Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Suryalanka-Vodarevu Beach Corridor

Featured Replies

  • Replies 265
  • Views 19.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

సూర్యలంక అత్యంత సురక్షితమైన ప్రాంతమన్న సీఎం.. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 కిలోమీటర్ల మేర కాలుష్య రహిత ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలన్నారు. సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్న చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చని సూచించారు. మాల్దీవ్స్ తరహాలో ఐల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చన్న  సీఎం.. టూరిజం కార్పోరేషన్ మరింత బలోపేతం కావాలన్నారు.

  • Author

 ఐలాండ్‌ టూరిజంపై దృష్టి

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 07 Jan 2026 05:16 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

బీచ్‌ టూరిజంపై మాస్టర్‌ ప్లాన్‌: చంద్రబాబు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో ఐలాండ్‌ టూరిజం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సూళ్లూరుపేట దగ్గర ఉన్న చిన్న ద్వీపాలను బీచ్‌ పర్యాటకం కింద అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చన్నారు. బీచ్‌ పర్యాటకంపై మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల సమీపంలోని సూర్యలంక అత్యంత సురక్షితమైన తీర ప్రాంతమని, సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌ను బ్రాండింగ్‌ చేయాలని సూచించారు. ఇక్కడ 15 కి.మీ. బీచ్‌ఫ్రంట్‌ అభివృద్ధి చేయాలన్నారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘టూరిజం కార్పొరేషన్‌ ద్వారా రాబోయే 15 ఏళ్లలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలి. పాపికొండలు, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టండి. కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు అద్భుత పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి. అనంతపురం నుంచి గండికోట వరకు టూరిజం క్లస్టర్లలో పర్యాటకానికి అవకాశం ఉంది. తిమ్మమ్మ మర్రిమానును గూగుల్‌ మ్యాపింగ్‌ చేయండి. ఆవకాయ్‌ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్‌ మార్ట్‌లను నిర్వహించాలి. విశాఖ, అమరావతికి హోటళ్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు వచ్చేలా చూడండి. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు మాన్సాస్‌ ట్రస్ట్‌ తన భూములు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అని సీఎం దిశానిర్దేశం చేశారు. 

  • Author

సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

 అధికారుల సమన్వయంతో ప్రతీ ప్రాజెక్టు గ్రౌండ్ కావాలన్నారు. చీరాల టూరిజం హబ్‌గా మారుతోందని చెప్పారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

 
  • Author

సూర్యలంక వద్ద చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 13 Jan 2026 05:33 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

ap120126main25a.webp

హెలికాప్టర్‌ నుంచి సూర్యలంకను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ 

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతి నుంచి హెలికాప్టర్‌లో నారావారిపల్లె వెళ్తూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సూర్యలంక తీరాన్ని ఏరియల్‌ వ్యూ ద్వారా సోమవారం పరిశీలించారు. స్వదేశీ దర్శన్‌ 2.0 కింద రూ.97 కోట్లతో షాపింగ్‌ స్ట్రీట్, పర్యాటకుల సమాచార కేంద్రం, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, కాటేజీలు, ఎక్స్‌పీరియన్స్, పార్కింగ్‌ జోన్ల నిర్మాణ పనులు చేపట్టారు. సెప్టెంబరు 27న బీచ్‌ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు సూర్యలంక రావాల్సి ఉంది. భారీవర్షాలు, ప్రతికూల పరిస్థితుల వల్ల ఆ పర్యటన రద్దయింది.

సూర్యలంక నుంచి 15 కి.మీ. వరకు బీచ్‌ ఫ్రంట్‌ను సుందరంగా అభివృద్ధి చేయాలని, పర్యాటక క్లస్టర్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఇటీవల చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ప్రముఖ హోటళ్లు, రిసార్టుల సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. త్వరలో సూర్యలంక నుంచి నిజాంపట్నం హార్బర్‌ వరకు హౌస్‌బోట్లను నడపనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న పనులను ఏరియల్‌ వ్యూ ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

  • Author

నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 13 Jan 2026 05:37 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

సూర్యలంకలో మూడు రిసార్టులు
పెనుకొండలో ‘మెగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం
ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలకు లీజుకు భూములు, రాయితీలు ఇవ్వండి
పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం

130126brk126007890a.webp

ఈనాడు, అమరావతి: పర్యాటక రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూములు లీజుకు కేటాయించడంతోపాటు పర్యాటక విధానం కింద పలు రాయితీలు అందిస్తోంది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంకలో మూడు రిసార్టులు, సత్యసాయి జిల్లా పెనుకొండలో మెగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలకు ప్రభుత్వం భూములు లీజుకు కేటాయించింది. అదే విధంగా పర్యాటక విధానంలో ప్రోత్సాహకాలు, రాయితీలు అందించాలని రాష్ట్ర పర్యాటకశాఖను ఆదేశిస్తూ సోమవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త ప్రాజెక్టులివి...!

