Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Suryalanka

Featured Replies

  • Replies 234
  • Views 18.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

పర్యాటకులను ఆకర్షించేలా జల సాహస క్రీడలు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 18 Apr 2026 04:18 IST

Ee

Font size

2 min read

ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహణకు ప్రణాళికలు

bpt1704263a.webp

జెట్‌స్కీ

న్యూస్‌టుడే, బాపట్ల : సూర్యలంక, వాడరేవు, రామాపురంలో జల క్రీడలు ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలు ఉన్నాయి. మరి కొద్దిరోజుల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తే బీచ్‌ పర్యాటకం ఆకర్షణీయంగా మారి ఈ రంగంలో వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బీచ్‌ పర్యాటక ప్రాంతాల్లో జల క్రీడలు ప్రధాన ఆకర్షణ. గోవాలో పెద్దఎత్తున జల సాహస క్రీడలు నిర్వహిస్తూ యువత, పర్యాటకులను నిర్వాహకులు ఆకర్షిస్తున్నారు. మున్నార్, ఊటి వంటి వేసవి విడిది కేంద్రాల్లో అక్కడి కొలనులు, సరస్సుల్లో పడవల్లో విహారం, జెట్‌స్కీ, స్పీడ్‌ బోటింగ్‌ వంటివి నిర్వహిస్తున్నారు. జిల్లాలోని బీచ్‌లు, సముద్ర ముఖ ద్వారం సమీపంలో వాగులు, కాలువల్లో వీటి నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

భద్రతా ప్రమాణాలు పాటిస్తూ..

రామాపురం బీచ్‌లో ఇప్పటికే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జెట్‌స్కీని కొత్తగా ప్రవేశపెట్టారు. సూర్యలంకలో పదేళ్ల క్రితమే దీనిని ప్రారంభించారు. జెట్‌స్కీ బోట్లు మరమ్మతులకు గురవటం, గత ప్రభుత్వం నిర్వహణకు నిధులు కేటాయించకపోవటంతో మూలనపడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వీటిని ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేశారు. కొత్త బోట్లు కేటాయించాల్సి ఉంది. తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వాటి నిర్వహణ చేపడితే జల సాహస క్రీడలు తిరిగి ప్రారంభమై హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారు. గోవా తరహాలో స్కూబా డ్రైవింగ్‌ నిర్వహణకు అవకాశం ఉంది.

వసతుల కల్పనపై దృష్టి

సాహస క్రీడలు ప్రారంభమైతే వ్యాపారాలు పెరుగుతాయి. రిసార్టులు కిటకిటలాడతాయి. ఆతిథ్య రంగం వృద్ధి చెందుతుంది. మత్స్యకార యువతకు జెట్‌స్కీ, స్పీడ్‌ బోట్లు నడపటంపై శిక్షణ ఇస్తే వారికి ఉపాధి లభిస్తుంది. అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే బాధితులను సత్వరమే కాపాడగలుగుతారు. భద్రతపై పర్యాటకులకు భరోసా ఏర్పడుతుంది. పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. పారా సెయిలింగ్, కయాకింగ్, సర్ఫింగ్‌ వంటి జల క్రీడల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీనిపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తీరంలోని బీచ్‌ల్లో జల సాహస క్రీడలు త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. పర్యాటకులకు అన్నిరకాల వినోద సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

  • Author

పర్యాటక రంగానికి కొత్త హంగులు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskUpdated : 22 Apr 2026 05:56 IST

Ee

Font size

2 min read

హోటళ్లు, రిసార్టుల నిర్మాణంపై పెట్టుబడిదారుల ఆసక్తి
న్యూస్‌టుడే, బాపట్ల 

210426bpt-1a.webp

జిల్లాలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. తీరంలో నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బాపట్ల, చీరాల నియోజకవర్గాల పరిధిలోని సముద్రతీర ప్రాంతాల్లో భూములు కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వ, పట్టా భూముల వివరాలతో అధికారులు భూబ్యాంకును సిద్ధం చేశారు. సూర్యలంకను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా.. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడానికి అత్యున్నత ప్రమాణాలతో హోటళ్లు, రిసార్టుల నిర్మాణం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

సూర్యలంకలో రూ.97.52 కోట్లతో పర్యాటకాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కారవాన్, హౌస్‌ బోటింగ్‌ టూరిజాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల తీరాల్లో  హోటళ్లు, రిసార్టుల నిర్మాణం చేపట్టారు. కొత్త వాడరేవు వద్ద ఓ ప్రైవేటు సంస్థ నాలుగు నక్షత్రాల హోటల్‌ను గత సెప్టెంబరులో ప్రారంభించింది. దీనికి సమీపంలో రూ.200 కోట్లతో మరో రెండు పెద్ద రిసార్టులు నిర్మిస్తున్నారు. సూర్యలంకలో 17 ఎకరాల భూములను ఏపీటీడీసీకి ప్రభుత్వం కేటాయించింది. బహిరంగ వేలం నిర్వహించి రిసార్టుల నిర్మాణానికి అతిథ్య రంగ సంస్థలకు కేటాయించనున్నారు. 

వేడుకలకు వేదికగా మారుతూ.. 

జిల్లాలో బీచ్‌ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి వ్యాపారవేత్తలు, టెకీలు, ఉన్నతాధికారులు వారాంతంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సూర్యలంక, కొత్త వాడరేవు, రామాపురం బీచ్‌లలో విహారానికి వస్తున్నారు. నెలలు ముందుగానే హోటళ్లు,  రిసార్టుల్లో గదులు బుక్‌ చేసుకుంటున్నారు. వివాహాలకు ముందు మెహందీ, సంగీత్‌ వేడుకలు బీచ్‌ ఒడ్డున రిసార్టుల్లో నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే సమీపంలో ఉండే బాపట్ల, చీరాల బీచ్‌లలో భవిష్యత్తులో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్న అంచనాతో పెట్టుబడిదారులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. 

కనువిందు చేసే ప్రకృతి అందాలు 

తీరంలో మడ అడవుల అందాలు, కేరళ అలెప్పీ తరహాలో సముద్ర వెనుక జలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పెద్ద హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు నుంచి ఐదు, పది ఎకరాలు కేటాయించాలని అడుగుతున్నారు. తమకు కేటాయిస్తే టెంట్, హోమ్‌స్టే టూరిజం నిర్మాణాలు చేపడతామని ప్రతిపాదిస్తున్నారు. కొత్త హోటళ్లు, రిసార్టుల నిర్మాణం జరిగితే పర్యాటకులకు వసతి సౌకర్యాలు మెరుగవడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.