Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Suryalanka-Vodarevu Beach Corridor

Featured Replies

  • Replies 265
  • Views 19.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

షూటింగ్‌లకు రా రమ్మంటోంది

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 16 May 2026 03:01 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవు జిల్లా
చిన్న బడ్జెట్‌ సినిమాల చిత్రీకరణకు అనుకూలం
న్యూస్‌టుడే, బాపట్ల

bpt-pld-Dkr1505263a.webpimage.png

మడ అడవిలో నుంచి ప్రవహిస్తున్న ఉప్పుటేరు

సూర్యలంక సహజసిద్ధ బీచ్‌.. మడ అడవులు.. హరిత తోరణాల్లాంటి వనాలు.. వాగుల సంగమం వంటి ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆంధ్రా గోవాగా అభివృద్ధి చేసి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.వంద కోట్లు ఖర్చుపెడుతోంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. అందమైన.. అద్భుత లొకేషన్లు సినిమాల చిత్రీకరణకు అనువుగా ఉన్నాయి. సినిమాల చిత్రీకరణకు బాపట్ల జిల్లాకు రావాలని నిర్మాతలు, దర్శకులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.


మదిని పులకింపజేసే సూర్యోదయం.. సూర్యలంక నుంచి పొగురు వరకు నాలుగు కి.మీ. విశాలమైన బీచ్, నల్లమడ వాగు, పేరలి కాలువ, ఉప్పుటేరు సముద్రంలో కలిసే సంగమ ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు మదిని పులకింపజేస్తాయి. పొగురు నుంచి నిజాంపట్నం వరకు ఉన్న ఉప్పుటేరు మడ అడవుల మధ్యలో నుంచి వెళ్తుంది. చిత్తడి నేలలు, అటవీ భూములు, మడ అడవులకు స్వదేశీ, విదేశీ పక్షులు ఏటా 120కు పైగా రకాలు వచ్చి సందడి చేస్తుంటాయి. రేపల్లె నుంచి పెదగంజాం వరకు తీరం వెంబడి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు దర్శనమిస్తాయి. పచ్చని అందమైన అటవీవనాలు, నగరవనం, జీడిమామిడి తోటలు, అటవీ అభివృద్ధి సంస్థ ఎకో రిసార్టు, సముద్రం ఒడ్డున పర్యాటక శాఖ రిసార్టు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 


చిత్రీకరణకు అవసరమైన విభిన్న లొకేషన్లు.. నిజాంపట్నం పోర్టు, వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, ఏటిమొగ్గ, దిండి బీచ్‌లు, తీరంలో రిసార్టులు, హోటళ్లు, రేపల్లె మండలం లంకెవానిదిబ్బ వద్ద సముద్రంలో కృష్ణా నది సంగమం, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం, చినగంజాం మండలం మోటుపల్లిలో కాకతీయుల కాలం నాటి వీరభద్రస్వామి ఆలయం తదితర చారిత్రక ప్రాంతాలు, సినిమాల చిత్రీకరణకు అవసరమైన విభిన్న నేపథ్యాల లొకేషన్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. చిన్న, మధ్యతరహా బడ్జెట్‌ సినిమాల చిత్రీకరణకు జిల్లాలో పలు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి. పిడుగురాళ్ల- వాడరేవు ఎన్‌హెచ్‌ 167ఏ నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి ఐదు గంటల్లో చీరాల, బాపట్లకు చేరుకోవచ్చు. జిల్లాలోని తీరప్రాంతంలో సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సినీ పరిశ్రమల ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి బాపట్లలో సినిమాల చిత్రీకరణకు రావాలని ఆహ్వానిస్తామని ఇటీవల సూర్యలంకలో పర్యటించిన రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ ప్రకటించారు. షూటింగ్‌లకు వేగంగా అనుమతులు, అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.  

