Jump to content

Vizag (Araku Valley) Coffee


Recommended Posts

this is different.

ade anipisthundi bro.. AP lo dorike daniki, Paris lo market chese daniki sambandham ee ledu.. Don't know who is making all the profits. kashtam okadidi sukham vere vadidi kakunda unte ade chalu!

Link to comment
Share on other sites

ade anipisthundi bro.. AP lo dorike daniki, Paris lo market chese daniki sambandham ee ledu.. Don't know who is making all the profits. kashtam okadidi sukham vere vadidi kakunda unte ade chalu!

 

ofcourse, middle men makes many times more than the farmer/gatherers. My understanding is, even grown from same area, coffee can have totally different taste/aroma depending on when they were harvested, how many stages in roasting ...etc. it is an art to get the right mix. So, premium ones definitely go through lot of intricate details. and also add marketing costs for branding.

 

but as you said, people involved at the grass root must be benefited. 

Link to comment
Share on other sites

ofcourse, middle men makes many times more than the farmer/gatherers. My understanding is, even grown from same area, coffee can have totally different taste/aroma depending on when they were harvested, how many stages in roasting ...etc. it is an art to get the right mix. So, premium ones definitely go through lot of intricate details. and also add marketing costs for branding.

 

but as you said, people involved at the grass root must be benefited. 

brother, its a trend and has always been, to source raw materials from poorer countries and just add or refine things here and there to make profits that are multi-fold by others.

Link to comment
Share on other sites

  12sun-cover1a.jpg

క్రీస్తుశకం ఏడో శతాబ్దం.. ఇథియోపియాలోని కొండప్రాంతం. పచ్చగడ్డి మేస్తున్న గొర్రెలు ఒక్కొక్కటే మత్తుగా తలవాల్చేస్తున్నాయి. కాపరికి సందేహం వచ్చింది. చుట్టుపక్కల గాలించాడు. అతడి చూపులు పొదల్లోని ఓ మొక్క మీద ఆగాయి. అనుమానంగా ఓ గింజ తీసి నోట్లో వేసుకున్నాడు. భలేగా అనిపించింది. ఇంకొన్ని చప్పరించాడు. చిటికెడు మద్యం తాగినట్టు, కించిత్‌ మత్తు.

అవి, కాఫీ గింజలు!

ఆ రుచిని తొలిసారిగా అనుభవించిన గొర్రెలకాపరి ధన్యుడు!

* * *

నాలుగువందల సంవత్సరాల క్రితం.. బాబూ బుడాన్‌ అనే సూఫీ గురువు మక్కాయాత్రకు వెళ్లొస్తూ యెమన్‌ నుంచి ఏడు కాఫీ గింజలు తీసుకొచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిక్‌మగళూరు ప్రాంతంలో నాటాడు. అలా, తొలిసారిగా కాఫీ గింజలు మన మట్టిలో మొలిచాయి. ఆ ముదురు గోధుమరంగు విత్తనాలతో నేలపిల్ల పీకలోతు ప్రేమలో పడిపోయింది. కాఫీ పంట వేల ఎకరాలకు విస్తరించింది. భారతదేశం ఇప్పుడు నూట ఏడు దేశాలకు కాఫీని ఎగుమతి చేస్తోంది.

‘షుక్రియా... బుడాన్‌ జీ!

ప్రతి గింజ మీదా ఆ కాఫీ తాగే వ్యక్తి పేరు ఉంటుందంటారు. ఆ మాట నిజమైతే, అందుకు అనుమతిస్తూ మీ సంతకం ఉండటమూ నిజమే!’

* * *

12sun-cover1b.jpgవందేళ్ల నాటి మాట.

అప్పట్లో, విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అంతా పోడు సేద్యమే. దిగుబడి కూడా అంతంతమాత్రమే. గిరిజనులకు ఉపాధి మార్గం చూపాలన్న ఆలోచనతో బ్రిటిష్‌ అధికారులు కాఫీ పంటను ప్రోత్సహించారు. మట్టి మహత్యమేమో, పంట విరగబండింది. నీటి స్వభావమేమో, రుచీ అద్భుతమే. తెల్లదొరలైతే ఆ కమ్మదనాన్ని మరువలేకపోయారు. సెలవులకు వెళ్తున్నప్పుడు కూడా, కాఫీ గింజల్ని మూటగట్టి ఓడలకు ఎక్కించారు. ఆరోజుల్లో... యూరప్‌లోని సంపన్న కుటుంబాలకు పొద్దున్నే కప్పు నిండా అరకు కాఫీని ఆస్వాదించడం ఓ అలవాటు, అదో ఉత్తమాభిరుచి కింద లెక్క. మధ్యలో కొంతకాలం, చల్లారిపోయిన కాఫీలా అరకు పేరు మూలనపడిపోయింది. మళ్లీ ఇప్పుడు, పునర్వైభవం మొదలైంది. ‘అరకు కాఫీ’ దుకాణం ఇటీవలే పారిస్‌ పురవీధుల్లో ప్రారంభమైంది. అత్తరునగరానికి అలా సరికొత్త కాఫీ రుచి పరిచయమైంది.

ఫలానా వాళ్లింట్లో నందివర్ధనం చెట్టుంది - ఇదో ప్రత్యేకత! ఫలానా వాళ్లది డాబా ఇల్లు - ఇదీ ఓ ప్రత్యేకతే! ఫలానా వాళ్లింట్లో కాఫీ బావుంటుంది - ఇదైతే ఓ ప్రత్యేకతా, గుర్తింపూ, గౌరవమూ, హోదా అన్నీ! ఆ ఆశతోనే అతిథులు తెల్లారేసరికి గడప ముందు వాలిపోతారు. స్నేహితులైతే, మాంచి కాఫీ కోసం మొహం వాచిన ప్రతిసారీ, ‘నిన్ను చూడాలనిపించి వచ్చామంటూ’... కాఫీమజిలీ కబుర్లు వినిపిస్తారు.

