Jump to content

Chandranna Bima

Recommended Posts

Just now, AnnaGaru said:

Raaz bro, idi already prati vallaki telusu....andaru join ayyaru.......GUINESS RECORD lo ki veltundi....

2 crore people joined it seems....

Avnu bro.. but Naku idhi recent ga telisindhi.. ofcourse nenu peddhaga pattinchukoledhu.. even ee thread Loki nenu antha ga involve avaledhu.. nalanti vallu Inka vuntaru.. Andhariki telise Vidhan ga ee scheme ni Janalloki teesukellali.. 4 Cr population ki vartimpu cheyyali ani na korika 

Link to comment
Share on other sites

అందరి బంధువు!
02-06-2018 02:59:34
 
636635051814510836.jpg
ఏడు నెలల క్రితం నా భర్త చనిపోయాడు. చంద్రన్న బీమా కింద అప్పటికప్పుడు రూ.5వేలు, మళ్లీ కొన్నిరోజుల్లోనే రూ.1.95 లక్షలు ఇచ్చారు. రెండు లక్షల్లో రూ.లక్షతో అప్పులు తీర్చాను. మిగిలిన మొత్తం కిరాణా కొట్టు పెట్టుకున్నాను. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాను. నా భర్త చనిపోయిన తర్వాత బంధువులెవరి నుంచీ ఫోన్‌ రాలేదు. కానీ... చంద్రన్న వైపు నుంచి మాత్రం ప్రతి రెండురోజులకు ఒక ఫోన్‌ వస్తుంది. అన్నీ సక్రమంగా ఉన్నాయా, సంతృప్తిగా ఉన్నారా? అని వివరాలు తెలుసుకోవడం ధైర్యాన్ని ఇస్తుంది. చంద్రబాబు అందరి బంధువు.
- యశోద, పెద్దకాకాని, గుంటూరు జిలా
 
బాబు పెద్ద కుమారుడే!
మాది చేపలు పట్టే కుటుంబం. కొన్ని నెలల క్రితం నా భర్త ప్రమాదవశాత్తూ చనిపోయారు. నా అన్నవాళ్లెవరూ పలకరించలేదు. కానీ.... చనిపోయిన రోజు రూ.5వేలు, ఆ తర్వాత రూ.4.95లక్షలు నాకు చంద్రన్న బీమా కింద ఇచ్చారు. చంద్రన్న ప్రతి ఇంటికీ పెద్దకొడుకు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే!
-లక్ష్మి. ముద్దూరు కృష్ణా జిల్లా 
Link to comment
Share on other sites

కష్టం తీర్చే బీమా!
02-06-2018 02:56:46
 
636635050136698081.jpg
  • ఆపదలో ఆదుకుంటుంది.. జనం మెచ్చిన పథకమిది
  • తొలుత కార్మికులకు ఇచ్చాం.. ఇప్పుడు పేదలందరికీ
  • మరణించిన రోజే 5 వేలు.. పెద్దకర్మలోపు మిగిలినది
  • ఇంటికే పత్రాలన్నీ.. పేదల కష్టం తీర్చేందుకే ఉన్నాం
  • మీ ఆశీర్వాదమే కావాలి.. ప్రజలకు బాబు పిలుపు
  • ‘చంద్రన్న బీమా’ మూడో ఏడాది ప్రారంభం
అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో చంద్రన్న బీమా నంబర్‌ వన్‌. నాకు, ప్రజలకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకం కూడా ఇదే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కుటుంబ యజమాని ఏ కారణంతో మరణించినా... పరిహారం చెల్లించి ఆదుకునే ‘పీఎంజేజేబీవై-చంద్రన్న బీమా’ను మూడో ఏడాది కూడా కొనసాగిస్తూ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. మూడో ఏడాది బీమాకు సంబంధించిన ప్రీమియంను చెక్కు రూపంలో ఎల్‌ఐసీకి అందించారు. చంద్రన్న బీమా లబ్ధిదారులు, బీమా మిత్రలు, అధికారులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘డ్రైవర్లు వారాల తరబడి రాష్ట్రాలకు రాష్ట్రాలు తిరుగుతుంటారు. వారికేదైనా అయితే ఇక ఆ కుటుంబం పరిస్థితి దారుణం. అందుకే తొలుత డ్రైవర్లకు తొలుత ఈ చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టాం. ఏ పేదోడు బయటికి వెళ్లినా.. అతను ఇంటికి తిరిగిరాకపోతే ఆ కుటుంబం దిక్కులేనిదవుతుంది. అందుకే ప్రతి కార్మికుడికీ ఈ పథకం విస్తరించాం’’ అని వివరించారు. తొలి రెండేళ్లలో చంద్రన్న బీమా కింద లక్షన్నర్ర కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈసారి రాష్ట్రంలోని 2.47 కోట్ల మందికి బీమా కల్పిస్తున్నామన్నారు.
 
