Jump to content

Jakkampudi Township


sonykongara

Recommended Posts

విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేద, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం అధునాతన సదుపాయాలతో టౌన్‌షిప్‌ నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనిలో భాగంగా 28 వేల గృహాలు నిర్మిస్తారు. టౌన్‌షిప్‌ నిర్మాణానికి ముందుకు వచ్చిన బెంగళూరుకి చెందిన ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ) జనాధార్‌ ఇండియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.
టౌన్‌షిప్‌ నిర్మాణానికి జక్కంపూడి దగ్గర 265 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆటస్థలాలు, పార్కులతో మెరుగైన నివాసయోగ్య సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. టౌన్‌షిప్‌లో సోలార్‌ హీటర్లు, సోలార్‌ వీధి దీపాలు, సీవరేజి ప్లాంటు, వాననీటిని భూగర్భ జలాలుగా మార్చే ఏర్పాటు చేస్తామని జనాధార్‌ ఇండియా ప్రతినిధులు తెలిపారు.15170943_1479974192016167_80742339579649
Link to comment
Share on other sites

  • 3 weeks later...

విజయవాడకే ఆర్థిక నగరం..!
ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్యనగరంగా గుర్తింపు పొందిన విజయవాడ ఇప్పుడు ఆర్థిక నగరంగా మారబోతోంది. నవ్యాంధ్రలో ఆర్థిక నగరాన్ని విజయవాడలో నిర్మాణం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. విజయవాడకు సమీపంలో ఉన్న జక్కంపూడి గ్రామాన్ని దీనికి ఎంపిక చేశారు. జక్కంపూడిలో 250 ఎకరాలను ఆర్థిక నగరానికి కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నగరంలో వివిధ రకాల వాణిజ్య, వర్తక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. 2018 నాటికి ఒక రూపు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అంతర్‌వలయ రహదారికి జక్కంపూడి సమీపంలో ఉంది. అదేవిధంగా విజయవాడ నగరంలో కొండకింద ఉన్న నిరుపేదల స్థలాలు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. దీనివల్ల దాదాపు 40వేల మందికి ప్రయోజనం కలగనుంది. వారి నివేశన స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

Link to comment
Share on other sites

ఏపీ ఆర్థిక నగరంగా జక్కంపూడి అభివృద్ధి
 
636178118867024337.jpg

విజయవాడ నగర ఉత్తర వాయువ్య దిశలో ఉన్న జక్కంపూడి ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి భవిష్యత్తులో రాష్ర్టాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జక్కంపూడిని వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడను మరింత విస్తరింప చేయటానికి ర్యాపిడ్‌ గ్రోత్ ఉన్న ఉత్తర, వాయువ్య ప్రాంతాన్ని అటు నున్న, ఆగిరిపల్లి, నూజివీడు ఇటు గన్నవరం వరకు ఉన్న ప్రాంతంపై దృష్టి సారించారు. ఆర్థిక నగరాన్ని ప్రారంభించటానికి వీలుగా ముందుగా హౌసింగ్‌ కోసం సిద్ధం చేసిన 265 ఎకరాల లే అవుట్‌ను దీని కోసం ఉపయోగించుకోవాలని చూడటం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే నగరాలనే ఆర్థిక నగరాలు అంటారు. ఇవి అద్వితీయమైన వృద్ధిని సాధించే నగరాలుగా భాసిల్లుతాయి. దేశంలోని ఆర్థిక నగరాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచటం, హౌసింగ్‌ టౌన్‌షి్‌పల నిర్మాణం, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, శకివంతమైన పరిశ్రమలు, ఎయిర్‌పోర్టులు, ఫార్మాస్యూటికల్స్‌, కెమికల్స్‌, టెక్ట్స్‌టైల్స్‌ వంటి అనేక రంగాలకు కేంద్రీకృతంగా ఉంటూఅత్యధిక ఆదాయా న్ని ఆర్జించి పెట్టడంలో ముందువరుసలో ఉంటా యి. ఇప్పటికే విజయవాడ వర్తక వాణిజ్య ప్రాంతంగా, ఫార్మాస్యూటికల్‌, ఆటోమొబైల్‌, రవాణా కేంద్రంగా ఉంది. ఒక రకంగా దేశంలోనే వైవిధ్య రంగాలకు కేంద్ర స్థానంగా ఉంది. అత్యున్నత ఆర్థిక నగరంగా ఎదగాలంటే ఇవి చాలవు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, అనేక తయారీ రంగాలకు కేంద్రస్థానంగా చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇక్కడ ఆటోమొబైల్‌ ఆధారిత భారీపరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉంది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలకు వేదిక కావాలి. దేశవ్యాప్తంగా ఆర్థిక నగరాలు ఏఏ రంగాలలో పురోభివృద్ధి చెందుతున్నాయో గమనించి వాటిని ఇక్కడ ప్రవేశపెట్టే ఆలోచన చేయాలి. వీటిని దృష్టిలో ఉంచుకుని జక్కంపూడి ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా ఎంచుకోవటం గమనార్హం. నవ్యాంధ్రలో ఇప్పటికే విశాఖపట్నం ఆర్థికనగరంగా ఉంది. రానున్న రోజుల్లో అమరావతి, జక్కంపూడిలు కూడా ఆర్థిక నగరాలుగా ఎదిగితే ఆంధ్రప్రదేశ్‌కు మూడు ఆర్థిక నగరాల ఖ్యాతి దక్కుతుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో ముంబై, పూనె, గుజరాత్ లో అహ్మదాబాద్‌, సూరత్ లు రెండేసి చొప్పున ఆర్థిక నగరాలుగా ఉన్నాయి.
 
