October 1Oct 1 16 hours ago, Yaswanth526 said:manavaallu baaga propaganda chesthunnaru manchidhae... Hyd lo ippatikae 350+ GCC lu unny anukuntaga, 2061 ki avi 3500 avuthay. ala comparison lo thakkuva unna dhaaniki ikkada pettakunda unte baagundedhi, 12.5 lakh direct and indirect anta. Hyd lo 50 lakh + untay ga ippude direct + indirect. Hyd ni cherukotam eppatiki saadyam kaadhu. kaani amaravati baaga edhagaali. 35 aellu tdp ae undaali, kaani saadyama? vere vaallu vasthae inka mattae
October 4Oct 4 Author చకాచక్.. కూ.. చుక్ చుక్!By Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 04:53 ISTEeFont size2 min readఅమరావతిలో రైల్వేలైన్ నిర్మాణ ప్యాకేజీకి టెండర్లువడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కి.మీ. నిర్మాణంఅంచనా విలువ రూ.599 కోట్లునవంబరు 23 వరకు బిడ్ల దాఖలుకు గడువుఈనాడు - అమరావతి అమరావతి మీదుగా నిర్మించనున్న ఎర్రుపాలెం- నంబూరు రైల్వే లైన్లో.. నాలుగో ప్యాకేజీకి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. ఇప్పటికే ఎర్రుపాలెం నుంచి కృష్ణా నది దాటాక వడ్డమాను వరకు మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవగా, ఇప్పుడు చివరిదైన నాలుగో ప్యాకేజీకి కూడా మోక్షం లభించింది. రాజధాని ప్రాంతంలోని వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి రూ.599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. నవంబరు 23 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చారు. ఈపీసీ విధానంలో దీని నిర్మాణం చేయనున్నారు. టెండరు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇంజినీర్లు పేర్కొన్నారు.ఇప్పటికే 3 ప్యాకేజీలకు టెండర్లు..ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు రైల్వే లైన్ ప్రాజెక్ట్ మొత్తం 58.10 కి.మీ. కాగా.. దీన్ని నాలుగు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు.ఖమ్మం జిల్లా పరిధిలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం సమీపం వరకు తెలంగాణ పరిధిలో 3.5 కి.మీ. మొదటి ప్యాకేజీగా ఉంది. దీనికి టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థను ఎంపిక చేశారు.పెద్దాపురం నుంచి కృష్ణా నది వంతెన వరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రెండో ప్యాకేజీగా టెండరు పిలిచారు.కృష్ణా నదిపై 3.23 కి.మీ. మేర వంతెనతోపాటు, పల్నాడు జిల్లాలో వడ్డమాను వరకు లైన్ నిర్మాణ పనులను మూడో ప్యాకేజీగా టెండరు పిలిచారు.ఎన్టీఆర్ జిల్లాలో 152.40 హెక్టార్ల మేర భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక 2, 3 ప్యాకేజీల టెండర్లు ఖరారు చేయనున్నారు.ఇప్పుడు వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కి.మీ. నాలుగో ప్యాకేజీకి తాజాగా బిడ్లు ఆహ్వానించారు.నాలుగో ప్యాకేజీలో రైల్వే లైన్ నిర్మాణానికి పల్నాడు జిల్లాలో 48.527 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 181.16 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. ఈ భూములను సేకరణ కాకుండా.. సీఆర్డీఏ భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) చేస్తోంది.9 స్టేషన్ల నిర్మాణం..ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు లైన్లో 9 చోట్ల రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పరావూరులలో స్టేషన్లు నిర్మించనున్నారు. అమరావతి రైల్వే స్టేషన్ను విశాలంగా నిర్మించనున్నారు.2024 నవంబరులో ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు దీని అంచనా వ్యయం రూ.2,047 కోట్లుగా పేర్కొన్నారు.
Create an account or sign in to comment