అవే పాలు, అదే పొడి, అంతే చక్కెర. కానీ, కొన్ని ఇళ్లలో అమృతాన్ని తలపిస్తుంది. కొన్ని కొంపల్లో కషాయాన్ని గుర్తుచేస్తుంది. అంతా, ఆ ఇల్లాలి చేతి మహత్తని అనుకోవాలి. ఇంతే ప్రత్యేకత, ఏ ఉత్పత్తికో ఉంటే - ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌’ (జీయీ) వీరతాడు తగిలిస్తారు. అరకు కాఫీ మెడలో ఆ వరమాల ఎప్పుడో పడింది. ఓమోస్తరుగా, తిరుపతి లడ్డూకు సమానమైన హోదా అది.

మన్నెంలో మొనగాడు....

విశాఖ ఏజెన్సీలో, 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక... జైపూర్‌ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర అటవీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో రాఘవేంద్రరావు అనే అధికారి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాలు కాఫీ పంటకు అనుకూలమంటూ ప్రభుత్వానికి నివేదిక పంపింది ఆయనే. ఆ జాబితాలో అరకు కూడా ఉంది. ఆతర్వాతే, సర్కారూ ఇటువైపు దృష్టిపెట్టింది. ఆయన పేరు మీదే, చింతపల్లిలోని ఎస్టేట్‌కు ఆర్‌వీనగర్‌ కాఫీ ఎస్టేటుగా పేరొచ్చింది. స్వాతంత్య్రం తర్వాత రాష్ట్ర అటవీశాఖ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాఫీబోర్డుతో కలసి కాఫీ సాగును ప్రోత్సహించే ప్రయత్నం మొదలుపెట్టింది. 1960లో అనంతగిరి, మినుములూరు ప్రాంతాల్లో నాలుగు వేల హెక్టార్లలో కాఫీ సాగును చేపట్టింది. మెల్లమెల్లగా పంట పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాలకూ పరిచయమైంది. 1986లో కాఫీబోర్డు, గిరిజన సహకార సంస్థ సంయుక్తంగా తోటల విస్తరణకు నడుంబిగించాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో... కాఫీబోర్డు అధీనంలోని తోటల్ని గిరిజన రైతులకు రెండేసి ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. అప్పట్లో, అదో సంచలనం!

12sun-cover1c.jpg

‘నాంది’ ప్రస్థానం...

మొత్తానికి... గిరిజనానికి కాఫీ గింజల్ని పండించడమంటూ తెలిసింది కానీ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద మాత్రం పెద్దగా అవగాహన రాలేదు. దీంతో గింజ నాణ్యత దెబ్బతింది. దిగుబడి తగ్గింది. రాబడి నామమాత్రమైంది. రైతు కుదేలైపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే నాంది ఫౌండేషన్‌ ఆ ప్రాంతంలో కాలుపెట్టింది. విద్య, జీవనోపాధి - ఆ స్వచ్ఛంద సంస్థ జంట లక్ష్యాలు. చిన్న, సన్నకారు గిరిజన రైతుల పరస్పర సహకార సంఘం ద్వారా... ఆరువందల గ్రామాల్లోని పదకొండు వేలమంది రైతుల్ని ఓ ఛత్రం కిందికి తీసుకొచ్చింది. ఆ సమైక్యశక్తి ముందు దళారుల పప్పులు ఉడకలేదు. లోయ పచ్చగా ఉంటేనే, కాఫీ రైతుల జీవితం వెచ్చగా సాగిపోతుంది. పంటల కోసం హద్దూ అదుపూ లేకుండా వాడే క్రిమిసంహారకాలు ప్రకృతిని వికృతంగా మార్చే ప్రమాదం ఉందని నాంది పసిగట్టింది. పరిష్కారంగా సేంద్రియ సేద్యాన్ని గిరిజనుల ముందుంచింది. రైతు రైతుగానే కాకుండా, ఓ వ్యాపారిలా ఆలోచించాలి. అప్పుడే, నాలుగు రాళ్లు వెనకేసుకోగలడు. ఆ ఆలోచనతోనే నాంది గిరిపుత్రులకు మార్కెటింగ్‌ పాఠాలు బోధించింది. కొత్త రకాల్ని పరిచయం చేసింది. కాఫీ పంటని ఒక్కోలా సాగుచేస్తే ఒక్కో రుచి వస్తుంది. కొన్నిజాతుల్ని పెద్దపెద్ద చెట్ల నీడలో పెంచితే, ఆ విత్తనాలకో ప్రత్యేకమైన పరిమళం అబ్బుతుంది. ఇలాంటి అనేక చిట్కాల్ని గిరిజనుల దాకా తీసుకెళ్లింది. అరకు తనకంటూ ఓ బ్రాండ్‌ నిర్మించుకోడానికి పరిపూర్ణ సహకారం అందించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో, అనంతగిరి నుంచి కొయ్యూరు వరకూ మొత్తం పదకొండు మండలాల్లో... 1.52 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారిప్పుడు. మొత్తంగా, ఏడువేల టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతోంది.

