Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో రహదారుల నిర్మాణంపై సమీక్ష

హాజరైన ప్రముఖ కన్సల్టెంట్లు

మాచవరం(విజయవాడ), న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో రహదారులను అత్యుత్తమ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) తనదైన శైలిలో శ్రద్ధ తీసుకొంటోంది. రాజధానికి ప్రధాన రవాణా మార్గమైన సీడ్‌యాక్సెస్‌ రోడ్డుతో పాటు రాజధానిలో నిర్మిస్తున్న 65 కి.మీ విస్తీర్ణంలో (ప్రైయారిటీ రోడ్డు-1) నిర్మించాలని యోచిస్తున్న ప్రధాన రహదారులపైౖ నిర్మాణాలపై ఏడీసీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి గురువారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో అధికారులు, కన్సల్టెంట్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మూడేళ్లలో ఏడీసీ నేతృత్వంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా రాజధానిలో పరిధిలో 590 కి.మీ. మేర నిర్మితమయ్యే ప్రధాన రహదారులు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ఫేజ్‌లో 65 కి.మీ.ల మేర రహదారులను నిర్మించేందుకు అధికారులు సిద్ధపడాలన్నారు. దీనికి సంబంధించి అక్టోబరు రెండో వారం నాటికి టెండర్లు ఖరారు చేయాలని కోరారు. రాజధాని పరిధిలో మొత్తం 1100 కి.మీ మేర నిర్మించాల్సిన రహదార్ల నిర్మాణంపై కార్యాచరణను తయారుచేయాలని సూచించారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై ప్రత్యేక చర్చ: రాజధాని అమరావతికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్న రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు తొలి దశగా జరుగుతున్న 18.5 కి.మీ. మేర నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్‌ అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానది మీదుగా అమరావతికి చేరేందుకు వీలుగా చేపట్టాల్సిన వంతెన నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. పర్యాటక నగరంగా అమరావతి గుర్తింపు పొందాలంటే చక్కటి ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని ఏడీసీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారధి అధికారులకు సూచించారు. శాఖమూరు గ్రామంలో అతి పెద్ద రాజధాని ప్రాంతీయ ఉద్యానవనాన్ని నిర్మించటంతో పాటు రాజధాని నలుదిక్కులా నాలుగు అతి పెద్ద ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు, పర్యాటకులకు చక్కగా దోహదపడతామని ఆమె అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి సంస్థ సీపీవో విశ్వనాథ్‌, సీటివో సుదర్శన్‌రెడ్డి, సీఈ రామూర్తి, ఆర్వీ అసోసియేట్స్‌, జీఐఐసీ, బ్లూ కన్సల్టెంట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతి ప్రపంచంలోనే బెస్ట్‌
 
636113158081609189.jpg
 • అత్యుత్తమ విధానాలతో రూపకల్పన, అమలు
 • ప్రభుత్వశాఖలు, ఏపీసీఆర్డీయే, ఏడీసీ సమన్వయంతో పని చేయాలి: సీఎం
 • బ్లూ ప్లాన రూపకల్పనలో ప్రగతిని తెలిపిన ఆర్కాడిస్‌ ప్రతినిధి
 
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను అవలంబించడం ద్వారా అమరావతి బ్లూ ప్లానను పకడ్బందీగా రూపొందించి, అమలుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం అమరావతి నిర్మాణ వ్యవహారాలను సమీక్షించాలన్న నిర్ణయంలో భాగంగా.. రాజధాని బ్లూ ప్లాన రూపకల్పనపై ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, బ్లూ కన్సల్టెంట్‌ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. వరద నివారణ చర్యలు, కొండవీటి వాగు నియంత్రణ, కృష్ణానదీ తీర సుందరీకరణ, నది మధ్యలో లంకల పరిరక్షణ, సహజ జలవనరులను యథాతధంగా ఉంచుతూనే మరింతగా అభివృద్ధి పరచడం, కాలువలతో అమరావతిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా జలరవాణాకూ అవకాశం కల్పించడం.. తదితర బృహత్తర లక్ష్యాల సాధనతో బ్లూ ప్లాన రూపొందించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే.
 
సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజధానికి ఇసుమంతైనా వరద రావడానికి వీల్లేని విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా నే.. అమరావతిలో కొండవీటి వాగు సహా పలు వాగులకు, కృష్ణానదికి గత వందేళ్లలో వచ్చిన వరదలను సమగ్రంగా అధ్యయనం చేసి బ్లూప్లానను రూపొందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజధానిని ప్రపంచంలోనే అత్యద్భుత పర్యాటక కేంద్రంగా చేయాలని ఆకాంక్షించారు. బ్లూ ప్లాన లక్ష్యాలన్నింటినీ చేరుకునేందుకు ఆయా అంశాలకు సంబంధించి దేశ విదేశాల్లో విజయవంతమైన అత్యుత్తమ విధానాలను దాని రూపకల్పన, అమలులో అనుసరించాలన్నారు. అమరావతి బ్లూ ప్లాన అందరూ వేనోళ్ల చెప్పుకునేలా విజయవంతమయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
 
సవివర ప్రజెంటేషన్‌
అమరావతి బ్లూ కన్సల్టెంట్‌ సంస్థ ఆర్కాడిస్‌కు చెందిన రాబ్‌.. బ్లూ ప్లాన రూపకల్పన దిశలో ఇంతవరకూ తాము సాధించిన పురోగతి గురించి సవివర ప్రజెంటేషన ఇచ్చారు. సీఎం ఆదేశానుసారం అత్యుత్తమమైన బ్లూ ప్లానను తయారు చేసేందుకు తాము శ్రమిస్తున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో జలరవాణాకు అనువైన కాలువల గురించి వివరించారు. కాగా, ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సతీష్ చంద్ర, జి.సాయిప్రసాద్‌, ఏపీసీఆర్డీయే ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన, ఏడీసీ చైర్‌పర్సన లక్ష్మీపార్థసారథి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

టాప్‌ బ్రాండ్‌ అమరావతి
 
636114303576773152.jpg
 • రంగాలవారీగా వర్క్‌షాపులతో రాజధానికి ఊపు
 • ఇప్పటికే ఇంటర్నేషనల్‌ స్కూళ్ల యాజమాన్యాలతో భేటీ
 • 18న దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత హోటళ్ల ప్రతినిధుల సమావేశం
 • తర్వాత ఆసుపత్రులు, ఆర్థిక, ఐటీ, సేవాసంస్థలతో చర్చలు
 • అంతర్జాతీయ నగరం దిశగా సీఆర్‌డీఏ కసరత్తు
(ఆంధ్రజ్యోతి, అమరావతి): అమరావతిని అసలు సిసలైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అందులో వివిధ రంగాలకు సంబంధించిన అత్యుత్తమ సంస్థలు కొలువుదీరేలా చేయాలని భావిస్తున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ).. అందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరొందిన సంస్థల యాజమాన్యాలతో వర్క్‌షాపుల నిర్వహణకు సంకల్పించింది. రాజధానిలో తమ శాఖలను స్థాపించాలని ఆసక్తితో ఉన్న ఆయా రంగాల్లోని విఖ్యాత సంస్థలను ఆహ్వానించి, అమరావతికి తరలిరావడానికి ఏయే వసతులు (భూమి, రాయితీలు ఇత్యాదివి) కోరుతున్నాయో తెలుసుకోవడం.. అదే సమయంలో వాటి నుంచి తాము ఏమేం ప్రజా ప్రయోజనాలు ఆశిస్తున్నదీ తెలియజేయాలన్నది సీఆర్‌డీఏ ఉద్దేశం. తద్వారా ఆయా సంస్థలు, సీఆర్‌డీఏ మధ్య చక్కటి ప్రాథమిక అవగాహన నెలకొంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది తదనంతర చర్యలను వేగంగా తీసుకునేందుకు దోహదపడి, అమరావతి శీఘ్ర అభ్యున్నతికి చోదకశక్తిగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే దేశ, విదేశాల్లోని పేరొందిన ఇంటర్నేషనల్‌ స్కూళ్ల యాజమాన్యాలతో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వర్క్‌షాపునకు మంచి స్పందన లభించింది. దీంతొ ద్విగుణీకృతోత్సాహంతో ఇతర రంగాలకు సంబంధించిన వర్క్‌షాపులను వరుసగా నిర్వహించేందుకు సీఆర్‌డీఏ సమాయత్తమవుతోంది.
 