  • బాపట్ల జిల్లా సూర్యలంకలో రూ.187.58 కోట్లతో ఫైవ్‌స్టార్‌ కోస్టల్‌ రిసార్ట్,  వెల్‌నెస్‌ సెంటర్, ఐటీసీ బ్రాండ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న ఆర్న కోస్టల్‌ రిసార్ట్స్‌ సంస్థకు  రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుందని రాష్ట్ర పర్యాటకశాఖ పేర్కొంది. 
  • సూర్యలంకలో రూ.64.44 కోట్లతో రాయల్‌ ఆర్చిడ్‌ బ్రాండ్‌తో త్రీస్టార్‌ సూర్య నమస్కార్‌ రిసార్ట్‌ అభివృద్ధి కోసం శుభం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు, ఇంద్రనీర్‌ ఫుడ్, బెవరేజెస్‌ సంస్థకు 66 ఏళ్ల లీజుకు 2.6 ఎకరాల భూమిని కేటాయించడంతోపాట ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని పర్యాటకశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్టు ఏర్పాటుతో వంద మందికి ఉపాధి లభించనుంది. 
  • సూర్యలంకలో రూ.183.87 కోట్లతో ‘హిల్‌టన్‌’ బ్రాండ్‌తో ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌తోపాటు సెయిలింగ్‌ క్లబ్, కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన సైవెన్‌ హాస్సిటాలిటీ గ్రూప్, యూనిఫై సొల్యూషన్స్‌ కన్సార్షియంకు 6.69 ఎకరాల భూమిని 66 ఏళ్లకు లీజుకు ఇవ్వడంతోపాటు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ఏర్పాటుతో 196 మందికి ఉపాధి లభిస్తుంది.
  • సత్యసాయి జిల్లా పెనుకొండలో గణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాదాల చెంత రూ.425.20 కోట్లతో మెగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రం-బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన బెంగళూరుకు చెందిన కృష్ణ కాన్షియస్‌నెస్‌ అంతర్జాతీయ సంస్థ (ఇస్కాన్‌)కు పెనుకొండలో మూడు సర్వే నంబర్లలో 119.50 ఎకరాల భూమిని లీజుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాయితీలు ఇవ్వాలని పర్యాటకశాఖను ఆదేశించింది. ప్రాజెక్టు ఏర్పాటుతో 1,035 మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం పేర్కొంది.
  • 2 weeks later...
  • Author

లాహిరి లాహిరి లాహిరిలో..

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 02 Feb 2026 04:31 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

ఉగాది నాటికి హౌస్‌ బోటింగ్‌ పర్యాటకం 

image.png

పేరలి కాలువ

న్యూస్‌టుడే, బాపట్ల: హౌస్‌ బోటింగ్‌ పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆపరేటర్ల సహకారంతో పడవల్లో విహారం ప్రాజెక్టును సూర్యలంక సమీపంలో ఆదర్శనగర్‌ వద్ద పేరలి కాలువలో త్వరలో ప్రారంభించనున్నారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను రూ.8 కోట్లతో కల్పిస్తున్నారు. హౌస్‌బోటింగ్, నిర్మాణ పనులకు జలవనరుల శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. పనులు పూర్తి చేసి ఉగాది నాటికి ప్రారంభించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

సరికొత్త అనుభూతి

రాష్ట్రంలో తొలి విడతలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో కేరళ అలెప్పీ తరహాలో హౌస్‌ బోట్లు నడపటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందులో సూర్యలంక ప్రాజెక్టు ఒకటి. బాపట్ల మండలం ఆదర్శనగర్‌ వద్ద పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు, ఉప్పుటేరు మీదుగా తూర్పు తుంగభద్ర కాలువలో నిజాంపట్నం హార్బర్‌ వరకు, పడవల్లో విహారాన్ని ప్రారంభించి పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచాలని అధికారులు  ప్రణాళిక రూపొందించారు. సింగిల్, డబుల్, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ స్పీడ్‌బోట్లు నడపాలని నిర్ణయించారు. లగ్జరీ బోట్ల తయారీ చేపట్టారు.