12sun-cover1d.jpg

అరకు కాఫీ ప్రత్యేకత అరకు కాఫీదే. రసాయనాల జాడే ఉండదు. ఇప్పటికే అరకు ప్రాంతంలో... ‘నాంది’ ఆధ్వర్యంలోని పరస్పర సహకార సంస్థ (మ్యాక్స్‌) ద్వారా సుమారు 600 మంది రైతులు తమ కాఫీ తోటలకు ‘సేంద్రియ ధ్రువీకరణ’ పొందారు. మన్నెంలోని మిగతా ప్రాంతాల గిరిజనులూ ఇదే బాటలో నడుస్తున్నారు. పాడేరు ఐటీడీఏ వీరి పొలాలకు కూడా ధ్రువీకరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు ప్రాంతాల్లో రైతులు అరబికా కాఫీని పండిస్తుండగా... చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో ఇతర రకాల్ని సాగుచేస్తున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోళ్లను చేపట్టింది. రైతుల నుంచి కొన్న గింజల్ని అంతర్జాతీయ మార్కెట్‌లో బహిరంగ వేలం వేసి, ఆ సొమ్మును బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు చెల్లించే పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఇటలీ, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌ వ్యాపారులు అరకు కాఫీని వేలంపాటలో పోటీపడి కొంటున్నారు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో చిల్లర దుకాణాల్లో నేరుగా ఇన్‌స్టంట్‌ కాఫీని విక్రయిస్తున్నారు. రాబోయే పదేళ్ల కాలానికి... విశాఖ అటవీ ప్రాంతంలో రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టును చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

12sun-cover1e.jpg

‘ఛాయ్‌వాలా’ మెచ్చిన కాఫీ...

ప్రధాని మోదీజీ కూడా అరకు కాఫీ అభిమానే! ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా, ఓ కప్పు రుచి చూడందే వెళ్లరు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ‘నేను అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటాను’ అని స్వచ్ఛందంగా ప్రకటించారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అయితే, అరకు కాఫీ స్టాల్‌ దగ్గరే అంతర్జాతీయ అతిథులంతా పోగైపోయేవారు. ‘కాఫీ పే’ చర్చలన్నీ ఆ కమ్మదనాన్ని ఆస్వాదిస్తూనే. ‘ఇంత రుచికరమైన కాఫీ నేనెప్పుడూ తాగలేదు’ అంటూ కప్పు మీద కప్పు లాగించేశారు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బార్బియర్‌. ‘ఇలాంటి స్ట్రాంగ్‌ కాఫీ కోసమే ఇన్నేళ్లుగా వెదుకుతున్నా. నా అన్వేషణ ఫలించింది’ అని మురిసిపోయారు అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ సుసాన్‌. అరకులో కాఫీ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ, మూడొందల రకాల కాఫీ చాక్లెట్లను రుచిచూడవచ్చు. కాఫీతో తయారు చేసిన కేకులూ, పిజ్జాలూ, బర్గర్లూ అందుబాటులో ఉంటాయి. విశాఖ ఏజెన్సీలో పండుతున్న ‘అరబికా’ కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు ‘ఫైన్‌ కప్‌ ఆఫ్‌ కాఫీ’ అవార్డును సొంతం చేసుకుంది.

12sun-cover1f.jpg

జీవితాలు మారుతున్నాయి..

పాడేరు ప్రాంతంలో, కాఫీ గింజలు అనేక జీవితాల్ని మారుస్తున్నాయి. ఒకప్పుడు పూట గడవడానికే కష్టంగా ఉన్న కుటుంబాలు... కార్లలో తిరుగుతున్నాయి. పూరిళ్లు మేడల అవతారం ఎత్తేస్తున్నాయి. ఒక్క మోదాపల్లి గ్రామంలోనే యాభై అయిదు కుటుంబాలు దారిద్య్రరేఖను దాటేశాయి. రైతులు వరి, సామలు, మొక్కజొన్న తదితర సంప్రదాయ పంటల్ని పండిస్తుంటారు. ఏడాదంతా కష్టపడినా ఎకరానికి నాలుగైదు వేలు మిగిలినా గగనమే. ఆ కాస్త సంపాదనతో ఏ రైతు అయినా ఎలా బతుకుతాడూ, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడూ! కాఫీ పుణ్యమాని గిరిజనుల బతుకులు సాఫీగా సాగుతున్నాయిప్పుడు. మూడో సంవత్సరం నుంచే పంట మొదలైపోతుంది. ఇక, నలభై ఏళ్ల వరకూ నిశ్చింత! రకాన్ని బట్టి, ఎకరాకు నలభైవేల నుంచి యాభైవేల దాకా ఆదాయం వస్తుంది. మిరియాలు, మామిడి, నేరేడు మొదలైన అంతర పంటల ద్వారా వచ్చే రాబడి అదనం. ఆమధ్య, హుద్‌హుద్‌ తుపాను బీభత్సం కాఫీ రైతుల్నీ కష్టాలపాలు చేసింది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆ నష్టాల నుంచి తొందరగానే కోలుకున్నారు.