  • Author

రొంపేరు కాలువలో జెట్‌స్కీలో ప్రయాణించిన కలెక్టర్

Eenadu icon

By Andhra Pradesh Dist. TeamPublished : 16 May 2026 21:42 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

bapatla-chinnaganjam-1a.webp

చినగంజాం: ఆంధ్రప్రదేశ్లోని 1,053.07 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంకల్పంతో ఉన్నారు. దీనిలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో దక్షిణ దిశలో చివరి మండలమైన చినగంజాంలోని సముద్ర తీరాన్ని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ శనివారం సాయంత్రం జెట్‌స్కీ (పడవ)లో పర్యటించారు. రొంపేరు కాలువలో ఏటిమోగ వద్ద నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరం 10 నిమిషాల పాటు పర్యటించి మడ అడవులు, తీరం వెంట పర్యటించారు. ఈ ప్రాంతంలో జెట్‌స్కీలో ప్రయాణం చేయడం.. అందులోనూ జిల్లా కలెక్టర్ కావడంతో ఆసక్తిగా గమనించారు. భవిష్యత్తులో పర్యాటకంగా అభివృద్ధి చెందితే తాము కూడా ఇలానే జెట్‌స్కీలో షికారు చేయవచ్చని పడవల్లో పర్యటించిన తెదేపా నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు సంబరపడ్డారు.

  • Author

పర్యాటక అభివృద్ధికి దారులు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 17 May 2026 06:30 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

రూ.20.70 కోట్లతో తారురోడ్ల నిర్మాణం

bpt160526--8a.webp

న్యూస్‌టుడే, బాపట్ల : జిల్లాలోని తీర ప్రాంతంలో బీచ్‌ పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రూ.కోట్ల పెట్టుబడులతో పెద్దసంఖ్యలో రిసార్టుల నిర్మాణం జరుగుతోంది. వారాంతంలో వేలసంఖ్యలో పర్యాటకులు వచ్చి సేదదీరుతున్నారు. బాపట్ల నుంచి పాండురంగాపురం మీదుగా వాడరేవు వరకు రోడ్ల నిర్మాణ పనుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి. ప్రస్తుతం రెండుదశల్లో పనులు జరుగుతున్నాయి. తొలిదశలో పాండురంగాపురం నుంచి అడవిపల్లెపాలెం వరకు రూ.5.5 కోట్లతో తారురోడ్డు నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం కాలువపై రూ.11 కోట్లతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. బాపట్ల-చీరాల తీర ప్రాంతం అనుసంధానమై పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది. సూర్యలంక, వాడరేవు, రామాపురం ప్రముఖ బీచ్‌లుగా ప్రాచుర్యం పొందాయి. పిడుగురాళ్ల-వాడరేవు మధ్య ఎన్‌హెచ్‌-167ఏ నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు వేగంగా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. వాడరేవు నుంచి రామాపురం, కఠారివారిపాలెం మీదుగా పొట్టిసుబ్బయ్యపాలెం వరకు ప్రస్తుతం బీచ్‌ రోడ్డు ఉంది. దీనిని రెండు వరుసల రోడ్డుగా విస్తరించాల్సి ఉంది. 

భూసేకరణ అవసరం లేకుండానే బీచ్‌రోడ్‌ :పాండురంగాపురం-వాడరేవు బీచ్‌లను కలుపుతూ సముద్ర తీరం వెంబడి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాండురంగాపురం- అడవిపల్లెపాలెం వరకు బీచ్‌ రోడ్డు నిర్మాణానికి ఉపాధి నిధులు కేటాయించారు. వంద అడుగుల లింకు డొంక మార్గం ఇప్పటికే ఉండటంతో భూసేకరణ అవసరం లేకుండానే బీచ్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బాపట్ల- చీరాల తీర ప్రాంతాన్ని కలపటానికి కీలకమైన ఈపూరుపాలెం స్ట్రైయిట్‌కట్‌ కాలువపై వంతెన నిర్మాణానికి జిల్లా ఖనిజ నిధి నుంచి రూ.11 కోట్లు కేటాయించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారుకు పనులు అప్పగించారు. 

