Tuesday at 06:10 AM5 days Author రాజధానిలో రూ.212 కోట్లతో గవర్నర్ నివాస సముదాయంBy Andhra Pradesh News DeskPublished : 01 Sep 2026 06:23 ISTEeFont size1 min readసీఆర్‌డీఏ నిధులతోనే పూర్తి చేయాలని ఆదేశంఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.212.22 కోట్లతో గవర్నర్ నివాస సముదాయం నిర్మాణానికి ఆర్థిక శాఖ అనుమతించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిధులు ఇందుకోసం వెచ్చించాలని స్పష్టం చేసింది. సాంకేతిక మంజూరు, టెండర్ తుది వ్యయం రూ.212.22 కోట్ల పరిపాలన మంజూరు పరిధిలోనే ఉండాలని పేర్కొంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో చేపట్టే గవర్నర్ నివాస సముదాయంలో గవర్నర్ బంగళా, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు అతిథి గృహాలు నిర్మించనున్నారు. వీటితోపాటు ఆరుగురు అధికారులు, మరో 62 మంది సిబ్బందికి నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. 144 మందికి వసతి కల్పించేలా 20 గదులతో బ్యారక్, నాలుగు సెంట్రీ పోస్టులతో ప్రహరీ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. అదనపు పనులు, అంచనా వ్యయం పెంపు, ప్రాజెక్టు పరిధి విస్తరణ వంటివి చేపట్టాలంటే ముందుగానే సంబంధిత అధికారుల అనుమతితో పాటు ఆర్థిక శాఖ అంగీకారం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో నిర్వహణ పరమైన ఖర్చులు కూడా ప్రభుత్వ నిధులతో భరించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని సీఆర్‌డీఏకి సూచించింది.
Thursday at 09:10 AM3 days Author ఐకానిక్ కూల్ కూల్!ABN , Publish Date - Sep 03 , 2026 | 05:33 AMరాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఆ భవనాలకు సెంట్రలైజ్డ్ ఏసీ.. సింగపూర్, దుబాయ్ తరహా ‘డిస్ట్రిక్ట్’ కూలింగ్ వ్యవస్థLATESTభారత్‌లో ఏఐ వ్యవస్థ చూస్తే సంతోషం కలుగుతోంది: ఎన్విడియా సీఈఓకొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాస్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కసస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్ఉచిత టెస్ట్‌లు ఉత్తదే!కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారఅభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియోఆదాయానికి మంచి ఆస్తుల కేసు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెరాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేహలధారి.. అయోమయం.. రైతు బీమా ఉన్నట్లా! లేనట్లా.?భారత్‌లో ఏఐ వ్యవస్థ చూస్తే సంతోషం కలుగుతోంది: ఎన్విడియా సీఈఓకొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాస్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కసస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్ఉచిత టెస్ట్‌లు ఉత్తదే!కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారఅభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియోఆదాయానికి మంచి ఆస్తుల కేసు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెరాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేహలధారి.. అయోమయం.. రైతు బీమా ఉన్నట్లా! లేనట్లా.?ఒకే చోట ప్లాంటు, భూగర్భ పైపులైన్‌తో సరఫరా30,000 టీఆర్ సామర్థ్యంతో ప్లాంటు నిర్మాణంపీపీపీ పద్ధతిలో రూ.415 కోట్లతో భారీ ప్రాజెక్టుపర్యావరణహితం.. 40 శాతం విద్యుత్ ఆదాగుంటూరు(రాజధాని), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయస్థాయి నగరాల్లో కనిపించే ఈ అత్యాధునిక కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అమరావతిని కూడా ఆ నగరాల సరసన నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అధునాతన డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రొసీజర్(డీసీపీ) ద్వారా ఐకానిక్ సెక్రటేరియట్ భవన సముదాయమైన జీఏడీ టవర్, 4 హెచ్‌వోడీ టవర్లు, సీఎం కార్యాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఏసీ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికిగాను రూ.415 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో సీఆర్డీఏ అధికారులు ఇటీవల టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు అవకాశం ఉంది. టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసి, 30 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ భారీ అత్యాధునిక ప్రాజెక్టును పీపీపీ పద్థతిలో బిల్ట్-డెవల్‌ప-ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. కాంట్రాక్ట్ సంస్థకు లీజు రూపంలో స్థలాన్ని కేటాయిస్తారు. కూలింగ్ యాజ్ ఏ సర్వీస్(సీఏఏఎస్) మోడల్‌లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది.హరిత ఇంధనంతో..పర్యావరణహిత విధానంలో ఏర్పాటు చేసే ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానంలో పెద్ద మొత్తంలో కరెంటు కూడా ఆదా కానుంది. విడివిడిగా ఏసీలు పెట్టడం వల్ల కరెంట్ బిల్లులు పెరగడమే కాకుండా పర్యావరణానికి హాని చేేస గ్రీన్‌హౌస్ వాయువులు భారీగా విడుదలవుతాయి. సెంట్రలైజ్డ్ కూలింగ్ విధానంతో ఈ నష్టం భారీగా తగ్గనుంది. 30-40 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో హరిత ఇంధనాన్ని వినియోగించి ప్లాంట్ నడిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.డీసీపీ ఎలా పనిచేస్తుందంటే..సాధారణంగా ప్రతి ఆఫీస్ లేదా గదికి విడివిడిగా ఏసీలు వాడతారు. డిస్ర్టిక్ట్ కూలింగ్ విధానం(డీసీపీ)లో ఒకే ఒక ప్లాంటు ఉంటుంది. 1,350 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రభుత్వ భవన సముదాయం పరిధిలో ఒకే ఒక సెంట్రలైజ్డ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. 30వేల టన్నుల కూలింగ్(టీఆర్) సామర్థ్యంతో ప్లాంట్ పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ఏసీ సరఫరా చేయాలనుకున్న అన్ని భవనాలకు భూగర్భ పైపులైన్లు అమరుస్తారు. చల్లదనం పోకుండా వాటిని ఇన్సులేట్ చేస్తారు. ఈ భూగర్భ ఇన్సులేటెడ్ పైపులైన్ల నెట్‌వర్క్ ద్వారా శీతల గాలిని ప్రతి ప్రభుత్వ భవనానికి పంపిస్తారు.
Friday at 11:17 AM2 days Author రాజధానికి కొత్తశోభABN , Publish Date - Sep 04 , 2026 | 05:21 AMనవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి.అమరావతి రహదారులకు నగిషీలుLATESTబైక్‌లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరఆర్టీసీకి కాసుల పంట..మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైకొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చినఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామాచేత వెన్నముద్ద...సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐసమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ కోరిన మంత్రినేపాల్ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంగీతాచార్యుని రాజనీతిబైక్లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరఆర్టీసీకి కాసుల పంట..మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైకొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చినఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామాచేత వెన్నముద్ద...సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐసమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ కోరిన మంత్రినేపాల్ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంగీతాచార్యుని రాజనీతి700 కి.మీ. మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లునిర్మాణం పూర్తయిన రోడ్లలో పనులు ప్రారంభంఈ3, ఎన్9, ఈ9, ఈ6రోడ్లు, జోన్ 2ఏలో నిర్మాణంఅమరావతికి ప్రత్యేక ఆకర్షణగా కొత్త హంగులురోడ్డు, ట్రాక్‌లకు మధ్య అవెన్యూ ప్లాంటేషన్గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి. ఆ వెనువెంటనే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. రాజధాని నగరంలో తూర్పు-పడమరలను కలుపుతూ ఈ 1 నుంచి ఈ 16 వరకూ 16 ‘ఈ’ సిరీస్ రోడ్లు, ఉత్తర-దక్షిణాలను కలుపుతూ ఎన్ 1 నుంచి ఎన్ 17 వరకూ 17 ‘ఎన్’ సిరీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి మొత్తం పొడవు 350 కి.మీ. ఉంటుంది. ఈ రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో మొక్కలను పెంచడంతో పాటు స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మిస్తారు. అమరావతి మొత్తం మీద రోడ్లకు ఇరువైపులా 700 కి.మీ.ల మేర సైక్లింగ్ ట్రాక్‌లు, 700 కి.మీ. మేర వాకింగ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో ట్రాక్‌ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.
Create an account or sign in to comment