Jump to content

Rajamahendravaram Airport


sonykongara

Recommended Posts

  • 5 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
ప్రపంచ ఎయిర్‌పోర్టుల చార్ట్‌లలో రాజమహేంద్రవరం
13-01-2019 11:30:11
 
636829762026325087.jpg
  • 3165 మీటర్ల రన్‌వే విస్తరణ నేటితో పూర్తి
  • రెండు నెలల్లో పెద్ద విమానాల రాకపోకలు
  • ఇప్పటికే సగటున రోజుకు 1200 మంది ప్రయాణికులు
  • త్వరలో కార్గో సౌకర్యం
  • ప్రస్తుతం 16 విమాన సర్వీసులు, 18 హెలికాప్టర్లు
  • రన్‌వే ప్రారంభమైతే సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు వచ్చే అవకాశం
 
రాజమహేంద్రవరం: ఇక రాజమహేంద్రవరం విమానాశ్రయం పెద్ద ‘విమానా’లాశ్రయంగా అవతరించనుంది. కేవలం రెండు, మూడు నెలల్లోనే ఇది అమలులోకి రానుంది. ఇక ప్రపంచ ఎయిర్‌పోర్టుల చార్ట్‌లలో రాజమహేంద్రవరం చార్ట్‌ కూడా ఉంటుంది. రన్‌వే విస్తరణ ఆదివారం నాటికి పూర్తి కానుంది. కొన్ని అనుమతులు లభించిన వెంటనే ఈ విమానాశ్రయం పెద్ద విమానాశ్రయం అవుతుంది. ప్రస్తుతం 16 విమానాశ్రయాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై సర్వీసులు నడుస్తున్నాయి. విస్తరించిన రన్‌వే ప్రారంభమైన తరువాత ఢిల్లీ, తిరుపతి, ముంబై వంటి ప్రాంతాలకు కూడా విమానాలు నడుస్తాయి. ప్రస్తుతం రోజుకి 1200 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది 3.5 లక్షల మంది ప్రయాణించారు.
 
మార్చి నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంచి భవిష్యత్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో రన్‌వే ప్రారంభమైన వెంటనే కార్గో సౌకర్యం కూడా అమలులోకి వస్తుంది. ఇప్పటికే టూ రిజం పరంగాను, వివిధ ఫోర్ట్‌లు, ఓఎన్జీసీ, రిలయన్స్‌ వంటి సంస్థలు, వివిధ వ్యాపార సంస్థల వల్ల మంచి డిమాండ్‌ ఏర్పడింది. కార్గో ఏర్పడిన తరువాత ఆక్వా, నర్సరీ మొక్కలు, పూలు, పండ్లు, ఇతర ప్రాంతాలకు ఈ జీగా ఎగుమతి అవుతాయి. తాజా సరుకును కొన్ని గంటల్లోనే ఇతర ప్రాంతాలకు చేర్చే అవకాశముంటుంది.
 
3165 మీటర్ల రన్‌వే: ఇక్కడ గతంలో కేవలం 1750 మీటర్ల రన్‌వే ఉండేది. దానిని విస్తరించడంతో దీని పొడవు 3165 మీటర్లకు చేరింది. రన్‌వే వెడల్పు 45 మీటర్లు. దానికి ఇరువైపులా 7.5 మీటర్ల చొప్పున సేఫ్టీ షోల్డర్స్‌ నిర్మించారు. రన్‌వేపై నీరు నిలువకుండా ప్రత్యేక నిర్మాణం చేశారు. రెండు వైపులా స్టోరమ్‌ వాటర్‌ డ్రెయిన్‌ నిర్మించారు. 29 ఇంజక్షన్‌ వెల్స్‌ కూడా నిర్మించారు. ఇవి నీటిని రీసైకిలింగ్‌ చేస్తాయి. మొత్తం ఈ విధానాన్ని గ్రేడింగ్‌ ఆఫ్‌ రన్‌వే అంటారు. వర్షం వచ్చినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోగా, మిగిలింది పల్లపు ప్రాంతానికి పోతుంది.
 
రూ.181 కోట్లతో విమానాశ్రయం అభివృద్ధి: ఈ విమానాశ్రయం అభివృద్ధిని రూ.181 కోట్లతో చేపట్టారు. గతంలో 368 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఉండేది. కొత్తగా మరో 852 ఎకరాలు సేకరించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 1220 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం లోపల 17 కి.మీ రోడ్డు నిర్మించారు. దాని చుట్టూ ప్రహరీ నిర్మించారు.
 
