June 21, 20179 yr Author కృష్ణా తీరంలోని ద్వీపాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. దక్కించుకున్న ‘స్టూడియో పాడ్’ ‘స్టూడియో పాడ్’కు ‘ఐలాండ్స్’ మాస్టర్ ప్లాన్ బాధ్యతలు ! కాంట్రాక్టు సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఏపీటీడీసీ భవానీ ఐలాండ్‌తో పాటు ఆరు దీవులకు మాస్టర్ ప్లాన్ దశల వారీగా అభివృద్ధికి ప్రణాళికలు అందచే త రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ధి (ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణానదీ తీరంలోని దీవుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అంతర్జాతీయ సంస్థ ‘స్టూడియో పాడ్’ దక్కించుకుంది. భవానీ ఐల్యాండ్‌తో పాటు, శాండ్ ఐల్యాండ్, ప్లాంటేషన్ ఐల్యాండ్స్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి తగిన ప్రణాళికలతో కూడిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసేందుకు స్టూడియోపాడ్ సంస్థతో ఏపీటీడీసీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండు నెలల్లో ఈ సంస్థ మాస్టర్ ప్లాన్ అందచేయాల్సి ఉంటుంది. స్టూడియో పాడ్ అనేది మన దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ. అయితే ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు నిర్దేశిస్తుంది. అమెరికా దేశ భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తుంటుంది. కృష్ణానదిలోని దీవుల అభివృద్ధికి ఏపీటీడీసీ టెండర్లను పిలిచింది. ఈ క్రమంలో అర్హతలు, ప్రామాణికాల ఆధారంగా స్టూడియోపాడ్‌ను ఎంపిక చేశారు. స్టూడియాపాడ్ సంస్థ ఏమేమి చేయాల్సి ఉంటుందన్న దానిపై ఏపీటీడీసీ అధికారులు ఆర్‌ఎఫ్‌పీ ని విడుదల చేశారు. ఈ ఆర్‌ఎఫ్‌పీని అధ్యయనం చేసిన స్టూడియోపాడ్ సంస్థ ఏపీటీడీసీతో అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ముందుగా భవానీ ద్వీపంపై దృష్టి సారిస్తుంది. భవానీ ద్వీపం భౌగోళిక స్వరూపం, కృష్ణాన ది, శతాబ్దాల నాటి వరదల చరిత్ర వీటన్నింటినీ అధ్యయనం చేసి ఒక నివేదికను అందిస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవానీ ద్వీపంలో నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేస్తుంది. అన్ని దీవులకు ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవానీ ఐల్యాండ్‌కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే భవానీ ఐల్యాండ్‌ను దాదాపుగా రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిల్మ్‌సిటీలాగా అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడచక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్‌ను ఆవిష్కరించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్‌లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ముందు తలపోస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దానిపై తగిన ప్రణాళికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాల మేళవింపుతో సుందరీకరించే విధంగా నివేదికలు ఇవ్వనుంది. భవానీ ఐల్యాండ్‌లో ఇప్పటికే అంతార్జాతీయ స్థాయిలో లేజర్ షో మ్యూజికల్ ఫౌంటెయిన్ వంటివి ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో ఈ తరహాలో ఉండే విధంగా పర్యాటకాభివృద్ధి చేపట్టడానికి ప్రణాళికలు ఇవ్వనుంది. భవానీ ఐల్యాండ్‌ను పక్కన పెడితే మిగిలిన దీవులకు సంబంధించి వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశించనుంది. శాండ్ ఐల్యాండ్, ప్లాంటేషన్ ఐల్యాండ్స్‌లో ఏమి అభివృద్ధి చేయవచ్చు అన్న దానిపై ప్రణాళికలు ఇస్తారు. రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ నివేదిక వస్తుందని ఏపీటీడీసీ ఈడీ ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతికి చెప్పారు.
June 21, 20179 yr Krishna River Floating restaurant&Cottages /************ The state government on Wednesday gave permission to by M/s. Champion Yacht Club for setting up a floating restaurant and cottages in the middle of River Krishna facing the Prakasam Barrage near Bhavani Island. Engineer-in-Chief (Irrigation), water resources department has submitted a proposal requesting the government for necessary permission for the floating restaurant and cottages. In the orders issued by principal secretary Shashi Bushan Kumar, the tourism authorities have to take all necessary precautions and safety measures to avoid untoward incidents, in anchoring the barges at stipulated locations and to shift them to the banks during floods and anchor them safely. Tourism authorities and M/s Champion Yacht Club should shift the floating restaurant and cottages to safest place during flood times after announcement of warning of flood discharges of 1 lakh cusecs and above and they have to obtain information from IMD, CWC and water resources department.