ఆహ్వానితులను గుర్తిస్తున్న మెకన్సీ..
అమరావతికి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అద్వితీయమైన బ్రాండ్‌ ఇమేజ్‌ను కల్పించే సా్ట్రటజీ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైన ప్రముఖ సంస్థ మెకన్సీ ఈ వర్క్‌షాపుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రాజెక్టులకు ఇలాంటి ‘బ్రాండ్‌ ఇమేజ్‌ బిల్డింగ్‌ ప్రక్రియ’ను విజయవంతంగా నిర్వహించిన విస్తృతానుభవంతో అమరావతిని కూడా అన్ని స్థాయుల్లల అద్భుతరీతిలో ‘మార్కెటింగ్‌’ చేసేందుకు ఈ సంస్థ పలు వ్యూహాలను రూపొందించింది. రాజధానిలో నిర్మించాలని ప్రతిపాదించిన 9 థీమ్‌ నగరాల్లో ఆయా రంగాల్లో పేరొందిన ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరేలా చేసేందుకు ఈ సంస్థ అమరావతికి సంబంధించిన విశిష్టతలు, భవిష్యత్తులో అది రూపుదిద్దుకోనున్న విధం, ఇప్పటికే ఈ నగరం పట్ల సర్వత్రా వ్యక్తమవుతున్న ఆసక్తి వంటి వివరాలను గత కొన్నినెలలుగా ఆకట్టుకునే రీతిలో తెలియజేస్తూ, రాజధాని పట్ల సానుకూల స్పందన నెలకొనేందుకు కృషి చేస్తోంది. వివిధ ప్రచార సాధనాలు, ప్రకటనలు, రోడ్‌షోలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ఎక్స్‌పోల్లో స్టాళ్ల ఏర్పాటు వంటి పలు రూపాల్లో ప్రయత్నాలు చేస్తోంది. విద్య, వైద్యం, ఆతిథ్యం, ఫైనాన్షియల్‌, సర్వీసెస్‌, ఐటీ తదితర రంగాల్లోని దిగ్గజ సంస్థలను గుర్తించి, వాటితో వర్క్‌షాపుల నిర్వహణ ద్వారా అమరావతిలో తమ శాఖల స్థాపనపై అవి, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల మధ్య ముఖాముఖి చర్చలు జరిగేలా చూస్తోంది.
 
ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు లీజుకు స్థలాలు
ఇలాంటి వర్క్‌షాపుల్లో మొదటి దానిని విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఈనెల 4వతేదీన నిర్వహించారు. 13 ప్రఖ్యాత ఇంటర్నేషనల్‌ స్కూళ్ల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. వీటిలో దుబాయ్‌, సింగపూర్‌లకు చెందినవీ ఉన్నాయి. లీజు ప్రాతిపదికన ఈ స్కూళ్లకు స్థలాలను కేటాయిస్తామని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. సాధ్యమైనంత త్వరగా విధివిధానాలు రూపొందించి, స్థలాలను ఇస్తే నిర్మాణాలను ప్రారంభిస్తామని స్కూళ్లు చెప్పడంతో అధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ స్ఫూర్తితో ఈ నెల 18వ తేదీన దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత హోటళ్ల యాజమాన్యాలతో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. దీనికి దాదాపు 40వరకూ హోటళ్ల ప్రతినిధులు హాజరు కావచ్చని సీఆర్‌డీఏ అంచనా. అనంతరం ఆసుపత్రులు, ఆర్థిక (బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ తదితరాలు), సేవారంగం, ఐటీ- సాఫ్ట్‌వేర్‌ ఇత్యాది రంగాల్లోని పేరొందిన సంస్థలతో వేర్వేరుగా వర్క్‌షాపులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. మొత్తమ్మీద నెలకు ఇలాంటి 2, 3 వర్క్‌షాపులను జరపడం ద్వారా వివిధ రంగాల్లోని విఖ్యాత సంస్థలను సాధ్యమైనంత త్వరగా అమరావతికి తీసుకురానుంది.
Link to comment
Share on other sites