బెంగళూరు టాప్
బెంగళూరు:కర్నాటక రాజధాని ఇది. దీని జీడీపీ 83 బిలియన్ల యూఎస్‌ డాలర్లుగా ఉంది. ఈ శతాబ్దంలోనే అత్యధిక ఐటీ కంపెనీలు ఉన్న నగరమిది. ఇండియా సిలికాన్‌ సిటీగా పిలుస్తారు. పారిశ్రామికవేత్తలు ప్రపంచంలోనే.. టాప్‌-10 లొకేషన్స్‌లో బెంగళూరుకు ర్యాంకు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు.దేశంలో 35 శాతం మేర బెంగళూరు నగరం ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి కల్పిస్తోంది. విమానయానరంగ వ్యాపారాలు బెంగళూరులో 65 శాతం మేర ఇక్కడ జరుగుతుంటాయి. బోయింగ్‌, ఎయిర్‌బ్‌స, జీఈ ఏవియేషన్‌, జాగ్వార్‌, సుఖోయ్‌- 30 వంటి విమానాలను తయారు చేస్తే హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ హెడ్‌క్వార్టర్‌ బెంగళూరులోనే ఉంది. ఈ నగరంలో సిల్క్‌ ఇండస్ర్టీ 35 బిలియన్‌ రూపాయల ఆపరేషన్స్‌ నిర్వహిస్తుంది.
 
ముంబయి దేశ ఆర్థిక నగరంగా...
ముంబై: దేశ వాణిజ్య, వినోద, ఫ్యాషన్‌ రాజధానిగా వెలుగొందుతోంది. జీడీపీ 209 బిలియన్ల యూఎస్‌ డాలర్లు. దేశ ఎకానమీకి సంబంధించి ఈ పోర్ట్‌ సిటీ 70 శాతంపైగా లావాదేవీలను నిర్వహిస్తుంటుంది. మొత్తం దేశీయ ఎకనామీలో ముంబాయి విలువను జోడిస్తుంది. ఫ్యాక్టరీ ఎంప్లాయిమెంట్‌ 10 శాతం, ఆదాయపు పన్ను వసూళ్ళు 30 శాతం, కస్టమ్‌ డ్యూటీ కలెక్షన్‌ 60 శాతం, సెంట్రల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌ కలెక్షన్‌ 20 శాతం, ఫారిన్‌ ట్రేడ్‌ కలెక్షన్‌ 40 శాతం, కార్పొరేట్‌ టాక్సెస్‌ కింద 10 బిలియన్‌ యూఎస్‌ డాలర్లను ఆర్జిస్తుంది.