12sun-cover1g.jpg

మోదాపల్లి రైతు రాజారత్నం కాఫీ ద్వారా ఏటా రూ.4 లక్షల ఆదాయం కళ్లజూస్తున్నాడు. అంతర పంటగా మిరియాలు సాగు చేసి, మరో లక్షన్నర సంపాదిస్తున్నాడు. చక్కని ఇల్లు కట్టుకున్నాడు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాడు. ఎర్రగుప్ప గ్రామానికి చెందిన తరడా అప్పలమ్మ పదేళ్ల క్రితం... పది రూపాయల కూలీ కోసం రోజంతా కష్టపడేది. ప్రభుత్వం కాఫీ సాగు నిమిత్తం ఆరెకరాలు కేటాయించడంతో దరిద్రమంతా వదిలిపోయింది. ఏటా రెండు లక్షల రూపాయల వరకూ ఆదాయం వస్తోంది. ఆమె కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. గిరిజనుల్లో కృతజ్ఞతాభావం ఎక్కువ. తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కాఫీసాగును కూడా అమ్మతల్లి పూజంత శ్రద్ధగా చేస్తారు.

అంతర్జాతీయం...

అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దాలన్న తొలి ఆలోచన రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు అంజిరెడ్డిది. ఆయన చొరవతోనే మిగతా దిగ్గజాలూ ఇటువైపు వచ్చారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు క్రిష్‌ గోపాలకృష్ణన్‌, సోమా ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ మాగంటి రాజేంద్రప్రసాద్‌, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి... ఈ నలుగురూ అరకు కాఫీ వీరాభిమానులే. ఆ రుచీ పరిమళమూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాకూడదని బలంగా విశ్వసించేవారే. ఆ అభిమానంతోనే అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. ‘భవిష్యత్తులో దాతృత్వానికి అర్థం మారబోతోంది. చేపను ఇస్తే ఓ పూట కడుపునింపగలం. చేపనుపట్టే గాలం ఇస్తే ఓ జీవితకాలం బతకడం నేర్పగలం - వగైరా సూక్తులకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. అదే ఓ వ్యాపార వ్యవస్థను నిర్మించడం ద్వారా ఏకకాలంలో వందల జీవితాల్నీ వేల జీవితాల్నీ మార్చగలం. అలాంటి ప్రయోగమే ఇక్కడ జరుగుతోంది’ అంటారు ఆనంద్‌ మహీంద్రా. అలా అని, ఒక్క పారిస్‌కే పరిమితం కావడం లక్ష్యం కాదు. న్యూయార్క్‌, టోకియో, స్విట్జర్లాండ్‌లలోనూ అరకు కాఫీ అడుగుపెట్టబోతోంది. కొలంబియన్‌, సుమత్రా తదితర ప్రసిద్ధ కాఫీ రుచులు గట్టిపోటీని ఎదుర్కోడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రపంచంలో కాఫీ అలవాటు ఉన్న ప్రతి దేశంలోనూ జెండా ఎగరేయాలన్నది ‘అరకు కాఫీ’ ఆలోచన. దేశీయంగానూ మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఇప్పటిదాకా కొడగు, చిక్‌మగళూరు లాంటి ప్రాంతాలే కాఫీకి పేరెన్నికగన్నాయి. ‘అరకు’ అడుగుపెట్టడంతో ఒకట్రెండు సంస్థల ఆధిపత్యానికి కూడా కాలం చెల్లినట్టే.

వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతగానే ‘ప్రాజెక్ట్‌ అరకు’ను భుజానికి ఎత్తుకున్నారు. దీని ద్వారా వచ్చిన లాభాన్నంతా విస్తరణకే వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మొత్తం ఐదు రకాల అరకు కాఫీలు అందుబాటులో ఉంటాయి. అందులో ఓరకం ధర కిలోకు - ఏడు వేలు! వైన్‌ తయారీలో ఉపయోగించే టెక్నాలజీనే ఇక్కడా అనుసరిస్తారు. దీంతో నాణ్యత తిరుగులేని విధంగా ఉంటుంది. అరకు మట్టికో గొప్పదనం ఉంది. ఆ కారణంగానే, ఇదీ అని చెప్పలేని ఓ కొత్త పరిమళం కాఫీలో గుబాళిస్తుంది. ఆ ప్రత్యేకతనే యూఎస్‌పీ (యునీక్‌ సెల్లింగ్‌ ప్రపోజిషన్‌)గా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్లాలన్నది ఆలోచన.

గిరిపుత్రుల శ్రమ..  దిగ్గజాల మద్దతు.. చక్కని మార్కెట్‌ వ్యూహం.. రంగు, రుచి, చిక్కదనం- లాంటి ఈ మూడు ప్రత్యేకతలూ ‘అరకు కాఫీ’ని అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలబెట్టడం ఖాయం. మంచి కాఫీ లాంటి పరిణామమిది!