పాండురంగాపురం వరకు నాలుగు వరుసలు

  • బాపట్ల పట్టణం శివారు మరుప్రోలువారిపాలెం మీదుగా 216 ఏ ఎన్‌హెచ్‌ బైపాస్‌ మార్గం నుంచి పాండురంగాపురం వరకు రెండో దశలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.15.20 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఒక వరుసగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీని నిర్మాణం పూర్తయితే వాడరేవు నుంచి అడవిపల్లెపాలెం, రామచంద్రాపురం, పాండురంగాపురం బీచ్‌లకు రవాణా అనుసంధానం పెరుగుతుంది. చీరాల-బాపట్ల మధ్య ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులోకి వస్తుంది.

కేంద్ర అనుమతి వస్తేనే పొగురు వరకు మార్గం సూర్యలంక నుంచి పాండురంగాపురానికి రోడ్డు నిర్మించి వాడరేవు మార్గంతో అనుసంధానం చేయాలన్న మరో ప్రతిపాదన ఉంది. అటవీ భూముల్లో నుంచి రహదారి నిర్మాణానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. పర్యాటకాభివృద్ధిలో భాగంగా సూర్యలంక నుంచి పొగురు వరకు నాలుగు కి.మీ. బీచ్‌ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా ఉంది. గతంలో కేంద్రానికి ప్రాజెక్టు నివేదికను సమర్పించారు. అయితే ఈ మార్గం రిజర్వు అటవీ భూమిలోకి వెళ్తోంది. కేంద్రం నుంచి అనుమతి రావాలి. పొగురు వద్ద ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.  

  • The title was changed to Suryalanka-Vodarevu Beach Corridor
  • Author

సూర్యలంకకు సీప్లేన్లు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 22 May 2026 06:02 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ఉడాన్‌ పథకం కింద రూ.20 కోట్లు కేటాయింపు 

bpt21062026-1a.webp

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంకలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. కొత్తగా సీప్లేన్లను మంజూరుచేసింది. వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్‌ జెట్టీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్‌ పథకంలో కేంద్రం రూ.20 కోట్లు కేటాయించింది. అనువైన స్థలం ఎంపికచేసి త్వరలో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. సీప్లేన్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆహ్వానించనుంది.

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సీప్లేన్ల ప్రాజెక్టును ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం పది పర్యాటక ప్రాంతాల్ని సీప్లేన్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో సూర్యలంక ఒకటి. వీటిని నడపడానికి పౌరవిమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, సీఆర్‌జెడ్‌ అథారిటీ, పర్యావరణ అనుమతుల్ని అధికారులు తీసుకోనున్నారు. మౌలిక వసతుల కల్పన, సీప్లేన్లు విజయవంతంగా నడపడానికి ఉడాన్‌ పథకం కింద కేంద్రం సాయం చేయడానికి ముందుకు రావడంతో త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 

  • సూర్యలంక, నిజాంపట్నం తీరం మధ్య నల్లమడ వాగు, పేరలి కాలువ, ఉప్పుటేరు, తూర్పు తుంగభద్ర, ఇతర కాలువలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మడ అడవులు, అటవీ భూములు, వనాలు విస్తరించి ఉన్నాయి. వలస పక్షుల సందడి, హరిత వాతావరణం, ఎకో టూరిజం ప్రాజెక్టులతో ప్రకృతి  అందాలకు  నెలవుగా ఉంది. ఇప్పటికే హౌస్‌బోట్ల ప్రాజెక్టు మంజూరుచేశారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. వారు రెండు, మూడ్రోజులు ఉండి ఉల్లాసంగా గడిపేలా నూతన పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ.97.52 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. 

త్వరలో హెలీపోర్టు నిర్మాణం 

సూర్యలంకలో హెలీపోర్టు నిర్మించేందుకు పది ఎకరాలను సేకరించనున్నారు. ఇందుకు కేంద్రం రూ.36 కోట్లు మంజూరు చేయనుంది. ఇది పూర్తయితే పర్యాటకులకు హెలికాప్టర్లలో విహరించే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. సీప్లేన్ల ప్రాజెక్టు కూడా కేటాయించడంతో సూర్యలంక పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. స్థానిక వాయుసేన కేంద్రం నుంచి రెండు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏటా పది లక్షల మంది పర్యాటకులు వస్తుండగా దీని సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