తొమ్మిది నెలలు రాత్రింబవళ్లు పని: రన్‌వే విస్తరణ ఒక ప్రత్యేక సమయాల్లో నిర్మించినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌ కిషోర్‌ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమానాల రాకపోకలు ఉండడం వల్ల పగటి పూట పని చేయడానికి వీలు లేదు. ప్రతీరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనులు చేసేవారు. 7 గంటల తరువాత రన్‌వేలో ఏ విధమైన ఆటంకం లేకుండా క్లీన్‌ చేసి విమానాలు తిరగడానికి వీలుగా చేసేవారు. రన్‌వే నిర్మాణం కోసం కాంక్రీట్‌ మిక్చర్‌ మెటీరియల్‌ను కొంత సమయం ముందుగానే రెడీ చేసుకుని రన్‌వే నిర్మించారు.
 
ఏటీసీ, సివిల్‌ ఇంజనీర్లు, టెర్మినల్‌ మేనేజర్లు, సెక్యూరిటీ, పోలీస్‌ పర్యవేక్షణలో అతి జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ నిర్మాణాలు చేపట్టారు. రిటైర్డ్‌ ఆర్మీని సెక్యూరిటీగా నియమించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రన్‌వేపై వెహికల్‌ ఆగిపోతే మరుసటి రోజు విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల వాటి పట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. విమానాలు ఆలస్యమవడం వల్ల కొన్ని సందర్భాల్లో సిద్ధం చేసిన కాంక్రీట్‌ మిక్స్‌ వృథా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రన్‌వేతోపాటు విమానాశ్రయాల అభివృద్ధి పనులు ఆర్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ నిర్వహించింది.
 
ఐసోలేషన్‌ బే నిర్మాణం: ఐసోలేట్‌ బే అనేది ఇక్కడ అతి ముఖ్యమైన విభాగం. ఇది ఉంటేనే పెద్ద విమానాలు దిగడానికి అనుమతి ఉంటుంది. ఎయిర్‌ పోర్టులోను, ఎయిర్‌క్రాఫ్ట్‌లోను బాంబులు పెట్టినా, విమానాలు హైజాక్‌ చేసినప్పుడు సంబంధిత విమానాలను ఈ బే లోకి తీసుకువెడతారు. దీనివల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. బాంబ్‌ ఉంటే సంబంధిత విమానం వరకే ఇబ్బంది ఉంటుంది.
 
న్యూ అప్రాన్‌ నిర్మాణం: అప్రాన్‌ అంటే రన్‌వేపై విమానాలు దిగిన తరువాత అవి ఆగే ప్రదేశం. గతంలో ఇక్కడ అప్రాన్‌ అటు ఇటు వాలుగా ఉండేది. కొత్తగా నిర్మించిన అప్రాన్‌ను, పాత అప్రాన్‌ను కూడా ఒకే లెవెల్‌లో పటిష్టపరిచారు.
 
రన్‌వే పూర్తి అయినా: రన్‌వే పూర్తి అయినప్పటికీ సేఫ్టీ విషయంలో అనుమతి లభించాల్సి ఉంది. కార్టోగ్రఫీ సర్వే చేసి ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎత్తు ఎంత ఉండాలనే విషయాన్ని నిర్థారించారు. విమానాలు వచ్చే సమయంలో చెట్లు, ఇతర కట్టడాలు ఎంత ఎత్తు వరకు ఉండాలనే విషయంపై కార్టోగ్రఫీ సర్వే జరిగింది. దాని సలహా ప్రకారం లోపలి భాగంలో చెట్లు తొలగించారు. విమానాశ్రాయానికి వెలుపల ప్రాంతంలో కూడా కొన్ని చెట్లు ఇబ్బందిగా ఉండడం వల్ల రెవెన్యూ శాఖ సహాయంతో సర్వే నిర్వహించారు. నష్ట పరిహారం ఇచ్చి వీటిని తొలగించిన తరువాత సర్వే చార్ట్‌ను తయారు చేస్తారు.
 
ఈ చార్ట్‌లను ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాలకు పంపిస్తారు. ఉదాహరణకు లండన్‌ విమానాశ్రయంలో ఉన్న ఒక వ్యక్తి రాజమహేంద్రవరంలో విమానాశ్రయం సౌకర్యాలు తెలుసుకోవాలంటే ఈ చార్ట్‌ ఉపయోగపడుతుంది. ఈ చార్ట్‌లో రన్‌వే, సేఫ్టీ, అప్రాన్‌, టెర్నినల్స్‌, పార్కింగ్‌, కార్గో ఇతర సౌకర్యాల వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడే పెద్ద విమానాలకు అనుమతిస్తారు. అందుకు ఈ చార్ట్‌ ఉపయోగపడుతుంది. ఇప్పటికే సర్వే పూర్తి అయ్యింది. ఒకటి, రెండు నెలల్లో సర్వే చార్ట్‌ ప్రకటించే అవకాశముంది. అప్పుడు రన్‌వే ప్రారంభం కావడంతో పాటు పెద్ద విమానాలు కూడా దిగడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
 
 
 