July 5, 20179 yr Author ఐల్యాండ్‌లో ఫ్లోటెల్ రంగుల చేపల మధ్య పర్యాటకులకు ఆటవిడుపు ఏపీటీడీసీ, మత్స్యశాఖల నేతృత్వంలో త్వరలోనే ఏర్పాటు నీటిపై తేలియాడే ఫ్లోటెల్. అందులో పెద్ద పెద్ద నీటి మడుగులు.. వాటిలో రంగు రంగుల చేపలు.. వీటిని చూడటం అంటే ఎవరికి సరదా ఉండదు! కొందరు తమ ఇష్టాన్ని అక్వేరియం రూపంలో ఇంట్లో పెట్టుకుని ఆనందపడుతుంటారు. లేనివాళ్ళు ఇలాంటి వాటిని చూసినపుడు అనందపడుతుంటారు. ఇంట్లో అక్వేరియం లేకపోయినా ఫర్లేదు. కాస్త ఆటవిడుపుగా భవానీ ఐల్యాండ్‌కు వచ్చేస్తే, ఎంచక్కా ఉచితంగా మీరు కోరినంత సేపు రంగుచేపలను చూడవచ్చు. వాటికి ఆహారాన్ని అందించొచ్చు. టవర్ పాయింట్ ఎగువన భవాని ఐలాండ్ ఒడ్డున కృష్ణానదిలో ‘ఫిష్ ఫీడింగ్ ఫ్లోటెల్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీటీడీసీ, మత్స్యశాఖలు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేస్తున్నాయి. ఫ్లోటెల్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. రంగు చేపలు, ఫీడ్ రావాల్సి ఉంది. అవి కూడా వచ్చిన తర్వాత సరికొత్త ఆటవిడుపు కార్యక్రమం అందుబాటులోకి వస్తుంది
July 8, 20179 yr Author కృష్ణా నదిలో అతి పెద్ద భారీ క్రూయిజ్... నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి. రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి.
July 12, 20179 yr Author పతాక’ పార్కు! భవానీ ద్వీపంలో... 150 ఎకరాల్లో ఏర్పాటు దేశంలోనే ఎత్తైన జెండా దిమ్మె డిజైన్లు సిద్ధం చేసిన ఎల్ అండ్ టీ అమరావతి, జులై 11, (ఆంధ్రజ్యోతి): విజయవాడకు, నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’కి మధ్య... కృష్ణా నదిలోఉన్న భవానీ ద్వీపాన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో సుందర వనాలు, పార్కులు, అతిథి గృహాలు, క్రీడా ప్రదేశాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు... ఇలా సమస్త సదుపాయాలు ఉంటాయి. రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు సందడి నెలకొనేలా... ‘ఫ్లాగ్ పార్క్’ పేరిట దీనిని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన నమూనాలను ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించింది. విజయవాడ నుంచి అమరావతి వెళ్లేందుకు నిర్మించే ఒక వంతెనకు అనుసంధానంగా ఈ పార్కు నుంచి ఒక వాక్‌వేను నిర్మిస్తారు. అదేవిధంగా గొల్లపూడి నుంచి బోట్‌లో ఈ ప్రదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దేశంలోనే అత్యంత ఎత్తైన ఒక ఫ్లాగ్ పోల్ (జెండా దిమ్మె)ను ఏర్పాటుచేస్తారు. ఇది 393 అడుగుల ఎత్తుంటుంది.
July 12, 20179 yr Design L&T chesindi sare, daani build chesedi evaru? Tenders/bidding lantivi vuntaya leka L&T chestunda?
July 12, 20179 yr Author Design L&T chesindi sare, daani build chesedi evaru? Tenders/bidding lantivi vuntaya leka L&T chestunda? adi theliyadu brother
July 12, 20179 yr adi theliyadu brother twaraga cheste baagundu vijayawada lo square la kakunda. deeni meeda green tribunal lo cases vestaru definite ga
July 12, 20179 yr Author twaraga cheste baagundu vijayawada lo square la kakunda. deeni meeda green tribunal lo cases vestaru definite ga vijayawada lo square meda vesaru a musali kuka gadu
July 12, 20179 yr vijayawada lo square meda vesaru a musali kuka gadu akkada green tribunal or environmental issues emi levu ga?
July 12, 20179 yr Author akkada green tribunal or environmental issues emi levu ga? avi levu pdw grounds ni china ki dochi pedtunnaru ani case vesadu vadde musali kukka
July 12, 20179 yr avi levu pdw grounds ni china ki dochi pedtunnaru ani case vesadu vadde musali kukka is it not true that government owns most of the complex. Chinese contractor/whoever have to develop the facility and in return can charge fees for services (similar to toll gate concept). indulo dochipettedi emundi?
July 12, 20179 yr Author is it not true that government owns most of the complex. Chinese contractor/whoever have to develop the facility and in return can charge fees for services (similar to toll gate concept). indulo dochipettedi emundi? case veyyatana ki emi undi, konni rojulu agutundi ga
Create an account or sign in to comment