Jump to content

Apollo Tyres Confirmed for AP


sonykongara

Recommended Posts

  • Replies 77
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Guest Urban Legend

Cancel chesi dobbandi avasaram ledu itanti lafoot gallu... Eelani chusi inkontamandi bayaluderataru... Inni chesina taruvata inko melika pettadani enti nammakam

Prathodiki alusu aipoyindhi AP antey

We need to attract investment first

New state lots of challenges

Link to comment
Share on other sites

Guest Urban Legend

Hero vaadi vyavaharam kuda ide. vaadu pettedi 1000 cr investment. 600+ acres prime land teesukunnadu. anthe size land lo Kia vaadu 13000 cr invest chestunnadu. ade land tho ne business cheddamanukune vaadiki, business kosam land teesukunevaadiki theda.

Link to comment
Share on other sites

Prathodiki alusu aipoyindhi AP antey

We need to attract investment first

New state lots of challenges

Edo okati chesi ah koreans or japanees valani pattukuni vaste potundi... Veelaki land ammakunda direct lease ki iste potundi... Repu evadaina manchi vadu vaste teesi dobbochu eelani... Nakaite eelu business chestaru ani nammakam ledu... Anni ichina taruvatha land ammesi dobbese bapati laga kanapadutundi ee appolo vallu

Link to comment
Share on other sites

  • 2 months later...

9న ‘అపోలో’కు శంకుస్థాపన
03-01-2018 01:25:50

అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చినపండూరు గ్రామంలో అపోలో టైర్‌ లిమిటెడ్‌ స్థాపనకు ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 200 ఎకరాల్లో రూ.525కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థలో తొలిదశలో 900 మందికి, రెండో దశలో 450 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇది ప్రతిష్టాత్మక కంపెనీ అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

అపోలో.. ఇక సాగిపో! 
అవాంతరాలు అధిగమించిన టైర్ల సంస్థ 
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ ఫలితం.. 
రాష్ట్రానికి మరో మణిహారం 
రేపు ముఖ్యమంత్రిచే భూమిపూజ 
ctr-top2a.jpg
జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి తలమానికంగా నిలిచిన సత్యవేడు శ్రీసిటీకి సమీపంలో మరో భారీ పరిశ్రమకు పునాదిరాయి పడుతోంది. ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అపోలో టైర్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. వరదయ్యపాలెం మండలంలోని చిన్నపాండూరు వద్ద వేదిక ఖరారైంది. ఈ భారీ పరిశ్రమ జిల్లాకు రావడం వెనుక ఎన్నో పరిణామాలున్నాయి. అనేక అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు సంస్థ స్థాపనకు ముహూర్తం ఖరారైంది.

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అపోలో టైర్ల పరిశ్రమ తన తయారీ యూనిట్‌ను జిల్లాలోని చిన్నపాండూరు వద్ద నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భూకేటాయింపు నుంచి పరిశ్రమ  నిర్మాణానికి ఏర్పాట్లు చేసేవరకు ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను అధిగమించింది. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఈ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పేలా యాజమాన్యాన్ని ఒప్పించడంలో, వారు కోరిన గొంతెమ్మ కోర్కెలు తీర్చడంలోనూ ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పాటవుతున్న భారీ ప్రాజెక్టుల్లో అపోలో ఒకటిగా ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోంది. అందుకే ముఖ్యమంత్రి కొన్ని డిమాండ్లను నెరవేర్చి.. యాజమాన్యాన్ని ఒప్పించారు.

