Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Suryalanka

Featured Replies

  • Replies 234
  • Views 18.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

బ్లూఫ్రాగ్‌ బీచ్‌గా సూర్యలంక

రాష్ట్రంలో సూర్యలంకను రెండో బ్లూఫ్రాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskUpdated : 29 Mar 2025 06:49 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ 

tfkOTxU.png

వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు నరేంద్రవర్మ, కొండయ్య 
బాపట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సూర్యలంకను రెండో బ్లూఫ్రాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. బాపట్ల మండలం అడవిపల్లెపాలెంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన వీ వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యలంక బీచ్‌ ఫ్రంట్‌ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం రూ.97.52 కోట్లు మంజూరు చేయటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క రుషికొండ బీచ్‌కు మాత్రమే బ్లూఫ్రాగ్‌ గుర్తింపు ఉందని, సూర్యలంకను పరిశుభ్ర, అందమైన రెండో అధునాతన బ్లూఫ్రాగ్‌ బీచ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ మాత్రమే కాకుండా సినీ స్టూడియోలు, రికార్డింగ్‌ థియేటర్లు నిర్మించేలా సినీ పెద్దలతో మాట్లాడతామని తెలిపారు. బాపట్ల- చీరాలను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, రామాపురం బీచ్‌ ప్రగతికి చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాదిలో 50 వేల గదులు నిర్మించటమే లక్ష్యంగా బీచ్‌ రిసార్ట్స్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో దేశంలో రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తామని, పర్యాటకం ద్వారా ఏటా ఇరవై శాతం వృద్ధి సాధించనున్నట్లు తెలిపారు. ఈ రంగంలో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించటమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 

బీచ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు

ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ బీచ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును త్వరలో కలిసి ప్రతిపాదనలు అందజేస్తామని చెప్పారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య, బావుడా ఛైర్మన్‌ సలగల రాజశేఖరబాబు పలు ప్రతిపాదనలు చేశారు. వీ హోటల్స్, రిసార్ట్స్‌ ఎండీ సందీప్‌ మాట్లాడుతూ అడవిపల్లెపాలెంలో ఏడాదిలోగా అక్వేరియం ప్రాజెక్టు, అమ్యూజ్‌మెంట్‌ పార్కు నిర్మిస్తామని చెప్పారు. నామన వెంకట శివనారాయణ, ఆమంచి స్వాములు పాల్గొన్నారు.

  • Author

సూర్యలంకలో అందాలు ఆస్వాదించేలా..

సూర్యలంకను పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దే బీచ్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఆకృతులు ఖరారయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ ఈ ప్రాజెక్టుకు ఇటీవల రూ.97.52 కోట్లు మంజూరు చేసింది.

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 07 Apr 2025 05:04 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

బీచ్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఆకృతులు ఖరారు
త్వరలో టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం
బాపట్ల, న్యూస్‌టుడే 

044220250704GNT103.webp

సూర్యలంక బీచ్‌ ప్రవేశ ద్వారం నమూనా

సూర్యలంకను పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దే బీచ్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఆకృతులు ఖరారయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ ఈ ప్రాజెక్టుకు ఇటీవల రూ.97.52 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర పర్యాటకశాఖ పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్రం ఆమోదించింది. త్వరలో టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రెండేళ్లలో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి బీచ్‌ రూపురేఖలు పూర్తిగా మార్చనున్నారు. బీచ్‌ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దనున్నారు. 

  • బీచ్‌ రోడ్డు విభాగినిపై మొక్కలు నాటి హరితమయం చేసి చెట్ల నీడలో పర్యాటకులు కూర్చొని సేదదీరడానికి బల్లలు ఏర్పాటు చేసేలా ఆకృతిని సిద్ధం చేశారు. రాత్రులు అలల హోరును తిలకించేలా సెంట్రల్‌ లైటింగ్, సైకిలిస్టులకు ప్రత్యేకంగా సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. 
  • తీరం అందాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకిస్తూ ఉదయం, సాయంత్రం పర్యాటకులు నడవటానికి ప్రత్యేక నడక మార్గం నిర్మించనున్నారు. పుడ్‌ స్టాల్స్, రెస్టారెంట్లు, దుకాణాలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. 

044220250704GNT104.webp

ఆధునికీకరణతో కొత్త రూపు సంతరించుకోనుందిలా..

  • సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా బీచ్‌ కనిపించేలా ఇరవై కాటేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. 300 సీట్ల సామర్థ్యంతో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ నిర్మించి పిల్లల పార్క్‌ అభివృద్ధి చేయనున్నారు. 
  • బీచ్‌ ప్రారంభంలో పర్యాటకులకు సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల భద్రత కోసం బీచ్‌లోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చుతారు. 
  • స్పీడ్‌ బోటింగ్, స్కూబా డైవింగ్, ఇతర సాహజ జల క్రీడలు ఆడేలా ఏర్పాట్లు చేస్తారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో పాటు ధాన్య కేంద్రాలు నిర్మిస్తారు. 