కేవలం రెండేళ్లలో పెద్ద అభివృద్ధి: ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌ కిషోర్‌
కేవలం రెండేళ్లలో రాజమహేంద్రవరం విమానాశ్రయం పెద్దగా అభివృద్ధి చెందిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలై ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. సీ17 వంటి పెద్ద విమానాలు కూడా ఇక్కడ దిగే అవసరం ఉందని, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఎక్కువ మోతాదులో ఆహారపదార్థాలు దిగుమతికి కూడా సానుకూలమవుతుందన్నారు. రన్‌వేతో పాటు కార్గో కూడా మొదలవుతుందని విమానాల్లో బెల్లీ కార్గో సౌకర్యం ఉంటుందన్నారు. అంటే విమానంలో పైభాగాన జనం కూర్చుంటే కింది భాగంలో ఈ గూడ్స్‌ పెట్టుకోవచ్చన్నారు. పెద్ద విమానాలొస్తే రేట్లు కూడా తగ్గుతాయని చెప్పారు. ఇక్కడ ఎయిర్‌ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నామని, ఇంతవరకు ప్రయాణికులు టెర్మినల్‌ పాయింట్‌ నుంచి బస్సులలో విమానం వద్దకు వెళ్లేవారు.
 
ఈ బ్రిడ్జిలు పూర్తి అయితే నేరుగా విమానం వద్దకు వెడతారు. బస్సుల అవసరం ఉండదని ఆయన చెప్పారు. విద్యుత్‌ సౌకర్యం కోసం 1 మెగావాట్స్‌ సోలార్‌ ప్లాంట్‌లను 5 నెలలో నిర్మించగలమని, ఇప్పుడే అనుమతి వచ్చిందన్నారు. ఇక చెత్త, మురికి నీరు వృథా కాకుండా రీసైకిలింగ్‌ చేయడానికి 60 కేఎల్‌డీ ఎస్‌టీపీని నిర్మిస్తున్నామన్నారు. టాయిలెట్‌ నుంచి వచ్చిన మురికి నీటిని ఇక్కడ శుద్ధి చేసి దానిని గ్రీనరీకి ఉపయోగిస్తామని చెప్పారు. కొత్త టెర్మినల్‌ కూడా నిర్మిస్తున్నామని చెప్పారు.
Link to comment
Share on other sites

Rajahmundry airport to get bigger, better

https://www.thehindu.com/news/national/andhra-pradesh/g0f433/article26018714.ece/ALTERNATES/FREE_660/18VJRJYAIRPORT

Minor issues being sorted out at rapid pace, says director

In two months from now, Airbus and Boeing carriers will land and take off from the Rajahmundry airport as runway expansion works are nearing completion and the process for obtaining permission from the departments concerned is in progress.

Construction of the 10,540-foot-long runway has already been completed along with the construction of the compound wall, black pad, parking base and overlay of the airbase.

Once operations of the big carriers are commenced, the airport will be in a position to operate more flights to existing destinations such as Hyderabad, Chennai and Bengaluru, besides opening up for new routes such as Mumbai and Delhi. There is every likelihood of operating direct flights to the United Arab Emirates soon.

“On the work front, removal of trees and poles that may obstruct the movement of big carriers is yet to be done. The trees and poles in question have already been earmarked and revenue officials are expected to complete the work by month-end,” M. Raj Kishore, Director of the Rajahmundry Airport, told The Hindu.

Process is in progress to obtain safety clearance from the Bureau of Civil Aviation Security and the obstacle limitation survey has to be taken up to obtain the clearance once the trees and poles are removed.

“Work on the domestic cargo terminal has been completed, as we are planning to launch cargo operations along with the commencement of operations of the big carriers,” he said.

Bus bays

At present, turbo props such as ATR and Q400 are able to land and take off from the airport and the major airlines doesn’t have these 72-seater small carriers. As a result, very few services are available from Rajahmundry notwithstanding the increasing demand. “The runway expansion will solve this problem too. We can expect more and more services to domestic destinations, besides commencement of international services,” Mr. Raj Kishore explains.

To connect the airport with the rest of the city, bus bays have been built in the airport and APSRTC is expected to operate shuttle services between the airport and the bus station.

Link to comment
Share on other sites

21 minutes ago, katti said:

AP lo vunnananni airports inka aa state lo levu anukunta.. passengers kuda baane vuntunnaru

TN lo already epputnuncho 4 (Chennai, Tiruchi,Coimbatore, Madurai)international Airports run avtunnay..Budda Kerala lo kuda 4 international Airports...manam chala venakabadi unnam inka

Edited by Mahen_Nfan
Link to comment
Share on other sites

14 minutes ago, Mahen_Nfan said:

TN lo already epputnuncho 4 (Chennai, Tiruchi,Coimbatore, Madurai)international Airports run avtunnay..Budda Kerala lo kuda 4 international Airports...manam chala venakabadi unnam inka

we have 7 airports - Tirupati, Kurnool (from April), Kadapa, Puttaparthi, Vijayawada, Rajamahendrawaram, Vizag. 8th airport at Nellore is under construction.

We also have 3 international airports on paper. had central govt acted responsibly, we would have see international flights from Tirupati tooo

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...