Cbn eee govt schools mida next term lo getiga focus setae bagundi...teaching style marchali.. technology use chesukuni can create wonders in schools...

 

 

Eee private schools edo brand value laaa lakhs vasulu cheatunar lkg ki kuda em septaro endo school lo

Link to comment
Share on other sites

Mirchi9 article:

October 7, 2016 at 8:09 pm | Sridhar Raavi |ShareThis

Read more at: https://www.mirchi9.com/politics/singapore-prime-minister-lee-hsien-loong-will-show-can-amaravati/

 

We Will Show What We Can Do in Amaravati

 

Lee-Hsien-Amaravati.jpgSingapore Prime Minister Lee Hsien Loong is in India for a Five Days Official Tour. Lee in a media interview went on to say that India is not as open for business as investors expect, citing land acquisition, over-regulation, and legal hassles among the biggest bottlenecks. He also referred to Amaravati issue going on currently.

 

“We are working on Amaravati… We gave the master plan and are bidding for the master developer contract. However, there is a legal issue going on the process right now but we are hopeful of getting the contract. We will help Andhra Pradesh and show the World what we can do,” Lee said. It is known that a consortium of Singapore companies Ascendas-Singbridge and Sembcorp Development Ltd have bid to develop 6.84 sq km of the capital’s core area.

Singapore companies have taken up a similar project in Gujarat to build an industrial park but it was abandoned some months ago over land acquisition wrangles. Sp the memories are not good. Singapore sees Amaravati Project as a huge opportunity to impress the Indian Economy and create new business avenues here

The Singapore PM was to visit Amaravati in this trip but it was cancelled in the last minute as wrong signals will be sent about the PM trying to influence the government. Lee Hsien Loong is keen on visiting Amaravati if Singapore Consortium is able to win the bid. The next hearing of the case is posted to October 30th. The High Court will hear to government appeal on 15th.

Link to comment
Share on other sites

అమరావతిలో సరికొత్త సంస్థలు
 
636115557978522663.jpg
విజయవాడ: రాజధాని వెంట 32 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రివర్ ఫ్రంట్‌లో టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఉండేలా డిజైన్ చేయాలని మరో 24 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ పరిధిలో క్రియేటివ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు, ఇన్నోవేటివ్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణానదిలో ఉన్న ఐలాండ్స్‌లో ఎకో టూరిజం రిసార్ట్స్, ట్రైనింగ్ సెంటర్స్ వచ్చే విధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

బ్లూ-గ్రీన్‌ సిటీగా కృష్ణా రివర్‌ఫ్రంట్‌!
 
 • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 32 కిలోమీటర్ల మేర అభివృద్ధి
 • మరో 24 కిలోమీటర్ల పొడవునా విద్యాసంస్థలు
 • 5 ద్వీపాల్లో ఎకో టూరిజం, రిసార్ట్స్‌, శిక్షణ సంస్థలు
 • అమరావతి కన్సల్టెంట్‌ సంస్థలతో సీఎం బాబు సమీక్ష

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రపంచం ఆశ్చర్యపోయేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు దానికి చేరువలో ఉన్న కృష్ణానదీ తీరాన్ని బ్లూ-గ్రీన కాన్సె్‌ప్టతో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం అమరావతి నిర్మాణ డిజైన్లపై వివిధ కన్సల్టెంట్‌ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా సంస్థలు కృష్ణా నదీతీరాన ప్రతిపాదించిన వివిధ నమూనాలను పరిశీలించడంతోపాటు వాటిని వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సదరు డిజైన్లను మరింతగా మెరుగు పరిచేందుకు ఉపకరించే పలు సూచనలు ఇచ్చారు. వాటిని అనుసరించి, అవసరమైన డిజైన్లు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ప్రపంచంలోనే చాలా కొద్ది నగరాలకు మాత్రమే అమరావతి మాదిరిగా విస్తారమైన నదీ తీరం ఉందని సీఎం అధికారులకు తెలిపారు.
 
దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా మన రాజధానిని అటు అత్యుత్తమ పర్యాటక కేంద్రంగానూ, ఇటు అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు నెలవుగానూ తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇందుకుగాను ప్రకాశం బ్యారేజీ నుంచి ఎగువన అమరావతి వైపు 32 కిలోమీటర్ల పొడవునా రివర్‌ఫ్రంట్‌ను బ్లూ- గ్రీన (సుందర జలవనరులు- ఆకట్టుకొనే పచ్చదనం) సిటీగా అభివృద్ధి పరిచేందుకు డిజైన్లను రూపొందించాలని కన్సల్టెంట్లను ఆదేశించారు. దీంతోపాటు నదీతీరంలో పర్యాటకం, జలక్రీడలకు పెద్దపీట వేస్తూ నమూనాలను సిద్ధం చేయడం ద్వారా అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ టూరిస్ట్‌ డెస్టినేషనగా మార్చాలన్నారు. నదీతీరాన మరో 24 కిలోమీటర్ల పొడవున క్రియేటివ్‌ రీసెర్చ్‌ ఇనస్టిట్యూట్లు, ఇన్నోవేటివ్‌ విద్యాసంస్థల స్థాపనకు వీలైన డిజైన్లు రూపొందించాలన్నారు.
 
ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఇలాంటి సంస్థలను నెలకొల్పితే వాటిల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు మరింత సృజనాత్మకతతో, వైవిధ్యభరితంగా ఆలోచించి అమూల్యమైన ఆవిష్కరణలు జరిపేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సీఎం వివరించారు. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపంతోపాటు దానికి ఎగువన ఉన్న మరో నాలుగు దీవులను అందరి మనస్సులను దోచుకునే అద్భుత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు డిజైన్లను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఐదు ద్వీపాల్లో ఎకో టూరిజంతోపాటు రిసార్ట్స్‌, వివిధ ట్రైనింగ్‌ సెంటర్ల స్థాపన జరిగితే అమరావతికి మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర పాల్గొన్నారు.
 
Link to comment
Share on other sites

Andhra Pradesh government is planning a new barrage on Krishna river will connect Amaravati from Hyderabad-Vijayawada national highway of Krishna district. Krishna River, the second prime river in Andhra Pradesh flows east and turns to the north side at Vykuntapuram hill and later returns eastward giving it the name: Uttaravahini.

 

This east to north and back to east, twist is considered auspicious as per Hindu belief and Vastu. Andhra Pradesh government is planning this new barrage across Krishna between Vykuntapuram of Amaravati Capital Region and Damuluru of Krishna district. This Barrage is likely to store 5 TMC water which will otherwise go waste into the sea.

This barrage at Uttara Vahini will be auspicious for Amaravati, Vaastu Pandits say. The water stored here will be helpful for the growing water needs of Amaravati. In the Capital Master Plan, Singaporean planners also suggested construction of bridges including a 3-km-long underwater tunnel on the Krishna between Vijayawada and old Amaravati in the Master Plan. This will be one of those.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...