June 3Jun 3 Author అత్యాధునిక టెక్నాలజీతో అమరావతి పనులుABN , Publish Date - Jun 03 , 2026 | 04:19 AMరాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరూ వినని అత్యాధునిక నిర్మాణ పద్ధతులకు వేదిక అవుతోంది. ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి అమరావతిలోని ...శరవేగంగా ఐకానిక్ భవన నిర్మాణంఫ్లైవుడ్, ఉడెన్ బీమ్ జంపింగ్ టెక్నాలజీతో సెక్రటేరియట్ టవర్ 2, 3 పనులుసగటున పదిరోజుల్లో ఒక్కో అంతస్తు పూర్తి40 అంతస్తులు పూర్తయ్యాక ఒక్కోదానికి స్లాబ్(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి)రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరూ వినని అత్యాధునిక నిర్మాణ పద్ధతులకు వేదిక అవుతోంది. ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి అమరావతిలోని ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలోనే అమరావతి జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకూ సచివాలయ భవన సముదాయం అనగానే గుర్తొచ్చేది.. డయాగ్రిడ్ నిర్మాణ స్వరూపమే. అందమైన ఆ నిర్మాణ స్వరూపాన్ని గ్రాఫిక్స్ రూపంలో ప్రభుత్వం ప్రజలకు చూపించింది. ఇప్పుడు ఆ నిర్మాణంలో సెక్రటేరియట్ టవర్స్ 3, 4 పనులకు కొత్త టెక్నాలజీని వాడుతోంది. అదే.. ఫ్లైవుడ్, ఉడెన్ బీమ్ జంపింగ్ టెక్నాలజీ. మెరైన్ ప్లైవుడ్, ఉడెన్ బీమ్‌లను ఉపయోగించి నిర్మించే ఈ టెక్నాలజీ గురించి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులకు తెలిసింది కూడా తక్కువే. ఇక సామాన్యుల విషయం చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన ఈ ఆధునిక విధానాన్ని, మన సంప్రదాయ విధానంతో జోడించి ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో ఒక్కో అంతస్తు నిర్మాణానికి సగటున 10 రోజులు పడుతుంది. నిర్మాణ సమయం 3 వంతులు తగ్గి, మూడు రెట్లు నిర్మాణ వేగం పెరుగుతుంది.జంపింగ్ టెక్నాలజీ అంటే..ఇప్పటి వరకూ అందరూ షీర్‌వాల్ టెక్నాలజీ గురించి వినుంటారు. జంపింగ్ టెక్నాలజీ అనేది దీనికి దగ్గరగా ఉంటుంది కానీ, అంతకంటే అత్యాధునికమైనది. షీర్‌వాల్ టెక్నాలజీలో భవనం గోడలు, స్లాబులకు మొత్తానికి కలిపి ప్లేట్లతో రెండువైపులా షట్టరింగ్ చేసుకుని, మధ్యలో స్టీల్, కాంక్రీట్‌తో కలిపి కాంపోజిట్ మిక్స్ నింపుతారు. తద్వారా ఒకేసారి గోడలు, స్లాబు పూర్తైపోతాయి. ఆ తరువాత ప్లేట్లను ఊడదీసి పైకి తీసుకువెళ్లి పూర్తయిన స్లాబుపై మరో అంతస్తుకు షట్టర్లు అమరుస్తారు. కానీ ప్రస్తుత జంపింగ్ టెక్నాలజీలో స్లాబు లేకుండా గోడలు మాత్రమే నిర్మించుకుంటూ వెళతారు. మెరైన్ ఫ్లైవుడ్ షట్టరింగ్, రైలుపట్టాల మాదిరిగా చెక్క బీమ్‌ల సహాయంతో ముందుగా గోడల కోసం షట్టర్లను నిర్మిస్తారు. మధ్యలో స్టీల్, కాంక్రీట్‌తో కలిపి కాంపోజిట్ మిక్స్ నింపి గోడలు పూర్తి చేస్తారు. గోడలు పూర్తయిన తరువాత మరో అంతస్తు కోసం షట్టర్లను అక్కడి నుంచి సులువుగా పైకి జరుపుతారు. షీర్‌వాల్ టెక్నాలజీలో స్లాబు అడ్డంగా ఉండడంతో ప్లేట్లన్నీ ఊడదీసి పైకి తీసుకెళ్లి మళ్లీ బిగించుకోవాలి. కానీ జంపింగ్ టెక్నాలజీలో ఒకసారి బిగిస్తే వాటినే పై వరకూ జరుపుకొంటూ వెళ్లిపోవచ్చు. షీర్‌వాల్ టెక్నాలజీలో ప్లేట్లు ఊడదీసి, మళ్లీ బిగించడానికి వారం రోజుల వరకూ పడుతుంది. కానీ జంపింగ్ టెక్నాలజీ పద్ధతిలో 3 గంటల్లోనే పైఅంతస్తుకు షట్టరింగ్‌ను జరుపుకొని స్టీల్, కాంక్రీట్ మిక్స్‌తో గోడలు కట్టేసుకోవచ్చు. ఇలా 40 అంతస్తులు ఉండే భవనాలను నిర్మిస్తున్నారు. ఆ తరువాత ఒక్కో అంతస్తుకు పాతకాలం మిద్దెలకు మాదిరిగా భారీ ఉడెన్ బీమ్‌లు వేసి వాటి పై డెక్ ఎంబైబ్ ప్లేట్లు అమర్చి స్లాబ్ వేస్తారు. షట్టరింగ్‌ను ఒక అంతస్తు నుంచి మరో అంతస్తు కు జరపడానికి పిస్టన్, రైలింగ్ టెక్నిక్‌ను వినియోగిస్తున్నారు. ముందుగా భవన నిర్మాణం చుట్టూ రైలింగ్‌లను అమరుస్తారు. వాటిని షట్టర్లకు అనుసంధానిస్తారు.