భూసేకరణ నుంచే ప్రతిబంధకాలు 
చిన్నపాండూరు రెవెన్యూ వీకేఆర్‌వైకాలనీలో నూతన సెజ్‌ను ఏర్పాటు చేశారు. 376 ఎకరాలకు భూసేకరణకు యత్నించగా.. పట్టాల పంపిణీలో వివాదాలు నెలకొన్నాయి. తొలివిడతగా 200 ఎకరాలకు భూసేకరణ చేపట్టి.. ఎకరానికి రూ.6.50లక్షల చొప్పున పరిహారం అందించారు. ఆ భూములను అపోలో టైర్ల పరిశ్రమకు కేటాయించారు. పరిశ్రమకు రహదారి సౌకర్యాన్ని కల్పించడానికి సత్యవేడు-కడూరు మార్గంలో రూ.6కోట్ల వ్యయంతో రోడ్డును సైతం వేశారు. గతేడాది సెప్టెంబరు 28నే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ పరిశ్రమ నిర్మాణానికి 260 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. రూ.1200 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600మందికి ప్రత్యక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో అపోలో టైర్ల పరిశ్రమకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ పరిశ్రమను అంత ఆషామాషీగా ఇక్కడ నెలకొల్పడం లేదు.

హీరో సైతం.. 
అపోలో పరిశ్రమకు సమీపంలోనే హీరో మోటారు పరిశ్రమకు కేటాయించిన 600ఎకరాలలో సైతం స్థానికుల నుంచి అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతుండటంతో, భవిష్యత్‌పై ఆందోళన చెందిన హీరో యాజమాన్యం కూడా ఓ దశలో వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, హీరోకు వచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీతోపాటు పూచీకత్తు ఇవ్వడంతో ఆ పరిశ్రమకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే.

దోబూచులాట! 
టైర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన అపోలో కంపెనీ తమ యూనిట్‌ ఏర్పాటుపై చివరి వరకూ సందిగ్ధత నెలకొంది. ఓ దశలో షరతులు, ఆంక్షలతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. ప్రభుత్వం అన్నింటినీ అంగీకరిస్తూ మార్గం సుగమం చేసింది. ఈ పరిశ్రమకు కేటాయించిన భూముల్లో నాలుగేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తిచేయాలని, లేనిపక్షంలో ఆ భూములను ఏపీఐఐసీ వెనక్కి తీసుకుంటుందని తొలుత నిబంధన విధించారు. అయితే తాము వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతుండగా, సకాలంలో పూర్తిచేయని పక్షంలో భూములు వెనక్కి తీసుకుంటే.. పెట్టుబడి వృథాగా పోతుందని అపోలో యాజమాన్యం వెనకడుగు వేసింది. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆ కాలపరిమితిపై ఆంక్షలు ఎత్తివేయించారు. తొలిదశలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దశల వారీగా రూ.4500కోట్లతో పరిశ్రమను విస్తరించనున్నట్లు యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకు మరో 60 ఎకరాలను కేటాయించాలని షరతు విధించింది. ప్రభుత్వం మెట్టు దిగి.. ఆ మేరకు స్థలాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, భూములు కేటాయించిన 90రోజుల్లోపు సంస్థ నిర్ణయించిన భూమి ధరను ఏపీఐఐసీకి చెల్లించాలి. నిబంధనల మేరకు చెల్లించని పక్షంలో 91 రోజుల తర్వాత 16శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇలా ఎకరాకు రూ.11లక్షల చొప్పున కేటాయించగా, వివిధ కారణాలతో మొన్నటివరకు డబ్బులు చెల్లించలేదు. నిబంధనల ప్రకారం ఇప్పటివరకు రూ.79.28లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ వడ్డీని చెల్లించేందుకు అపోలో ససేమిరా అనగా.. ప్రభుత్వం అంగీకరించి మాఫీ చేసింది. భవిష్యత్‌లో ఈ భూములపై పరిహారం కోసం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఆ పరిహారాన్ని ప్రభుత్వమే భరించేలా ఒప్పుకొంది. సత్యవేడు ప్రాంతంలో నీటివసతి లేని కారణంగా ఓ దశలో ఈ కంపెనీ తమిళనాడు వైపు మొగ్గు చూపింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి.. సమీపంలోని తెలుగుగంగ ఉపకాలువ ద్వారా నీటివసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని ఆంక్షలకు కట్టుబడి ఇక్కడ పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమం చేసింది.