అసలే బాధలో.. మళ్లీ తిరగడమా?
‘‘కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోతే భార్యా పిల్లలు బాధలో ఉంటారు. ఆ బాధలో మళ్లీ పంచనామా కోసం పోలీస్‌ స్టేషన్‌, మరణ ధ్రువపత్రం కోసం ఆస్పత్రికి, తహశీల్దార్‌, గ్రామపంచాతీ అధికారుల వద్దకు తిరగడం అంటే ఇంకా బాధ. అందుకే ఒక పద్ధతి పెట్టా. మరణించిన రెండురోజుల్లో డెత్‌ సర్టిఫికెట్‌, పోస్టు మార్టం నివేదిక వారం రోజుల్లో రావాలి. చనిపోయిన రోజునే అంత్యక్రియలకు ఐదువేలు అందుతాయి. ఆ తర్వాత... పెద్దకర్మకు ముందే, పదో రోజునే బీమా పరిహారం అందుతుంది. సహజ మరణం అయితే రెండు లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇవ్వడమే కాకుండా.. పిల్లలకు ఉపకార వేతనాలు ఇస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. పాదయాత్రలో తాను కలిసిన ఒక వృద్ధురాలు ఎవరన్నా పెడితే తింటాను, లేకుంటే పస్తులు ఉంటానని చెప్పడం తనను కలచివేసిందని... కళ్లు చెమర్చాయని తెలిపారు. ‘‘అందుకే ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానన్నాను. పింఛను ఐదురెట్లు పెంచుతానని ప్రకటించాను. మాట నిలబెట్టుకున్నాను’’ అని తెలిపారు. మరింత సంక్షేమం దిశగా ముందుకెళ్లేందుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రేషన్‌ కార్డు, పింఛను నుంచి బస్‌ టికెట్‌ వరకు ఏదైనా ఇంట్లోనే కూర్చుని ఫోన్‌ చేస్తే పనైపోయే వ్యవ్యస్థ రూపొందిస్తున్నామని తెలిపారు. ‘‘ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ద్వారా టీవీ ద్వారానే... చంద్రన్నా నాకీ పని కావాలి అని చెబితే చాలు. ఆ విషయం ప్రభుత్వానికి చేరుతుంది. పని పూర్తవుతుంది. ఇలాంటి వినూత్న పాలన తీసుకొస్తాం. నేనే కోరేదల్లా మీ సహకారం ఒక్కటే’’ అని పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకం విజయవంతం కావడంలో కార్మికశాఖ కమిషనర్‌ వరప్రసాద్‌, సెర్ప్‌ సీఈవోల కృషి అభినందనీయమన్నారు. ‘‘సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పనిచేస్తారు. పేదల కోసం పని చేస్తే పుణ్యం వస్తుంది’’ అని తెలిపారు.
 
మానవత్వంతో పెట్టిన పథకం: పితాని
చంద్రబాబు పాదయాత్రలో చూసిన సంఘటనలు, పేదల కష్టాలు గుర్తుపెట్టుకుని మానవతా హృదయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. అందులో చంద్రన్న బీమా ఆయన మానస పుత్రికలాంటిదని అన్నారు. దేశంలోనే మరే రాష్ట్రంలోను ఇంత బీమా లబ్ది ఇస్తున్న పథకం లేదన్నారు.
 