- యద్దనపూడి ఛత్రపతి

సహకారం: గురునాథ్‌, అనిల్‌

ఫొటోలు: గోపి

వధువు చేతి కాఫీ... ఎంత అందంగా అయినా ఉండవచ్చు, ఎన్ని ఆస్తిపాస్తులకైనా వారసురాలు కావచ్చు. కాఫీ పెట్టడం రాకపోతే మాత్రం కష్టమే. టర్కీలో... కాఫీ కలపడం తెలియని అమ్మాయికి కొత్త కుటుంబంలో కలసిపోయే స్వభావమూ ఉండదని బలంగా నమ్ముతారు. ఫలానా అబ్బాయికి ఫలానా అమ్మాయి సరిపోతుందా, లేదా అన్నది నిర్ణయించే ముందు - అమ్మాయిని కాఫీ పెట్టి తీసుకురమ్మంటారు. ఆ రుచిని బట్టే దాంపత్య జీవితాన్నీ వూహిస్తారు. పెళ్లి తర్వాత కూడా, ‘మా ఆవిడ చేతి కాఫీ పరమచండాలంగా ఉంటోంది...’ అన్న ఫిర్యాదుతో కోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉందక్కడ. యాక్‌... ఎంతోరుచి! కొన్ని అంతే! తలుచుకుంటేనే డోకు వచ్చేస్తుంది. వూహించుకుంటేనే కంపరం పుట్టేస్తుంది. కానీ, ఒక్కసారి రుచి చూడగానే అపోహలన్నీ తొలగిపోతాయి. గతం గురించి ఆలోచించకుండా, వర్తమానాన్ని ఆస్వాదించేస్తాం, అప్రయత్నంగానే ‘ఆహా...’ అనేస్తాం! ఇండొనేషియాలో షివిట్‌ జాతికి చెందిన పిల్లికి కడుపునిండా కాఫీ గింజలు తినిపిస్తారు. గింజల్ని అది శుభ్రంగా జీర్ణించుకుని, మలరూపంలో విసర్జించాక ... ఆ వ్యర్థాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆరుబయట ఎండబెడతారు. దాంతో కాఫీపొడి తయారు చేసుకుంటారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కాఫీ రుచుల్లో ఇదొకటి. పంచాయతీ! మత్తునిస్తుంది, గమ్మత్తుగా ఉంటుంది! ఆ పానీయాన్ని తాగాలా, వద్దా? తాగితే పుణ్యమా, పాపమా? - అన్న కోణం లోంచి అప్పట్లో చాలా చర్చే జరిగింది. చివరికి ఆ పంచాయతీ పోప్‌గారి దగ్గరికి వెళ్లింది. ఎంత గొప్ప తీర్పరి అయినా, పైపై వాదనలతో ఓ నిర్ణయానికెలా వస్తారు? సేవకులు ఓ కప్పులో వేడివేడి కాఫీ తీసుకొచ్చారు. నాలుక మీద పడగానే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న అనుభూతి కలిగిందా పెద్దాయనకు. ‘నిస్సందేహంగా ఇది గౌరవనీయుల పానీయమే...’ అని తీర్పు ఇచ్చేశారు. అలా, కాఫీ వాటికన్‌లో కాలుపెట్టింది. అందం+ఆనందం+ఆరోగ్యం కాఫీపొడి చక్కని సౌందర్య సాధనం కూడా. పొడిచర్మంతో బాధపడేవారు రెండు చెంచాల డికాక్షన్‌లో కాస్తంత ఆలివ్‌నూనె కలిపి మర్దనా చేసుకుంటే, మంచి నిగారింపు వస్తుందని అంటారు. డికాక్షన్‌లో ఓట్స్‌, తేనె కలిపి పూసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. పాలూ నెయ్యీ కలిపి పూసుకుంటే ఒంటికి పేరుకుపోయిన చెత్తంతా వదిలిపోతుంది. బ్లాక్‌ కాఫీ బరువును తగ్గిస్తుందన్న ప్రచారమూ ఉంది. కాఫీ వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యల్ని దూరం చేస్తుందని కొన్ని అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. ‘కాఫీ’ప్రెన్యూర్స్‌! కాఫీని నమ్మినవాళ్లు ఎన్నటికీ చెడిపోరు. ఆ రెండక్షరాల మీద విశ్వాసంతోనే ‘కాఫీ డే’ కోట్ల రూపాయల వ్యాపారమై కూర్చుంది. పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి పన్నెండు వందల కోట్ల రూపాయలు సమీకరించుకుంది. అంకుర్‌గుప్తా, రోనక్‌కా పటేల్‌ అనే కుర్రాళ్లు ‘బ్రూ బెర్రీస్‌’ పేరుతో ప్రారంభించిన కాఫీ వ్యాపారం దాదాపు రెండొందల యాభై అవుట్‌లెట్లకు విస్తరించింది. ‘భారతీయులు కాఫీ అంటే ప్రాణమిస్తారు. కమ్మని కాఫీ దొరుకుతుందంటే, ఎంత దూరమైనా వచ్చేస్తారు. ధర గురించి అస్సలు ఆలోచించరు’ అంటారా మిత్రులు. కాఫీ సాగును పర్యావరణంతో ముడిపెట్టింది అర్షియా అనే యువతి. ఈ సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో కాఫీపంటను సాగుచేసే పద్ధతిని ప్రచారం చేస్తోంది. అర్షియా తన బ్రాండ్‌కు పెట్టుకున్న పేరు - ‘బ్లాక్‌ బజా కాఫీ’. కాఫీ తోటల్లో కనిపించే ఓ రకమైన పక్షి పేరు బ్లాక్‌ బజా. స్ఫూర్తి ఖండాంతరాలకు... అరకులో చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వస్తున్న మార్పులు ప్రపంచం దృష్టినీ ఆకర్షించాయి. అందులోనూ, నాంది ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు నెల్సన్‌ మండేలా మంత్రివర్గంలో పనిచేసిన జేనాయుడును చాలా ప్రభావితం చేశాయి. నాయుడి జేజమ్మ తెలుగువారే. తరాలక్రితం ఆమె కుటుంబం దక్షిణాఫ్రికాకు తరలివెళ్లింది. అరకు విజయాన్ని ఆయన అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, దక్షిణాఫ్రికాలో మరో అరకు ఉద్యమం మొదలైంది. కాఫీతో పాటూ ఇతర పంటలూ పండిస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
 

Araku Paris now a hot spot. After the visit of @nsitharaman the store saw Nobel laureate Muhammad Yunus & French actress Mareva Galanter.

