Jump to content

Non BB Industry HIT


Thota_NTR

Recommended Posts

ABN ARTICLE ABOUT JG

 

డివైడ్ టాక్‌తో మొదలైన జనతాగ్యారేజ్ సినిమా ప్రయాణం.. భారీ హిట్ వైపు దూసుకెళ్లింది. అంతేకాదు.. ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది. బాహుబలి మినహా ఇతర సినిమాల రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసింది. రూ.80 కోట్లకు పైగా షేర్, రూ.140 కోట్లకు పైగా గ్రాస్‌ను కొల్లగొట్టిన ఈ సినిమా.. గురువారంతో అర్ధశత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఒకప్పుడు 50 రోజులు, వంద రోజుల సెలబ్రేషన్స్ అంటే.. ఎన్ని థియేటర్లలో అన్న చర్చ నడిచేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమా రిలీజైన మూడు..నాలుగు వారాలకే థియేటర్ల నుంచి బయటపడిపోతున్నాయి. కలెక్షన్లు భారీగా సాధిస్తే చాలు సినిమా హిట్టే నేటి పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలోనే 39 కేంద్రాల్లో జనతాగ్యారేజ్ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 39 కేంద్రాల్లో ఇలాంటి ఫీట్‌ను సాధించడమంటే విశేషమే మరి. హైదరాబాద్ సహా ఇతర పెద్ద సెంటర్లలో ఈ ఘనతను సాధించింది జనతాగ్యారేజ్. ఇక, ఈ ఆదివారమే ఓ ప్రముఖ చానెల్లో సినిమా ప్రీమియర్ పడనుండడంతో థియేటర్లలో జనతా మారథాన్ ముగిసినట్టే. ఇక, ఈ సినిమా ఆడుతున్న థియేటర్లన్నిటిలోనూ ఇజం సినిమాను ప్రదర్శించబోతున్నారు. కాగా, జనతాగ్యారేజ్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తారక్ ట్విట్టర్‌లో స్పందించాడు. ఇలాంటి మరపురాని విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. ‘‘ఇక కొరటాల శివకు మరీ మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయనే లేకుంటే సినిమానే లేదు. శివ నువ్వే సినిమాకు మూల స్థంభం. మన మనోధైర్యమే ఇంతటి ఘనవిజయానికి బాటలు వేసింది. అంతేగాకుండా సినిమా మొత్తం అండగా, మద్దతుగా నిలిచిన చిత్ర బృందాన్ని, అభిమానులను, మీడియాను, నా శ్రేయోభిలాషులకూ ధన్యవాదాలు’’ అంటూ తారక్ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...