ఆర్‌బీఏ, బీఎస్ ఈ వంటి సంస్థలు ముంబైలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. దేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్‌, టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు ముంబయి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఢిల్లీ: దేశ రాజధాని ఇది. 167 బిలియన్‌ యూఎ్‌స డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా ఉంటా రు. లాభదాయకమైన మార్కెట్‌లను కలిగి ఉం డటం వల్ల.. ఢిల్లీ ఎఫ్‌డీఐలను ఎక్కువుగా ఆకర్షిస్తుంది. ఢిల్లీ జీడీపీలో సేవల రంగం 80 శాతం కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. ఐటీ, హోటల్స్‌, బ్యాంకింగ్‌, మీడియా, టూరిజం వంటి రంగాలు కీలక రంగాలుగా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, గ్రామాలతో ఢిల్లీ విస్తరిస్తోంది. నోయిడా, గుర్గావ్‌, ఫరీదాబాద్‌, రోహతక్‌ వంటివి ఈ కోవకు చెందుతాయి.
 
అహ్మదాబాద్...అంతర్జాతీయ కంపెనీలకు వేదిక
అహ్మదాబాద్‌: గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌ శక్తివంతమైన నగరం. దీని జీడీపీ 64 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు ఈ నగరం కేంద్రీకృతంగా అదాని గ్రూప్‌, నిర్మా, అరవింద్‌మిల్స్‌, కాడిలా, టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ వంటి కొన్ని అంతర్జాతీయ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. డెనిమ్‌ వస్ర్తాల పంపిణీదారులలో అహ్మదాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. వెస్ట్రన్‌ రీజియన్‌లో ఫైనాన్షియల్‌ హబ్‌గా ఉంది.
 

పూణే నగరం...

పూణె: మహారాష్ట్రలో రెండో మెట్రోపాలిస్‌ నగరంగా పూనె ఉంది. పూనె జీడీపీ 48 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉంది. దశాబ్దకాలంలో ఐటీ, ఆటోమొబైల్‌ కార్యాలయాలతో పూనె శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫుడ్‌, వెజిటబుల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌కు సంబంధించి ఇక్కడ పూనె ఫుడ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయటానికి వరల్డ్‌బ్యాంక్‌ పరిశీలిస్తోంది. దాదాపుగా 250కుపైగా జర్మన్‌ కంపెనీలకు చెందిన కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. గత 60 సంవత్సరాలుగా ఏకైక జర్మన్‌కు పూనె హబ్‌గా మారిపోయింది.
 

కోల్ కతా వాణిజ్య కేంద్రం

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌ ముఖ్య పట్టణం ఇది. దీని జీడీసీ 150 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉంది. నార్త్‌-ఈస్ట్‌ ఇండియాలో కోల్‌కతా మేజర్‌ పోర్ట్‌సిటీ, కమర్షియల్‌ హబ్‌గా ఉంది. ఇతర మేజర్‌ సిటీస్‌ కంటే కూడా ఐటీ సంస్థలు, బీపీవోలకు మంచి గమ్య స్థానంగా ఉంది. ఐటీ సెక్టార్‌ రంగంలో 70 శాతం వృద్ధిలో ఉంది. ఐటీ సెజ్‌లో అగ్రస్థానంలో ఉంది. ర్యాపిడ్‌ ఇండస్ర్టియల్‌ గ్రోత ఇక్కడ ఉంది. గ్లోబల్‌ కంపెనీలకు కోల్‌కత హెడ్‌ క్వార్టర్‌గా ఉంది.
 
హైదరాబాద్ నగరం ఫార్మా సిటీ...
హైదరాబాద్‌:తెలంగాణా ముఖ్య పట్టణం ఇది. పెరల్‌ సిటీగా పేరుగాంచింది. ఈ నగర జీడీపీ 74 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశంలోనే అత్యధిక సెజ్‌లు కలిగిన నగరంగా పేరు గాంచింది. పర్యాటకంలో దేశంలో మూడవ బెస్ట్‌ సిటీగా పేరుగాంచింది. ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా వెలుగొందుతోంది. గూగుల్‌, ఆమెజాన్‌, ఐబీఎం వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి.
 