June 4Jun 4 Author అమరావతిపై వైకాపా కమిటీలు హాస్యాస్పదం: మంత్రి నారాయణBy Andhra Pradesh News TeamPublished : 04 Jun 2026 09:53 ISTEeFont size1 min readఅమరావతి: రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ట్రంక్ రోడ్లపై 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టి తొలగిస్తున్నారని చెప్పారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందన్నారు. భారీ వర్షాలు వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. రాజధానిలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను పరిశీలించారు. బ్రిడ్జిల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టి తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్నచోట మరింత వెడల్పు చేయాలని సూచించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులు పరిశీలించారు. రైతులను వైకాపా రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ ఆరోపించారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. అమరావతిపై వైకాపా కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఎలా ఇచ్చేస్తారని నిలదీశారు. భవనాలు, రోడ్లు, పైపు లైన్ ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మంత్రి నారాయణ మండిపడ్డారు.
June 4Jun 4 4 hours ago, sonykongara said:ante balavanthamu gaa vachhada leka maa reds akkada matladina taravatha ichhesadu emo letter waste ika veellatho ani 😂😂
June 4Jun 4 Author 3 minutes ago, Mobile GOM said:ante balavanthamu gaa vachhada leka maa reds akkada matladina taravatha ichhesadu emo letter waste ika veellatho ani 😂😂
June 5Jun 5 On 6/2/2026 at 8:54 PM, JVC said:ee sari Koulu dabbulu chala mandiki issues unnayi anta. Okari perutho inkokari bank a/c lo vesaaranta. Em pani chestunnaro edavaluidhaem chandaalamo, kaneesam aevari kaathaallo, vaariki dabbulu ivvatam chetha kaakunda, inka Quantum lu, AI lu aenti ?
June 5Jun 5 Author కృష్ణా నది ఒడ్డున అమరావతి ఐలండన్లో ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో అమరావతిలో కృష్ణా నది ఒడ్డున ఆరు ఎకరాల ఏపీ సీఆర్‌డీఏ భూమిలో అమరావతి ఐ అభివృద్ధి చేయనున్నారు. ఈ జెయింట్ అబ్జర్వేషన్ వీల్‌లో.. చక్రం పైకి వెళ్లినప్పుడు పర్యాటకులు అందులో కూర్చుని అమరావతి నగరాన్ని, కృష్ణా నది అందాలను చుట్టూ ఉన్న పరిసరాలను ఎత్తు నుంచి వీక్షించి ఆనందించవచ్చు. రాజధానిలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ భూమిపై 30 ఏళ్ల కాలానికి డీబీఎఫ్‌ఓటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్సు, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తారు.
June 5Jun 5 Author అమరావతి నగరంలో ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ఎఫ్‌లో హైకోర్టు భవనానికి మౌలిక సౌకర్యాలు, బాహ్య అభివృద్ధి పనులు చేసేందుకు రూ.547.07 కోట్లతో పాలనామోదం ఇచ్చేందుకు అనుమతి. అమరావతి పరిధిలోని రాయపూడిలో ఆలిండియా సర్వీసెస్ అధికారుల భవనాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఎల్1 బిడ్డర్‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. పనుల ఒప్పంద విలువ రూ.94.90 కోట్లు.
June 6Jun 6 19 hours ago, AndhraBullodu said:idhaem chandaalamo, kaneesam aevari kaathaallo, vaariki dabbulu ivvatam chetha kaakunda, inka Quantum lu, AI lu aenti ?Mundu ee Anta Anta Kaburlu maanithe anni set avuthayi
Create an account or sign in to comment