Jump to content

New Air ports


Recommended Posts

  • 4 weeks later...
విమానాశ్రయానికి దామవరంలో 210 ఎకరాలు

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లాలో నిర్మించే విమానాశ్రయానికి 210 ఎకరాలు కేటాయించారు. దగదర్తి మండలంలోని దామవరంలో ఆ భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల్‌ వలెవన్‌ ఉత్తర్వులిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ పేరిట ఈ భూమిని ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లిలో 50 ఎకరాలను పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి ఉచితంగా ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. విశాఖ జిల్లాలోని నడుపూరు గ్రామంలో 66.25 ఎకరాల భూమిని వైద్య ఉపకరణాల ఉత్పత్తి కేంద్రం స్థాపన నిమిత్తం వైద్య ఆరోగ్యశాఖకు ఉచితంగా కేటాయించారు.

Link to comment
Share on other sites

విమానాశ్రయానికి భూముల పరిశీలన

కుప్పంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారుల పర్యటన

శాంతిపురం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను పునః ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హామీ మేరకు మినీ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు భూముల పరిశీలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి శుక్రవారం మాట్లాడుతూ ఇక్కడికి విమానాశ్రయం రాబోతోందని వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు కుప్పంలో పర్యటించారు. మధ్యాహ్నం దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. రెండు మండలాల సరిహద్దులోని అమ్మవారిపేట, కిలాకిపోడు, మణీంద్రం గ్రామాల సమీపంలోని భూములను పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు భూములను, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. శాంతిపురం తహసీల్దార్‌ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది వారికి సహకరించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
దగదర్తి విమానాశ్రయానికి రెండు బిడ్లు!

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లాకు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దగదర్తి విమానాశ్రయం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఈ విమానాశ్రయ పనులు చేజిక్కించుకోవడానికి రెండు సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏసీఎల్‌)... దగదర్తి విమానాశ్రయ నిర్మాణం కోసం ఆసక్తి చూపుతున్న సంస్థల నుంచి టెండర్లు పిలిచింది. పోటీ పడిన రెండు సంస్థల్లో ట్రూ మెగా విమానయాన సంస్థ ఉన్నట్లు సమాచారం. దగదర్తిలో విమానాశ్రయాన్ని ‘డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ, బదిలీ’ (డీబీఓటీ) విధానం కింద పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. ఈ బిడ్లను బీఐఏసీఎల్‌ త్వరలోనే తెరవనుంది. రెండు సంస్థల్లో ఎవరు ఎక్కువ ఆదాయ వాటాను ఇవ్వడానికి ముందుకొస్తే వారికి పనులు అప్పగించనున్నారు. ట్రూ మెగా సంస్థ 9 శాతం ఆదాయ వాటా ఇవ్వడానికి కోట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వ్యాఖ్యానించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే త్వరలోనే టెండర్లు ఖరారు చేసి మంత్రివర్గానికి నివేదిస్తామని... బీఐఏసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Ramcharan partner company getting Dagadarthi airport works

 

 

Now YSRCP accusing this as collusion of CBN&PK :)

 

 

/***

A top official from the state government had announced its inability to take up the much-awaited Greenfield airport at Dagadarthi some time ago. People believed it and there were some protests too on the decision. But, amusingly, the issue came up within a couple of months at state government level where an aviation group had moved proposals to bag the development works that are now at approval level.

Highlights:

The aviation company submitted the highest bid which would naturally be considered by the state government  
Principal Secretary of Infrastructure and Investments Ajay Jain says the proposals have been placed before the Cabinet for final approval
Interestingly, Jain had announced in May that the project would be shelved due to budget constraints as the farmers were demanding huge compensation for lands
Now, analysts opine that the state government had played a mind game pretending to shelve Dagadarthi airport, but works of the project have reportedly been okayed to Turbo Megha group owned by Tollywood actor Ram Charan. Sources in the state government said the group bagged the works for development keeping good revenue from cargo business in view. It may be recalled that Turbo Megha group runs Truejet Airlines.