చెన్నై నగరంలో ఇండియా డెట్రాయిట్ గా...

చెన్నై: తమిళనాడు క్యాపిటల్‌ ఇది. ఇండియా డెట్రాయిట్‌గా దీనికి పేరుంది. దక్షిణ భారతదేశంలో పోర్ట్‌ సిటీగా వెలుగొందుతోంది. ఈ నగరం జీడీపీ 66 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆటోమొబైల్స్‌, సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌, మెడికల్‌ టూరిజం, హార్డ్‌వేర్‌, తయారీ, ఆర్థిక సంస్థల రంగాలు ఇక్కడ ఎక్కువుగా ఉన్నాయి. ఐటీ సంబంధిత సేవల విషయంలో చెన్నై రెండో పెద్ద ఎగుమతిదారుగా ఉంది. దేశంలోనే పెద్ద ఎలక్ర్టానిక్‌ ఉపకరణాల ఎగుమతిదారుగా ఉంది. ఫోర్ట్‌, నిస్సాన్‌, బీఎండబ్ల్యూ వంటి అనేక ఆటోమోబైల్‌ కంపెనీలు ఇక్కడే హెడ్‌క్వార్టర్స్‌ను కలిగి ఉన్నాయి.
 
విశాఖపట్టణం సీ పోర్టు
విశాఖపట్నం: నవ్యాంధ్రలో వైజాగ్‌ కీలకమైన పట్టణం. వైజాగ్‌గా అందరికీ చిరపరిచితమే. దీని జీడీపీ 26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అతి ప్రాచీన షిప్‌యార్డ్‌ను కలిగిన ఈ నగరంలో అతిపెద్ద సీ పోర్టులను కలిగి ఉంది. భారీ పరిశ్రమలను కలిగి ఉంది. గెయిల్‌, వైజాగ్‌ స్టీల్‌, హిందుస్తాన్‌ స్టీల్స్‌ వంటివి ఇక్కడ ఉన్నాయి. - విశాఖపట్నం నుంచి తున, తదితర పొడి చేపలు భారీ స్థాయిలో ఎగుమతి అవుతుంటాయి. భారీ పరిశ్రమలను కలిగి ఉన్న విశాఖ ఇప్పుడిప్పుడే ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. సుందరమైన నగరం ఇది. పర్యాటకంగా అభివృద్ధి చెందిన నగరం ఇది.
 
డైమండ్స్ హబ్ గా ...
సూరత్: సూరత్ జీడీపీ 40 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉంది. 2020 నాటికి సిటీ మేయర్స్‌ ఫౌండేషన్‌ జీడీపీ 57 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచానికి సూరత్ డైమండ్స్‌ హబ్‌గా ఉంది. వజ్రాలను కట్‌ చేయటం, పాలిష్‌ పట్టడంలో ప్రపంచంలోనే సూరత 90 శాతం స్తానాన్ని ఆక్రమించింది. . సూరత పట్టణం మేజర్‌ టెక్స్‌టైల్‌ హబ్‌గానూ ఉంది. 380 డైయింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌ మిల్స్‌ ఉన్నాయి. 41 వేల కరెంట్‌ మగ్గాలను కలిగి ఉంది. దేశంలో సూరత్ నుంచి 40 శాతం పైగా ఆర్టిఫిషియల్‌, ఫ్యాబ్రిక్‌ ఉత్పత్తులు వస్తుంటాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...
  • 4 weeks later...
Guest Urban Legend

naaku oka centu bhoomi ledu, oka illu ledu family lo nenu okkadine sampadistunna. naa daggara 1l tax cut chesaru ee year. naaku emina illu istaru atleast cheap price ki ina :thinking:

 

tax ye 1lakh kadutunnava

inkendhuku neeku govt illu :blink:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Tax kattanu kabatte naaku kavali ee Pani cheyyani somaripotulaki naa dabbu ela istaru. tax kattedi benefits kosame ga