 

DB5bZTDWAAEKFUx.jpg

DB5bZTDW0AAOe4S.jpg

 

33d9gS-h_bigger.jpg Nirmala SitharamanVerified account @nsitharaman

 
Replying to @anandmahindra

 

Impressive branding. Appreciate the effort you've put in. Spirited, motivated team running the place. @arakucoffee #Paris @CoffeeboardI

Link to comment
Share on other sites

Replying to @anandmahindra

 

Impressive branding. Appreciate the effort you've put in. Spirited, motivated team running the place. @arakucoffee #Paris @CoffeeboardI

anand mahindra Retweeted Nirmala Sitharaman

 

Thank you Minister. The goal is to build a global,premium brand that uplifts underprivileged farmers.The reward will be Pride, not Paisa

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

Araku coffee franchises ivvabotunaru AP lo starting with VIzag.

 

Araku coffee ki 2003 lo CBN planned to create brand....He shared this with AP entrepreneurs and Anji reddy came forward.

Now it became international brand again...

 

 

 

http://www.thehindu.com/news/national/andhra-pradesh/araku-coffee-to-spread-its-aroma-in-vizag/article19653051.ece

Link to comment
Share on other sites

  • 2 weeks later...

మన్యం కాఫీ గుబాళింపు

అంతర్జాతీయ విపణిలో అరకు ఖ్యాతి విస్తరణ

అనంతగిరి ఏపీఎఫ్‌డీసీకి ‘బెస్ట్‌ అరబిక కాఫీ ఆఫ్‌ అరకువ్యాలీ’ పురస్కారం

గూడెంకొత్తవీధి రైతు బాలయ్యకు గుర్తింపు

పాడేరు, అనంతగిరి, న్యూస్‌టుడే

vsp-sty2a.jpg

కాఫీ నాణ్యత, రుచిలో మరోమారు గుబాళించింది. 2017 సంవత్సరానికి ‘ఫ్లవర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫైన్‌ కప్‌’ పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ‘ఫ్లవర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫైన్‌ కప్‌’ విభాగంలో అనంతగిరి ఏపీఎఫ్‌డీసీ ఎస్టేట్‌కు ‘బెస్ట్‌ అరబిక ఆఫ్‌ అరకువ్యాలీ రీజియన్‌’ పురస్కారం లభించింది.

గతంలో పది పర్యాయాలు అరకువ్యాలీ రీజియన్‌ కాఫీకి ఈ పురస్కారం దక్కగా ఈ ఏడాది గూడెంకొత్తవీధి మండలానికి చెందిన రైతు బాలయ్య కాఫీ సాగు, మార్కెటింగ్‌లో ఉత్తమ రైతుగా ఎంపికయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎంపిక కమిటీ నిర్ధారించే ఈ పురస్కారం తరచూ దక్కించుకోవడంతో మన్యం కాఫీ మార్కెటింగ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. తాజాగా అనంతగిరి ఏపీఎఫ్‌డీసీకి దక్కిన పురస్కారం కాఫీ రైతుల్లో మరింత సంతోషాన్ని నింపింది.

కాఫీ సాగులో ఏపీఎఫ్‌డీసీ

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు (ఏపీఎఫ్‌డీసీ) కాఫీ సాగు, విస్తరణలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవముంది. మన్యంలోని 11 మండలాల్లో మినుములూరు, చింతపల్లి, పెదబయలు, అనంతగిరి ఏస్టెట్‌లలో సుమారు 4 వేలకు పైగా ఎకరాల్లో కాఫీ సాగు చేస్తోంది. ఏటా 800 నుంచి 900 టన్నుల వరకు దిగుబడి సాధిస్తోంది. మన్యం వ్యాప్తంగా 10 వేల టన్నులు ఉత్పతి అవుతుంటే ఏపీఎఫ్‌డీసీ ద్వారా 800 టన్నుల వరకు కాఫీ దిగుబడులు వస్తున్నాయి. బెస్ట్‌ అరబిక కాఫీ పురస్కారానికి ఎంపికైన అనంతగిరి ఎస్టేట్‌ పరిధిలో 140.20 హెక్టార్ల మేర కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. సొంపి, సుంకరమెట్ట, అనంతగిరి ప్రాంతాల్లో ఎస్టేట్‌ విస్తరించింది. ఇటీవల మావోయిస్టుల ప్రభావంతో ఏపీఎఫ్‌డీసీ వన్నె కొంత మేర తగ్గినా.. ఉత్పత్తి అయిన పంటను నర్సీపట్నం తరలించి అక్కడే గింజలను శుద్ధి చేస్తున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచి దేశీయంగా జరుగుతున్న మార్కెటింగ్‌ ద్వారా విక్రయిస్తున్నారు.

పురస్కారాల పంట

మన్యంలో పండుతున్న కాఫీ ఏటా దేశీయంగా ప్రకటిస్తున్న ఫ్లవర్‌ ఆఫ్‌ ఇండియా ఫైన్‌ కఫ్‌ పురస్కార ఎంపికకు వెళ్తొంది. స్థానిక రైతులు, ఏపీఎఫ్‌డీసీ పండించిన కాఫీ నమూనాలను సేకరించి ఏటా పురస్కారాలు ప్రకటించే నాలుగు నెలల మందు బెంగళూర్‌కు పంపుతారు. సేకరించిన నమూనాలను శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించిన కాఫీకి ‘ఫ్లవర్‌ ఆఫ్‌ ఇండియా ఫైన్‌ కప్‌’కు ఎంపిక చేస్తారు. 2003 నుంచి అరకు వ్యాలీ రీజియన్‌గా గుర్తింపు పొందిన మన్యం కాఫీకి పదిసార్లు ఈ పురస్కారం లభించింది. ఏపీఎఫ్‌డీసీ ద్వారా సేకరించిన నమూనాలకు ఎక్కువ శాతం పురస్కారాలు దక్కుతున్నాయి. మినుములూరు, పెదబయలు ఎస్టేట్‌లకుమూడుసార్లు అవార్డులు దక్కాయి. తాజాగా అనంతగిరి ఎస్టేట్‌ బెస్టు అరబిక ఆఫ్‌ అరకువ్యాలీగా ఎంపికైంది. ఉత్తమ రైతులుగా లంబసింగి, గొందిపాకలు గ్రామాలకు చెందిన రాములమ్మ, అనసూయ, ఈ ఏడాది గూడెంకొత్తవీధికి చెందిన బాలయ్య ఎంపికయ్యారు.