పడవలో రెండు గంటలు

ఆదర్శనగర్‌ వద్ద పడవ ప్రారంభమై నల్లమడ వాగు సముద్రంలో కలిసే చోట ఇసుక తిన్నెల్లో ఆగేలా ల్యాండింగ్‌ పాయింట్‌ ప్రతిపాదించారు. పర్యాటకులు నల్లమడ వాగు సంగమం, చుట్టూ మూడు వైపుల నీరు, ఓ వైపు భూమి ఉండే ద్వీపకల్ప ప్రాంతం, పక్షులను సందర్శించేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఉప్పుటేరులో మరలా పడవ ప్రారంభమై కర్లపాలెం మండలం తుమ్మలపల్లి రామాలయం సమీపంలో రెండో ల్యాండింగ్‌ పాయింట్‌కు చేరుకుంటుంది. ఇసుక తిన్నెలు, మడ అడవుల అందాలు తిలకిస్తారు. కొద్దిసేపు తర్వాత పడవలో ముందుకు సాగుతూ తూర్పు తుంగభద్ర కాలువలోకి ప్రవేశించి నిజాంపట్నం హార్బర్‌కు 1.5 కి.మీ. దూరంలో చివరి ల్యాండ్‌ పాయింట్‌కు చేరుకుంటుంది. హార్బర్, మడ అడవుల సందర్శన తర్వాత పడవ వచ్చిన మార్గంలో వెనుదిరిగి తిరిగి ఆదర్శనగర్‌ చేరుకోవటంతో విహారం ముగుస్తుంది. పడవలో ప్రయాణ సమయాన్ని రెండు గంటలుగా అంచనా వేశారు. మధ్యలో సందర్శన ప్రాంతాలతో కలుపుకుని విహారం మొత్తం నాలుగు గంటలు ఉంటుంది. పడవల్లో విహరిస్తూ మడ అడవులు, ప్రకృతి అందాలు, విదేశీ, స్వదేశీ పక్షులను తిలకించేలా మార్గాన్ని ఎంపిక చేశారు.  హౌస్‌బోట్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు. పడవల విహారం ప్రారంభయ్యే పేరలి కాలువ కట్టపై కి.మీ. పొడవున నడక ట్రాక్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మడ మొక్కలు నాటనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వేసవి సెలవుల్లో హౌస్‌ బోటింగ్‌ పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని  కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. 

  • పడవల విహార మార్గం: పేరలికాలువ(4 కి.మీ.)-నల్లమడ వాగు(1.5 కి.మీ.)-ఉప్పుటేరు (12.2 కి.మీ.)-తూర్పుతుంగభద్ర కాలువ(0.65 కి.మీ.)
  • పడవల విహారం ప్రాజెక్టు దూరం: 18.37 కి.మీ.
  • కాలువల్లో కనీస లోతు: 1.65 మీ. నుంచి 3.14 మీ.
  • ప్రయాణ సమయం: రెండు గంటలు
  • మొత్తం ల్యాండింగ్‌ పాయింట్లు: నాలుగు  
  • Author

విస్తరణకు మార్గం సుగమం

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 06 Feb 2026 03:10 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

నాలుగు వరుసలుగా గుంటూరు-బాపట్ల దారి
న్యూస్‌టుడే, బాపట్ల

025920260602BPT100.webp

జీబీసీ రోడ్డుపై వాహనాల రద్దీ

ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాపట్ల-గుంటూరు రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పీపీపీ విధానంలో 60 కి.మీ. మేర నాలుగు వరుసలుగా విస్తరణ, భూసేకరణకు కలిపి రూ.వెయ్యి కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. త్వరలో టెండర్‌ పిలిచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

బాపట్ల - గుంటూరును కలిపే రాష్ట్ర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని 2012లో నిర్ణయించారు. దీనికి రూ.672 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనావేశారు. అయితే కార్యరూపం దాల్చలేదు. సూర్యలంక కేంద్రంగా పర్యాటక క్లస్టర్‌ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బీచ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసార్టులు, మూడు, ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. ఐటీసీ, లెమన్‌ట్రీ, ర్యాడిసన్, ఆర్చిడ్‌ బ్లూ వంటి ప్రముఖ సంస్థలు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. రూ.486 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించాయి. సూర్యలంక బీచ్‌లో ఇప్పటికే రూ.97.52 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

కేంద్రాన్ని కోరినా.. అమరావతి ఆర్థిక మండలిలో భాగంగా బాపట్లను పర్యాటక, ఆక్వా, జలక్రీడల హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పనకు సింగపూర్‌ ప్రభుత్వ నిపుణుల సహకారం తీసుకుంటోంది. ఆ దేశం నుంచి అధికారుల బృందం బాపట్లలో పర్యటించి వెళ్లింది. అమరావతి నుంచి బాపట్లకు వేగంగా చేరుకోవడానికి జీబీసీ రాష్ట్ర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా నిబంధనలతో అనుమతులు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే పీపీపీ విధానంలో రహదారి విస్తరణ పనులు చేపట్టడానికి ఆమోదం తెలిపింది.