 

benefits kosam tax enti :o

tax kattedhi benefits kosam kaadhu

better roads better infra, judiciary , health care, law and order etc etc etc kosam

its ur contribution to the country ani feel avu bro

question the effing govt on corruption with ur money, question them about the facilities etc . u have every right for that

Link to comment
Share on other sites

benefits kosam tax enti :o

tax kattedhi benefits kosam kaadhu

better roads better infra, judiciary , health care, law and order etc etc etc kosam

its ur contribution to the country ani feel avu bro

question the effing govt on corruption with ur money, question them about the facilities etc . u have every right for that

LoL facilities bike ki road tax katta road kosam so it's excluded goods ki vat katta so it's excluded what else is govt providing with my income tax :thinking:

 

And how fair is it if govt is giving houses and clear loans to lazy a$$ holes when I am suffering

Link to comment
Share on other sites

Guest Urban Legend

LoL facilities bike ki road tax katta road kosam so it's excluded goods ki vat katta so it's excluded what else is govt providing with my income tax :thinking:

 

And how fair is it if govt is giving houses and clear loans to lazy a$$ holes when I am suffering

 

lazy assholes ah ..yes there are some i agree ...andhairni same line lo petteyaku

ala road meedhaki velli kasta padey vaalani chudu street vendor, rikshaw puller , vegetable seller and many more

they work as hard as u do ...few work even harder

sarey ivvani vadileseyi ...i bet ah govt ichey houses lo 1lakh tax kattey nuvvu vundalevu ..

and

nuvvu anukunnatu

ye country or world work avvadhu brother

Link to comment
Share on other sites

lazy assholes ah ..yes there are some i agree ...andhairni same line lo petteyaku

ala road meedhaki velli kasta padey vaalani chudu street vendor, rikshaw puller , vegetable seller and many more

they work as hard as u do ...few work even harder

sarey ivvani vadileseyi ...i bet ah govt ichey houses lo 1lakh tax kattey nuvvu vundalevu ..

and

nuvvu anukunnatu

ye country or world work avvadhu brother

Yes Ade nenu cheppedi unnadi ammukoni chaduvu kovatam tappindi. Bevarse ga tirigina EE patiki same position lo undevadini with eligibility for govt schemes :crying:

 

And developed countries lo kooda edi free ga ivvaru India lo ichinattu :dream:

Link to comment
Share on other sites

Guest Urban Legend

Yes Ade nenu cheppedi unnadi ammukoni chaduvu kovatam tappindi. Bevarse ga tirigina EE patiki same position lo undevadini with eligibility for govt schemes :crying:

 

unnadi ammukoni chaduvukoatam telusu neeku

vaalaki ammukotaniki kuda emi ledhu

 chadivithey e opportunities vuntayi ani neeku ne family lo vaalani chuso me circle lo chuso inkoka lagano telusu

vaalu chadivithey ivi vasthayi telusu kaani

ah manalanti vaalaki ela vasthayi le ane oka mindset lo vuntaru becoz they haven;t seen any one in their family circle or their community succeed in getting jobs

so its tough for them to go for it with confidence

vaalaki telisna vrukthi lo continue avutunnaru ...

housing anedhi basic bro

as major chunk of their earnings go towards rent ....poni paakalu vesukoni vundamantava ...slums kaavala manaki

 

finally ur not the product of u, ur knowldge etc etc is all product of ur previous generations,community etc

they don't have that privilege

Link to comment
Share on other sites

Naaku house and good facilities for medication we rendu unte lite teesukunevadini, even though life is not luxurious :)

Avi leka anni pogotukunna Amma nanna ki kaneesam illu konelepotunna ani stomach burning or jealous what ever we can call it.

Link to comment
Share on other sites

LoL facilities bike ki road tax katta road kosam so it's excluded goods ki vat katta so it's excluded what else is govt providing with my income tax :thinking:

 

And how fair is it if govt is giving houses and clear loans to lazy a$$ holes when I am suffering

 

I can feel your pain. but govt. neeku emi provide cheyyatam leda? Are you sure? Can you imagine living a day without police/law&order enforcement. Lot of people sneeze at our police capabilities but reality is we can't live a day without them in cities (villages may be...).