044220250704GNT105.webp

బీచ్‌ రోడ్డు మారనుందిలా..

  • స్థానిక సముద్ర ఉత్పత్తుల మార్కెటింగ్, మత్స్యకారులకు ఉపాధి కల్పనకు దుకాణాల వీధిని ప్రతిపాదించారు. పర్యాటకుల కోసం మరుగుదొడ్లు, స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు నిర్మిస్తారు. 
  • ఆదర్శనగర్‌ వద్ద పేరలి కాలువ కట్టలను పటిష్ఠం చేసి నాలుగు కి.మీ. రింగ్‌ రోడ్డు నిర్మించి సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు. పడవల్లో విహారం కోసం జెట్టీలు నిర్మించనున్నారు. QGuGeZl.pngcz6qU0T.pngJGFUBT1.png 
  • 2 weeks later...
  • 3 weeks later...
  • Author
సూర్యలంక మరియు వాడ్రేవు బీచ్‌ల మధ్య కోస్టల్ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలని AP చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP చాంబర్స్) ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసింది. ఈ కారిడార్ అభివృద్ధి చేయాలనే ఆలోచన, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికీ దోహదపడుతుంది. 
పూర్తి వివరాలు:
  • కోస్టల్ బీచ్ కారిడార్:
    సూర్యలంక (Bapatla జిల్లా) మరియు వాడ్రేవు (Prakasam జిల్లా) బీచ్‌ల మధ్య ఒక కారిడార్ అభివృద్ధి చేయాలని AP చాంబర్స్ ప్రతిపాదించింది.
  • ప్రయోజనాలు:
    ఈ కారిడార్ ద్వారా, పర్యాటకులు సులభంగా ఈ రెండు బీచ్‌లకు వెళ్ళవచ్చు, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు మరియు వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
  • పరిశ్రమల అభివృద్ధి:
    ఈ కారిడార్ అభివృద్ధికి తోడుగా, రిసార్ట్‌లు, ఎకో-లోడ్జ్‌లు, వెల్నెస్ సెంటర్‌లు మరియు వాటర్ స్పోర్ట్స్ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది.
  • పర్యాటకానికి ప్రోత్సాహం:
    ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత సందర్శించబడే మరియు ఆర్థికంగా చురుకైన బీచ్ గమ్యంగా మారవచ్చు. Image
  • 2 weeks later...
  • 3 weeks later...
  • Author

సూర్యలంకకు అదనపు హంగులు

ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంకను సందర్శించే పర్యాటకులకు తీపి కబురు. బీచ్‌లో సముద్రాన్ని చూస్తూ ఆహ్లాదకరంగా గడపటానికి దూరప్రాంతాల నుంచి వేల మంది వస్తున్నా గదుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskUpdated : 10 Jun 2025 06:44 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

పది ఎకరాల్లో టెంట్‌ సిటీ అభివృద్ధి

ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే అందుబాటులోకి 50 గదులు 

gnt90625--8a.webp

టెంట్‌ సిటీ నిర్మాణానికి కేటాయించనున్న భూమి 
ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంకను సందర్శించే పర్యాటకులకు తీపి కబురు. బీచ్‌లో సముద్రాన్ని చూస్తూ ఆహ్లాదకరంగా గడపటానికి దూరప్రాంతాల నుంచి వేల మంది వస్తున్నా గదుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. గదులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు భాగస్వామ్యంతో సూర్యలంకలో పది ఎకరాల్లో టెంట్‌ సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే 50 గదులు అందుబాటులోకి వస్తాయి. 

న్యూస్‌టుడే, బాపట్ల : బాపట్లలోని సూర్యలంక బీచ్‌ పర్యాటకుల సందర్శనలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. సహజసిద్ధ సుందరమైన సమతల బీచ్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. వారాంతాల్లో హైదరాబాద్‌ నుంచి వేలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటక శాఖకు చెందిన బీచ్‌ రిసార్ట్స్‌లో 32 గదులు మాత్రమే ఉన్నాయి. ఇటీవల అదనంగా మరో ఏడు గదుల నిర్మాణం చేపట్టారు. శుక్ర, శని, ఆదివారాలు ఖాళీ ఉండటం లేదు. రెండు, మూడు నెలల క్రితమే ఆన్‌లైన్‌లో గదులను రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. రిసార్ట్స్‌ కాటేజీలో కూర్చొని సముద్ర అలలు, సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలను తిలకించే అవకాశం ఉండటం ఈ రిసార్ట్స్‌ ప్రత్యేకత. సూర్యలంకకు వచ్చే వారంతా రిసార్ట్స్‌లో బస చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. 