ఐదేళ్లలో పెరిగిన రద్దీ.. గుంటూరు-బాపట్ల మార్గంలో గత ఐదేళ్లలో వాహనాల రద్దీ పెరిగింది. 60 కి.మీ. దూరం ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది. నాలుగు వరుసలుగా విస్తరించడానికి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరులో బైపాస్‌ మార్గాలను కొత్తగా నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణం పూర్తయితే గుంటూరు నుంచి 45 నిమిషాల్లో బాపట్ల చేరుకోవచ్చు. ఎన్‌హెచ్‌ -16, ఎన్‌హెచ్‌-216ఏ అనుసంధానం అవుతాయి.

బీవోటీ విధానంలో.. రోడ్డు విస్తరించాక 15 నుంచి 30 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు గుత్తేదారువే. భూసేకరణ, రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు లైన్లను పక్కకు జరపడానికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రహదారి విస్తరణ పనులు చేసిన గుత్తేదారుకు టోల్‌ వసూలుతోపాటు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద బీవోటీ (నిర్మించు, నిర్వహించు, బదలాయించు) గడువు ఉన్నంత కాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.150 కోట్ల మేర చెల్లించనున్నాయి.

 
  • Author

సూర్యలంకలో పార్కింగ్‌కు రెండెకరాలేనా?

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 17 Feb 2026 03:10 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

image.png

సూర్యలంకలో ప్రభుత్వ భూమి

సూర్యలంక బీచ్‌ను జాతీయ పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయి. ప్రముఖ ఆతిథ్య సంస్థలకు హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి బీచ్‌కు సమీపంలోనే భూములను ప్రభుత్వం కేటాయించింది. అయితే వాహనాల పార్కింగ్‌కు కేవలం రెండు ఎకరాలు మాత్రమే కేటాయించారు. కార్తిక పౌర్ణమి, ఇతర ఉత్సవాల సమయంలో వేల సంఖ్యలో వచ్చే వాహనాలకు ఇది ఏ మాత్రం సరిపోదు. సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతారు.

న్యూస్‌టుడే, బాపట్ల : సూర్యలంక పర్యాటక పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా ప్రముఖ కేంద్రం. కార్తిక పౌర్ణమి రోజు సముద్రంలో పుణ్యస్నానాలు చేయటానికి లక్షన్నర మంది వరకు భక్తులు వస్తారు. అదేమాసంలో వారాంతంలో భారీసంఖ్యలో తరలి వస్తారు. ఇన్నాళ్లూ భక్తులు, పర్యాటకుల వాహనాలకు స్థానిక ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు, అటవీ భూమిలో అధికారులు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే సమయంలో పార్కింగ్‌కు ఎనిమిది నుంచి పది ఎకరాల అవసరం ఉంటుంది.

25 ఎకరాల ప్రభుత్వ భూమి .. ప్రసుత్తం బీచ్‌లో రూ.97.52 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, సుందరీకరణ పనులు చేస్తున్నారు. సూర్యలంకలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఐటీసీ ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి 8 ఎకరాలు, హిల్టన్‌ సంస్థ హోటల్‌కు 6 ఎకరాలు, శుభం హోటల్‌కు రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. పర్యాటక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ భవనాన్ని మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి రెండు నుంచి మూడు ఎకరాల భూమి పోతోంది. వాహనాల పార్కింగ్‌కు కేవలం రెండు ఎకరాలు మాత్రమే కేటాయించారు. ప్రత్యేక వేడుకల సందర్భంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.

ప్రైవేటు భూముల్లో స్థిరాస్తి వెంచర్లు

ఇన్నాళ్లూ వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్న నాలుగు ఎకరాల ప్రైవేటు భూముల్లో స్థిరాస్తి సంస్థ వెంచర్‌ వేసి ప్లాట్లు విక్రయిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇక నుంచి ఆ భూమిలో వాహనాలు నిలపటం కుదరదు. బీచ్‌కు కి.మీ. దూరంలో ఖాళీగా ఉన్న అటవీశాఖ భూమిలో వాహనాలు నిలిపి పర్యాటకులు, భక్తులు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. భారీవర్షాలు వస్తే పరవాగు పొంగి అటవీ భూముల్లో వాహనాల పార్కింగ్‌ సాధ్యపడదు. కార్తికమాసం, ఇతర ఉత్సవాలు నిర్వహించే సమయంలో వాహనాల పార్కింగ్‌ సమస్య వస్తుంది. దీనిపై ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ సూర్యలంకలో వాహనాల పార్కింగ్‌కు కేవలం రెండెకరాలు కేటాయింపు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని, మరింత భూమి కేటాయించాలని కోరతానన్నారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.