Jump to content

Jakkampudi Township


sonykongara

Recommended Posts

ఆర్థిక నగరం..ఉపాధి స్వర్గం!
రాష్ట్రంలో వినూత్న తరహాలో జెట్‌ సిటీ నిర్మాణం
22వేల మందికి ఒకే ప్రాంతంలో కొలువులు
మొదలైన నిర్మాణ పనులు
ఈనాడు, విజయవాడ
amr-gen2a.jpg

నవ్యాంధ్రలో నగర జీవనశైలికి అనుగుణంగా, వినూత్న పద్ధతిలో ఓ ఆర్థిక నగరం రూపుదిద్దుకుంటోంది. జక్కంపూడి ఆర్థిక నగరం(జెట్‌ సిటీ)గా పేర్కొంటున్న ఈ నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగానే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ తరహా ప్రాజెక్టును దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో నిర్మిస్తున్నారు. జెట్‌ సిటీకి ఏపీ పట్టణ మౌలిక వసతులు అభివృద్ధి కల్పన సంస్థ (టిడ్కో - టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) బృహత్తర ప్రణాళికను రూపొందించింది. టిడ్కోకు జిల్లా యంత్రాంగం తగిన తోడ్పాటు అందిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక నగరం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) చేపడుతున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ఇక్కడ పరిశ్రమలు, ఆర్థిక యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం కల్పించనున్నారు. హరిత, నీలి నగరంగా జెట్‌సిటీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. 60శాతం విస్తీర్ణంలో పచ్చదనం, నీరు, 40శాతం విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయి.

ఎక్కడ.. ఎలా?
* ప్రయోగాత్మకంగా ఆర్థిక నగరాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. విజయవాడ గ్రామీణం మండలం పరిధిలో జక్కంపూడి గ్రామాన్ని దీని కోసం ఎంపిక చేశారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి జక్కంపూడి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఆర్థిక నగరానికి 265 ఎకరాలను కేటాయించారు. ఎకరానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల కాలంలో ఇంత పరిహారం నిర్ణయించడం ఇదే ప్రథమం.
* జెట్‌సిటీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆర్థిక యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా సాంకేతిక తరహా యూనిట్లు, గార్మెంట్స్‌, ఇతర ఆర్థిక యూనిట్లు ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా భవనాలను నిర్మిస్తారు. కాలుష్య రహిత కర్మాగారాలకే ప్రాధాన్యం ఉంటుంది.
* వినూత్న ఆలోచనలకు వ్యాపారాలకు ఇది నిలయంగా మారనుంది. ఈ ఆర్థిక నగరంలో మౌలిక వసతులను టిడ్కో సమకూర్చుతుంది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ నిర్వహణ బాధ్యతలను తీసుకుంటుంది.
* యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు నివాస కాలనీలు ఉంటాయి. అక్కడే వాణిజ్య సముదాయాలు, సినిమా కాంప్లెక్సులు, పాఠశాలలు, యోగా సెంటర్లు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, ఆహారశాలలు తదితరాలు ఏర్పాటు చేస్తారు.
* జెట్‌ సిటీలో నివాస గృహాలను నిర్మించి అర్హులకు కేటాయిస్తారు. వీటిని నాలుగు విభాగాలుగా నిర్మాణం చేస్తారు. ఈడబ్ల్యూఎస్‌ (నాలుగోతరగతి ఉద్యోగులకు), ఎల్‌ఐజీ (తక్కువ ఆదాయం ఉన్నవారికి), ఎంఐజీ (మధ్యతరగతివారికి), హెచ్‌ఐజీ (అధిక ఆదాయం ఉన్న వర్గాలకు)లుగా నిర్మిస్తారు.
* జక్కంపూడి - విజయవాడకు మెట్రో అనుసంధానం ఉండేలా ప్రణాళిక.
* ఆర్థిక నగరంతో పాటు జక్కంపూడి ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిని 300, 365, 430చదరపు అడుగుల్లో... జీప్లస్‌ 5 అంతస్తులుగా నిర్మిస్తారు

వేల మందికి ఉపాధి
వినూత్నంగా నిర్మిస్తున్న ఈ ఆర్థిక నగరం వల్ల వేల మందికి ఉపాధి  లభించనుంది. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నాటికి పూర్తి కావల్సి ఉంది.

- బి.లక్ష్మీకాంతం, కృష్ణా జిల్లా కలెక్టర్‌
amr-gen2b.jpg
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
జెట్‌.. స్లో
20-02-2019 08:53:45
 
636862496262190720.jpg
  • బిల్లుల చెల్లింపులో తాత్సారంపై కాంట్రాక్టు సంస్థ ఆగ్రహం
  • పనుల నిలిపివేత.. టిడ్కో అధికారుల చర్యలతో మళ్లీ మొదలు
  • మందగించిన వేగం..
  • రూ. 35 కోట్లే బకాయి ఉందంటున్న టిడ్కో అధికారులు
ఆంధ్రజ్యోతి విజయవాడ: జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌ సిటీ ) పనులు నిదానించాయి. బకాయిలు చెల్లించడం లేదన్న కారణంతో కాంట్రాక్టు సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌సీసీ) పనులు నిలిపివేయడంతో టిడ్కోకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమేర కాంట్రాక్టు సంస్థకు, టిడ్కో డబ్బు చెల్లించడంతో కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టినా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. పనులు నెమ్మదించడంతో టిడ్కో అధికారులు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ పనుల పురోగతికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఆర్థిక రాజధానిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో.. జక్కంపూడిలో ఆర్థిక నగర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీకి 2016 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగింది. జెట్‌సిటీలో 28 వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించింది.
 
 
జెట్‌సిటీ కోసం అప్పగించిన భూముల్లో 50 ఎకరాల వరకు ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండటంతో 10,624 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో 8,600 గ్రౌండ్‌ వరకు అయ్యాయి. జీ ప్లస్‌ త్రీ విధానంలో షేర్‌వాల్‌ టెక్నాలజీలో నిర్మిస్తున్నారు. మొత్తం 176 బ్లాకుల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిలో 3 వేల ఇళ్ల వరకు శ్లాబులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కాంట్రాక్టు సంస్థకు డబ్బు చెల్లింపులో జాప్యం జరగడంతో వేచి.. చూసీచూసీ ఎన్‌సీసీ పనులు నిలుపుదల చేసింది. దీంతో రంగంలోకి దిగిన టిడ్కో అధికారులు కాంట్రాక్టు సంస్థకు కొంత మేర చెల్లించారు. దీనిపై కాంట్రాక్టు సంస్థ సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో పనులు ఆశించిన వేగంగా జరగడం లేదు.
 
 
పనులు జరుగుతున్నాయి.. దాదాపు చెల్లించాం
జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ పనులు ఆగిపోయాయన్నది వాస్తవం కాదు. పనులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా కాంట్రాక్టు సంస్థ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌తో సమావేశమయ్యాను. వేగంగా పనులు చేయాలని వారికి చెప్పాం. కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన డబ్బులను సకాలంలోనే చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు కాంట్రాక్టు సంస్థకు 140 కోట్ల వరకు చెల్లించాం. ఇంకా వారికి రూ. 35కోట్ల మేర ఇవ్వాలి. అది కూడా ఇస్తాం. అగ్రిమెంట్‌ ప్రకారం పనులు చేపడుతున్నారు.
 
-చిన్నోడు, ఈఈ, టిడ్కో
Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...