 

yes, you are paying road tax.  But with that money how many k.m of road can you build for your commute? You are using public resources, so nothing wrong in paying your fair share. You can argue what is "fair" share. You will get my vote.

 

Some people do really need help. As UL brother mentioned your anger should be towards the govt/politicians mishandling your tax money with phony schemes but not the beneficiaries of those schemes.

Link to comment
Share on other sites

  • 2 months later...

 

నవ్యార్థిక నగరంలో మెరుగైన జీవనం!

పనిచేసే చోటే కార్మికులకు సకల సదుపాయాలు

సింగపూర్‌, మలేషియా, చైనా తరహా ప్రయోగం

జక్కంపూడిలో 256 ఎకరాల్లో ప్రత్యేక ప్రాజెక్టు

ఈనాడు - అమరావతి

jakkampudi2.jpg 

పనిచేసే ప్రాంతానికి కూత వేటు దూరంలోనే ఉద్యోగులకు ఇళ్లు, విద్య, వైద్యం, వినోదం, ఇతర సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడకు 2 కి.మీ దూరంలోని జక్కంపూడిలో 265 ఎకరాల్లో నవ్యార్థిక నగర నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటోంది. రూ.3,456.56 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. సింగపూర్‌, మలేషియా, చైనా వంటి నగరాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ ఒకేప్రాంగణంలో ఉంటూ, వీటిల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. ఇదే తరహాలో విజయవాడలోని 180 చెప్పుల తయారీ పరిశ్రమలకు జక్కంపూడిలో నవ్యార్థిక నగరం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిశ్రమలు నగరంలో వేర్వేరు చోట్ల ఉండగా, లక్షన్నర కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. చెప్పుల తయారీ పరిశ్రమల కోసం జక్కంపూడిలో ఏడు అంతస్థుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే ప్రాంగణంలో కార్మికుల, ఉద్యోగుల నివాసాలు, విద్య, వైద్యం, షాపింగ్‌ మాళ్లు, వినోద కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

పరిశ్రమల్లోనూ ఆధునిక సాంకేతికత....

చెప్పుల తయారీ పరిశ్రమల్లోనూ ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పురోభివృద్ధి పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ స్కీం) కింద ప్రాజెక్టు విలువలో 50 శాతం రాయితీ అందించనుంది. జక్కంపూడిలోని నవ్యార్థిక నగరంలో పరిశ్రమలు నిర్వహించే వారందరికీ విద్యుత్తు ఛార్జీలు, అమ్మకం పన్ను తదితర అంశాల్లో రాయితీలు అందించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండోదశలో విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో ప్రయివేట్‌ భాగస్వామ్యంతో ఇదే తరహా ప్రాజెక్టుల నిర్వహణ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. నెలాఖరులోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

* నవ్యార్థిక నగర నిర్మాణ అంచనా వ్యయం: రూ.3,456.56 కోట్లు

* నగర నిర్మాణంతో 20 వేల కుటుంబాలకు మెరుగైన ఉపాధి, నివాస, జీవన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.110కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

* నిర్మాణం పూర్తయ్యేనాటికి ఏర్పాటయ్యే పరిశ్రమల్లో రూ. 32,650 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధ్యమని అంచనా వేస్తున్నారు.

* అన్ని సదుపాయాలూ ఒకే ప్రాంతంలో కల్పించడంవల్ల వాహన వినియోగం తగ్గి ఏటా 240 వేల లీటర్ల ఇంధనం ఆదా కావడం, 673 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.

జక్కంపూడి నవ్యార్థిక నగర విస్తీర్ణంలో రంగాలవారీగా..

* పరిశ్రమలకు 34 ఎకరాలు (10.84 శాతం)

* నివాస భవనాలకు 88 ఎకరాలు (36.39 శాతం)

* పచ్చదనం కోసం 40.86 ఎకరాలు (19.98 శాతం)

* రహదారులకు 75.17 ఎకరాలు (28.60 శాతం)

* మౌలిక సదుపాయాలకు 11 ఎకరాలు (4.19 శాతం)

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...