August 4Aug 4 51 minutes ago, JVC said:Where is IRR yaa?Eppatiki aayyaeno Amaravati IRR and Internationa Airport. KAneesam, vachae aedu lo panulu modalayite, vachae term CBN vasthae appudu poorthi chesi, perulu pettukovachu. Veellu cheyyakapothae aa projects mundhuku vellavu, vere vaallu vasthae. poorthayyae sarikii lepotae veellu maari malli Nehru IRR, Rajiv Gandhi Ariport laaga avuthhundhi.
August 5Aug 5 Author రాజధానిలో 20 మెగావాట్‌ల డేటా సెంటర్By Andhra Pradesh News DeskPublished : 05 Aug 2026 03:59 ISTEeFont size2 min readవిజయవాడ బస్టాండ్ నుంచి అమరావతిలోని వేంకటేశ్వరస్వామి గుడి వరకు రోప్‌వే సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయాలుసమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబుఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో 20 మెగావాట్‌ల టయర్-3 ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్‌లు ఆహ్వానించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 64వ అథారిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. తీసుకున్న నిర్ణయాల్ని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు..డేటా సెంటర్‌కు నిడమర్రు వద్ద 1.8 ఎకరాలు కేటాయించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రియల్ టైమ్ గవర్నెన్స్, ల్యాండ్ రికార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు వంటి.. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం భద్రపరిచేందుకు ప్రత్యేకంగా డేటా సెంటర్ ఉండాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటయ్యే సంస్థలకూ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.విజయవాడలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్, దుర్గ గుడి, పున్నమిఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా రాజధానిలోని వేంకటేశ్వరస్వామి గుడి వరకు పీపీపీ విధానంలో రోప్‌వే ప్రాజెక్టు.క్వాంటమ్ వ్యాలీలో రూ.1,208 కోట్లతో రెండు టవర్ల నిర్మాణానికి పిలిచిన టెండర్‌లో ఎల్1గా వచ్చిన ఎల్‌అండ్‌టీకి పనులు అప్పగించేందుకు నిర్ణయం. అమరావతిని భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కలిపి కోటి మంది జనాభాతో మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు తగ్గట్టుగా కృష్ణా నదిపై ఏఏ ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించాలి, ఎన్ని నిర్మించాలి వంటి అంశాల్ని నిర్ణయించేందుకు కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి అనుమతి. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వేలైను ప్రాజెక్టు కోసం మోతడక గ్రామంలో 2,344 ఎకరాలు తీసుకునేందుకు అనుమతి. గ్రామంలోని మొత్తం భూమి ఇచ్చేందుకు ఇప్పటికే అక్కడి రైతుల తీర్మానం. పల్నాడు జిల్లాలో రాజధాని రెండో దశకు భూసమీకరణలో తీసుకుంటున్న 244.39 ఎకరాల ఇనాం భూముల నిమిత్తం దేవాదాయ శాఖకు రూ.122 కోట్లు చెల్లించేందుకు సీఆర్‌డీఏకు అనుమతి. రైతులకు వార్షిక కౌలు చెల్లించే నిమిత్తం ఏపీపీఎఫ్‌సీఎల్ నుంచి సీఆర్‌డీఏ తీసుకున్న రూ.300 కోట్ల రుణానికి ఆమోదం.రాజధానిలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు. రాజధాని ప్రాంతంలో 20 చోట్ల 5జీ నెట్‌వర్క్ టవర్ల ఏర్పాటుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పిలవాలని నిర్ణయం. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పునఃప్రారంభం నేపథ్యంలో ఏపీ రెరాకి చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు.రాజధానిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో తెలుగు కళలు, సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా చేపట్టాల్సిన చర్యలపై ఒక కమిటీ నియామకం. అమరావతి ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడానికి అథారిటీ ఆమోదం.
August 6Aug 6 amaravati plus water availability minus weather affordable cooling arrange chesthe it companies interest choopisthaayi
August 6Aug 6 2 hours ago, ravindras said:amaravatiplus water availabilityminus weatheraffordable cooling arrange chesthe it companies interest choopisthaayiTrafic plus kada
August 6Aug 6 2 hours ago, ravindras said:amaravatiplus water availabilityminus weatheraffordable cooling arrange chesthe it companies interest choopisthaayiInko Plus... jenaba takkuva... inko 20 years inthee
Create an account or sign in to comment