  • Author

సందర్శకులు మెచ్చేలా సౌకర్యాలు

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 25 May 2026 02:20 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

సూర్యలంకలో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్‌ సెల్‌ టవర్ల ఏర్పాటు
న్యూస్‌టుడే, బాపట్ల

020420262505BPT100.webp

సూర్యలంకలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌

గోవా బీచ్‌ల తరహాలో సూర్యలంకలో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. బీచ్‌లో సిగ్నల్స్‌ లేక సెల్‌ఫోన్లు పనిచేయక ఇబ్బందులు వస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో మాట్లాడి సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయించారు. ఎయిల్‌టెల్‌ టవర్‌ ఈ నెలాఖరుకు సిద్ధం కానుంది. ఇవి అందుబాటులోకి వస్తే కమ్యూనికేషన్ల వ్యవస్థ మెరుగవుతుంది. అంతర్జాలం బాగా పని చేస్తుంది.

అత్యవసర వైద్యం అందించేలా..

సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లలో త్వరలో షాక్స్‌ ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తీరానికి వేల మంది పర్యాటకులు విహారానికి వస్తున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రమాదవశాత్తూ సముద్ర నీటిలో మునిగినా అత్యవసరం వైద్యం అందించే సౌకర్యం లేదు. కార్తికమాసంలో మాత్రమే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. బీచ్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన తుపాను రక్షిత భవనం ఖాళీగా ఉంది. దీనిలో రెండు గదులు హెల్త్‌ క్లినిక్‌కు కేటాయించి కలెక్టర్‌ ప్రారంభించారు.

నీటి కోసం ప్రత్యేక పైప్‌లైన్లు

బీచ్‌ వద్ద ఇప్పటికే 25 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు కేటాయించారు. మరో ఎకరా ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 26 ఎకరాలు పర్యాటక శాఖకు అప్పగిస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటల్, రిసార్టులు నిర్మించటానికి 15 ఎకరాల భూమిని మూడు సంస్థలకు ఏపీటీడీసీ కేటాయించింది. సుమారు రూ.480 కోట్లు ఖర్చు చేసి వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నీటి సౌకర్యం కల్పించటానికి ప్రత్యేక పైప్‌లైన్లు వేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా పెంచనున్నారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా భూమి కేటాయించనున్నారు. హెలీపోర్టు, పార్కింగ్‌కు అదనంగా భూ సేకరణ చేయాల్సి ఉంది. 15 నుంచి 20 ఎకరాల అటవీ భూములు తీసుకునే యోచనలో ఉన్నారు. ఇటీవల మూడురకాల సాహస క్రీడలు ప్రారంభించారు. పారా సెయిలింగ్‌తో పాటు మరిన్ని క్రీడలను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత ఆకర్షణీయంగా బీచ్‌

సూర్యలంకలో స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ.97.52 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకోవటానికి భవనాల నిర్మాణం చేపట్టారు. వీటిని సెప్టెంబరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే వసతి లేక మహిళలు, యువతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే పర్యాటకులకు సౌకర్యాలు సమకూరుతాయి. వాకింగ్‌ ట్రాక్, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేస్తే బీచ్‌ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

  • Author

బీచ్‌ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:43 AM

జిల్లాలోని బీచ్‌లలో షాక్స్‌ (చిన్న గుడిసె/పూరిపాకలు) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

బీచ్‌ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

విశాఖలో పైలట్‌ ప్రాజెక్టు

రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం

విశాఖపట్నం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని బీచ్‌లలో షాక్స్‌ (చిన్న గుడిసె/పూరిపాకలు) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గోవా తరహాలో విశాఖలో కూడా బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుచేస్తే పర్యాటకం పెరుగుతుంని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఎప్పటి నుంచో కోరుతోంది. బీచ్‌లలో తాటాకులు, ఈత ఆకులతో కుటీరాలు ఏర్పాటుచేస్తారు. అందులో వారికి అవసరమైనవన్నీ ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో తాగడానికి బీర్లు వంటివి అందుబాటులో ఉంచుతారు. మద్యం కూడా లభిస్తుంది. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యలు, చేపలు వంటి పదార్థాలు పెడతారు. ఇవి విదేశీ పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఈ బీచ్‌ షాక్స్‌ను విశాఖపట్నం, చీరాలలో రెండేసి చొప్పున పైలట్‌ ప్రాజెక్టు కింద పెడతారు. ఆదరణ బాగుంటే మిగిలిన బీచ్‌లలో కూడా పెట్టే అవకాశం ఉంది.

