Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Amaravati

Featured Replies

  • Replies 13.6k
  • Views 1.1m
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Nfan from 1982
    Nfan from 1982

    Santi uncle  Meeku positivity increase cheyaali ante yem tablets vaadalo meere prescription raasukuni pharmacy ki velli regular ga vaadi updates ekkada post cheyandi please 🙏 

  • Elections time ki Basic trunk Infrastructure antha aipothundhi le. Inka 3 years 9 months undi ga. Tenders ichhesaru, kontha grounding work chesaru. Raina valla next 3-4 months delay aina, next year ee

  • Prathi daaniki ee edupu endi nayana abba koduku anukunta.  Amaravathi ki 15K crores loan which center will pay ichharu ga. ORR sanction chesaru. Polavaram ki Funds ichharu. Steel plant ki Package

Posted Images

  • Author

సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల ఫసాడ్‌ పనుల అంచనా వ్యయం రూ.4,830 కోట్లకు పెంపు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 07 Nov 2026 05:22 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

ఈనాడు, అమరావతి: రాజధానిలో నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయ టవర్ల ఫసాడ్‌ గ్లేజింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆర్టియం, కనోపీ స్కైలైట్, కాలమ్‌ క్లాడింగ్‌ తదితర పనుల అంచనా వ్యయాన్ని రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. గతంలో నిర్ణయించిన అంచనా వ్యయం ప్రకారం మూడుసార్లు టెండర్లు పిలిచినా, మెటీరియల్‌ ధరలు పెరిగినందున ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. అందుకే అంచనా వ్యయాన్ని పెంచుతున్నట్టు తెలిపింది. ఐదు టవర్లకు 3 ప్యాకేజీలుగా మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఏజీఐసీఎల్‌కు పాలనాపరమైన ఉత్తర్వులు జారీచేసింది.

జీఏడీ టవర్‌కి రూ.1,094.60 కోట్లు, 3, 4 టవర్లకు రూ.1,790.20 కోట్లు, 1, 2 టవర్లకు రూ.1,945.20 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. అల్యూమినియం ధరలు పెరగడంతో పాటు, టవర్లకు వినియోగించే అల్యూమినియం పరిమాణం పెరిగినందున అంచనాలు సవరించాల్సి వచ్చినట్లు పురపాలకశాఖ ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. ఆరు మీటర్ల పొడవుండే  ప్రత్యేకమైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్యానళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుందని తెలిపింది. మూడేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీ, పదేళ్లపాటు సమగ్ర నిర్వహణ బాధ్యతలు, వారంటీ నిబంధనలు ఈ అంచనాలో చేర్చినట్టు పేర్కొంది.

  • Author

తాడికొండకు సమీపంలో అమరావతి రైల్వేస్టేషన్‌

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 07 Nov 2026 05:34 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కారణంగా స్వల్పంగా మారిన ఎర్రుపాలెం-నంబూరు రైల్వే ఎలైన్‌మెంట్‌
నాలుగు క్రాసింగ్‌ స్టేషన్లు, ఐదు హాల్ట్‌ స్టేషన్లు 

061126APMAIN-31A.webp

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి మీదుగా నిర్మించనున్న ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్‌ ఎలైన్‌మెంట్‌ స్వల్పంగా మారింది. తొలుత ఖరారైన ఎలైన్‌మెంట్‌లో ఒకచోట ఇన్నర్‌రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ కలుస్తుండటంతో రైల్వే అధికారులు ఈ మార్పులు చేశారు. దీనివల్ల అమరావతి రైల్వేస్టేషన్‌ నిర్మాణ ప్రాంతం మారింది. తాజా ఎలైన్‌మెంట్‌ ప్రకారం తాడికొండకు సమీపంలో అమరావతి ప్రధాన రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నారు.

పెరిగిన లైన్‌ పొడవు..

విజయవాడ-కాజీపేట రైల్వేలైన్‌లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం సమీపంలో మొదలయ్యే ఈ లైన్‌.. అమరావతి మీదుగా వెళ్లి, విజయవాడ-గుంటూరు లైన్‌లో నంబూరు వద్ద కలుస్తుంది. తొలుత 56.53 కి.మీ. మేర ఈ లైన్‌ నిర్మాణానికి ఎలైన్‌మెంట్‌ ఖరారు చేశారు. తాజా ఎలైన్‌మెంట్‌ మార్పులతో పొడవు 58.10 కి.మీ.కు పెరిగింది. గతంలో నెక్కల్లు, పెదపరిమి మధ్యలో అమరావతి రైల్వేస్టేషన్‌         నిర్మించాలనుకున్నారు. తాడికొండకు 5 కి.మీ. దూరంలో అమరావతి స్టేషన్‌ నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. 

క్రాసింగ్‌ స్టేషన్లు, హాల్ట్‌ స్టేషన్లు ఎక్కడెక్కడంటే..

  • పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు రైల్వేస్టేషన్లు నిర్మించనుండగా.. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు వద్ద క్రాసింగ్‌ స్టేషన్లు ఉంటాయి. ఇది సింగిల్‌ ట్రాక్‌ రైలుమార్గం కావడంతో ఈ నాలుగు స్టేషన్ల వద్ద రెండు, మూడు లూప్‌లైన్లు నిర్మిస్తారు. ఏదైనా రైలును నిలిపి, వెనుక వచ్చే రైలు ముందుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు.

  • చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, కొత్తపల్లి, వడ్డమాను, తాడికొండ వద్ద హాల్ట్‌ స్టేషన్లు నిర్మిస్తారు. ఆయాచోట్లా సింగిల్‌ ట్రాక్‌లే ఉన్నాయి. ప్యాసింజర్‌ రైళ్లు ఆగి వెళ్లేందుకు అవకాశముంటుంది. అక్కడ అదనపు ట్రాక్‌లు ఉండవు.

  • ఈ ప్రాజెక్టులో 58.10 కి.మీ. మేర ప్రధాన రైలుమార్గం నిర్మించనుండగా, నాలుగు స్టేషన్ల   వద్ద లూప్‌లైన్లు, ఎర్రుపాలెం, నంబూరు వద్ద బైపాస్‌లైన్లు.. తదితరాలన్నీ కలిపి 74 కి.మీ. మేర ట్రాక్‌ నిర్మిస్తారు.

  • గంటకు గరిష్ఠంగా 160 కి.మీ. వేగంతో రైళ్లు పరుగులు పెట్టేలా ట్రాక్‌ నిర్మాణం ఉంటుంది. కృష్ణా నదిపై ప్రధాన వంతెన, అప్రోచ్‌లు కలిపి 4.95 కి.మీ. నిర్మించనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం వంతెనపై రెండు ట్రాక్‌లు నిర్మించేందుకు వీలుగా ఫౌండేషన్‌ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక ట్రాక్‌ మాత్రమే నిర్మిస్తారు. ఇది కాకుండా ప్రాజెక్టులో 32 మేజర్‌ వంతెనలు, 92 మైనర్‌ వంతెనలు, రెండు ఆర్వోబీలు, 10 ఆర్‌యూబీలను నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్‌ అందుబాటులోకి వస్తే ఎర్రుపాలెం, నంబూరు స్టేషన్లు జంక్షన్లుగా మారనున్నాయి.


కొప్పురావూరు సమీపంలో మెగా కోచ్‌ టెర్మినల్‌

అమరావతి ప్రాంతంలోని కొప్పురావూరు స్టేషన్‌ సమీపంలో రైల్వే మెగా కోచ్‌ టెర్మినల్‌ను రైల్వేశాఖ నిర్మించనుంది. ఇక్కడ రైళ్ల నిర్వహణ (మెయింటనెన్స్‌) పనులు చేస్తారు. 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లు నిలిపేందుకు 9 ప్లాట్‌ఫామ్‌లు, నిర్వహణ పనులకు 6 పిట్‌ లైన్లు, 12 స్టేబులింగ్‌ లైన్లు నిర్మిస్తారు. మెగా కోచ్‌ టెర్మినల్‌కు 230 ఎకరాలు కేటాయించాలని సీఆర్‌డీఏని రైల్వేశాఖ కోరింది.

On 10/30/2026 at 8:02 AM, Yaswanth526 said:

Project wise percentage here 👇

@sonykongara brother ee progress tho inka meeru Amaravati meeda hopes pettukunnara?
Adi gone case le mastaru. Aa xxxxxx gaade better.. clear ga cheyanani cheppesaadu. ela ayina emi chesayina 2029 lo vaade vastaadu. Janallo kuda mana kootami MLAs ki vaallaki pedda difference ledu ane talk gattiga vinipistundi. Monna Muncipal,MPTC/ZPTC elections lo manaki inni seats vachayani thodalu kottukovachemo kaani.. YCP baaga pick ayindi anedi nijam. Vaallu expect cheyanivi kuda gelichaaru. Inka maatlaadukunte.. Mana Babu gaari ninnedo % lekkalu chepparu kada. 2021 ive elections lo manakochina vote percentage kante ippudu vaadikochina vote % 5% ekkuva. inka intakanna matlaadedemi ledu.

Edited by JVC

14 hours ago, JVC said:

@sonykongara brother ee progress tho inka meeru Amaravati meeda hopes pettukunnara?
Adi gone case le mastaru. Aa xxxxxx gaade better.. clear ga cheyanani cheppesaadu. ela ayina emi chesayina 2029 lo vaade vastaadu. Janallo kuda mana kootami MLAs ki vaallaki pedda difference ledu ane talk gattiga vinipistundi. Monna Muncipal,MPTC/ZPTC elections lo manaki inni seats vachayani thodalu kottukovachemo kaani.. YCP baaga pick ayindi anedi nijam. Vaallu expect cheyanivi kuda gelichaaru. Inka maatlaadukunte.. Mana Babu gaari ninnedo % lekkalu chepparu kada. 2021 ive elections lo manakochina vote percentage kante ippudu vaadikochina vote % 5% ekkuva. inka intakanna matlaadedemi ledu.

2021 lo unanimous ekkuva, poti takkuva. Also there are multiple opposition parties, kontha kontha vote divide ayyindhi. Ippudu okate opposition, antha okkallake pothundhi. Except Kadapa MP, Rajampeta MP and Palnadu, State antha fair election jarigindhi which gave YCP a fair chance too

Vaallu emanna unexpected ga gelicharu ante alliance parties candidates mistakes valla. That can happen with 3 parties and thousands of posts on offer in a local election

4 hours ago, TDP_2019 said:

End of Decemeber ki anni Towers will be in 12-15 Floors range. 2027 end ki 4 towers almost end ki vachhesthayi. 2028 second half ki opening chesukovachhu. GAD Towers 2028 End ki aipovali even at current pace

Towers completion time as per government a 2029. So 2028 lo complete avvudhi ani expect cheyyatam kuda waste

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.