హుద్‌హుద్‌ను తట్టుకుని..

నాలుగేళ్ల కిందట సంభవించిన హుద్‌హుద్‌ ప్రళయాన్ని తట్టుకొని అనంతగిరి ఎస్టేట్‌లో కాఫీ సాగును విస్తరించగలిగాం. ఎప్పటికప్పుడు తోటలను పర్యవేక్షిస్తూ సేంద్రియ సాగు ద్వారా నాణ్యతలో రాజీ లేకుండా విస్తరించాం. బెస్ట్‌ అరబిక కాఫీగా పురస్కారాన్ని అందుకోవడం బాధ్యతను మరింత పెంచింది. ఇదే స్ఫూర్తితో సంస్థ సాగు విస్తరణకు చర్యలు చేపడతాం.

- బాబూరావు, రేంజర్‌, ఏపీఎఫ్‌డీసీ, అనంతగిరి ఎస్టేట్‌

రైతుల సహకారంతో..

మన్యంలో కాఫీ అభివృద్ధికి రైతులు సహకరిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ సాగు పద్ధతులను అవలంబిస్తూ.. దిగుబడులు సాధిస్తుండటంతో ఏజెన్సీలో ఉత్పత్తి అవుతున్న కాఫీ గింజలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ ఏడాది ఏపీఎఫ్‌డీసీకే కాకుండా గిరిజన రైతుకూ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది.

- రమేష్‌, ఇన్‌ఛార్జి డీడీ, కేంద్ర కాఫీ బోర్డు
Link to comment
Share on other sites

Guest Urban Legend

i think girijan coffee beans nd powder is available at girijan stores in ur cities

ippudu outlets kuda start chesara.. nice.

 

rich exotic araku coffee is exported

ah price mana valla kaadhu

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 1 month later...
గగనంలో ఘుమఘుమ..!
28-01-2018 00:42:36
 
636526969605460328.jpg
  • స్పైస్‌జెట్‌ విమానాల్లో అరకు కాఫీ
  • టూరిజం శాఖతో ఒప్పందం
విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకొంటున్నాయి. ఇప్పటివరకు గిరిజనులు పండించిన అరకు కాఫీని ప్రమోట్‌ చేయడానికి ప్రధాన సదస్సులు, సమావేశాలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నేరుగా ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌తోనే ఒప్పందం చేసుకున్నారు. ఏపీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగే 36 స్పైస్‌జెట్‌ విమానాల్లో ప్రతి ప్రయాణికునికి అరకు కాఫీని అందించే ఏర్పాటు చేశారు.
 
 
ప్రతి స్పైస్‌ జెట్‌ విమానంలో డ్రా తీసి ప్రయాణికులకు ప్రతి రోజూ రెండు కూపన్లు అందజేస్తారు. వాటిని గెలుచుకున్నవారికి రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ చూపిస్తుంది. అరకు కాఫీకి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడంతో పాటు, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఈ చర్యలు చేపట్టామని అరకు కాఫీని మార్కెటింగ్‌ చేస్తున్న గిరిజన సహకార సంఘం (జీసీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిప్రకాశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, సోమవారం అరకు ఇన్‌స్టెంట్‌ కాఫీని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Link to comment
Share on other sites

అరకు కాఫీ రుచి చూడండి
30-01-2018 01:16:55

గిరిజనులను ఆదుకోండి
మంత్రి నక్కా ఆనందబాబు పిలుపు
రోజూ రుచిచూస్తా: మంత్రి జవహర్‌
2, 10 గ్రాముల ప్యాకెట్లు విడుదల
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అరకులోయ ఇన్‌స్టంట్‌ కాఫీ రుచి చూసి.. ఆస్వాదించి గిరిజనులను ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపిచ్చారు. సోమవారం సచివాలయంలో ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌తో కలిసి ఆయన అరకు వ్యాలీ ఇన్‌స్టంట్‌ కాఫీ 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ.. గిరిజనుల ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్‌ చేయించి, మార్కెటింగ్‌ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ(జీసీసీ) విధి అని వివరించారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90కోట్ల టర్నోవర్‌ ఉన్న జీసీసీ వ్యాపారం ఇప్పుడు రూ.247 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జవహర్‌ మాట్లాడుతూ.. అరకు కాఫీ రుచిని చంద్రబాబు ప్రపంచానికి పరిచయం చేశారన్నారు.
గిరిజన కుటుంబాలు నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇన్‌స్టంట్‌ కాఫీ రుచి చూశానని.. బాగుందని.. ఇక తాను రోజూ ఈ కాఫీనే తాగుతానని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, జీసీసీ ఎండీ రవిప్రకాశ్‌, సాంఘిక సంక్షేమ కమిషనర్‌ రామారావు, వేహాన్‌ కాఫీ సంస్థ యజమాని శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
 