2.48 కోట్ల మందికి చంద్రన్న బీమా
రాష్ట్ర జనాభాలో సగం మందికి పైగా చంద్రన్న బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది ఈ సంఖ్య 2.48 కోట్లకు చేరిందని కార్మికశాఖ కమిషనర్‌ వరప్రసాద్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబరు నుంచి మే 31 వరకూ రాష్ట్రంలో మృతి చెందిన అసంఘటిత కార్మికుల కుటుంబాలకు రూ.1200 కోట్లు బీమా పరిహారం చెల్లించినట్లు వివరించారు.
Link to comment
Share on other sites

చంద్రన్న బీమాతో పదిరోజుల్లోనే ఆర్థిక సాయం
రెండేళ్లలో 1.52లక్షల మందికి పరిహారం
ఈ పథకం పరిధిలో 2.47 కోట్ల మంది
ఈనాడు, అమరావతి: కుటుంబ యజమానిని కోల్పోయిన వారికి చంద్రన్న బీమా అండగా నిలుస్తోంది. ప్రమాదంలో మరణిస్తే.. వారి కుటుంబాలకు పది రోజుల్లోనే రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. సహజంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షల వరకు అందిస్తోంది. ఈ పథకం కింద తొలి ఏడాది 82 వేల మంది లబ్ధి పొందగా.. రెండో ఏడాది 70వేల మందికి పరిహారం అందింది. రెండేళ్లలో 37 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకార వేతనమూ అందిస్తున్నారు. రెండేళ్లలో 2 వేల కోట్లు పరిహారం అందించగా.. రూ.444 కోట్లు ఉపకారవేతనాలు అందించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే.. ఈ ఏడాది 2.47కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి రావడం విశేషం. సహజ మరణం, ప్రమాద మరణం జరిగినా వీరికి పరిహారం లభిస్తుంది.

అర్హులు..:అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, కార్పెంటర్‌, ఔట్‌సోర్సింగ్‌, ఉపాధి హామీ కూలీలు, తోపుడు బండ్లు, కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ పనివారు, డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజక పనిచేసేవారు, ఇంటి పనిచేసే వారు, అంగన్‌వాడీ వర్కర్స్‌, తదితర రూ.15వేల కంటే తక్కువ జీతం పొందే ఎవరైనా ఇందులో చేరవచ్చు.
* ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి. బీ సెర్ప్‌, మహిళా సమాఖ్యలు ఇళ్లకు వచ్చి నమోదు చేసుకుంటారు. దీనికి రూ.15 సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఏడాదికి పాలసీ బాండ్‌ ఇస్తారు. బీ ఏటా జూన్‌ 1 నుంచి తర్వాత ఏడాది మే 31 వరకు పాలసీ అమల్లో ఉంటుంది. బీ 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
పది రోజుల్లో పరిహారం..: పాలసీదారు మరణిస్తే.. వారి కుటుంబానికి 24 గంటల్లో రూ.5వేల మొత్తాన్ని బీమా మిత్ర చెల్లించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 10 రోజుల్లో కుటుంబంలోని నామిని బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ చేస్తారు.
* ప్రమాద బాధితులకు పూర్తి అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగ వైకల్యానికి రూ.2.50లక్షలు అందిస్తారు. బీ బాధిత కుటుంబాల్లో 9 నుంచి 12 తరగతులు, ఇంటర్‌, ఐటీఐ చదువుతున్న పిల్లలకు సంవత్సరానికి రూ.1,200 చొప్పున ఉపకార వేతనం మంజూరవుతుంది.

అయినవాళ్లెవరూ ఆదుకోలేదు..
‘నా భర్త ప్రమాదంలో మరణించారు. ఆయన బంధువులు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. చంద్రన్నబీమా కింద అప్పటికప్పుడు రూ.5 వేల సాయం అందింది. నెల రోజుల్లోపు రూ.5 లక్షలు పరిహారం కింద వచ్చాయి. వచ్చిన వాటితో అప్పులు తీర్చా. కొంత మొత్తంతో రెండు కుట్టుమిషన్లు కొని స్వయంగా ఉపాధి పొందుతున్నా. ఇప్పుడు నా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నా.

