May 19May 19 Author సుందర తీరం.. నగర మణిహారంBy Andhra Pradesh Dist. DeskPublished : 19 May 2026 05:49 ISTEeFont size2 min readరివర్‌ఫ్రంట్ అభివృద్ధితో రూపురేఖలే మారిపోతాయ్పదేళ్లుగా ప్రతిపాదనలు, తాజాగా సీఎం ఆదేశాలుఅహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరం ఈనాడు, అమరావతి: దేశంలో విజయవాడ లాంటి సుదీర్ఘ నదీ తీరప్రాంతాలున్న నగరాలన్నీ దానిని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నగరంలో గోమతి రివర్‌ఫ్రంట్, రాజస్థాన్‌లోని కోటాలో చంబల్ నదీతీరం, అసోంలోని గౌహతి నగరంలో బ్రహ్మపుత్ర తీరప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్న ప్రదేశాలుగా మార్చేస్తున్నారు. నగరవాసులతో పాటు పర్యాటకులను సైతం ఈ తీరప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.లఖ్‌నవూ నగరంలోని గోమతి రివర్ఫ్రంట్అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరాన్ని నగరవాసులందరికీ అత్యంత ఇష్టమైన ప్రదేశంగా అక్కడి ప్రభుత్వం మార్చేసింది. 11 కి.మీ మేర నదీ తీరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దింది. ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు ఆహ్లాదాన్ని జోడించారు. ఉదయం, సాయంత్రం నడక, కుటుంబమంతా గడిపేలా పార్కులు, ఫుడ్‌కోర్టులతో తీర్చిదిద్దారు. నగర జీవనశైలిలో అలసిపోయే ప్రజలు సేదదీరేందుకు ఇదో గొప్ప ప్రదేశంగా మారిపోయింది. అహ్మదాబాద్ నగరం రూపురేఖలనే ఈ సుందర తీరప్రాంతం పూర్తిగా మార్చేసింది.విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన ఇలా.. విజయవాడలో కార్యరూపం దాల్చలేదు..ఇబ్రహీంపట్నం నుంచి ఆరంభించి యనమలకుదురు వరకూ నగరాన్ని ఆనుకునే సుదీర్ఘమైన రివర్‌ఫ్రంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రాంతమంతటినీ నడుస్తూ వెళ్లేలా వాకింగ్ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టులు, పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా ఉంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే విజయవాడను ఆనుకుని ఉన్న నదీ తీరప్రాంతాన్ని ఆహ్లాదకరమైన, పర్యాటక ప్రదేశంగా మార్చాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవేవీ పట్టాలెక్కలేదు. చిత్తశుద్ధితో చేస్తే నగరానికి వరమే..విజయవాడ నగరంలో కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు, సేదదీరేందుకు ఒక్క ప్రదేశమూ లేదు. కృష్ణానదీ తీరాన్ని సబర్మతి మాదిరిగా అభివృద్ధి చేస్తే చాలు. సహజసిద్ధంగా నది అందుబాటులో ఉన్నా దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే భవిష్యత్తులో నగరానికి వరంగా మారుతుంది.తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలు..కృష్ణా నది వెంబడి ప్రకాశం బ్యారేజీ నుంచి యనమలకుదురు వరకు 9 కి.మీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఎంపీ కేశినేని శివనాథ్, నగర ఎమ్మెల్యేలతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు చేపడతామంటూ పచ్చజెండా ఊపారు.
Create an account or sign in to comment