Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Amaravati

Featured Replies

  • Replies 12.3k
  • Views 958k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Nfan from 1982
    Nfan from 1982

    Santi uncle  Meeku positivity increase cheyaali ante yem tablets vaadalo meere prescription raasukuni pharmacy ki velli regular ga vaadi updates ekkada post cheyandi please 🙏 

  • Elections time ki Basic trunk Infrastructure antha aipothundhi le. Inka 3 years 9 months undi ga. Tenders ichhesaru, kontha grounding work chesaru. Raina valla next 3-4 months delay aina, next year ee

  • Prathi daaniki ee edupu endi nayana abba koduku anukunta.  Amaravathi ki 15K crores loan which center will pay ichharu ga. ORR sanction chesaru. Polavaram ki Funds ichharu. Steel plant ki Package

Posted Images

  • Author

9 జిల్లాలు, 44,962 చ.కి.మీ.ల్లో అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 05 May 2026 05:48 IST

Ee

Font size

3 min read

సమగ్ర ఆర్థిక, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కసరత్తు
టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

050526brk126078378a.webp

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ (ఏఈఆర్‌) అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ (స్ట్రాటజిక్‌ సపోర్ట్‌ ఏజెన్సీ- ఎస్‌ఎస్‌ఏ) నియామకానికి ఏపీసీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 44,962 చ.కి.మీ. ప్రాంతానికి ఎకనమిక్‌ రీజియన్‌ ప్లాన్‌ (ఏఈఆర్‌పీ) సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర విజన్‌-2047, కేంద్ర ప్రభుత్వ సిటీ ఎకనమిక్‌ రీజియన్‌ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఏఈఆర్‌పీని రూపొందిస్తున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఏఈఆర్‌కి సంబంధించి ఆర్థిక, భూ వినియోగ ప్రణాళికలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, నాణ్యమైన, అత్యంత అనుకూలమైన జీవన విధానం, సుస్థిరాభివృద్ధి మూలస్తంభాలుగా పేర్కొంది. టెండర్లలో ఎంపికైన సంస్థ వాటి ఆధారంగా యాంకర్‌ ప్రాజెక్టుల రూపకల్పన, మొత్తం రీజియన్‌ను ఒక యూనిట్‌గా పరిగణిస్తూ పట్టణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య విస్తృత సమన్వయంతో సమగ్రాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఏఈఆర్‌పీని సిద్ధం చేయాలని పేర్కొంది. ఈ ప్రణాళిక రూపకల్పనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి ఆర్థిక, సాంకేతిక సహకారం తీసుకుంటున్నామని, సింగపూర్‌ ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తోందని తెలిపింది. ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ ఏడీబీ, సింగపూర్‌ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఏడాది నుంచి 

  • ఏఈఆర్‌పీ అమలుకు స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించాలి.  0-12 నెలలు, 1-3 సంవత్సరాలు, 3-7 సంవత్సరాలు, 7-22 సంవత్సరాలకు ఈ ప్రణాళికలు ఉండాలి. 2030, 2035, 2047 సంవత్సరాలకు సాధించాల్సిన లక్ష్యాలను ఏఈఆర్‌పీలో నిర్దిష్టంగా పేర్కొనాలి.

  • ఏఈఆర్‌పీ సిద్ధమయ్యాక ప్రభుత్వ విభాగాల వారీగా ఆచరణాత్మకమైన రోడ్‌మ్యాప్‌లు రూపొందించి.. బాధ్యతలు, లక్ష్యాలు, వాటిని సాధించాల్సిన గడువు స్పష్టంగా నిర్దేశించాలి. 

  • సింగపూర్, గ్రేటర్‌ టోక్యో, సియోల్‌ కేపిటల్‌ ఏరియా, గ్రేటర్‌ బే ఏరియా, రోటర్‌డామ్‌- యాంట్‌వెర్ప్, బార్సిలోనా మెట్రోపాలిటన్‌ రీజియన్, గ్రేటర్‌ మాంచెస్టర్‌ వంటి అంతర్జాతీయ ఎకనమిక్‌ రీజియన్లు, మన దేశంలోని బీసీపీపీఈఆర్, ఎంఎంఆర్, ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ ఎంఆర్, చెన్నై ఎంఆర్‌ వంటి రీజియన్లకు దీటుగా సిద్ధం చేసేలా ప్రణాళిక ఉండాలి. 

  • వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించగల 100కి పైగా ప్రాజెక్టులు, 8-12 యాంకర్‌ ప్రాజెక్టుల్ని సిద్ధం చేయాలి. 

  • ప్రాజెక్టుల పర్యవేక్షణ, సంస్కరణల అమలు, ఆర్థిక వనరుల నిర్వహణకు డిజిటల్‌ పీఎంఓ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలి. 

  • తొమ్మిది నెలల్లో ప్రణాళిక రూపొందించాలి. తర్వాత ఆరు నెలలపాటు ప్రాజెక్టు అమల్లో సహకరించేందుకు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ముగ్గురు సభ్యులతో నిర్వహించాలి. 

పారిశ్రామిక జంట నగరాలుగా విజయవాడ- గుంటూరు

  • 2047కి ఏఈఆర్‌ని 250 బిలియన్‌ డాలర్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేలా ప్రణాళిక ఉండాలి. 

  • అమరావతి యాంకర్‌ కేపిటల్‌ సిటీగా విజయవాడ- గుంటూరును పారిశ్రామిక సేవలందించే జంట నగరాలుగా, ఏలూరు, బాపట్లలను వ్యవసాయ పారిశ్రామిక హబ్‌లుగా, ఒంగోలు, మార్కాపురం ప్రాంతాల్ని ఖనిజాలు, తయారీ రంగ కారిడార్‌గా అభివృద్ధి చేయాలి. 

  • పోర్టు ఆధారిత తయారీ యూనిట్లు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, డ్రోన్లు, డిఫెన్స్, ఏరోస్పేస్‌ క్లస్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాల తయారీ కేంద్రాలు, జీసీసీలు, హైఎండ్‌ సర్వీసులు అందించే ప్రాంతంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలి. 

  • సర్క్యులర్‌ ఎకానమీ విధానాల అమలు, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే మౌలిక వసతులు, ప్రపంచస్థాయి పట్టణ సేవలు, అత్యున్నత నైపుణ్యమున్న మానవ వనరులతో దీన్ని సుస్థిర, అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. 

  • ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఈఆర్‌పీలో 10 నుంచి 12 గ్రోత్‌ డ్రైవర్స్‌ను, కొన్ని ఉత్ప్రేరక ప్రాజెక్టులను రూపొందించాలి. పెట్టుబడుల్ని ఆకర్షించాలి.

  • Author

అమరావతిలో కొత్త విద్యాశకం.. వైద్య కళాశాల, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఒప్పందం

ABN , Publish Date - May 07 , 2026 | 05:10 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివరాల్లోకి వెళితే..

అమరావతిలో కొత్త విద్యాశకం.. వైద్య కళాశాల, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఒప్పందం

APCRDA Amaravati News

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విద్యా రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి వైద్య విద్య, నైపుణ్యాధారిత శిక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీతో ఏపీ సీఆర్డీఏ (APCRDA) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాజధానిలో మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అంశంపై గురువారం లీజ్ ఒప్పంద ప్రక్రియ అధికారికంగా పూర్తయింది.

Group%2011.svg


ఈ ప్రాజెక్టు కోసం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ పరిధిలో సుమారు 23 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన సీఆర్డీఏ కేటాయించింది. ఈ ఒప్పంద కార్యక్రమం సీఆర్డీఏ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఆర్డీఏ డైరెక్టర్ చిరాన్ రాయ్, ఆదిత్య ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆద్విక్ బొల్లినేని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. అనంతరం ఆదిత్య ఎడ్యుకేషన్ ప్రతినిధులు తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాధారిత ఉన్నత విద్యను అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. విద్యార్థులకు విస్తృతమైన పరిశోధనలకు అవకాశం కల్పిస్తూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ సంస్థలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.


Create an account or sign in to comment

Recently Browsing 1

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.