Link to comment
Share on other sites

Hon'ble CM of AP Sri. Nara Chandra Babu Naidu Garu at the foundation stone laying ceremony of #apollotyres Ultra Modern Global Scale Manufacturing Facility at #Chittoor.@Sri_City @ncbn @AndhraPradeshCM https

Link to comment
Share on other sites

Guest Urban Legend
తూర్పున.. పరిశ్రమ పశ్చిమాన.. ప్రగతి జమ 
రోజంతా బిజీగా ముఖ్యమంత్రి పర్యటన 
చిన్నపాండూరు, ననియాల సభల్లో ప్రసంగం 
జిల్లా అభివృద్ధికి దిశానిర్దేశం 
ఈనాడు డిజిటల్‌- చిత్తూరు 
ctr-top1a.jpg

తూర్పున పారిశ్రామిక ప్రగతి.. పశ్చిమాన జన్మభూమి గ్రామసభలు.. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మంగళవారం నాటి పర్యటన విజయవంతంగా సాగింది. ఉదయం 11:30 గంటల సమయంలో వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరుకు వచ్చిన చంద్రబాబు నాయుడు రూ.1200 కోట్లతో ఏర్పాటవుతున్న అపోలో టైర్స్‌ పరిశ్రమకు భూమి పూజ చేశారు. అంతకుముందు మంత్రులు నారా లోకేష్‌, అమర్‌నాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, తిరుపతి సబ్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం ఇక్కడ ఏర్పాటుచేసిన పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి.. చిత్తూరు జిల్లా పారిశ్రామిక రంగంలో అగ్రభాగాన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరికం శాశ్వతంగా పోవాలన్నా.. యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా.. కొత్త పరిశ్రమల ఏర్పాటు అవసరమని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా ఆటోమొబైల్‌ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. మూడు లక్షల మందికి ఉపాధి కల్పించినా.. విపక్ష నేత జగన్‌ విమర్శలు చేయడం సరికాదంటూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

సొంతింట తీరిక లేకుండా..  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2గంటలకు హెలికాప్టర్‌ ద్వారా రామకుప్పం మండలంలోని ననియాలకు చేరుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గీర్వాణీ, జేసీ గిరీషా, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన జన్మభూమి గ్రామసభలో చంద్రబాబు పాల్గొన్నారు. సుమారు గంటన్నర సేపు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగించారు. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ఇంటి పెద్ద కొడుకుగా ఉంటూ అన్నివిధాలా ఆదుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన ప్రసంగం అనంతరం మంత్రి నారా లోకేష్‌, ఎంపీ శివప్రసాద్‌ మాట్లాడారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న జిల్లా అభివృద్ధి ప్రగతిని, జన్మభూమి గ్రామసభల నిర్వహణ తీరును వివరించారు. అనంతరం సాధికార మిత్రలతో మాట్లాడించారు. నాలుగో తరగతి విద్యార్థి శశాంక్‌ ప్రసంగానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి.. అతడికి ఆర్థిక సాయంతో పాటు సన్మానించారు. జన్మభూమికి సేవ చేసిన స్ఫూర్తిదాతలను సన్మానించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో రూ.517 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు చెందిన 26 శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ఫైబర్‌ గ్రిడ్‌ విధానంతో వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ ద్వారా బెంగళూరు నుంచి ఉపాధ్యాయురాలు, రామకుప్పం, శ్రీకాళహస్తిల నుంచి విద్యార్థులతో టీచింగ్‌ చేసిన విధానాన్ని వీక్షించారు. అనంతరం ఇదే టెక్నాలజీ ద్వారా వివిధ ప్రాంతాల మహిళలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ననియాల వద్ద రూ.2కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎలిఫెంట్‌ క్యాంప్‌ ఎకో టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం అడవులకు నిప్పు పెట్టే నియంత్రణ పోస్టర్లను ఆవిష్కరించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...