  • వారాంతంలో గదులు ఖాళీ లేక కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చిన వారు వసతి లభించక నిరాశగా వెనుదిరుగుతున్నారు. బీచ్‌లో పర్యాటక శాఖకు 15 ఏళ్ల క్రితమే పదెకరాల భూమి కేటాయించారు. ఆ తర్వాత మరో పదెకరాలు ఇచ్చారు. రిసార్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. సముద్రపు ఒడ్డుకు సమీపంలో విలువైన 20 ఎకరాల భూమి ఎంతోకాలంగా నిరుపయోగంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూర్యలంక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ద్వారా స్వదేశీ సందర్శన్‌-2 ప్రాజెక్టు కింద రూ.97.52 కోట్ల నిధులు మంజూరు చేయించింది. బీచ్‌ అభివృద్ధి పనులకు టెండర్లు పిలవటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. 
  • బీచ్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు గదుల కొరతపై పర్యాటకాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టింది. గుజరాత్‌ కెవాడియా, ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో విజయవంతంగా అమలైన టెంట్‌ సిటీల గురించి తెలుసుకుని, ఆ తరహాలో సూర్యలంకలో రూ.18 కోట్ల వ్యయంతో పది ఎకరాల విస్తీర్ణంలో టెంట్‌ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటిలో స్టార్‌ హోటళ్ల స్థాయిలో సదుపాయాలు కల్పించనుంది. అవి అందుబాటులోకి వస్తే సూర్యలంకలో వసతి సమస్య పరిష్కారమవుతుంది. కొత్తగా 50 గదులు అందుబాటులోకి వస్తాయి. సందర్శకులకు బస సౌకర్యం లభిస్తుంది. పర్యాటక శాఖకు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. సూర్యలంకలో నక్షత్రాల హోటల్‌ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. గతంలో ఒబెరాయ్‌ గ్రూప్‌ నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి ముందుకు వచ్చింది. మరో పది ఎకరాలు దీనికి కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తే పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెంది వందలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • Author

సూర్యలంకకు మహర్దశ

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 21 Aug 2025 04:01 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

రూ. 97.52 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు సన్నాహాలు 

21825gntl-6a.webp

సూర్యలంక బీచ్‌కు మహర్దశ పట్టనుంది. స్వదేశీ దర్శన్‌ పథకం కింద కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.97.52 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 27న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయించడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో రూ.70 కోట్ల విలువైన పనులు చేపట్టనున్నారు. 

న్యూస్‌టుడే, బాపట్ల: సూర్యలంకలోని సముద్రతీరం తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకులను ఆకర్షిస్తోంది. వారాంతంలో వేల మంది తరలివస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2000లో బీచ్‌ రిసార్టులు నిర్మించారు. వీటికి 94 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. ప్రస్తుతం 32 కాటేజీ గదులున్నాయి. ఆన్‌లైన్లో నెల ముందుగానే పర్యాటకులు గదులను బుక్‌ చేసుకుంటున్నారు. ఈ కారణంగా దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో వస్తున్న వారు కాటేజీలు లభించక నిరుత్సాహానికి గురవుతున్నారు. పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో రిసార్టు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఏళ్లుగా ఉన్నాయి. బీచ్‌ వద్ద 2011లో మత్స్యశాఖకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని కొత్త పర్యాటక ప్రాజెక్టుకు కేటాయించి రూ.6 కోట్లు మంజూరుచేశారు. అనంతరం పనులకు శంకుస్థాపన చేసినా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. 2013 జూన్‌లో సూర్యలంకలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథి గృహ నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు మంజూరు కాలేదు. అతిథి గృహం నిర్మించలేదు. 

21825gntl-6b.webp

పర్యాటక ప్రాజెక్టుకు కేటాయించిన భూమి

పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి.. వైకాపా పాలనలో పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. సందర్శకుల విశ్రాంతి భవనాలు రెండింటిని కూల్చివేశారు. 2020 జనవరిలో బీచ్‌ ఫెస్టివల్‌ పేరిట హంగామా చేసినా బిల్లులు మంజూరు కాక గుత్తేదారులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పర్యాటకరంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికతో ప్రతిపాదనలు పంపి నిధులు సాధించింది. వీటితో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. బీచ్‌ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. పిల్లల పార్కు, ఈత కొలనులు, ఆర్వో వాటర్‌ ప్లాంట్లు, నడక, సైక్లింగ్‌ ట్రాక్‌లు, బడ్జెట్‌ గదులు, ఫుడ్‌ కోర్టులు, స్వాగత ద్వారాలు నిర్మించనున్నారు. 

  • 2 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.