- లక్ష్మీనాగేశ్వరమ్మ, మోద్దూరు, కంకిపాడు
1ap-state4a.jpg
 
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Half of AP population covered :terrific:

Universal healthcare :terrific:

Link to comment
Share on other sites

11 minutes ago, venkat232 said:

Sony bro...nenu adigina daniki related articles vunte post cheyara...........

ఇకపై సహజ మరణానికీ చంద్రన్న బీమా వర్తింపు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం

అమరావతి: ఇకపై సహజ మరణానికి కూడా చంద్రన్న బీమా వర్తింప చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. పధకం లబ్డిదారులకు 14వరోజు సంతాప కార్యక్రమం, అదే కార్యక్రమంలో ఫైనల్ సెటిల్‌మెంట్ చెక్ అందివ్వాలని సీఎం ఆదేెశించారు. మృతుని ఇంటికి వెళ్లి జన్మభూమి సభ్యులే ఫైనల్ సెటిల్మెంట్ చెక్ అందివ్వాలని సీఎం సూచించారు. 2.13 కోట్ల మందిని ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, మిగిలిన రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

Some bjp/ycp fan to disco bro........central govt mundu start chesinda.......mana Govt.....?

wiki idi vundi.......

"Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana is a government-backed Life insurance scheme in India. It was originally mentioned in the 2015 Budget speech by Finance Minister Arun Jaitley in February 2015."

Link to comment
Share on other sites

చంద్రన్న బీమాకు కొత్తరూపు!

సహజ మరణానికి పరిహారం రూ.2 లక్షలకు పెంపు

2.20 కోట్ల మందికి ప్రయోజనం కల్పించేలా చర్యలు

ఈనాడు - అమరావతి

29ap-state1a.jpg

చంద్రన్న బీమాలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకం ప్రారంభించి ఏడాదవుదన్న సందర్భంగా క్షేత్రస్థాయి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు అదనంగా లబ్ధి చేకూర్చేలా కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటిలో రెండు మార్పులు కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి... సహజ మరణానికి పరిహారం రూ.2 లక్షల వరకు పెంచడం. రెండు... పాక్షికంగా వైకల్యం సంభవిస్తే పరిహారాన్ని రూ.3.62 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు తగ్గించడం. గతంలో ఈ పథకంలో చేరకుండా ఉండిపోయిన వారికి ఈ ఏడాది అవకాశం కల్పించనున్నారు.

తాజా మార్పులు...

* చంద్రన్న బీమాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీగా సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆమ్‌ ఆద్మీ బీమా యోజన పథకాలను కలిపి రాష్ట్రంలో కార్మికులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం కల్పించేలా చంద్రన్న బీమాను రూపొందించారు.

* కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఇప్పటివరకు ఇది రూ.30 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2 లక్షల పరిహారం అందుతుంది. 50 ఏళ్ల వరకు వయసు ఉండి, సహజ మరణం సంభవిస్తేనే ఇంత మొత్తం ఇస్తారు. 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు సహజ మరణానికి రూ.30వేలే పరిహారంగా అందిస్తారు. 60ఏళ్ల తర్వాత సహజమరణానికి ఏ పరిహారమూ దక్కదు.

* ప్రమాదంలో మరణిస్తే ఏ కార్మికుని కుటుంబానికైనా రూ.5 లక్షలు పరిహారం అందుతుంది. మొదటి సంవత్సరంలోనూ ఇదే విధానం అమలు చేశారు.

* పూర్తి వైక్యల్యం సంభవిస్తే మునుపటిలాగానే రూ.5 లక్షల పరిహారం దక్కుతుంది. పాక్షిక వైకల్యం పొందిన కార్మికులకు రూ.2.50 లక్షల పరిహారమే అందుతుంది. కిందటి సంవత్సరం ఇది రూ.3.62 లక్షలుగా ఉండేది.

* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు రూ.1,200 ఉపకార వేతనం అందించనున్నారు.