  • Author

గదులు నిర్మిస్తేనే మణిహారం.. వసతులు కల్పిస్తేనే విహారం

Eenadu icon

By Andhra Pradesh Dist. DeskPublished : 08 Jun 2026 04:36 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు కొరవడిన సౌకర్యాలు 

bpt%20070626%206a.webp

హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి కేటాయించిన భూమి 

న్యూస్‌టుడే, బాపట్ల : జిల్లాలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. వేసవిలో బీచ్‌లను సందర్శించిన పర్యాటకుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. రిసార్టుల్లో గదుల కొరత ఉంది. సూర్యలంకలో ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ప్రముఖ అతిథ్య సంస్థలు మూడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వాటికి ఏపీటీడీసీ ద్వారా 17 ఎకరాల భూములు కేటాయించారు. నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

వారం ముందు బుక్‌ చేసుకుందామన్నా..

జిల్లాలో 74 కి.మీ. తీర ప్రాంతం ఉంది. సూర్యలంక, రామాపురం, వాడరేవు, పాండురంగాపురం, అడవిపల్లెపాలెం బీచ్‌లు ప్రాచుర్యం పొందాయి. సూర్యలంకలో పర్యాటక శాఖకు చెందిన బీచ్‌ రిసార్ట్స్‌ ఉంది. దీనిలో 32 ఏసీ కాటేజీలు ఉన్నాయి. 98 శాతం ప్రైవేటు రిసార్టులు వచ్చాయి. గత రెండేళ్లలో కొత్త రిసార్టుల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. అదే సమయంలో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల సంఖ్య రెట్టింపైంది. వేసవిలో పిల్లలతో కలిసి సందర్శకులు ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు, వ్యానుల్లో వేలమంది బీచ్‌లకు వస్తున్నారు. రిసార్టుల్లో గదులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వారం ముందు బుక్‌ చేసుకుందామన్నా దొరకటం లేదు. చాలామందిలో నిరాశ ఉంది. కొన్ని రిసార్టుల్లో గదుల అద్దె రూ.9500 నుంచి రూ.15 వేలు ఉన్నా పర్యాటకులు చెల్లిస్తున్నారు. తీర మండలాలు బాపట్ల, చీరాల, వేటపాలెంలోని అన్ని రిసార్టుల్లో గదుల సంఖ్య రూ.3500 లోపే ఉంది. వేసవి సెలవుల్లో రోజూ 20 నుంచి 25 వేల మంది పర్యాటకులు వస్తుండటంతో గదులు సరిపోవటం లేదు. ప్రస్తుతం కొన్ని కొత్త రిసార్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో ఇవి పూర్తి కానున్నాయి. నూతనంగా మరో 300 గదులు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సూర్యలంక సమీపంలోని ఆదర్శనగర్‌ వద్ద పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు, ఉప్పుటేరు మీదుగా తూర్పు తుంగభద్ర కాలువలో నిజాంపట్నం హార్బర్‌ వరకు పడవల్లో విహారం, హౌస్‌ బోటింగ్‌ను సెప్టెంబరు నుంచి అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

పనులు పూర్తి చేస్తేనే వసతులు

సూర్యలంకలో ప్రముఖ అతిథ్య సంస్థలు రూ.464 కోట్ల పెట్టుబడితో 340 గదుల సామర్థ్యంతో మూడు రిసార్టుల  నిర్మాణానికి పర్యాటక శాఖతో ఎంవోయూ చేసుకున్నాయి. భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. రిసార్టుల నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించి 2027 మార్చిలోగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ.97.52 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి చేస్తే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పర్యాటకులకు తగినన్ని గదులతో వసతి సౌకర్యాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.