Principal Secretary of Infrastructure and Investments Ajay Jain had said here on May 18 that they had dropped the proposal and considering it in some other district owing to local issues saying there was no cooperation from the local farmers who demanded huge compensation for lands. Hence, he said, they had dropped the idea due to budget constraints even though around Rs. 20 crore was spent on land acquisition process.

 

“The highest bidder was the Turbo Megha group and the proposals were placed before the Cabinet for approval. The concerned Minister will announce the decision according to the government’s plans,” said Ajay Jain talking to the Hans India.

In fact, Bhogapuram International Airport Corporation Limited (BIACL) had received only two bids in which Ram Charan’s group was one among them which offered the highest amount. There would be no hurdles for approvals to the group since it was highest bidder, according to sources.

“Why the senior officials of the state government had initially announced shelving the airport proposals and then proceeded with the bids? It seems some kind of ‘management’ at government level transpired which was in favour of a group related to Pawan Kalyan. How can we expect integrity from the Government,” said a senior leader from the YSR Congress.

Andhra Pradesh's Infrastructure and Investment Department wrote to Airports Authority of India (AAI) seeking development of a new airport at Krishnapatnam in Nellore district in Dec 2014 and it was changed to Dagadarthi subsequently. In January 2016, Bhogapuram International Airport Corporation invited requests for selection of developers for a low cost greenfield airport model at Dagadarthi.

The union ministry of Civil Aviation had accorded approval for development of the airport, committee on Greenfield airports headed by the Secretary, GoI, announced the decision in the same year. In January this year, the state government had considered for changing the proposed site and declared shelving the project in May.

But, the hush-hush process still continued and bids were filed and Turbo Megha aviation group had won the tender process submitting the highest bid which would invest above Rs. 200 crore for development of the airport.

Link to comment
Share on other sites

నెల్లూరులో కొత్త ఎయిర్ పోర్ట్... వచ్చే నెలలో భూమి పూజ...

 

 
share.png

పదేళ్ళ నెల్లరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని 2007 లో అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 3500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థతో ఎంవోయూ కూడా చేసుకున్నా భూసేకరణ జాప్యం కావడం, ప్రభుత్వంలో పాలకుల ఉదాసీనతతో విమానాశ్రయం పనులు ముందుకు సాగలేదు.

 

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మించాల్సిందేనని నిర్ణయించింది. దీని కోసం భూసేకరణ చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. మొదట అనుకున్న 3500 ఎకరాలు కాకుండా తొలి, మలి విస్తరణకు అవసర మైన 1352 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.130 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేసింది.

దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ఈ నెల 9న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంపెనీ లిమిటెడ్ (బీఐఏసీఎల్) సారథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం, నిర్వహణ జరగనున్నది. తొలి, మలి దశ విస్తరణ కోసం 1౩52 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 1054 ఎకరాలు సేకరించారు.

పదేళ్లుగా ఈ విమానాశ్రయం కోసం పాలకులు ఎన్నో హామీలు గుప్పించి ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్ ఈ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమం అయింది.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
Guest Urban Legend
శరవేగంగా విమానాశ్రయం అభివృద్ధి: చినరాజప్ప 
eag-brk6A.jpg