7 లక్షల మందికి అదనంగా ప్రయోజనం

అక్టోబరు 2 నుంచి ఈ పథకం రెన్యువల్‌ అవుతుంది. రెండో సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య మరో 7లక్షలు పెరిగి... 2.20 కోట్లకు చేరవచ్చని కార్మికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కార్మికశాఖ వద్ద విస్తృతమైన డేటాబేస్‌ సిద్ధంగా ఉంది. అందులో నుంచి 70 ఏళ్లు దాటిన వారిని తొలగించి...17 ఏళ్లు నిండిన కొత్త యువతరాన్ని చేర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం 70 ఏళ్లు దాటి ఈ పథకం నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య కన్నా 17 ఏళ్లు నిండి కొత్తగా చేరే వారి సంఖ్యే ఎక్కువని అధికారులు వివరిస్తున్నారు. ఇలా మొత్తం 5 లక్షల మంది వరకు పెరుగుతారని, కిందటి సంవత్సరం వివిధ కారణాల వల్ల ఈ పథకం పరిధిలోకిరాని మరో 2 లక్షల మంది కూడా చేరతారని అంచనా వేస్తున్నారు. కార్మిక బీమా పథకాలకు ఎల్‌ఐసీని మాత్రమే ఏజెన్సీగా ఎంపిక చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియం కింద దాదాపు రూ.320 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.500 కోట్ల వరకు కార్మికులకు బీమా రూపంలో దక్కినట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

16 minutes ago, venkat232 said:

Some bjp/ycp fan to disco bro........central govt mundu start chesinda.......mana Govt.....?

wiki idi vundi.......

"Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana is a government-backed Life insurance scheme in India. It was originally mentioned in the 2015 Budget speech by Finance Minister Arun Jaitley in February 2015."

anni schemes kalapi Chandranna Bima tisukuvachharu bro,

dini ki mundu apathbandhu scheme undedi adi 2004 ki mundu nude undedi chanipothe 50 k ichhe vallu cbn ne start chesaru appti lo

Edited by sonykongara
Link to comment
Share on other sites

9 minutes ago, venkat232 said:

Some bjp/ycp fan to disco bro........central govt mundu start chesinda.......mana Govt.....?

wiki idi vundi.......

"Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana is a government-backed Life insurance scheme in India. It was originally mentioned in the 2015 Budget speech by Finance Minister Arun Jaitley in February 2015."

http://tgasp.meeseva.gov.in/Manuals/District admin/MEESEVA User Manual for KIOSKS Ver 1.5 MeeSeva End - Apathbandhu Service.pdf

cbn elantidi APATH BANDHU SCHEME  1998 lone start chesadu vengallappa ki cheppandi brother

Link to comment
Share on other sites

ippudu anni

17 minutes ago, venkat232 said:

Some bjp/ycp fan to disco bro........central govt mundu start chesinda.......mana Govt.....?

wiki idi vundi.......

"Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana is a government-backed Life insurance scheme in India. It was originally mentioned in the 2015 Budget speech by Finance Minister Arun Jaitley in February 2015."

edi purthiga central govt scheme ayyi valle irgatisthu unte pakka states lo entha isthunaru enthamandi vacchindo cheppamandi bro

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

ippudu anni

edi purthiga central govt scheme ayyi valle irgatisthu unte pakka states lo entha isthunaru enthamandi vacchindo cheppamandi bro

Annagaru Bro....ee scheme 1st start chesindi state govt ..not central govt annaru vere thread lo..............so just asking.......if that was the case.......Yes...5L lo state govt 3L istundi.......

Link to comment
Share on other sites

3 minutes ago, venkat232 said:

Annagaru Bro....ee scheme 1st start chesindi state govt ..not central govt annaru vere thread lo..............so just asking.......if that was the case.......Yes...5L lo state govt 3L istundi.......

Govt of India done scheme after AP has done it 1st time in India(if any pushpam idiot still ranting on this throw them below full facts video ).....By the way, CBN opposed his name for scheme but officers convinced him because it was 1st in country done by Andhra with AADHAR linkage after many states failed in past....

All facts behind this scheme and how center done after Andhra succeeded and shown way on how to do it.

:clickhere:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...