రైతులకు సకాలంలో రుణాలు
సహకార సంస్థల ద్వారా రైతులకు మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సహకార సంస్థల పటిష్ఠతకు పాలకవర్గాలు కృషి చేయాలని, రైతులకు సకాలంలో రుణాలివ్వాలని సూచించారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచి రామారావు, 13 జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్లు సోమవారం సాయంత్రం సచివాలయంలో ఆయన్ను కలిశారు. సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసినందుకు సీఎంను సత్కరించారు. మూడంచెల సహకార సంస్థల పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Link to comment
Share on other sites

మైమరచి 
అరకు ఇన్‌స్టెంట్‌ మార్కెట్లో 
గిరిజన సహకార సమాఖ్య ద్వారా అరకు వ్యాలీ ‘ఇన్‌స్టెంట్‌ కాఫీ’ 
మంత్రులు ఆనందబాబు, జవహర్‌ల ఆవిష్కరణ 
2 గ్రా, 10 గ్రా సాచెట్లలో లభ్యం 

ఈనాడు, అమరావతి: అరకు వ్యాలీ కాఫీ పొడి ఇక ఇన్‌స్టెంట్‌ కాఫీగా మార్కెట్‌లో లభిస్తుంది. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ) ఈ మేరకు సాచెట్లు తయారు చేసి సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎక్సయిజ్‌ శాఖ మంత్రి కె.జవహర్‌లు సోమవారం సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. అరకులో ప్రసిద్ధి చెందిన కాఫీని గిరిజనులు 3లక్షల ఎకరాలలో పండిస్తున్నారు.
ప్రధాని వహ్‌వా అన్నారు..: ఈ కాఫీ పొడిని చంద్రబాబు కొన్ని జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లోను పరిచయం చేశారని, ప్రధాని మోదీతోను తాగించి భేష్‌ అనిపించారని గిరిజనకార్పొరేషన్‌ ఎండీ రవిప్రకాష్‌ చెప్పారు. ఈ కాఫీతో ఫిల్టర్‌ ద్వారా కాఫీ తాగే వెసులుబాటు ఉండేదని, చాలా మంది ఇన్‌స్టెంట్‌ కాఫీని సరఫరా చేయాలని సూచించడంతో ప్రయివేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇలా సాచెట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈ సాచెట్లు 2 గ్రా, 10 గ్రాముల ప్యాకెట్లలో లభ్యమవుతాయన్నారు. వీటిని కొనుగోలు చేస్తే గిరిజనులకు మేలు చేసినవారవుతారని చెప్పారు.

2 ఏళ్లలో రూ.500 కోట్లకు వ్యాపారం విస్తరణ: మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లకు జీసీసీ వ్యాపారం పెరగనుందన్నారు. 10 సంవత్సరాల్లో రూ.526 కోట్లతో కాఫీ సాగును విస్తరింపజేసే ప్రాజెక్టు అమలు చేయనున్నామన్నారు. జీసీసీయే గిరిజన రైతులనుంచి కాఫీ సేకరించి శుద్ధి చేసి, అమ్మి ఆ సొమ్ము గిరిజనులకు అందించే బృహత్తర కార్యక్రమం జీసీసీ ప్రారంభించిందన్నారు. ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాంఘిక సంక్షేమశాఖ సంచాలకుడు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

అరకు కాఫీతో స్టార్టప్‌ వెంచర్‌
 

  •  మార్చి నుంచి రిటైల్‌ అమ్మకాలు ప్రారంభం
  •  క్రిష్‌ ఫుడ్‌ అండ్‌ ఫన్‌ ఎండి ఎస్‌ కృష్ణ చైతన్య వెల్లడి
కాకినాడ/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): అరకు కాఫీ ఘుమఘుమలతో వ్యాపారం చేసేందుకు ఒక స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా క్రిష్‌ ఫుడ్‌ అండ్‌ ఫన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ ఇప్పుడు తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాలో విడుదల చేసిన ‘అరకు అరోమా’ బ్రాండ్‌ కాఫీని దేశీయ మార్కెట్లోనూ విడుదల చేస్తోంది. ఈ నెల నుంచి ఆన్‌లైన్‌లో, వచ్చే నెల నుంచి రిటైల్‌ మార్కెట్లో ఈ కాఫీని విడుదల చేస్తున్నట్టు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ కృష్ణ చైతన్య చెప్పారు. ఈ బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ సంవత్సరం ఎపి, తెలంగాణ సహా దేశ, విదేశాల్లో 35 కేఫ్‌ షాప్‌లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వీటిలో 10 కేఫ్‌లు భారత్‌లో, మిగతా 10 కేఫ్‌లు అమెరికాలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కంపెనీ వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు అమెరికాలోని అనేక మంది ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నట్టు కృష్ణ చైతన్య చెప్పారు.
 
ట్రాపిక్స్‌ ఫ్లేవర్‌ కాఫీ ధర కిలో రూ.30,000
కంపెనీ ప్రీమియం బ్రాండ్‌ కాఫీ ‘ట్రాపిక్స్‌ ఫ్లేవర్‌’ను మార్కెట్లోకి తెస్తోంది. దీని ధర కిలో రూ.30,000 వరకు ఉంటుంది. అరకు ప్రాంతంలో పండే మేలు రకం కాఫీ గింజలతో పాటు ప్రపంచంలోని అత్యున్నత కాఫీ గింజలని ఈ బ్రాండ్‌ కాఫీ పొడి తయారీకి వినియోగించాలని కంపెనీ భావిస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...