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం ఇండిగో నూతన సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. చినరాజప్పతో పాటు పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్‌, శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయరు పంతం రజనీ శేషసాయి, కలెక్టరు కార్తికేయ మిశ్రా, సబ్‌కలెక్టరు సాయికాంత్‌వర్మ, అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి, ఎయిర్‌పోర్టు డైరెక్టరు ఎం.రాజకిషోర్‌ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఇప్పటికే భూసేకరణ చేసి విమానాశ్రయాన్ని విస్తరించినట్లు తెలిపారు. బ్రిటీష్‌ కాలంనాటి ఈ విమానాశ్రయం దశల వారీగా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరికొన్ని సంస్థలు ముందుకు రానున్నాయని త్వరలో మరిన్ని విమాన సర్వీసులు పెరగనున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలు అభివృద్ధి చెందాయని, విశాఖపట్నం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సర్వీసులు రావడంతో ప్రజలకు ఉపయోగపడతాయని, దిల్లీకి కూడా సర్వీసు వస్తే బాగుంటుందని అన్నారు. సర్వీసులు పెరిగితే సామాన్య ప్రజలకు విమానయానం అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రామీణ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ బోయింగ్‌ సర్వీసుల ఏర్పాటు అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. నగర శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ విమాన సర్వీసుల అనుసంధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మేయరు పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ ఇండిగో సర్వీసులతో విమాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం ఇండిగో విమాన సర్వీసులను ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తిలకించారు. సంస్థ ప్రతినిధులు సంజీవ్‌ రామదాస్‌, అబ్రహం, జయంత్‌, డిప్యూటీ మేయరు వాసిరెడ్డి రాంబాబు, మోది సత్తిబాబు, కాశీ నవీన్‌కుమార్‌, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 2 weeks later...
  • 4 weeks later...
జోరుగా విమానయానం
మూడేళ్లలో 41 లక్షలకు పెరిగిన ప్రయాణికుల సంఖ్య
వివిధ దశల్లో విమానాశ్రయాల విస్తరణ పనులు
ఈనాడు - అమరావతి
9ap-main2a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతిలోని విమానాశ్రయాల్లో విస్తరణ, మెరుగైన సౌకర్యాల కల్పనతో కొత్తగా అనేక విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. 2014-15లో 11 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య 2017-18 నాటికి 41 లక్షలకు పెరిగింది. 2014-15 నాటి సంఖ్యతో పోల్చితే ప్రయాణికులు 272 శాతం పెరిగారు. రాష్ట్రంలోని మరికొన్ని విమానాశ్రయాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

* రాజమహేంద్రవరం విమానాశ్రయంలో 1365 మీటర్లకు పెంచే రన్‌వే విస్తరణ పనులు నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో మూడు అదనపు
‘పార్కింగ్‌ బే’ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

* విజయవాడ విమానాశ్రయంలో రన్‌ వే విస్తరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సమగ్ర టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు మరో రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు. తిరుపతి విమానాశ్రయంలో మూడు అదనపు ‘పార్కింగ్‌ బే’ల పనులు ఇటీవలే పూర్తయ్యాయి.

కొత్త విమానాశ్రయాల్లో పరిస్థితి...
* విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం కోసం కావలసిన 2703 ఎకరాల్లో ఇప్పటివరకు 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇక్కడ పునర్నిర్మాణ, పునరావాస(ఆర్‌అండ్‌ఆర్‌) అమలు కోసం యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
* నెల్లూరు జిల్లాలో దగదత్తి విమానాశ్రయం కోసం అవసరమైన 1399 ఎకరాల్లో 1095 ఎకరాలు స్వాధీన ప్రక్రియ నడుస్తోంది. మరో 304 ఎకరాల ప్రభుత్వ భూమి సమీకరణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెలలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి.
* కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ పనులు గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
* చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయ ‘అడ్మినిస్ట్రేటీవ్‌ ఎయిర్‌ స్ట్రిప్‌’ పనుల కోసం రూ.95 కోట్లతో అంచనాలు రూపొందించారు.
* నాగార్జున సాగర్‌, పుట్టపర్తి విమానాశ్రయ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.  పుట్టపర్తి నుంచి విజయవాడకు రోజులో రెండుసార్లు, నాగార్జునసాగర్‌ నుంచి విజయవాడకు రోజులో ఒకసారి తొమ్మిది సీట్ల వీజీఎఫ్‌ మోడల్‌ ఎయిర్‌ క్రాఫ్టు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...