా భావించాలో అర్థం కావటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గామన్ ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కేంద్రానికి చెప్పినా, ఆ కంపెనీకే మళ్లీ బాధ్యతలు అప్పగించవద్దని విజయవాడ ఎంపీ లేఖ రాసినా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. గామన పేరు చెప్పగానే.. భూములిచ్చిన రైతులు అసహనంతో ఉన్నారు. తమ త్యాగాలను గామన సంస్థ నిష్ఫలం చేసిందన్న కోపంతో వారు ఉన్నారు. ఇలాంటి సంస్థకు తిరిగి ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించే ప్రయత్నాలు చేయటం చూస్తే.. అవుటర్‌ గతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ళ నుంచి ఆర్థిక ఇబ్బందుల పేరుతో.. పదిశాతం పనులు కూడా పూర్తి చేయలేని సంస్థను ఇప్పటికే రద్దు చేశారు. ఆ సంస్థ అధీనంలో ఉన్న టోల్‌ప్లాజాను ఇటీవలే ఎనహెచ స్వాదీనంలోకి తీసుకుని ఓ ప్రైవేటు సంస్థ ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. గామన ఇప్పటి వరకు వసూలు చేసిన టోల్‌ చార్జీలను, ఇతర చెల్లింపులకు సంబంధించి వసూలు చేసుకోవాల్సింది పోయి.. మళ్ళీ ఆ సంస్థకే కాంట్రాక్టు అప్పగించాలని చూస్తుండటంతో అంతా నోరెళ్ళబెడుతున్నారు. బీఓటీ ప్రాతిపదికన ప్రాజెక్టును దక్కించుకున్న గామన సంస్థ పనులు చేపట్టే విషయానికి వచ్చేసరికి అంతులేని అలక్ష్యాన్ని చూపింది. ఆర్థిక ఇబ్బందులను ఈ సంస్థ సాకుగా చూపి పనులు సాగించకపోవటం వల్ల ఎనహెచ అధికారులు అనేక రకాలుగా ఈ సంస్థ ద్వారా పనులు చేయించే ప్రయత్నం చేశారు. విసిగి వేసారిపోయిన ఎనహెచ అధికారులు చట్ట ప్రకారం ఈ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ గామన ఇంకా ఆర్థిక సమస్యలనే విన్నవించింది. దీంతో ఎనహెచ అధికారులు ఫైనల్‌ నోటీసు ఇచ్చారు. తర్వాత కూడా గామన తీరు మారకపోవటంతో ఇక్కడి అధికారులు ఆ సంస్థ నిండు నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ గామనపై వేటుకు సిఫార్సు చేశారు.
వేటు వేసే విషయంలోనూ జాప్యం
ఢిల్లీకి వెళ్ళిన తర్వాత.. ఈ సంస్థపై వేటు వేసే విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. బ్రూక్‌ఫీల్డ్‌ అనే సంస్థ ఈ ప్రాజెక్టును టేకోవర్‌ చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ ప్రయత్నం ఫలించలేదు. ఇదే సందర్భంలో పనులు చేపడతానని గామన రంగంలోకి దిగటం, ఆ తర్వాత పనులు నిలిపివేసి కేవలం టోల్‌ వసూళ్ళపైనే దృష్టి సారించటం జరిగింది. ఈ పరిణామ క్రమంలో గామన సంస్థను రద్దు చేశారు. ఈ దఫా బీఓటీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో టెండర్లు పిలుస్తారన్న ప్రచారం జరిగింది. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలంటే ఏడాది పడుతుంది. విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టు రెండు బైపాస్‌ నిర్మాణాలతో అంతర్భాగంగా ఉంటుంది. సూరాయపాలెం నుంచి గుంటుపల్లి పొలాల మీదుగా బాహు బాలేంద్రునిగూడెం నుంచి పెద అవుటపల్లి వరకు నాలుగు లేన్లుగా 47.88 కిలోమీటర్ల మేర విజయవాడ బైపాస్‌ను అభివృద్ధి చెయ్యాల్సి ఉంది. అక్కడి నుంచి జంక్షనవరకు తిరికి అక్కడి నుంచి గుండుగొలను వరకు రెండవ బైపాస్‌ నిర్మాణం చేపట్టవలసి ఉంది. మొత్తం అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు నిడివి 103 కిలోమీటర్లు కాగా ప్రాజెక్టు వ్యయం రూ.1700 కోట్లు. అదే టెండర్లు పిలిస్తే.. ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వతంత్రంగా ఎవరికి వారు ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని, ప్రాజెక్టు పనులు చేపడతామంటూ గామన ముందుకు రావటం, కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు చేయటంతో మళ్ళీ ఆ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఈ సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తే.. మళ్ళీ పనుల విషయంలో ఇలానే చేస్తే.. అత్యవసరమైన ప్రాజెక్టు ఎన్నేళ్ళకు సాకారం అవుతుంది ? ఎంతో విలువైన భూములను అప్పగించిన రైతుల త్యాగాలు ఫలిస్తాయా ? అన్నవి ప్రశ్నలుగానే ఉన్నాయి.

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

Gamman India vadu full ga try chesthunnadu ani talk kuda vachindhi,, ayithe nijame anamata.. Gamman odu full ga bribe chesadu ani talk :sleep:

 

bjp silent ga congi way lo potundhi ....

kakapothey major scams kakunda chinna chinna scams chestundhi teliviga

Link to comment
Share on other sites

Toll inka petaledhu bro.. State govt opposing Toll gate bcoz according to NH master plan Toll gate Capital city lo vasthadhi, so Max oppose chesaru

 

Ampapuram daggarlo oka toll booth vundi, adi velladi kada?

above article lo mention chesadu ga brother. 

"ఆ సంస్థ అధీనంలో ఉన్న టోల్‌ప్లాజాను ఇటీవలే ఎనహెచ స్వాదీనంలోకి తీసుకుని ఓ ప్రైవేటు సంస్థ ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది"

Link to comment
Share on other sites

Ampapuram daggarlo oka toll booth vundi, adi velladi kada?

above article lo mention chesadu ga brother.

"ఆ సంస్థ అధీనంలో ఉన్న టోల్‌ప్లాజాను ఇటీవలే ఎనహెచ స్వాదీనంలోకి తీసుకుని ఓ ప్రైవేటు సంస్థ ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది"

May be Kaza Toll gate bro :cheers:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

State Govt road vesthe No-Toll

 

Ippudu Gaman vadu vesthunnadu So toll plaza vundochu..

 

7 Underpasses pedutunnaru.. City lo oka vaipu nunchi inko vaipuku vellali ante.. like Vij-Gnt Express Highway

 

Gaman vadiki kooda.. no tolls ani annaru.. chudali

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...